భావం మారిన...

ప్రాకుతూ సాగితే ప్రౌఢ పాపాయి అగునా
చిలిపి భావాలు రాసిన చిత్రాంగి అగునా?

తాటిచెట్టు నీడలో ముంతమజ్జిగని కల్లు అని
సేదతీర్చుకున్న, తాగుబ్రోతని తట్టిలేపవలెనా?

కుంచెరంగుల చిత్ర శృంగారమొలికించిన జాణ
జవరాలై బరితెగించెనని పళ్ళు ఇకిలించవలెనా?

భావాలు మారెనని భాష మార్చినంత మాత్రాన్న
వైఖరే మారిపోయెనని నిందవేసి నిలదీయవలెనా?

నవరసాలువ్రాయ కలం మార్చిన, కల్తీసిరా అంటూ
పాళీపీకి పీకనొక్కి పొగడ్తని సానుభూతి చూపవలెనా?


నేనువ్రాసే భావాల్లో నానీడ చూసి నన్ను చూస్తున్నారనే
సంశయం నాలో కలగడం సమంజశమేనా లేక భ్రాంతేనా?

23 comments:

 1. సమంజసమే. రాతలలోని భావాలు మనసును పట్టిస్తాయి కదా పద్మార్పిత గారు.

  ReplyDelete
 2. మీ చిత్రాల్లో మీ భావాల్లో మీరు మాకు ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తారు

  ReplyDelete
 3. మనిషి వేరు, మనసు వేరు. మనసు చెప్పేదే... భావం. ఆ భావం చాలా రూపాల్లో
  బయటపడుతుంది. మీ రాసే ప్రతీ అక్షరంలో మీరు కనిపిస్తారని నేను చాలా
  సార్లు చెప్పాను. మనోభావగర్భితంగానే ఉంటాయి మీ కవితలు.
  మీ భావాలు మీ నీడలు కావొచ్చు, కాకపోవచ్చు. అవి కేవలం
  కవితా వస్తువులూ కావొచ్చు. కానీ.. అవి మీ నీడలే అనిపిస్తాయి.
  అది భ్రాంతి కాదులెండి.. బాగుంది.

  ReplyDelete
 4. నో డౌట్ ప్రతిభావంలోను మీరు కనిపిస్తారు. మీ ఉన్నతమైన వ్యక్తిత్వం కనిపిస్తుంది మీ చిపి భావాల్లో, అంతేకానీ మీ నీడ మీ అంతం అందంగా ఉండదు అని తెలివైన పాఠకులందరికీ తెలిసే ఉంటుందండి. అయినా మీకు ఇప్పుడు ఇలాంటి డౌట్స్ రావడం ఏంటి పద్మార్పిత?

  ReplyDelete
 5. భావాలు మారెనని భాష మార్చినంత మాత్రాన్న
  వైఖరే మారిపోయెనని నిందవేసి నిలదీయవలెనా?
  ఇలా సున్నితంగా గిల్లి జోలపాడ్డంలో మీకు మీరేసాటి.

  ReplyDelete
 6. నూటికి నూరు శాతం కాకున్నా , 90 శాతం వరకు కరెక్టే అని గట్టిగా చెప్పవచ్చు .

  ReplyDelete
 7. పద్మా డియర్,కరక్టే్ అని చెప్పొచ్చు , మీ భావాలు అల్లరివైనా, గిల్లేవి అయినా అలరించేవే,
  మంచి స్నేహ హృఇదయాన్ని ఇట్టే పట్ట్తేయ వచ్చు,

  ReplyDelete
 8. భావం మారినా భాష మారినా నీపై అభిమానం మానదు, ఆలోచించండం మాని వ్రాసేయ్.

  ReplyDelete
 9. మీరన్నది సమంజసమే....ఈ చిత్రం నాకు చిక్కి ఉంటే బాగుండేది (చిలకపచ్చని చీరలో చిన్నది బాగుంది)

  ReplyDelete
 10. ఏ భావమైనా అందంగా అలరించే నేర్పు నైజం నీ సొంతం.

  ReplyDelete
 11. ప్రశ్నలు అడగడం మీరే, జవాబులు మీవే....ఇంక మేం చెప్పడం ఏంటో !:-)

  ReplyDelete
 12. మీ భావాలన్ని మీకు ప్రతిరూపాలేగా...ఇంక సమంజసమా ఏంటీ 100% కరెక్ట్

  ReplyDelete
 13. "నా రచనలన్నీ నా ఊహలేనండి..." అని మీరే already చెప్పారు కదా బ్లాగ్లో ఎడమ ప్రక్క.

  ReplyDelete
 14. భాష మార్చినంత మాత్రాన్న భావంమారితే రోజుకొక భాష

  ReplyDelete
 15. నేనొప్పుకోను గాక ఒప్పుకోను భావం మారినప్పుడు భాష మారుస్తూ మనమూ మారిపోతే బాగుంటుంది :-)

  ReplyDelete
 16. ఏ భావం వ్రాస్తే అందులో మన ప్రతిబింబం ఉందనుకోవడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకు. భావం ఎప్పుడూ మన అస్తిత్వాన్ని చెక్కి రూపాన్ని మార్చలేదు.

  ReplyDelete
 17. manam kalaniki peddavaram kani, manasuku kadu kada padmaarpita garu

  ReplyDelete
 18. chala bavundi padmaarpita garu ,branthi kadu adi meere madam

  ReplyDelete
 19. మీ భావాలన్నీ అనుభవాలు కావాల్సిన అవసరం లేదు కదా మేడం. మీ రాతల్లో దాగిన అందమైన భావాలు మమ్మల్ని అలరిస్తుంటే ఇంకా భ్రాంతి అంటారేంటి ?

  ReplyDelete
 20. మీరు మాకళ్ళకు కమ్మిన మాయ
  మీ భావాలే మావెంట నడిచే ఛాయ
  మీ కవితల్లోని పదాలే నిండైన కాంతి
  మీకు అనిపించరాదు అది ఒక భ్రాంతి
  హమ్మయ్య.... మీకులా కమెంటేసా :-)

  ReplyDelete
 21. mee bhasha Super:-) Mee Bhavam inka super.. rendu special:-)

  ReplyDelete