అనుబంధాల అంగడి

అదేమి వింతనో ఏమో అక్కడో అంగడే వెలసింది
అందులో అనుబంధాలన్నీ అమ్ముడై పోయాయి

అమ్మ ఆశయం తీర్చలేని అమ్మాయి నిలబడింది
అందలం ఎక్కినాక అవసరం లేదంటూ అబ్బాయి
వారి విలువల్ని వారే వింతగా నిర్ణయించుకున్నారు
కుంటి సాకులేవో చెప్పి బజారులో అమ్ముడయ్యారు!
నాన్న న్యాయనిర్ణేతని కాదంటూ ఊగుతూ నిలబడి,
మంచి బేరమొకటి చూసుకుని తనరేటు ఇదన్నాడు
అక్క హైరానా పడి, అన్న అవసరమంటూ బజారులో
తలా ఒకవైపు తాహతుకి తగ్గట్టుగా అమ్ముడయ్యారు!
తమ్ముడు తన వంతు కోసం ఎదురుచూస్తూ నిలబడితే
చెల్లి తను తక్కువేం కాదంటూ చిత్రంగా తూకం వేసింది
ఒకగూటివే అమ్ముడైపోతే మరోగూటివి మాకేమన్నాయి
అమ్మ మాత్రం అంగడి అరుగుపై కూర్చుని ఆలోచిస్తుంది
లాభనష్టాల బేరీజువలో ఎవరు ఎంతకు అమ్ముడయ్యారని!

17 comments:

  1. You are a LADY with lot of guts madam. Rock, rock, rocking

    ReplyDelete
  2. Hatsoff to your poetry. Proud to be your fan Madam. Keep rocking

    ReplyDelete
  3. అమ్మకాల అంగడిలో అన్నీ అనుబంధాలు అమ్ముడైపోతాయని అద్భుతంగా చెప్పారు . చప్పట్లు

    ReplyDelete

  4. "అదేమి వింతనో ఏమో అక్కడో అంగడే వెలసింది
    అందులో అనుబంధాలన్నీ అమ్ముడై పోయాయి"

    అక్షరాలా నిజం పద్మార్పిత గారూ !
    జరుగుతుందీ - చూస్తున్నదీ ఇదే కదా . ఎంత మంది కళ్ళల్లో తడి చూసామో ,
    ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేక .....

    "అమ్మ మాత్రం అంగడి అరుగుపై కూర్చుని ఆలోచిస్తుంది
    లాభనష్టాల బేరీజువలో ఎవరు ఎంతకు అమ్ముడయ్యారని!?

    ఇది విడ్డూరమననా... లేక
    వైపరిత్యమననా.
    పైత్యం ముదిరితే మరి ఇలాగే .
    ఓ మంచి యితివృత్తాన్ని ముందుంచుకుని 'కళ్ళు 'తెరిపించేలా రాసారు.
    ఓ సందేశముంది మీ ఈ కవితలో.
    ఈ కవిత చదివాక " బేరానికి అమ్ముడుబోయే " ప్రతి వ్యక్తి వారి అనునాయులు,
    కొంతైనా మార్పు తెచ్చుకుంటే సంతోషం .
    మంచి సందేశాత్మక కవితనందించినందులకు ........
    నా "అభినందనలు"
    *** శ్రీపాద

    ReplyDelete
  5. అమ్ముడవనిది అమ్మతనం ఒక్కటే!

    ReplyDelete
  6. అంతా సరుకుగ మారిన వ్యవస్థలో ఇది తప్పని సరి కదా పద్మార్పిత గారు. అవసరాన్ని లాభ నష్టాల బేరీజులో తూకం వేసి అమ్మ కడుపును కూడా సరుకును చేస్తున్నది కదా నేటి గ్లోబల్ ప్రపంచీకరణలో. మంచి వస్తువును తీసుకొని కవిత్వీకరిస్తూ మీ ధర్మాగ్రహాన్ని వెలిబుచ్చారు. అభినందనలు..

    ReplyDelete
  7. సందేశాత్మకంగా వ్రాసి మెప్పించారు. అభినందనలు

    ReplyDelete
  8. ఇలాంటి సందేశాత్మక కవితలు వ్రాసి సంఘాన్ని ఉధ్ధరించేవాళ్ళు చాలామందే ఉన్నారు, నీకు ఎందుకు చెప్పు ఇలాంటివి అంటే అర్పితా మరోలా అన్ముకోకు.....మనసు ఊరటచెందాలంటే ఒక ఔహధంలా నీ కవితల్ని చదువుకుని ఆనందించేవాళ్ళలో నేను ఒకడిని. అల్లరిగా నవ్విస్తూ అంతో కొంత జ్ఞానాన్ని భోధిస్తూ అలరించేయి ఎండాకాలమంతా.....థంఢా థంఢా కూల్ కూల్, నో రోనా ధోనా ప్లీజ్ పద్మా-హరినాధ్

    ReplyDelete
  9. Padma this is little bit painful poetry yaar. Be as you are, always cheerful and smiling.

    ReplyDelete
  10. "అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం" అనే పాట గుర్తుకు వచ్చింది ఇది చదువుతుంటే. బాగుంది.

    ReplyDelete
  11. చివరికి అమ్ముడు పోకుండా అంగటి అరుగుపై అమ్మ ప్చ్ ప్చ్ :(

    ReplyDelete
  12. కుటుంబం కూడా వ్యవస్థలో భాగమై వుంటుంది కాబట్టి వ్యవస్థపై వున్న సామాజిక ప్రభావాలు దానిపై కూడా ప్రభావం చూపుతూ ప్రస్ఫుటమవుతాయని దీనికి మినహాయింపు లేదని బాగా చెప్పారు పద్మార్పిత గారు. అభినందనలతో..

    ReplyDelete
  13. అనుబంధాలలో తగ్గిన సాంద్రతను గురించి బాగాచెప్పారు

    ReplyDelete
  14. amma gurinchi chala baga chepparu, ammudu avanidi ammatanam okkate:-) very beautiful..

    ReplyDelete
  15. పైన మీరు చెప్పిన బంధాలన్నీ పరోక్షంగా అమ్మతనాన్ని తాకట్టు పెట్టేవే పద్మగారు.
    ఈ ప్రపంచంలో అమ్మ ఒక్కతే గాయపడి, జీవితాన్నిచ్చే పేగుని
    తనలో దాచుకుంది. దెబ్బ తగిలితే తప్ప... బంధాల విలువ తెలీదు కదా.
    అందుకే అమ్మ.. అన్నీ తనలో తానే దాచుకోగలదు. మిగిలిన బంధాలన్నీ
    దాదాపు మెకానికల్, హిపొక్రాటిక్. అందుకే సమాజం అంగడిలో
    అందరూ అమ్ముడుపోతారు. చాలా బాగుంది. జీవితాన్ని చాలా లోతుగా
    పరిశీలించారు మీరు. ఈ ఆలస్యానికి క్షమించాలి మీరు.

    ReplyDelete
  16. స్పందించిన హృదయాలకి నమస్సుమాంజలులు _/\_

    ReplyDelete