నా ఊహల్లో అలరించి మురిపించే నీవు..
ముఖమని ప్రతిబింబాన్ని ముద్దాడినావు!
ప్రేమించానని నిజాలనీడవై దరిచేరి నీవు..
వివస్త్రను చేసి తనువంతా తడిమేసినావు!
తలపుతడికి వణికితే బిడియపడకని నీవు..
గిరిగీసుకున్న గీతను దాహంతో చెరిపేసినావు!
బిత్తరతనపు బేలచూపేలని ఒడిసిపట్టి నీవు..
ఒంటరికి జతకడతానని ఊపిరిలో కలిసినావు!
పసుపుతాడుగా ప్రేమనంతా పెనవేసి నీవు..
పెళ్ళిసాక్ష్యం వలదని పట్టులేని ముళ్ళేసినావు!
ప్రణయపునాదిపై పరిణయ అత్తర్లేచల్లి నీవు..
పగటివేళ మల్లెపందిరి నీడన మంచమేసినావు!
పరిమళంలేని మమతల మత్తుమాటలతో నీవు..
కలకౌగిట కర్పూరంలా కరిగించి శోభనమన్నావు!
ముఖమని ప్రతిబింబాన్ని ముద్దాడినావు!
ప్రేమించానని నిజాలనీడవై దరిచేరి నీవు..
వివస్త్రను చేసి తనువంతా తడిమేసినావు!
తలపుతడికి వణికితే బిడియపడకని నీవు..
గిరిగీసుకున్న గీతను దాహంతో చెరిపేసినావు!
బిత్తరతనపు బేలచూపేలని ఒడిసిపట్టి నీవు..
ఒంటరికి జతకడతానని ఊపిరిలో కలిసినావు!
పసుపుతాడుగా ప్రేమనంతా పెనవేసి నీవు..
పెళ్ళిసాక్ష్యం వలదని పట్టులేని ముళ్ళేసినావు!
ప్రణయపునాదిపై పరిణయ అత్తర్లేచల్లి నీవు..
పగటివేళ మల్లెపందిరి నీడన మంచమేసినావు!
పరిమళంలేని మమతల మత్తుమాటలతో నీవు..
కలకౌగిట కర్పూరంలా కరిగించి శోభనమన్నావు!
బ్యూటిఫుల్ పిక్ పెట్టి ఇలా కలతో అంతం చేయడం అన్యాయం పద్మార్పితా...
ReplyDeleteనిజంకానివన్నీ కలలే కదండీ సృజనగారూ...
DeleteMee kavitalu supero super:):)
ReplyDeletemee comment happy happies :-)
Deleteప్రణయపునాదిపై పరిణయ అత్తర్లేచల్లి నీవు..
ReplyDeleteపగటివేళ మల్లెపందిరి నీడన మంచమేసినావు!
పగటిపూట మల్లెల పరిమళం ఉండదని కామోసు అత్తర్లు చల్లాడు....what a idea, picture simply superb.
బహుశా మీలాగే తెలివైనవాడు కామోసు!
Deleteఅయ్యబాబోయ్ ఇన్ని నెగటీవ్ థాట్స్ లో కూడా మీ కావ్యనాయిక కంటికింపుగా ఉందండి పద్మగారు :-)
ReplyDeleteనెగటీవ్స్ నుండి పాజిటీవ్ కలలు కంటుంది మన నాయిక మహీ :-)
Deleteకెవ్వువ్వువ్వువ్వువ్వు కేకో కేక ఒకటి మీ బొమ్మకు మరొకటి మీ టటిల్ కు, ఇంక కలలో శోభనానికి కేకెందుకు చెప్పండి....చప్పట్లో చప్పట్లు :-)
ReplyDeleteఅయ్యయ్యయ్యయ్య బాబో ఆకాంక్ష.....కేకలకి అదిరిపోయానుగా :-)
Deleteమంచిపదాలతో కూర్చిన కవిత దానికన్నా మిన్నగా చిత్రం చాలా బాగుంది.
ReplyDeleteమీరు మెచ్చితే మాహానందం నాకు
Delete
ReplyDeleteప్రణయం పునాదిపై పరిణయ అత్తర్లు చల్లి, పగటి వేళ మల్లెపందిరి నీడన మంచమేసినావు .... లాంటి భావనలతో కలల శొభనం కవితావిష్కరణ చాలా బాగుంది పేరుకు తగ్గట్లు వర్ణనాత్మకంగా
అభినందనలు పద్మార్పిత గారు!
మల్లెల పరిమళమేకా అత్తర్లని కూడా అభిమానించే మీకు అభివందనం.
Deleteచిన్నప్పటినుండి చదువులో మునిగిపోవడం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్ కి బాగా దూరం అయిపోయాను... మీలాగా ఎవరైనా అందంగా రాస్తుంటే.. అర్రే నేను ఇలా రాయలేకపోతున్నానే.. అని ఫీల్ అవుతూ వుంటాను...
ReplyDeleteరాంకుమార్ గారు....అందంగా రాసిన వాటిని ఆర్టిస్టిక్ గా ఆస్వాధించే మీలాంటివాళ్ళేగా మాతో రాయించేది....అంటే మీరు వ్రాస్తున్నట్లే
Deleteమరొక భావాయుక్త కళాత్మక కావ్యాన్ని మీదైనరీతిలో అందించారు. మీ దగ్గర నేర్చుకున్న పదాలే.
ReplyDeleteమనమంతా ఎవరో ఒకరి దగ్గర నేర్చుకున్నవే. మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteపెద్దమనిషైనప్పటినుంచి పేట్రేగిపోతున్నారు మీరు... కలల్లోన్నే కాదు కవితల్లోనూ కుమ్మేస్తున్నారుగా :-)
ReplyDelete
Deleteతమ్ముడు వినోద్ .....
నీ కవితల భావాల్లోనే కాదు -
నీవు రాసే ప్రతి విశ్లేషణలో కూడా అర్ధవంతమైన పలుకుల మాలలుంటాయ్.
అదే 'మా' వినోద్ లోని ప్రత్యేకత.
'కలలశోభనం' కాస్తా కలవర పరిచినా, అందులోని తాత్పర్యాన్ని అర్ధం చేసుకుంటే అదో 'మంచి కవిత
ఈ మధ్య కాలంలో పద్మార్పిత గారు ' పెద్దమనిషయ్యా' టైటిల్ తో ఓ భావాత్మకమైన కవితనందించారు.
ఆ కవిత ఎంత మందినాకర్శించిందో. భావాల పుట్ట అని 'శభాష్' అనిపించుకుంది కూడాను.
బహుశా ఆ కవితను దృష్టిలో ఉంచుకుని ......
' పెద్దమనిషయ్యాక పెట్రేగిపోతున్నారు ' అనే పదాన్ని వాడుంటావు నీవు . కాని మీ మాటల్లోని అర్ధాన్ని నే గ్రహించా.
"ఎంతో మంచి పటుత్వంగల రచనలు చేస్తున్నారు పద్మార్పిత గారూ సాగిపోండి ఇలాగే " అని ఉద్దేశ్యమని .
ఎంత మంచి ఆశాభావం నీది .
"కుమ్మేస్తున్నారుగా" అని చివర నీవన్నా ... అందులోని భావం అపూర్వం.
మనస్సులను పులకరింతతో రాగరంజితం చేయడమే కాదు ..... పద్మార్పిత మంచి భావుకతతో నిండిన కవితలనందిస్తున్నారని నీ భావన.
'కత్తికి రెండు వైపులా పదునన్నట్లు' .. అర్ధం చేసుకునే వారి మీదుంటుంది
కవితలోని పరమార్థ మేమిటో .
తప్పుగా అనుకోకు. 'తమ్ముడూ' అన్నాను ..... అందుకే ఏకవచన సంభోధన.
ప్రేమతో
*శ్రీపాద
శ్రీపాదగారు మీరు తమ్ముడూ అంటూ వినోద్ ని సంభోధిస్తూ అతని భావాలని మీరు సమర్ధించిన విధంగా ఎంతమంది అర్థం చేసుకుని ఉంటారనుకుంటున్నారు. నాణ్యానికి రెండువైపులా బొమ్మా-బొరుసూ ఉన్నట్లే మీలా కాకుండా వక్రంగా యోచించే వాళ్ళే ఎక్కువేమో. ఏమైనా మీ ఆలోచనా విధానం, వ్యాఖ్యలు వ్రాయడంలో మీరు కనబరుస్తున్న శ్రధ్ధ అభినందనీయం-హరినాధ్
Delete'తమ్ముడూ' అని పిలిచి ఆప్యాయతను పెంచుకున్నాననిపిస్తుంది హరినాథ్ గారూ.
Deleteమీ వాఖ్య నన్ను ఎంతగానో మురిసిపోయేలా చేసింది.
అదృష్టవంతుణ్ణి కదూ .
ధన్యవాదాలు హరినాథ్ గారు.
*శ్రీపాద
శ్రిపాద గారు... నా మాస్ కామెంట్ ని క్లాస్ గా ఇరగదీసారుగా. థ్యాంక్స్ ఫర్ అండెర్ స్టాండింగ్. నాకు తెలిసీ పద్మార్పిత గార్కి నా కామెంటి పిచ్చిపిచ్చిగా నచ్చేసి నవ్వుకొని ఉండుంటారు. :-)))
Deleteహరినాద్ గారు... థ్యాంక్ యూ.
ఇక చెప్పోచ్చేదేంటంటే... నేనెప్పుడూ సక్రంగానే రాస్తాను. వక్రంగా అర్థమైనవాళ్ళకి నేనే కాదు, ఎవరూ ఏం చెప్పలేరు.
ఇన్ని ఆర్టులు తెలిసిన పద్మార్పిత గారు హర్ట్ అవ్వరని నా మమ్మకం ( పొగడ్తకు పడిపోండి. ఇది నిజం ) . ఏమండోయ్ పద్మా గారూ... చెప్పండి ఇక్కడ.
వినోద్.....పెద్దమనిషయ్యానని అనగానే సరికాదు కదా దానికి తగ్గట్ట్లుగా మెలగాలి, పదవతరగతి పాస్ అయ్యక కూడ అమ్మ, ఆవు అని పదాలు నేర్చుకుంటానంటే ఎలా చెప్పు.:-)
Deleteశ్రీపాదగారు.....మీ సౌశీల్యమైన కోమల పదజాలంతో సొరచేపనే కాదు చిన్ని పరిగెల్ని కూడా చేజారిపోనీయక పట్టుకునే నేర్పు మీది. అమ్మో ఏదైనా ఒక వాక్యం రాస్తే దాని ఇన్ని అర్థాలు అపార్థలు ఉంటాయన్నమాట. నేను మాత్రం నా భావాలకి అక్షర రూపం ఇవ్వడమే తప్ప ఎటువంటి అపార్థాలకి తావివ్వకూడదనే ప్రయత్నం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. తధాస్తూ! అని దీవించేద్దురూ :-)
Deleteహరినాధ్ గారూ....నాణ్యానికున్న బొమ్మా బొరుసులాగే....రాసిన వాటిలో మెరిట్స్ డీమెరిట్స్ కూడా ఉంటాయని అనుకుని రాసేస్తే ఎవరు తిట్టినా మెచ్చినా మెజారిటీ హ్యాపీగా ఉండగలమేమో :-) కాదంటారా
DeleteClarification miss ayyanu.Well said
Deleteఅధ్భుతమైన భావాలతో మరింత అధ్భుతమైన చిత్రాన్ని జోడించి అందించిన మీ పదచిత్రం కలే అయినా చదువుతుంటే కమ్మగా ఉంది మేడం... జస్ట్ క్లాప్స్
ReplyDeleteఅభిమానసంగం చప్పట్లు నన్ను వెన్ను చరిచి ప్రోత్సహిస్తున్నటుంది. ధన్యవాదాలు అందరికీ_/\_
Deleteకలే ఇంత కమ్మని ప్రణయకావ్యమైతే
ReplyDeleteనిజమైతే ప్రేమలో ప్రళయమే సృష్టిస్తారా?
నిజంగా ప్రళయం వస్తుందనే కదా అది కలతో ఆగిపోయింది :-)
Deleteపద్మా,బాగుంది మంచి కవిత,అమ్మాయి ఇంకా బాగుంది.
ReplyDeleteపద్మా....అని ఆప్యాయంగా అభినంధిస్తారు...ఇంకేముంది మీరాజ్ గారి "ప్యార్ మే పడిపోయానే" :-)
Deleteటైటిల్ తో పడేసి భావంతో బంధించి బొమ్మతో అరిపించారు. మొత్తానికి పోస్ట్ అదుర్స్
ReplyDeleteకమెంట్ రాసి, అదుర్స్ అని నన్ను నవ్విస్తావుగా :-)
Deleteకవిత చూడ్డానికి కాస్తా శృంగారమయమని తోస్తుంది .
ReplyDeleteకాని ఓ మారు మీ పలుకుల అర్ధం లోని లోతుని పరిశీలిస్తే........
అవగాహన చేసుకున్న వారికి ఎన్నో మంచి భావాల కూడలిని చూడగలుగుతారు
ఎంతో నిఘూడమైన 'ప్యూరిటీ ' ఆ మాటల్లో.
" పసుపుతాడుగా ప్రేమనంతా పెనవేసి నీవు..
పెళ్ళిసాక్ష్యం వలదని పట్టులేని ముళ్ళేసినావు! "
- అదేకదా నిజమైన ప్రేమ బంధం.
" పరిమళంలేని మమతల మత్తుమాటలతో నీవు..
కలకౌగిట కర్పూరంలా కరిగించి శోభనమన్నావు! "
పై మాటతో కవితను ముగించిన తీరు చాలా బావుంది .
అభినందనలు పద్మార్పిత గారూ .
*శ్రీపాద
ధన్యవాధాలు శ్రీపాదగారు._/\_బొమ్మను చూసి బూతు, పదాలలను చదివి శృంగారమని అనకుండా...రాసిన కవితలోని భావాన్ని విశ్లేషించి, భాషలోని సున్నితత్వాన్ని గ్రహించి వివరించిన మీ తెలుగుభాష అభిమానానికి, కవితాతృష్ణకు వందనాలు.( నిజానికి మీ అంత గొప్పగా రిప్లై ఇవ్వలేను అందుకే ఇలా మితంగా మూడు ముక్కల్లో రాస్తే నన్ను నేను కాపాడుకోవచ్చన్న పిసరంత స్వార్థం:- )
Deleteఇంపైన సొగసులు కలగలిపి ఓ కమ్మని కావ్యాన్ని అందించిన మీ ఈ-కాలానికి, మీ బుద్ధి బలానికి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. కవిత ఆలోచనాత్మక ధోరణిలో సాగిపోయింది. చిత్రం లో చిన్నదిని చూస్తూ ఉంటె నిజంగా చిత్రానికే ఊపిరి పోసిన జీవకళ ఉట్టిపడుతుంది పద్మగారు.
ReplyDeleteశ్రీధర్ గారు కమ్మని కావ్యం వరకు ఓ.కె.....నా బుద్ధి బలం పై మీ నమ్మకమే కాస్త హెచ్చుగా అనిపిస్తుందండి :-) చిత్రం లో చిన్నిదాన్ని చుస్తూ అలా నన్ను పొగిడేసేరు కామోసు:-) కదా!
Deleteపద్మర్పిత బ్లాగ్ మిత్రులందరికీ ఓ గమనిక, మీరు గనక మీ స్మార్ట్ మొబైల్ ఫోన్ లో పద్మ గారి బ్లాగ్ తాలూకు టపాలు చూడాలనుకుంటే http://www.padma4245.blogspot.com/feeds/posts/default అని మీ వెబ్ బ్రౌజరు లోని ఫీడ్ ఎడిటర్ లో టైపు చేసి సేవ్ చేస్తే ఓ విద్గేట్ లో ఆ టపాలన్నీ కనిపిస్తాయి.
ReplyDeleteఅలానే వ్యాఖ్యాలను చూడాలనుకుంటే http://www.padma4245.blogspot.com/feeds/comments/default అని మీ వెబ్ బ్రౌజరు లోని ఫీడ్ ఎడిటర్ లో టైపు చేసి సేవ్ చేస్తే ఓ విద్గేట్ లో ఆ వ్యాఖ్యాలన్ని కనిపిస్తాయి.
Most useful Information Sridhar garu.
DeleteThanks.
*Sripada.
Very good Information Sridhar Garu.
DeleteThanks.
*Sripada
Thanks for adding and sharing.
Deleteఎంతో భావాత్మక సంఘర్షణ మనసులో జరిగితేనే ఇలాంటి అందమైన పదామృతలు పుట్టుకొస్తాయి. పగటివేళ మల్లెపందిరి నీడన మంచం వేసినంత మాత్రాన్న పరిమళం దక్కదని నిగూఢ భావాన్ని నిర్మలంగా చెప్పావు. భావాలకి తగ్గ చిత్రాలు పెట్టడం నీకు భగవంతుడిచ్చిన మరో వరం. అభినందనలు అర్పిత-హరినాధ్
ReplyDeleteఅందరూ సునాయసంగా రాస్తారో ఏమో తెలీదు కానీ....పద్మార్పితకి ఎప్పుడూ ప్రతిపదం భావసంఘర్షణల ఫలమే. ఇక్కడ మాత్రం ఇది రాయనా వద్దా అని ఒకటికి పదిసార్లు ఆలోచించి చివరికి పోస్ట్ చెసింది మాత్రం అక్షరాలా నిజం. నేను ఈ టైల్ చూసే నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందని అనుకున్నా, కానీ తప్పలేదు, తిట్టినా, మొట్టినా మనవారేగా మోకరిల్లిపోదాం అని ఇలా.....మీ అందరి అభిమానానికి ఎప్పుడూ మోకరిల్లుతూనే ఉంటాను._/\_
DeleteI am so glad that my friend Padma got this much talent and becoming popular day by day. Congrats my dear.
ReplyDeleteనీలో కళలకి, భాషపై నీకున్న పట్టుకి నిదర్శం ఈ కవిత. మా ఆఫీస్లో కవిత చదివి అందరు నిన్ను మెచ్చుకుంటుంటే నాకు సంతోషంవేసింది. కంటిన్యూ
DeleteThank you very much Sandya. పరిచయమైన కొద్దికాలంలోనే ఆప్తురాలిగామారి ప్రోత్సహిస్తున్న మీకు వందనం.
Deleteఊహల్లో అయినా నిందించడం మానరా :)
ReplyDeleteనింద అనుకుని తర్కించకుండా చూస్తే అంతా నీట్ గా ఉంటుందేమోనండి. :-)
DeleteVery Great Lyrics with Beautiful Pic:-) i Don't have any words to express the feeling on your poetry:-) Very Very Happy:-)Super:-)
ReplyDeleteSruti thanks a lot...after a long time, hope everything fine. Keep in touch my dear friend.
Deleteఏంటేంటి......నేను నాలుగురోజులు ఊరెళ్ళి వచ్చేసరికి ఇలా జరిపోయిందా!:-) భలే భలే
ReplyDeleteచిత్రంలోని చిన్నది పూసగుచ్చినట్లుగా చెప్పి కవ్విస్తుంది. పద్మగారు మీరు ఏం వ్రాయడానికైనా సమర్థులే.
మీరు ఇలా జరింగిందా అని ఉరెళ్ళి వచ్చి భలే భలే అని సంబరపడిపోతే...మరికొందరు మీరు ఊరెళ్ళితే ఇంకేం జరుగుతాయో అని మళ్ళీ మళ్ళీ పంపిచేస్తారు :-) నేనేమైపోను
Deleteమేడమ్ రిప్లైస్ ఇవ్వండి కాస్త.
ReplyDeleteఈ కమెంట్ కి రిప్లై ఏమివ్వనండి :-)
Deleteపద్మగారు... ఈ కవిత గురించి ఎందుకో చాలా సునిశితంగా వర్ణించాలనిపించింది.
ReplyDeleteఇందులో జీవితంలో దాగున్న ఆనంద పరిమళాలన్నీ కనిపిస్తున్నాయి.
అక్షరాలతో లేలేత భావనలు పొదిగి.. కవిత్వాలు రాసే వాళ్లను చూశాను.
కానీ... అవే అక్షరాలతో మానసిక సౌందర్యాన్ని ఆవిష్కరించి...
పరిమళాలు వెదజల్లే కలం, కవనం, చిత్రం మూడూ మీ దగ్గరున్నాయి.
కవిత సార్లు చదివాక... అంతరంగ ఆవిష్కరణకు ఒక నిక్కచి రూపం
కళ్ల ముందు కనిపించింది. ఇలాంటి నిక్కచ్చి భావ వ్యక్తీకరణ
అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒక స్త్రీ... తన మనసు పొరల్లో... జారిపోతున్న
ఆలోచనలను ఒడిసి పట్టుకునే క్రమంలో... ఎన్నెన్ని అందమైన ఊహలో.. వాటిని
అనుభవించాలన్న తాపత్రయాలో... అన్నన్నే అభ్యంతరాలను షరతులనూ
తనే విధించుకుంటుంది. కలలను తనే ఆహ్వానిస్తుంది. ఆ కలలోనే తపనలను
కరిగించుకుంటుంది. ప్రేమ మైకాన్ని కన్నీటిలో గుండెలో బరువుగా దాచుకుంటుంది.
మీ కవితలో చివరి లైనులా. మొత్తానికి బిడియం గడియ పెట్టుకుని... తత్తర బిత్తర పాటులో
తనలో తానే ఇంత మదనపడుతుంది. మూడు రోజుల పాటు మీ కవితను సగం సగం
చదివాను. ఇవాళ పూర్తిగా చదివి. నా మనసులో ఏది తోచిందో... యధాతథంగా
ఇలా రాసేస్తున్నాను. రాంగ్ ఇంటర్ ప్రటేషన్ అయితే... మరోలా అనుకోకండే....
సతీష్ గారు థ్యాంక్స్ మీ అందమైన వ్యాఖ్యలకి.....రిప్లై ఇవ్వకుండా థ్యాంక్స్ అని నవ్వేద్దాం అనుకుంటే మనసూరుకోదు, స్త్రీ మనోభావాలని సునిశిత పరిశీలనంగా చదివిన మీకు రాద్దామనుకుంటే అక్షరాలు అడుగేయలేమంటూ మొరాయిస్తున్నాయి, ఏం రాయను. అయినా అదేంటండి మూడు మీ లక్కీ నంబరా అన్నీ 3 అంటూ మొదలెట్టారు :-)
DeleteSummer cool cool post.
ReplyDelete