తగునా!!!

ఏటిగట్టున కూర్చుని
ఏరులో నీడను చూసి
ఎదసవ్వడి ఎగసెనని
చూపులతో గాలమేసి
వాల్జడ నయగారమన్నా
వలపు విరబూసేయునా!

రేయిజామున కలగని
రేచీకటిలో మాటువేసి
సందెపొద్దు అందాలని
వెనకమాటున వాటేసి
వంపులని నింధించినా
వగల వయ్యారమాగునా!

బాహువుల్లో బంధీనని
బాహటంగా పలకననేసి
చోద్యమేదో చూపుతానని
చిత్ర విన్యాసమేదో చేసేసి
నేలచూసిన బిడియమౌనా
పైటకప్పిన పరువమాగునా!

51 comments:

  1. 1st clap...picture
    2nd clap..poetry
    A big clap to...PADMARPITA

    ReplyDelete
  2. అందమైన భావాలతో అక్షరసత్యాలను ఆవిశ్కరిస్తే కాదనగలమా మేడం. మీకు సాటిలేరెవరూ....

    ReplyDelete
    Replies
    1. అభిమానాక్షరాలని ఎన్నడూ కాదనను.

      Delete
  3. హాయ్ హాయ్ పిక్ చూస్తేనే మత్తెక్కిపోతుంది, ఇక కవిత చదివితే మనసు సంతోషంతో నిండిపోతుంది:-)అందమైన భావలకు ఊహాలోకం మీ బ్లాగ్:-)) చాల రిలాక్స్ గా ఉంటుంది మీ బాగ్ ముందు ఉంటే:-) సూపర్:-)) సూపర్:-))

    ReplyDelete
    Replies
    1. హాయి హాయిగా జాబిల్లిని మరిపించెను మీ స్పందన శృతి.

      Delete
  4. Padmarpita gaaru I am fine, But not getting relax time due to busy schedule, How are You,

    ReplyDelete
    Replies
    1. thanks for you reply my dear. take care of yourself.

      Delete
  5. నాజూకు పదాల నయాగార జలపాతంలా ఉంది కవిత దానికి తగ్గ చిత్రం .

    ReplyDelete
    Replies
    1. అల్లరిపాళ్ళే కాదు చలోక్తుల జిమిక్కులూ వచ్చన్నమాట :-)

      Delete

  6. " బాహువుల్లో బంధీనని
    బాహటంగా పలకననేసి
    చోద్యమేదో చూపుతానని
    చిత్ర విన్యాసమేదో చేసేసి
    నేలచూసిన బిడియమౌనా
    పైటకప్పిన పరువమాగునా! "
    బాగుంది.
    చిత్ర విన్యాసాలు, చోద్యాలు ఎలా ఉన్నా
    కవితకు మీరందించిన వంపులు మీ కవితకే అందాన్ని చేగుర్చాయి.
    కవిత చిన్నదే అయినా తగ్గట్టుగా అందించారు అన్ని రసాలను.

    అభినందనలు పద్మార్పిత గారు.
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనలు ఎప్పుడూ స్పూర్తిదాయకమే నాకు. ధన్యవాదాలండి.

      Delete
  7. మీ కవితలోని అందమైన హృద్యమైన భావానికి తోడుగా మీరుంచే చిత్రమెప్పుడూ అద్భుతమే పద్మార్పిత గారు. అభినందనలు.._/\_

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానాత్మక స్పందనలు నన్నేప్పుడూ అలరిస్తాయి. థ్యాంక్సండి.

      Delete
  8. తగునా......మీరిలా కవితా స్రవంతిలో మమ్మల్ని ముంచేయడం:-)

    ReplyDelete
    Replies
    1. వద్దంటే మాత్రం ఆపనుగా :-)

      Delete
  9. ఆమెకి వాలుజడ ఎక్కడుంది బెత్తెడే...
    మీరు చెప్పారుగా మేము అనుకోవాలి :)

    ReplyDelete
    Replies
    1. చూసే కళ్ళలో వాడి ఉంటే జడవాలుగా, పడతి పసందుగానే కనిపిస్తుందేమో :-) ట్రై చేయండి.

      Delete
  10. "బాహువుల్లో బంధీనని
    బాహటంగా పలకననేసి
    చోద్యమేదో చూపుతానని
    చిత్ర విన్యాసమేదో చేసేసి" మీ కావ్యనాయికని ఎవరు బాహువుల్లో బంధించారో తెలీదు నాకు....మీరు మాత్రం మీ భావకవితల్లో నన్ను పూర్తిగా బంధించేసారు...అక్కడ చోద్యం చూస్తే ఇక్కడ నేను మీ కవితల కోసం ఎదురు చూస్తున్నా :-)

    ReplyDelete
    Replies
    1. కవితాస్రవంతిలా ఉన్నాయి మీ వాక్యాలు.

      Delete
  11. Kavitha andamina oohallo viharimpachesindi...

    ReplyDelete
  12. బాగుంది పద్మగారు

    ReplyDelete
  13. భావచిత్రకవితార్పితకు మరోమారు వందనాలు .

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ అనికేత్.

      Delete
  14. భావం. భావానికి తగ్గ చిత్రం. బేషుగ్గా కుదిరాయి అర్పిత-హరినాథ్

    ReplyDelete
    Replies
    1. మీ మాటలెప్పుడూ నన్ను మైమరపిస్తాయి. ధన్యవాదాలండి.

      Delete
  15. Madam are you here.? Why you are not giving replies?

    ReplyDelete
  16. This Poem has got a hypnotic effect that lets one get into trance and find themselves impersonating. Really Beautiful piece of poetry.
    The Image is really life-like. Seems it is apt in this context.
    Very nice attempt, Dear Padma.. (Sorry for replying late)

    ReplyDelete
    Replies
    1. Thanks for your lovely reply. Hope everything went well.

      Delete
  17. తగునా అని నిలతీస్తే తగుదునమ్మా అనేంత ధైర్యమా మాకు :-)

    ReplyDelete
    Replies
    1. ఇలా నెత్తిమీద మొట్టి....జోలపాడాలా మహీ :-)

      Delete
  18. పిక్ & పోయెం పీలగా ఉన్నా పిచ్చెక్కించారుగా... :-)

    ReplyDelete
    Replies
    1. ఈసారి బలం తెచ్చుకుని బలిసిన పోయం & పిక్ పోస్ట్ చేస్తానుగా... :-)

      Delete
  19. ఏమోనమ్మ, ఇలా రాస్తవు అలా మెప్పిస్తావు, నెను ఇక్కడ బ్లాగ్ చుసి కమెంటడాని అవస్తపడాల్సి వస్తుందని దొంగలా చదివి జారుకుంటున్నా, మనసాగలేక

    ReplyDelete
    Replies
    1. ఏమోతల్లి....ఎక్కడ నచ్చక అలకబూనుతావో అని హడలి చస్తున్నా

      Delete
  20. పద్మార్పిత ,

    అసలు పేరు పద్మ ,ఈ ని జీవితాన్ని యిలా ఈ కవితలకి , ఈ చిత్రాలకి అర్పించుకొంటూ పద్మార్పితగా పదుగురికి పరిచయమైనావు .

    భేష్ భేష్ చాలా చాలా బాగుంది .

    చిత్రానికిచ్చిన వర్ణాలు వర్ణనాతీతం , నీ బ్లాగులో వినిపించే పాట లాగా .

    చెయ్యదల్చుకున్నవన్నీ చేసేసి చివరికి

    " నేలచూసిన బిడియమౌనా
    పైటకప్పిన పరువమాగునా!"

    చాలా బాగుంది ఈ తరం పిల్లలకి చక్కటి సందేశం .

    ReplyDelete
    Replies
    1. నా ఆటోబయోగ్రఫీని ఇలా చెప్పేస్తే అల్లరిపాలైపోతానేమో!:-)
      ఏదో చమత్కారినే కానీ సందేశం అందించేంత గొప్పదాన్ని కానేమో!
      Thank you Sharmagaru _/\_

      Delete
  21. పద్మా..,చిత్రం చాలా బాగుంది. భావం దానితొ సరి తూగుతుంది.
    అస్సలు ఇంత బాగా చెప్పినా..., ఇంకా ఏదో వినాలనే తపన గుండెకు ఉంటూనే ఉంటుంది...,
    అది మరో కవితకై ఎదురుచూస్తూ ఉంటుంది. నిజమేనా...బంగారు తల్లీ.

    ReplyDelete
    Replies
    1. ఇంత ఆప్యాయంగా నన్ను పలకరిస్తూ మీరు అందించే ప్రతి పదం నాకు ప్రేరణాత్మక పన్నీటిజల్లు. ధన్యురాలిని!

      Delete
  22. ఏటి గట్టున తామరాకు మీద నీటిబొట్టులా... అందీఅందని చక్కని కవిత. పట్టు విడుపుల పొడుపు కథ.బ్యూటిఫుల్‌.
    పద్మగారు.

    ReplyDelete
    Replies
    1. అహ్లాదకరంగా అలరించాలనే నా ప్రయత్నానికి మీ స్పందనలే పట్టుకొమ్మలు. థ్యాంక్యూ!

      Delete
  23. అద్బుతమైన భావ మాలిక. అబినందనలు పద్మా గారు.

    ReplyDelete
    Replies
    1. అభివందనాలు ప్రేమైకజీవులకు!

      Delete
  24. వలపుసరాగాల్లో తగునా అంటూ తగవులెందుకు పద్మా....అందమైన భావానుభూతులను అర్పించగల జాణవి:-)

    ReplyDelete
    Replies
    1. జాణలా మారిన జవరాలినైనా మీ అందరి అభిమానాన్ని ఆశించె అతిసాధారణ అతివను ఆశాజీవిని .

      Delete
  25. Chala hai Ga vuddi mee kavitha Padmarpita garu .matallu ravatammu leddu.

    ReplyDelete