పద్మార్పితా.....పిచ్చి పలువిధాలు అంటే కాదు కాదు ప్రేమికులు పలురకాలు అని చెప్పే ప్రయత్నమే ఈ "సప్త ప్రేమికులు" ఆస్వాధిస్తారు కదూ :-)
"పిసినారి ప్రేమికుడు" చిల్లర పైసల కోసం చిందులు వేసే నేను కోట్లరూపాయల విలువైనమాట చెప్పేసాను ఐ లవ్ యు అని మొబైల్ లో వినిపించాను!
"నిర్మల ప్రేమికుడు" నీ మోముపై మొటిమల మచ్చలున్నా ఎలా ఉన్నా నీ ముఖము చంద్రబింబమేనని తారలుకూడా తోడున్నాయని సంబరపడతాను!
"నిశ్చల ప్రేమికుడు" ప్రేమిస్తే నిద్రహారాలు ఉండవని అంటారు వీలుంటే నన్నూ ఒకసారి ప్రేమించేద్దురూ ఈ మధ్య తిని తొంగోవడం ఎక్కువై లావెక్కాను! "ధనమున్న ప్రేమికుడు" షాజహాను కంటే గొప్పవాడిని నేను సిరిసంపదలంటే లెక్కచేయక ప్రేమించేసి నీ పేరున బ్రతికుండగానే తాజ్ మహల్ కట్టిస్తాను!
"అతిజాగ్రత్త ప్రేమికుడు" మనసుతోపాటుగా మరెన్నో దోచుకున్నావు ఇది తెలుసుకుని గదినంతా పరిశీలిస్తుంటాను నువ్వొచ్చే ముందు వచ్చి వెళ్ళిన తరువాతను!
"అమాయకపు ప్రేమికుడు" నిన్ను చూస్తున్నా చూస్తున్నా చూస్తూనేవున్నా నువ్వు వచ్చేటప్పుడు నేనటు వెళ్ళేటప్పుడు చూసి చత్వారంవచ్చి రెండుకళ్ళు నాలుగనుకుంటున్నాను!
"నిత్య ప్రేమికుడు" గాలిలో ప్రేమలేఖరాసి అందరికీ మెయిల్ పంపి రిప్లై ఇచ్చిన వారిని నిజమైన ప్రేమంటూ ప్రేమించి తనకోరికలని తలా ఒక్కరిలో ఒక్కొక్కటి తీర్చుకునేను!
జీవించే ఉద్యోగమే చేసి అలసిన జీవితం ఖాతాలో లెక్కలేవోచూసి జీతమడిగింది! నిండిన పర్సు లోకాన్ని పరిచయం చేస్తే ఖాళీపర్సు మనిషి నైజాన్ని చూపించింది! డబ్బు జల్సాకాదు అవసరాలు తీర్చునని శ్రమతో సంపాధించి ఖర్చుపెడితే తెలిసింది!
ఇష్టమేలేని కష్టమైన నవ్వేదో నవ్వమని నవ్వు వెనుక ఏడ్పునే నిద్రపుచ్చమంది! జీవమనుకున్న పరిచయాలే విడిపోయి స్వార్థమేమో పెచ్చులూడి కనువిప్పైంది! అందరూ మేకవన్నెలద్దుకున్న పులులని ఈ జీవిత రంగస్థలం పై నటిస్తేనే తెలిసింది!
అంటించడానికి అగ్గిపుల్ల అవసరంలేదని మనిషి మనిషిని చూసి మండుతాడంది! రాతినికొలుస్తూ పూలుకోసి హత్యచేసానని గుడిలో రాతివిగ్రహానికున్న పూలమాలంది! పుణ్యానికి పెట్టుబడిగా పాపాన్ని లంచమిచ్చి క్షమని కోరుతూ మరో తప్పుని బలి ఇచ్చింది!