సరాగాల వంట

ముద్దుల ముద్దకూర మురిపాలవేపుడు
కమ్మగావండి వయ్యారంతో వేడిగా వడ్డిస్తే..
ఒళ్ళువేడెక్కి జ్వరమొచ్చింది అన్నావురా!

కౌగిళ్ళనే కొనగోటితో కోసి కలగూరగా కలిపి
కడుపసందుగా కవ్వింతలతో అందించబోతే..
కళ్ళున దగ్గితే కంగారులో పొలమారె కదరా!

వలపు వగలనే వడగాచి మసాల దట్టించి
ఇగురు కూరను ఇంపుగా ఆరగించమంటే..
అరగదని చెప్పి ఆయాసపడతావు ఏందిరా!

పులుపు పరువాన్ని పప్పుపులుసుగా పోపేసి
నాజూకు చేతులతో నెయ్యివేసి తినిపించబోతే..
వికారమని వింతాకారాలే చూపుతున్నావురా!

చిక్కటిపాల మదినే గడ్డపెరుగుగా తోడుపెట్టి
అల్లరి ఆవకాయనే నంజుగా అద్దుకోమంటే..
పడిసెమంటూ పట్టెమంచం ఎక్కినావేందిరా!

ఈ విచిత్ర విన్యాసాల చోద్యమేమని ఆరాతీస్తే
వలచినవాడి మనసుదోచ వంటావార్పులేల..
కలువభామను చూసి కడుపునిండెనన్నావురా!

24 comments:

  1. పద్మార్పితగారు...మేమూ ఆకలిగానే ఉన్నాము. కళ్ళకి కనబడి కడుపునింపేది ఎప్పుడో మరి :-)

    ReplyDelete
  2. కలువభామ కవ్విస్తుంటే కడుపాకలి ఏంముంటుంది.
    చలికాలంలో సరాగం గిలిగింతలు పెట్టింది

    ReplyDelete
  3. అద్భుతః
    శృంగారనైమిషాన్ని తగుపాళ్ళలో మేళవించి అందించిన రుచికరమైన వంటకం. కనులతో చుడకనే కవితరాసి కడుపు నింపావు. అభినందనలు అర్పిత-హరినాధ్

    ReplyDelete
  4. Pyaar+Kaadal+Love= Padmarpita
    Emotions+Feelings+Actions= this poem.

    ReplyDelete
  5. వంటలో వలపు విలాపాల పాళ్ళు బహు కమ్మగా ఉన్నాయండి సూపర్ మేడం

    ReplyDelete
  6. వలపు వంటలు ఏడ నేర్చుకున్నారు మాడం. బాగుంది మీ వంట కవిత

    ReplyDelete
  7. "ప్రియురాలి చేతి వంట
    ప్రియుడికి కనులపంట
    పెళ్ళానికి ఒళ్ళుమంట"
    ఇది కనెక్టివ్ కాకపోయినా చదువుకుని నవ్వండి.
    సామెత వ్రాసి చాలారోజులైంది అందుకని.
    మీ కవిత మా అందరి మనసులో జివ్వుమందట.

    ReplyDelete
  8. వంటచేస్తూ కూడా వలపు కురిపించి మైమరపించవచ్చనే గొప్ప సరససల్లాప చిట్కా చెప్పారు. ధన్యోస్మి పద్మార్పితగారు.

    ReplyDelete
  9. చిత్రంలో కలువభామను చూస్తేనే కడుపు నిండుపోయింది. లైవ్గా చూస్తే లైఫ్ జింగలాల :-)

    ReplyDelete
  10. simple & sweet blog creation with melody background song.

    ReplyDelete
  11. ఇలా వ్రాయడం నీకే సాధ్యం.
    the one and only poetess who can write in such a beautiful way.

    ReplyDelete
  12. మీ శైలిలో కూర్చిన కవిత.

    ReplyDelete
  13. madam marosari rocking romantic poem rasaru. kudoos

    ReplyDelete
  14. చూసి కడుపు నిండిపోతే లోకంలో కరువు కాటకాలే ఉండవు. పద్మగారు లోక కళ్యాణం కోసమని మీరు కనబడక తప్పదండి:-)

    ReplyDelete
  15. ఓహో...ఈసారి వంటలు వడ్డించి వలపు పండించారన్నమాట. బాగుందండి.

    ReplyDelete
  16. Banglore lo chaliki mee sarasasaraagaala vantalaki mahee's heart is beating and iam just kidding..:-) one more beautiful poem from your thoughts.

    ReplyDelete
  17. చూసి తరించడం తప్ప చేసేది ఏముందని :-)

    ReplyDelete
  18. మీరు గిట్ల మస్తుగ రాస్తే ఏం కమెంట్ పెట్టాలె

    ReplyDelete
  19. వంటల్లో వేలు పెట్టి వలపు కురిపిస్తే మేమేమైపోవాలి పద్మ. :-)

    ReplyDelete
  20. ఇన్ని రుచులు ఒకేసారి చూపిస్తే ఎలా??

    ReplyDelete
  21. మీకేం రాసేస్తారు. వండి వడ్డించేస్తారు.

    ReplyDelete
  22. కాస్త అప్పుడప్పుడూ కనికరించి రిప్లైస్ ఇవ్వండి మాడం

    ReplyDelete
  23. "అయిపోయిన పెళ్ళికి బాజాలు
    పాచిపోయిన వంటకు రుచులు"
    ఎందుకులెండి...అందుకే ఇక్కడ నన్నుమన్నించేయండి.
    మీ అభిమాన స్పందనలకు జవాబులు ఇవ్వలేదని :-)
    ...ప్రేమతో
    మీ పద్మార్పిత _/\_

    ReplyDelete