నేనూ...పతివ్రతనే!

అడుగడుగునా ఆశలే అణగారిపోయి
అంచెలంచెలుగా ఆశయాలే కూలిపోతే
అడ్డుకున్న వారినే అక్కున చేర్చుకుని
ఆహా! ఓహో అన్న నేనూ...పతివ్రతనే!



అడ్డమైన ప్రశ్నలకీ కాదంటూ అవునని
అర్థమైనా కానట్లు అమాయకంగా నవ్వి
అడ్డంగా నిలువుగా తలూపి తైతెక్కలాడి
అబ్బో అమ్మో అంటున్న నేనూ...పతివ్రతనే!



అలై ఎగసిపడుతున్న కోర్కెలకి ఆనకట్టేసి
అనురాగాన్ని కలలోనే కామించి రమించి
అలుసైపోయి అరచేతిలో వైకుంటమే చూసి
అమాయకంగా అవునన్న నేనూ...పతివ్రతనే!



అవసరాల్ని ఆసరాచేసి అందాలని పొగిడి
అదును చూసేసి అదుపు తప్పినవారిని
అతిమంచివారంటూ అందరినీ ప్రేమించిన
అసలుసిసలైన అబలనైన నేనూ...పతివ్రతనే!

43 comments:

  1. ఎవరినొపె ఆవేశంగా తిట్టి బుజ్జగిస్తున్నట్లుంది పద్మా. అయినా ఎవరికో సంజాయిషీ చెప్పుకునే స్టేటస్ కాదు మీది ;-)
    Picture is simply too good.

    ReplyDelete
    Replies
    1. తిట్టేంత సాహాసమా...నన్ను నేనే ఇలా ;-)

      Delete
  2. Who told you! Are you OK my friend?

    ReplyDelete
  3. కాదన్నది ఎవరు మేడం. మీరు పరమపావని పద్మార్పితగారే.
    కవిత పరంగా లోతైన భావాన్ని వ్యక్తపరిచారు. కుడోస్ & క్లాప్స్

    ReplyDelete
    Replies
    1. మనల్ని మనమే అనుకుంటే ఎవరో అనడానికి చాన్స్ ఉండదు కదా ;-)

      Delete
  4. అలై ఎగసి పడుతున్న కోర్కెలకి ఆనకట్ట వేసి....బాగా రాసారు పద్మాజీ...

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు వందనాలు.

      Delete
  5. మొట్టమొదటగా మీరు ఎంచుకున్న టైటిల్ పద్మార్పిత స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా అధ్బుతం!
    అణగారిన ఆశలకు ,, ఆశయాలకు అడ్డుపడ్డవారిని అక్కున చేర్చుకోవడం ... నచ్చకపోయినా అన్నీ అవునన్నట్లు తలూపడం...కలల్లో విహరించడం...అలుసైపోవడం... అందర్నీ అమాయకంగా ప్రేమించి వారి చేతిలో మోసపోవడం...
    /////// నేటి సమాజంలోని ప్రతి స్త్రీ మదిలో మెదులుతున్న ఈ భావాల్ని పొల్లుపోకుండా మీరు వ్యక్తపరచిన విధానం అమోఘం మేడం. .. పురుషాధిక్యతకు మీరు వ్యంగ ధోరణిలో సున్నిత నిగూఢమైన చురకలు అంటించి ఇప్పటికైనా స్త్రీ ఈ పతీవ్రత అనే దొంతెరలోంచి బయటకు రావాలని పిలుపునిస్తోంది మేడం... అధ్బుతం మీ కవిత.... చివరి లైన్లు చాలా చాలా బావున్నాయి....

    ReplyDelete
    Replies
    1. అయ్యబాబోయ్...అభిమానం పొంగిపొర్లుతుంటే మనసు గాలిలో తేలిపోతుందండి. ధన్యవాదాలు_/\_

      Delete
  6. ఆత్మపరిశీలన అంటూ అందరినీ పరికించినట్లుగా ఉందండి మీ కవిత. చిత్రం కూడా సరిపోయింది.

    ReplyDelete
    Replies
    1. నన్ను నేను పరిశీలిస్తూ పనిలో పని అంటారా:-)

      Delete
  7. Telugu Lo Rayadaniki
    http://alllanguagetranslator.blogspot.in/2013/05/blog-post.html

    ReplyDelete
  8. నేను నిన్ను అన్నానని ఎవరన్నా అన్నారా?:-)

    ReplyDelete
    Replies
    1. అంత ధైర్యమా మహీ :-)

      Delete
  9. చాలా మంచి కవిత పద్మగారు.

    ReplyDelete

  10. చ చ చ !

    ఆ పతి వ్రత గట్రా పదాలు ఎప్పడు వదిలేస్తారో ఏమో ఈ ఆండోళ్లు ! పతివ్రత ఏమి టండీ అసలు పాటి సాటి రాని వారి కై వ్రతులై ఉండడమేమి అంట ??


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అలా వదిలేసారు అనే అప్పుడప్పుడూ ఇలా గుర్తుచేసుకునేది :-)

      Delete
  11. పతివ్రతలా!!!!!???? అంటే అర్థం చెప్పి పోయెం వ్రాసి ఉంటే బాగుండేది పద్మార్పిత. ఇంకా ఏలోకంలో ఉన్నారు మీరు.
    హా హా :-) :-)

    ReplyDelete
    Replies
    1. అర్థం తెలిస్తే రాసేదాన్ని కాదేమో కదండి :-)

      Delete
  12. మీరు ఇలా నిజాలని నిర్భయంగా చెప్పేస్తుంటే
    ఎన్ని హృదయాలు మౌనంగా ఘోషిస్తున్నాయో తెలుసా!
    మొత్తానికి ధైర్యంగా చెప్పారు...మీకు తిరుగులేదు :-)

    ReplyDelete
    Replies
    1. ఘోషా....గోషా(ముసుగులో) దాగినవారి గురించా మీరు చెప్పేది :-)

      Delete
  13. బ్లాగర్స్ కి బద్దకం హెచ్చిందో లేక నా ఫీల్ అలా ఏడ్చిందో మరి! మా సతీష్ గారు, శ్రీధర్ గారు, సురేష్ గారు, శ్రీపాద సత్తయ్యగారు...ఇలా అందరూ కనబడకుండా దాగుడుమూతలాడుతున్నారు. ఈ ఏదాది చివరి నెల వచ్చేయడి ఎక్కడ ఉన్నాసరే :-)
    పద్మార్పితగారు....నన్ను తిట్టుకోకుండా మీరు కూడా పిలుపునివ్వండి

    ReplyDelete
    Replies
    1. నేను మనసులో అనుకుని మదనపడుతున్నది మీరు పైకి అనేసారు ఆకాంక్ష. ఎలా ఉన్నారో ఎకాడ ఉన్నా ఆల్ హ్యాపీస్ అనుకుందాం.

      Delete
    2. అనుకున్నానండి ఆకాంక్ష గారు. ఇయర్ ఎండ్ కదా కొంచం బిజీ చేత కవితలు కాని వ్యాఖ్యాలు కాని వ్రాయడం లేదు అంతే తప్పిస్తే వేరే కారణమంటూ ఎం లేదు. పద్మ గారు క్షమించాలి ఈ మధ్యన మీ ఏ కవితకిను కామెంట్స్ ఇవ్వలేనందులకు.

      Delete
  14. బులెట్ కన్నా వేగంగా తన్నుకొచ్చిన మాటలు. సూటిగా గుండెలోకి దూసుకెళ్ళాయి.

    ReplyDelete
    Replies
    1. ఈ తుపాకీ తూట్లేంటో గాయంలేకుండా గుర్తుకొస్తాయి ;-)

      Delete
  15. మనషుల ప్రవర్తనని మీదైన మాటల్లో చెప్పారు మేడం- బాగుంది కవితాచిత్రం

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి మీ స్పందనకు.

      Delete
  16. I got it. You are bold & beautiful in expressing thoughts.

    ReplyDelete
    Replies
    1. Oh...nice to read this. thank you Payal.

      Delete
  17. No Words to say... The best

    ReplyDelete
  18. చక్కగా చెప్పావు చిక్కని భావాన్ని .

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ మాడం

      Delete
  19. అంతరంగమధనానికి నీ ఆత్మపరిశీలన జోడించి అబ్బుర పరిచావు అర్పిత-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీరు నన్ను ఇలా ఉత్తేజ పరచి రాయిస్తారు.

      Delete
  20. అవునౌవునండి...కాదన్నదెవరు

    ReplyDelete
    Replies
    1. నేనే అనుకుని కాదనుకున్నా

      Delete
  21. ఇలా ప్రతివ్రతల్ని తిట్టకండి... :-) )

    ReplyDelete
    Replies
    1. తవిక రాస్తే తిట్టాను అంటే ఎలా :-)

      Delete