నాలోనే దాగిన స్వార్థ ప్రలోభ ప్రేతాత్మా
నా నుండి నన్ను లాక్కున్న భూతమా
మంత్రమేసి మాయచేసిన మార్జాలమా
పుర్రెలో గుజ్జునే పీక్కుతినెడి పిశాచమా!
నా ఆలోచల్ని ఆత్మలకిచ్చి ఆడుకోమని
నాదేహం పరులకై ప్రేతాత్మగా మారమని
మట్టిలో కలిసి పిండమై కాకినే తినమని
నన్నే మార్చిన నువ్వే ప్రియదెయ్యమని!
నా ఆత్మవే అయినా నిన్ను ఆలింగనమిడి
అసలుసిసలు అందవికారివైనా నే ముద్దిడి
ఆత్మలో ఆత్మనై ఆత్మల నడుమ అడుగిడి
ఎలుగెత్తి అరుస్తా అంతరాత్మా ఐ లవ్ యూ!
నా నుండి నన్ను లాక్కున్న భూతమా
మంత్రమేసి మాయచేసిన మార్జాలమా
పుర్రెలో గుజ్జునే పీక్కుతినెడి పిశాచమా!
నా ఆలోచల్ని ఆత్మలకిచ్చి ఆడుకోమని
నాదేహం పరులకై ప్రేతాత్మగా మారమని
మట్టిలో కలిసి పిండమై కాకినే తినమని
నన్నే మార్చిన నువ్వే ప్రియదెయ్యమని!
నా ఆత్మవే అయినా నిన్ను ఆలింగనమిడి
అసలుసిసలు అందవికారివైనా నే ముద్దిడి
ఆత్మలో ఆత్మనై ఆత్మల నడుమ అడుగిడి
ఎలుగెత్తి అరుస్తా అంతరాత్మా ఐ లవ్ యూ!
ఏంటేంటి...
ReplyDeleteమీ అంతరాత్మకి మీరే ఐ లవ్ చెప్పేసుకుంటే. మిగతా ప్రేమించేవాళ్ళ మాటేమిటి మాహారాణీగారు.
వ్యావ్ ఏం వాడిగా సూటిగా గుండెల్లోకి దూసుకుపోయే ముచ్చట చెప్పినారు. ఐ లవ్ యూ టూ
ReplyDeleteఎవరి పనులు వారే చేసుకోవాలి అనేది పాతనానుడి
ReplyDeleteఎవరిని వారే ప్రేమించాలి అనేది పద్మార్పిత ఒరవడి..
మీ మనసు ఇంత నిస్వార్థమైతే
ReplyDeleteనేను కూడా I LOVE YOU :-)
స్వార్థ ప్రలోభ కొత్త పద్మ బాగుంది పద్మగారు. ఆత్మలని సైతం ఆలింగనం చేసుకుంటారు.
ReplyDeleteఅంతరాత్మా ఐలవ్యు... అంటూ అంతరంగావిశ్కరణ చేసిన మీ శైలి అద్భుతం! అమోఘం!! అద్వితీయం!!! చాలా చక్కటి కవిత.. లోతుగా వెళ్ళేకొద్దీ ఆలోచింపజేసేలా ఉంది!! సూపర్...
ReplyDeleteలవ్వు వరకూ ఆగిపోండి... పెళ్లి శోభనం అంటే.. తేడా అనుకుంటారు! మీ అంతరాత్మ నాకు నచ్చేసింది... వీలయితే దానితోనే నా పెళ్లి!! హా హా... :-)
ReplyDeleteమార్జాలమా..naa profile pic used so i too love your soul :-)
ReplyDeleteవామ్మో నాకు భయ్యమేస్తుంది. అందమైన అమ్మాయి ఇట్లా భయపెడితే ఎట్లా.
ReplyDeleteస్వార్థరహిత హృదయం మనదైనా ఇతరులదైనా ప్రేమించడం గొప్పవరం. నిన్ను నీవు ప్రేమించుకుంటావు అది నిస్వార్థమైతే అని చక్కగా చెప్పావు పద్మార్పిత-హరినాథ్.
ReplyDeleteMe too love your soul :-)
ReplyDeleteIs there any trend to follow this blog mam. truly lovable
ReplyDeleteనీ అంతరాత్మ ఎప్పుడు నీ ఆధీనంలోనే ఉండగా ఇంకా ఐ లవ్ అనడం అవసరమా పద్మా
ReplyDeleteఇంతలా ఘోషించి మనల్ని మనం ప్రేమించుకోవడంకన్నా స్వార్థమో సెల్ఫిషో ఇన్ష్టం వచ్చినట్లు బ్రతికేసే పోలా. మొత్తానికి దెయ్యాలని బూతాలని కూడా మచ్చిక చేసుకుని మాటలాడే మంత్రముంది మీ మాటల్లో. బ్లాగ్ జనాలు భయపడ్డారేమో పద్మార్పితగారు బొమ్మచూసి. :-)
ReplyDeleteఅంతరాత్మను ప్రేమించలేని వారు జీవితంలో ఎవరినీ ప్రేమించలేరు...ఇది దయ్యాల కవిత కాదు...అసలు సిసలైన అంతరాత్మకు ప్రతిరూపం..గ్రేట్ పద్మగారూ...
ReplyDeleteఅసలుసిసలైన అంతరాత్మ మీది...ప్రేమించేయండి
ReplyDeleteనన్నే కాదు నా అంతరాత్మనూ ప్రేమించే మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలండి.
ReplyDelete