వింత వైద్యం


మనసు గాయానికి ఆయింట్మెంట్ అవసరంలేదు
స్వాంతన పరిచే సెంటిమెంట్ మాటలుంటే చాలు!


తలపుల తలనొప్పి, మాత్రలు వేసుకుంటే తగ్గదు
చెలి చెంత చేరి చేసే చిలిపి వలపు చేష్టలే చాలు!

ప్రణయరాగాలకు పల్స్ చూసి పరీక్షలు అక్కర్లేదు
స్పంధించే హృదయానికి ప్రతిస్పందనలే పదివేలు!

విరహంలో వేగి వైరస్ లక్షణాలు అనుకుంటే కాదు
తనువుల ఘర్షణలే వలపు జ్వరానికి విడుపులు!

సరసాల సమ్మోహనానికి సర్జరీలు చేయనక్కర్లేదు
సరదాగాసాగితే మన్మధుడే వేసేను వలపుబాణాలు!

సుమధుర ప్రేమకావ్యానికి సూదిమందు పనిలేదు
అంతు చిక్కని అంటువ్యాధది అనురాగమే చాలు!

పరవళ్ళు త్రొక్కే గుడ్డిప్రేమ ఏ ట్రీట్మెంట్ కి లొంగదు
లేని వలపు ఉందని ఎక్సరేలు తీస్తే అబాసుపాలు!

22 comments:

  1. వింత రోగానికి విచిత్రంగా ఉంటుంది ట్రీట్మెంట్ అనుకుంటే
    పరీక్షలు వద్దంటూనే పెద్ద లిస్ట్ వ్రాసి పైత్యం పెంచావే :) :-)

    ReplyDelete
  2. చివరిలో మీ మార్క్ ఉట్టిపడింది...బాగుంది మీ ట్రీట్మెంట్

    ReplyDelete
  3. ఛస్ పరీక్షలు ఏం లేకుంటే ప్రేమలో కిక్ ఉండదు

    ReplyDelete
  4. అహా..వృత్తి ధర్మం ప్రవృత్తిలో

    ReplyDelete
  5. గాల్లో కాల్పులు
    మీ కవితకు క్లాపులు

    ReplyDelete
  6. ప్రేమ పుట్టించడమే కాదు వైద్యం కూడా చేస్తారా.....బాగుందండి.

    ReplyDelete
  7. వలపు చిగురించైన ఒక ఎదకు ఎన్ని పరిక్షలు చేసినా ఓ పట్టాన అర్థం కాదు ఏం రోగమొచ్చిందని... ఎన్నెన్ని మందులేసినా తగ్గదు మాయరోగామేదో తెలియకుండా... ఇంకా సర్జరీలు చేసి ఏం లాభం?
    చిలిపి పదవిన్యాసాలతో కవిత సాంతం ఆకట్టుకొన్నారు... ఒక మంచి సందేశాన్ని (మీరు సందేశాలు డైరెక్ట్ గా ఇవ్వరనుకోండి) ఇచ్చి మీదైన మార్క్ వేసారు... చాలా రోజులకి ఇలా కాన్సెప్ట్ బేస్డ్ కవిత రాసారు..  మొత్తానికి ఇరగదీసారు.... చిత్రం ఎంపిక చాలా అధ్బుతంగా ఉంది. సలాం! మేడం....

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
  8. మీలాంటి డాక్టర్ ఉంటె నేను హాస్పిటల్లోనే మకాం వేసేస్తా... :-)

    ReplyDelete
  9. ఈసారి ఏం వ్రాస్తారో అనేలోపే ఏకంగా ప్రేమకే వైద్య సలహాలు ఇచ్చి ఆకట్టుకున్నారు

    ReplyDelete
  10. లేని వలపు ఉందని ఎక్సరేలు తీస్తే అ బాసు పాలు ... సమ్మోహనాభరిత కవిత .. మార్క్ ఆఫ్ పద్మార్పిత

    ReplyDelete
  11. మనసుకి రోగమొస్తే మందు లేదంటారు.కానీ మీ దగ్గర ప్రిస్కిప్షనే ఉందిగా. విరహానికో మందు సరసమే. మనసు నిర్లిప్తంగా ఉన్నప్పుడు ఒక్క వాల్చూపు చాలదూ... లక్ష ఓల్టుల కరెంటు షాకుతో ఒంట్లో ఉన్నఒక్కో కణం సునామీలా అంతెత్తు లేచి పడుతుంది. స్పర్శ లేదంటారా.. అయితే ఒక్కసారి నల్లతాచులాంటి వాల్జజ కొరడా తాకితే సరి... ఆ స్పర్శే కావాలనిపిస్తుంది. సేమ్‌ ఫీలింగ్స్‌ ఇన్ ఫిమేల్‌ ఆల్సో. కదా. ఆడువారు చెప్పుకోరు, మగాళ్లు చెప్పకుండా ఉండలేరు. బొమ్మ అదిరింది పద్మగారు.

    ReplyDelete
  12. సుమధుర ప్రేమకావ్యానికి సూదిమందు పనిలేదు...సూపరో సూపరు

    ReplyDelete
  13. Beautiful pic and poem padma.

    ReplyDelete
  14. మీ ప్రిస్క్రిప్షన్ తో ప్రేమించని పామరులు అంతా ప్రేమలో పడ్డం ఖాయం

    ReplyDelete
  15. ఊరగాయ పుల్ల పుల్లగా భలేగుంది , ఉప్పూ కారం మాత్రం బాగా అడుక్కి దిగిపోయి అక్కడ కొంచెం రుచిలో తేడా వచ్చింది తప్పితే ..... మిగతాది అంతా యమ్మీ యమ్మీ అనుక్కోండి .

    ReplyDelete
  16. మీ ట్రీట్మెంట్లో రోగం మళ్ళీ తిరగబడదు కదండీ :-)

    ReplyDelete
  17. మీ మార్క్ కవిత పద్మాగారు. మరో అందమైన చిత్రం

    ReplyDelete
  18. మందులు లేకనే చికిత్సా విధానం ;)

    ReplyDelete
  19. స్పంధించే హృదయానికి ప్రతిస్పందనలే పదివేలు!బాగా చెప్పారు

    ReplyDelete
  20. వండర్ఫుల్ ట్రీట్మెంట్

    ReplyDelete
  21. మీ అమూల్యమైన వాక్యాలతో ప్రేరణ ఇస్తున్న అందరికీ పద్మార్పితాంజలి _/\_

    ReplyDelete