తెల్లకాగితం

ఈ మనసే ఒక తెల్లని కాగితం...
దానిపై ఏం వ్రాయకనే వదిలేయ్
ఏ వ్యధలు, వేదనలు వ్రాయొద్దు
ఎటువంటి పిర్యాదులు, పితూరీలొద్దు!

ఏవో గుర్తులు, పాత విషయాలు...
ప్రేమ పలుకులు, గడిచిన రాత్రులు
దగ్గర దూరమని అనుభూతులు వ్రాసి
ఊపిరి పోస్తున్నానంటూ ఊపిరితీయొద్దు!

గుండె సవ్వడులను ప్రశ్నించవద్దు...
వేగంగానో నిదానంగానో కొట్టుకోనీయ్
నేడు వ్రాసిన రాతలు రేపటికి జ్ఞాపకాలని
అందమైన చెరుపలేని అక్షరాలని చెప్పొద్దు!

మది తేలికంటూ మరక చేయొద్దు...
నాలుగరల్లో ఏ మూలో ఆడే శ్వాసల్ని
పదధూళిలో ఊపిరాడనీయక బంధించొద్దు
ఇది ఒక తెల్లకాగితం దానిపై ఏం లిఖించొద్దు!

21 comments:

 1. నాలుగరల్లో ఏ మూలో ఆడే శ్వాసల్ని..... ఊపిరాడనీయక బంధించొద్దు
  Wow , nice lines .

  ReplyDelete
 2. నో నో అంటే యస్ అని కదూ :-)

  ReplyDelete
 3. తీయ తేనియ బరువు ఓపలేదీ బ్రతుకు
  సొగయు నా ఎదకేల ? తగని సౌఖ్య జ్వాల ?
  మ్రోయింపకోయ్ మురళి ............
  కృష్ణ మ్రోయింపకోయ్ కృష్ణ ! !

  ఎప్పుడో చిన్నప్పుడు చదివిన మహాకవి వాక్యాలు గుర్తొచ్చాయి .

  ReplyDelete
 4. తెల్లని కాగితానికి విలువ ఉండదు పద్మగారు

  ReplyDelete
 5. మీ మనసు మీ ఇష్టం, మీకు నచ్చినట్లు రాసుకోవచ్చు.

  ReplyDelete
 6. పదధూళిలో ఊపిరాడనీయక బంధించొద్దు

  ReplyDelete
 7. మేరా జీవన్ కొరా కాగజ్ కొరాహీ రెహనేదో అంటారా...ఎలాగైనా మీ బాణీ మార్చరు, బాగుంది బాగుంది

  ReplyDelete
 8. ఒక మహా కవిని బంట్రోతుపై కవిత రాయమని అడిగితే ఏం రాయను ఏం రాయనూ అంటూ పేద్ద కవిత్వాన్నే రాశడంట... అతడే మన తిలక్.... మీరు కూడా మనసుపై రాయొద్దూ అంటూ ....మా మనసులపై ప్రేమాక్షరాలు రాసేశారు... అందుకోండి మా హృదయధ్వానాల చప్పుళ్ళు...

  ReplyDelete
 9. రాయొద్దు అనంటే మాత్రం మనసు మాట వింటుందా ఏమిటి చెప్పండి. వద్దు వద్దనుకుంటూనే ప్రేమలో పడడం వ్యధ చెందడం పరిపాటి. ప్రేమార్పిత అయిన మీకు మేము చెప్పవలెనా ఏమిటి. :-) హా హా హా

  ReplyDelete
 10. తెల్లని మనసుపై సిరా మరకలు రాయొద్దు రాయొద్దు... :-(

  ReplyDelete
 11. ప్రేమించ వద్దు, కోరి వ్యధలని కొని తీసుకోవద్దు అని భలే చెప్పారు. ఈ సారి చిత్రం మీ టేస్ట్ కి భిన్నంగా ఉందండి.

  ReplyDelete
 12. ఏది రాయకపోతే తెల్లకాగితం ఎందుకు చెప్పండి

  ReplyDelete
 13. తెల్లకాగితం శుభ్రంగా ఉంది మీ మనసు వలె..

  ReplyDelete
 14. పద్మా మరీ తెల్ల కాగితం మరక పడరాదు అంటే ఎలా ;-) బాగుంది

  ReplyDelete
 15. మరక మంచిదే:-)
  తెల్లని కాగితం మీద
  బుసలు కొడుతూ వంపులతో
  నల్లని నాగు కదుల్తుంటే
  అది పద్మార్పిత కవిత - త్వమేవాహం?!

  ReplyDelete
 16. తెల్లని కాగితమున్నది
  ఉల్లములో రేగిన మధురోహల చిత్రా
  లల్లుటకొరకే గద ! మరి
  వల్లని తనమేల ? మనిషి వల్లవుతుందా !

  ReplyDelete
 17. తెల్లకాగితం ఉన్నదే రాసుకోవడానికి, వద్దు అంటే ఎల చెప్పు పద్మ-హరినాధ్

  ReplyDelete
 18. దగ్గర దూరమని అనుభూతులు వ్రాసి
  ఊపిరి పోస్తున్నానంటూ ఊపిరితీయొద్దు,హృదయాన్ని తాకిన పదాలు

  ReplyDelete
 19. _/i\_ అందరికీ వందనములు.

  ReplyDelete