ఊపిరి ఉన్నంత వరకూ ప్రయత్నించు
ఓడిపోక, ఆగిపోక అలసట అన్నదే లేక
ఆశ తీరేదాక గెలుపు కోసం ప్రయత్నించు!
విశ్వాసాన్ని విరిచేసే కష్టాలు ఎదురైనా..
ఇబ్బందులన్నీ ఏకమై ధైర్యాన్ని వెలివేసి
జీవితానికే విశ్రాంతని రెచ్చగొట్టినా, బెదరక
తుదిశ్వాస వరకూ గమ్యానికై ప్రయత్నించు!
నిబ్బరాన్ని నీలో నిండుగా నింపుకుని..
ఎందరో మహానుభావులను తలచి కొలచి
స్వార్థం వీడి, పేరు ప్రతిష్టల కొరకు ఆశించక
ప్రాణం పోయే వరకూ తప్పక ప్రయత్నించు!
దారిలో విఛ్ఛిన్నం చేసే విభేధాలని వీడి..
గాఢనిద్ర నుండి మేల్కొని, బద్ధకాన్ని బలిచ్చి
సంఘర్షణలని గెలిచి, ఆకర్షణలకి అంతుచిక్కక
అపజయంలోని జయం దక్కేలా ప్రయత్నించు!
try try try...until you succeed
ReplyDeleteప్రయత్నించడమే ఏ పని అయినా...మంచి సందేశాత్మక కవిత.
ReplyDeleteఉత్తేజంతోపాటు ఉల్లాసాన్ని ఇచ్చింది మీ పోస్ట్
ReplyDeleteyes try chesta
ReplyDeleteఉత్తేజభరితంగా సందేశాత్మకంగా సాగింది.. అభినందనలు పద్మాజీ..
ReplyDeleteहे भगवान ! मुझे मोती दे दे
ReplyDeleteचांदनी के सुहाना दे दे
फूलों का खुशबू दे दे
जमीन पर जन्नत दे दे ……
अगर ये सब ना मुमकिन हो तो
పద్మార్పిత जैसे शायरी दे दे
ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకి సాగిపొమ్మని చెప్పే మీ పోయం ప్రశంసనీయం.
ReplyDeleteఇకపై ఏదీ వదిలేదిలేదు...ప్రయత్నం పై ప్రయత్నం :)
ReplyDeleteme writings beautiful
ReplyDeleteఅక్షర అనుసంధానం చేసారు పద్మార్పిత.
ReplyDeleteచక్కని సందేశాన్ని మీదైన కూర్పుతో అందించారు.
ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోతే ఏం చేసేది చెప్పలేదు
ReplyDeleteగట్లనే మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తనే ఉంటా ;)
ReplyDeleteప్రయత్నంలో శ్రధ్ధ లోపించిన అది వ్యర్థం
ReplyDeleteఇంతకీ మీ ప్రయత్నం ఎంతవరకో చెప్పలేదు. మీరు ఆచరిస్తున్నారా
ReplyDeleteయద్భావం తద్భవతి
ReplyDeleteప్రయత్నించి ప్రయాసే తప్ప ప్రతిఫలం కనిపించడంలేదు....అయినా చేస్తూనే ఉంటాం.
ReplyDeleteబులెట్స్ మాటలు చెప్పినారు.
ReplyDeleteప్రయత్నించి విశ్వాన్ని జయించాలన్నమాట..
ReplyDeleteసందేశాత్మకంగా ఉంది..అభినందనలు-హరినాధ్
ReplyDeleteఇది...ఇలా మీరు ఊతమివ్వండి ప్రయత్నిస్తూ సాగిపోతాం విత్ సక్సెస్ ;)
ReplyDeleteచదువరులందర్నీ ప్రభావితం చేసే ఒక ఉద్వేగభరిత ఇన్స్పిరేషన్ కవిత. హ్యాట్సాఫ్ మేడం !
ReplyDeleteస్పందనలు తెలియజేసిన అందరికీ పద్మార్పిత అభివందనాలు _/\_
ReplyDeleteస్ఫూర్తిదాయకం మీ కవిత. బొమ్మ కూడా బాగుంది
ReplyDeletequite inspiring. any number of times, I say that i take a holy dip in the divine sea of your poetry. with every dip, i get new energy, new focus, new inspiration, new life. Ultimately, your poetry has become my life blood and breath Padma garu. hats off. i bow before you.
ReplyDelete