రాయలసీమ రాటుతనమేమో నీది
కోనసీమ కోమలత్వం అంతా నాది..
ఛల్ మోహనరంగా...జోడు కుదిరింది!
మొగలిపొదల మొరటుతనం నీది
బొండుమల్లెపూల పరిమళమే నాది..
పద పదరా...పండువెన్నెలే రమ్మంది!
గట్టి గడ్డపెరుగులాంటి కఠినత్వం నీది
పాల పొంగులాంటి పరువమేమో నాది..
కలసి తోడుకడదాం...ఈడు పిలుస్తుంది!
అంబరాన్ని తాకాలన్న ఆవేశమే నీది
అగాధాన్ని చూడరాదన్న ఆలోచనే నాది..
ఆచి తూచి అడుగేద్దాం..ఆనందమే నీదినాది!
నీది నాది అంటూ భలేగా వ్రాశారు. పిక్ చాలా బాగుందండి.
ReplyDeleteగడ్డ పెరుగు కఠినం ఎలా?
ReplyDeletegattidanam ante baagundedi. leda gadda perugulaanti chikkadanam needi ani kooda vraasi undochhu. inko vishayam. Raayalaseema ani undaali
Deleteshiraakiputragaru...meeru cheppina padaalu sunnitamgaa baagunnayi. tappuni sarichesina meeku dhanyavadalu_/\_
Deleteఏమి సెప్పినారు మాడం
ReplyDeleteబాగుంది
ReplyDeletebaagundandi pic kuda
ReplyDeleteso nice madam
ReplyDeletesimple words and meaningful.
ReplyDeleteనాదినీది అని చిరుకవిత రాసి కాస్త ఇబ్బంది పెట్టారు
ReplyDeleteఅలాగే ఆచి తూచి వేయండి అడుగులు ;)
ReplyDeleteనీది కానిదేమున్నది నాలో
ReplyDeleteనిజానికి నేనున్నది నీలో
...............................
అన్న ఆ మనసు కవి తో
మీకేదైనా బంధుత్వం ఉందా ?
ఆణిముత్యంలాంటి ఒక మంచి పాటను గుర్తుచేసినందుకు ధన్యవాదాలండి.
Deletesong super పిక్ చాలా బాగుందండి.
ReplyDeleteకొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవలి అనుకొంటె ఇప్పుడె చదవండి మీ Spice Andhra News
మొగలిపొదల మొరటుతనం నీది
ReplyDeleteబొండుమల్లెపూల పరిమళమే నాది...మీ కవిత పరిమళభరితం
మరి మాకేది :)
ReplyDeleteమీకు ఉన్నదండి ఆకాంక్ష గారు :
Deleteరాయలసీమ నుండి వెంకన్న ప్రసాదం (బూంది లడ్డు కోసం )
కోనసీమ నుండి కొబ్బరికాయలు (కొబ్బరి లడ్డు కోసం)
మొగలి రేకుల వాసనను మించిన నేతి సువాసన (బందర్ లడ్డు కోసం)
మల్లె పువ్వులాంటి తెల్లదనాన్ని మించిన కోమలత్వం (రసగుల్లా కోసం )
గట్టి పెరుగు కంటే గడ్డ పెరుగు భలే భలే (పెరుగు వడ కోసం)
పాలు కంటే తీయ్యని పదార్ధం (పాలకోవా కోసం)
ఆవేశం లో కట్టలు తెంచే కోపం ఎందుకు (కారపూస కరకర కోసం )
అగాధం కంటే లోతు వున్నా అందులో తీయని పానకం (కాకినాడ కాజ కోసం )
ఇవన్ని మీకే హహహ :-)
HAPPY DUSSERA
ReplyDeleteమావూరి కుర్రోడే కదా..కానివ్వండి :)
ReplyDeleteములుగోల విడువడు మోటు సరసము వాడు
ReplyDeleteమెడపట్టు విడువదు మృదు శరీర
కొలనిలో రాయంచ కలయిక చెలువమ్ము
కనురెప్ప వేయక కాంచుటేమొ
నింగిలోని మొయిలు నీడపట్టిన దేమొ
మొగిలి మాటుగనిల్చి మురిసెనేమొ
సంజ కెంజాయ కాస్తంత వెలుతురిచ్చి
దోహద పడెనేమొ తోడు నిల్చి
ప్రణయమే లోకమై , తాము పరవశించె
తనువులొండొంట , రెండేడ ? తామొకటియె
రాధికా శ్యాములా ? కాదు , ప్రాణాధికముగ
వలపు మూర్తీభవించిన వారు వీరు .
కొలనిలో రాయంచ కలయిక చెలువమ్ము
Deleteకనురెప్ప వేయక కాంచుటేమొ
నింగిలోని మొయిలు నీడపట్టిన దేమొ
మొగిలి మాటుగనిల్చి మురిసెనేమొ..ఏమో అంటూ అనుమానం ఎందుకండి...మీరు ఊహించిన తరువాత తప్పదేమో :-) ధన్యవాదాలు మీ అందమైన స్పందనకు
అంబరాన్ని తాకాలన్న ఆవేశమే నీది
ReplyDeleteఅగాధాన్ని చూడరాదన్న ఆలోచనే నాది
ఆచి తూచి అడుగేద్దాం..ఆనందమే నీది నాది !
Super lines !
నీహారికగారి నుండి పాజిటీవ్ స్పందన కడుహర్షనీయం మనసు ఉల్లాసభరితం. థ్యాంక్యూ.
DeleteThe union of bhava matter and abhava matter(anti matter) leads to
ReplyDeleteannihilation of (both).
Vaisheshika darshanam, 5.2.18
-------------------------
కోనసీమ కోమలత్వం - రాయలసీమ రాటుతనం కలిస్తే
గెలుపెవ్వరిదో తెలియని అద్వైతంలో ఇరువురూ లయిస్తారు
పద్మార్పిత ప్రణయ వేదం 2015.10.19
వేదాలు వల్లించేంత విచక్షణ నాలో ఎక్కడిది చెప్పండి, ఇంక ప్రణయం అంటారా అంతా ప్రేమమయం జగమంతా ప్రేమమయం :-)
Deleteప్రణయంలో ప్రళయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా పడక తప్పదు.
ReplyDeleteరాయలవారి సీమ లో శ్రీపతి ఎంకన్న సామి ఆసామి కదా
ReplyDeleteకోనసీమ కొబ్బరి పలగ్గోట్టినా అహంకారమే అణగారేను కదా
శ్రీరంగ రంగ చల్ చల్ అంటే చలాకీగా చిందులు వేసే కదా
మొగలిరేకుల (సు) వాసనే గిట్టదాయే సంపంగి కంటే స్ట్రాంగ్ కదా
జాజులైన నాజుకుగా ఉండేవి బొండు మల్లి కంటికి ఇంపుగా కనబడలేదు కదా
పదా పదా అంటూ పాదాలు అరిగె పండు వెన్నెలే అమాసా ఆయెను కదా
గడ్డ పెరుగు కఠినమేలా కృష్ణయ్య ఆవురావురుమని తినే నవనీతం సున్నితమే కదా
పాల మీగడ పొంగి పొర్లి పాలకొవాయెను దింపి చెక్కర వేసుకుంటే సరి కదా
ఈడు పిలిచినా ఆడు పిలిచినా వచ్చే వీలు లేదు కదా పెరుగు లో పాలు తోడైన పులిసిపోవును కదా
ఆకాశాన మబ్బుల నావ ఎగిరినా సూర్యుడే రారాజు కదా
నిప్పుల కొలిమిలో కాలే కట్టే లో అగాధమంత లోతులేకున్న మండే నిప్పు కదా ( ట్యూస్డే కి పప్పు లెండి )
అడుగు మడుగుల్లో వాన గోడుగుల్లో ఒడ్డున నడిచే పాదాలు కెరటానికి కెవ్వు కేక కదా
(వ్యంగ్యం జోడించిన వ్యాఖ్యా .. తప్పుగా అనిపిస్తే మన్నించండి పద్మ గారు )
మీరు హుషారుగా స్పందించి అందించిన వ్యంగ్య కవిత సరదాగా సాగింది. థ్యాంక్యు.
Deleteనీదినది అంటూ మీరు అందించిన కవిత ఎవరికి వారే మరో కవిత రాసేలా చెసింది. భలే భలేగుంది
ReplyDeleteLovely expression
ReplyDeleteరాయలసీమోడు గదా కొంచెం కంగారెక్కువ సర్దుకుపోమ్మా అర్పితా
ReplyDeleteవినోద్ గారు.. లాస్ట్ వీక్ మీ కవిత ఒకటి "సాక్షి" లో పబ్లిష్ అయ్యింది కదా.. విశ్వక్సేనులవారికి అభినందనలు
Deleteసహృదయంతో స్పందించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా నమస్సుమాంజలి_/\_
ReplyDelete