మారిపోయాయిమేఘం నేలని తాకి రూపం మార్చింది
నీరెండకు నీడ కూడా రూపుమార్చింది
అద్దంలో చూసుకుంటే మోమే మారింది
చూస్తుండగానే అన్నీ మారిపోయాయి!!


వాధించలేనన్న మనసు మారిపోయింది
ప్రశ్నించుకుంటే జీవితమే మారిపోయింది
ఊహలనే వలచిన నిద్ర నడిరేతిరి పట్టింది
కునుకు పట్టగానే కలలే మారిపోయాయి!!


బంధీ అయిన ఆశేమో ఆకారం మార్చింది
అనుగుణంగా కాలం వేషాన్ని మార్చింది
గెలుపు స్థితి పై అలిగి, ఓటమిగా మారింది
సంతోషమే కన్నీళ్ళుగా మారిపోయాయి!!


సర్దుబాటు కాలేక సమస్యే మారిపోయింది
గమ్యం దరికి చేరబోవ దారి మారిపోయింది
అలవాటుపడ్డ జీవితం చివరికి రాజీ పడింది
అలసిన అనుభవాలు ముడతలై మిగిలాయి!!

57 comments:

 1. "EXCELLENT POST"
  Whatever it may be you never change mam :)

  ReplyDelete
 2. పద్మా మార్పు అనేది అనివార్యం.
  జీవితంతో రాజీ పడక తప్పదు ఎప్పటికైనా.
  చక్కని కవిత చూడ చక్కని చిత్రం.

  ReplyDelete
  Replies
  1. హ్మ్...సర్దుబాటు జీవితాలు తప్పవు :-(

   Delete
 3. మీరు మాత్రం మారలేదు మాడంజీ...ఎప్పటిలాగానే అధ్భుతంగా రాసేస్తున్నారు.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ...హడలిపోయాను మారలేదు అంటే :-)

   Delete
 4. మనసులోని మాటలకు అద్దం పట్టారు పద్మగారు

  ReplyDelete
 5. వాధించలేనన్న మనసు మారిపోయింది
  ప్రశ్నించుకుంటే జీవితమే మారిపోయింది
  ఇలాంటి మాటలతో పూర్తిగా ఫ్లాట్ అయిపోగొడతారు. చిత్రం సూపర్

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ...మెచ్చారుగా :-)

   Delete
 6. ముగింపు అధ్భుతంగా వ్రాసారు
  చిత్రం కంటికి ఇంపుగా ఉందండి

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ...మీకు నచ్చింది కదా

   Delete
 7. ఎవ్వరెట్ల మారినా నువ్వు మారకమ్మో పద్మమ్మో. గిట్లనే కవితలు రాసి ఖుషీ చెయ్

  ReplyDelete
  Replies
  1. ఏం రాస్తానో ఏమో గప్పుడప్పుడూ తిట్లుబీ తింటాను :-)

   Delete
 8. ఔను మారి పోయింది..
  నిన్నటికి రేపు ఈ రోజుగా మారిపోయింది
  చెడు చెడుకాలేక మంచిగా మారిపోయింది
  మనిషిలోని స్పందన కరువై మనసు శిలగా మారిపోయింది
  కల్లా కపటం ఎరుగని మానవత్వం మూగగా మారిపోయింది
  కలకాలం తోడుగా నిలిచే కాలం కూడా పగలు రేయిగా మారిపోయింది
  నవ్వు చెదిరి కట్టేగా కాలిపోయింది మసకబారిపోయింది

  ~శ్రీ

  ReplyDelete
  Replies
  1. శ్రీధర్ గారూ చాలారోజులకి కమ్మనైన వ్యాఖ్యతో అరుదెంచారు. ధన్యవాదాలు.

   Delete
 9. కాలాలు మారి, కష్టాలు తీరి
  సుఖఃసంతోషాలు విరిసి....అంతా మంచి జరుగుతుంది అన్న ఆశాభావంతో సాగడమే మంచిది

  ReplyDelete
  Replies
  1. ఆ ఆశాభావమే కదా ముందుకు నడిపించేది అందరినీ

   Delete
 10. maraka tappadu madamgaru

  ReplyDelete
 11. చాలా బాగా వ్రాశారు
  చిత్రం కూడా అతికినట్లు నప్పింది

  ReplyDelete
 12. అన్నీ మారాయని నన్నేమార్చకండి అర్పిత

  ReplyDelete
  Replies
  1. మిమ్మల్ని మార్చడం మా తరమా :-)

   Delete
 13. మారిన ప్రతీ వాటిని స్వీకరించడం మన వంతు.

  ReplyDelete
  Replies
  1. అదే ఇప్పుడు చాలా వరకు అందరూ చేస్తున్నది :-)

   Delete
 14. నైస్ పోస్టింగ్

  ReplyDelete
 15. ఏదైనా మార్పు సహజం
  చక్కని కూర్పుతో అందించావు.

  ReplyDelete
 16. కాలాలు మారిపోతాయి
  కలలు మారిపోతాయి
  మొత్తానికి మనుషులంతా మారిపోతారు

  ReplyDelete
  Replies
  1. తప్పని పరిస్థితి:-)

   Delete
 17. అన్నీ మారిపోతే వాటికి అనుగుణంగా మనము మారిపోతే సరి. :-) వాస్తవానికి అద్దం పట్టినట్లుంది కవితాచిత్రం!

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్సండి...మీరు మెచ్చారు.

   Delete
 18. So beautiful narration padma. congrats

  ReplyDelete
 19. వాధించలేనన్న మనసు మారిపోయింది
  ప్రశ్నించుకుంటే జీవితమే మారిపోయింది
  సర్దుకుని సాగిపోతే చెప్పడానికి ఏముంది

  ReplyDelete
  Replies
  1. చెప్పినా చెప్పకపోయినా చేయవలసింది అదేకదండీ

   Delete
 20. Change is always unavoidable, we have to accept. very nice poetry mam.

  ReplyDelete
 21. కాలానుగుణంగా మార్పులు తప్పవు. ఎన్నో అనుభవాల సమ్మేళనం జీవితం అయితే ముడతలు తప్పవు సర్దుబాటు ధోరణి తప్పదు. బాగుంది పద్మార్పిత-హరినాధ్

  ReplyDelete
  Replies
  1. మీ వాఖ్యాల్లో స్వాంతనతోపాటు హెచ్చరికా ఉందండి. ధన్యవాదాలు.

   Delete
 22. బాగుంది అమ్మాయి కాలం మారింది

  ReplyDelete
 23. కథలాంటి కల్పన జీవితం. ఆ కల్పనలో అన్నీ ఊహలే. ఆ ఊహలు చాలా అందమైనవని మీ ఒంపు సొంపుల చిత్రం చెబుతోంది. అద్దం లాంటి మనసులో దగ్గర నుంచి అంతర్ముఖాన్ని చూస్తేనే తెలుస్తుంది అది అందమా.... ఆనందమా... విషాదచిత్రమా అన్న యదార్ధం. జీవితమంటేనే పెద్ద రాజీ. రాజీ లేనివి రెండే పుట్టుక, మరణం. పుట్టుక మనం కోరుకోలేదు, మరణం వద్దన్నా ఆగదు. ఆ రాజీతత్వాన్ని నిజాయతీగా ఒప్పుకోడమే మంచిదన్న మీ అభిప్రాయాన్ని కాదనలేం. మొండి వాదనలతో ఎంత కప్పిపుచ్చుకున్నా... యస్‌... జీవితం ఒక రాజీ.

  ReplyDelete
  Replies
  1. రాజీ పడక తప్పదని సర్దుకుపోవడమే అని తేల్చి చెప్పారుగా...అదే చేద్దాం :-)

   Delete
  2. జీవితం ఒక రాజీ...మీ నుంచి ఈ వాక్యం కొత్తగా ఉంది. ;)

   Delete
 24. సర్దుబాటు కాలేక సమస్యే మారిపోయింది..సమస్యలన్నీ మారి మాయమైపోతే ఎంతబాగుంటుంది

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ ఆశగారు.

   Delete
 25. గెలుపు స్థితి పై అలిగి, ఓటమిగా మారింది
  సంతోషమే కన్నీళ్ళుగా మారిపోయాయి
  సర్దుబాటు కాలేక సమస్యే మారిపోయింది
  గమ్యం దరికి చేరబోవ దారి మారిపోయింది
  OUTSTANDING AND TOUCHING LINES

  ReplyDelete
 26. కాలం మింగేస్తుంది కదా.. ప్చ్.. touching lines.. congrats..

  ReplyDelete
 27. అంతేనేమో...అందరి జీవితాల్లోను మార్పు తప్పదు మనం రాజీ పడక తప్పదు.

  ReplyDelete
 28. వాధించలేనన్న మనసు మారిపోయింది
  ప్రశ్నించుకుంటే జీవితమే మారిపోయింది
  ఊహలనే వలచిన నిద్ర నడిరేతిరి పట్టింది
  కునుకు పట్టగానే కలలే మారిపోయాయి!!
  ఈ వాక్యాలు నన్ను అత్యంత ప్రభావితం చేసాయి. నేను తస్కరిస్తునాను :-)

  ReplyDelete