రాలిన మనసు


మనసులోనే భావాల్ని దాచి బయట పెట్టకుండా
సహించినంత కాలం నేను సంస్కారవంతురాలినే!

పండిన ఆకులే రాలిపోయే ఆకులురాల్చే కాలంలో

కన్నీరు కార్చబోవ ఋతువు మాత్రం కరువాయెనే!

మరణించిన మనసు వెతకబోవ సాక్ష్యం దొరికెనని

భావాలని బంధించి వధించాలని ఎత్తులెన్నో వేసెనే!

శ్వాస ఆగిపోవడమే మరణమంటే ఎలాగని ప్రశ్నించ

అస్వస్తతకు గురైన శూన్యహృదమే తల్లడిల్లిపోయెనే!

తనువంతా పసిడితో అలంకరించి పయనమవబోవ

పెదవులపై నవ్వు విరిసి మనసు ముక్కలై రాలెనే!

21 comments:

  1. మనోవేదన ధాటికి చెల్లాచెదురైన భావాలెన్నో
    అడియాశల ఒడిలో చితికిల పడిన కలలెన్నో
    నిట్టుర్పు సెగల నడుమ మాడి మసైన
    కాలగమనమున ఘడియలన్ని రాలిపోయిన
    అంతర్లీనంగా దుఃఖం యదాతదమై నిలిచి ఉన్నా
    బాహాటంగా లేని ఆనందాన్ని ముసుగేసుకున్నా

    ReplyDelete
    Replies
    1. అనేకానేక కవితలు.. వాటి లిపి ఒక్కటే
      అనేకానేక భావాలు.. వాటి ఆలోచన ఒక్కటే
      అనేకానేక రూపాలు.. వాటి ఔనత్యం ఒక్కటే
      అనేకానేక ఊసులు.. వాటి తీరుతెన్ను ఒక్కటే

      Padma Madam, Just as I told, you have moulded every emotion into a poem, which is worth reading, some of them bring back nostalgic feelings.. some of them cheer up and instill thoughts that are elucidating by themselves.

      Delete
  2. వ్యధను వ్యక్తం చేయడం మనసులో దాచుకుని భరించడం అంతా మనపై ఆధారపడి ఉంటుంది.
    ఏదీ శాస్వితం కాదు అనుకోవడం సులభ మార్గం.

    ReplyDelete
  3. పండిన ఆకులే రాలిపోయే ఆకులురాల్చే కాలంలో
    కన్నీరు కార్చబోవ ఋతువు మాత్రం కరువాయెనే!
    కొత్త తరబడి బాగుంది పద్మార్పితగారు.

    ReplyDelete
  4. వేదన ఉప్పెంగినట్లుంది కవితలో చిత్రం నవ్వుతూ.

    ReplyDelete
  5. అమ్మాయి చూపులతో షూట్ చేస్తుందేమో...హా హీ హీ :)

    ReplyDelete
  6. మళ్ళీ మొదలు వేదనలు రోదన,
    ఇలాగైతే ఎలాగంది పద్మగారు.

    ReplyDelete
  7. తనువు ఒకచోట
    మనసు మరొకచోట
    ఉన్నప్పుడు వ్యధ వర్ణనాతీతం
    బొమ్మల ఎంపికలో మీరు బెస్ట్.

    ReplyDelete
  8. అస్వస్తతకు గురైన శూన్యహృదమే తల్లడిల్లిపోయె excellent.

    ReplyDelete
  9. నేస్తం కుశలమా
    ? ? ?
    ఈ మధ్య మీరు గ్యాప్ తీసుకుని తక్కువగా పోస్ట్ చేస్తున్నారు.

    ReplyDelete
  10. ఏ భావమైనా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది
    మనసులోనే భావాల్ని దాచి బయట పెట్టకుండా
    సహించినంత కాలం నేను సంస్కారవంతురాలినే! మీరు వ్రాసింది మరోవిధంగా చెప్పాలంటే ఎవరైనా దొరికితేనే దొంగలు దొరకనంత వరకూ అందరూ దొరలే...అవునంటారా అర్పిత?

    ReplyDelete
  11. Nice poetry mam
    Ramdan mubarak

    ReplyDelete
  12. శ్వాస ఆగిపోవడమే మరణమంటే ఎలా?

    ReplyDelete
  13. AWESOME PAINTING & POETRY

    ReplyDelete
  14. కన్నీటి ఋతువులో కన్నీరు

    ReplyDelete
  15. అవునండీ శ్వాస ఆగిపోతేనే మరణం కాదు
    దక్కని వాటికోసం వేదనపడే మనసు రోదన

    ReplyDelete
  16. కన్నీరు కార్చబోవ ఋతువు మాత్రం కరువాయె really pathetic padma

    ReplyDelete
  17. వ్యధాభరితం.

    ReplyDelete
  18. వేదనను వేడుకను కూడా సమపాళ్ళలో ఆదరిస్తున్న అందరికీ అర్పిత నమస్సులు_/\_

    ReplyDelete
  19. వేదనతో విరిగిన మనసు..రక్షించారు చదివినవారి మనసు ముక్కలు కాలేదు

    ReplyDelete
  20. ఆవేదన కట్లు తెగింది.

    ReplyDelete