అక్షరం ఆసరాగా..

నేనెప్పుడూ ప్రాముఖ్య పదమవ్వాలనే కోరుకుంటాను
ఏవో కొన్ని చెత్త వాక్యాల పద పంక్తుల్లో ఇమడలేను
ఉపనిషత్తుల ఉపోద్ఘాతంలో చిన్ని ఉపమానమే నేను!     

ఎత్తుగడతో పొగిడి ఎత్తిపడేస్తే పొంగే ఉద్వేగ వాగుకాను
అనేకానేక ఒత్తిళ్ళను అక్షరాల ఆసరాతో సేదతీరుస్తాను  
అస్తిత్వాన్ని అరగదీస్తే రత్నంలా మారే రాయిని నేను!

వాత్సల్య అన్వేషణలో వడలి వాలిన తామర తూడను 
నిలకడతో నిశ్చల తటాకంపై తేలుతూ ఆలోచిస్తున్నాను
ఆరిపోయిన అనురాగాన్ని తేమతోతడిమి దిద్దను నేను!

మానసికొల్లాసానికి తియ్యని తెలుగు లిపిని వాడతాను 
తిరిగిరాని సమయానికి నెరవేరని కలల్ని జోడించలేను
స్వాభిమాన అక్షర ఆలుచిప్పలో దాగిన ముత్యం నేను!

మదిమడత విప్పి చదవలేని నిస్సహాయత గెంటేసాను
పదబంధాల సౌందర్యంతో ఆత్మబలాన్ని అలంకరిస్తాను        
నా చిత్రాన్నిగీసి సుపరిచితం చేసుకుంటా నన్ను నేను!

44 comments:

  1. పదాల కూర్పులో భావాలు ఒదుగుతాయి
    భావాల కలయికలో భావోద్వేగాలు ఎదుగుతాయి
    భావోద్వేగాల ఎదుగుదలలో రాగద్వేషాలు భాసిల్లుతాయి
    రాగద్వేషాల నడుమ జీవిత సాగరాలు ఇముడుతాయి

    కారు చీకటి వేళ చంద్రుని వెన్నెల హాయిగోలుపుతుంది
    బాధ కలిగిన మనసుకు ఆత్మీయతకు చేరువవుతుంది
    రెప్పల లోగిలిలో కన్నుల కాంతి కలలా విచ్చుతుంది
    హంసధ్వని రాగాల కలయికతో జోల పాడుతుంది

    కరిగే మేఘాల అవెన్యులో రాగరంజిత జల్లు
    వేవేల వర్ణాల డిస్పర్శన్ తో నింగి నేల పరవళ్ళు
    పసి ప్రాయపు చిరునవ్వుల్లో బ్యాక్అపయ్యే స్మృతులు
    థాట్స్ కణుగుణంగా అల్లుకుపోయే అక్షరాలు

    ~శ్రీత ధరణి

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు...
      నిజమే అలా అక్షరాలతో ఎన్నో భావాలను వెదజల్లి
      మదిలో రేగే అలజడులను సైతం మరచిపోవచ్చు..

      Delete
  2. మీ అక్షరాల్లో ఆలోచనల్లో మేము ఎప్పుడో బంధీలం.

    ReplyDelete
    Replies
    1. అంతా మీ అభిమానం. _/\_

      Delete
  3. విశ్వనాథ సత్యనారాయణ & తిలక్ ని జంటగా చదివినట్టు ఉంది... కరోనా టైంలో కెవ్వు మనిపించి కవిత

    ReplyDelete
    Replies
    1. తీరిగ్గా కూర్చుని ఆలోచించి రాసాను అనుకోండి..:)
      అలా గొప్పవారితో పోల్చి నన్ను భయపెట్టకండి. .:)

      Delete
  4. మీరు అక్షరాలను ఆసర చేసుకుని మరిన్ని కవితలతో మున్ముందు ఇంకా ఎంతో చక్కగా రాసి మమ్మల్ని అలరించాలని కోరుతున్నాను.

    ReplyDelete
    Replies
    1. మీ అందరి అశిస్సులతో తప్పక రాసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాలండీ.

      Delete
  5. koorchundabetti chadivistaru meeru.

    ReplyDelete
  6. అక్షరాలు అందంగా పేర్చి చిత్రాల పరిమళం అద్దుతారు. అదే మీ ప్రత్యేకత. ఎవరు మాత్రం కాదంటారు.

    ReplyDelete
  7. You are always special and unique Padmagaru. No doubt in it.

    ReplyDelete
    Replies
    1. thank you very much Harsh
      But sometimes I feel my thoughts are baseless and disturbing some people.

      Delete
  8. మీరు ప్రత్యేకతను పుణికిపుచ్చుకుని పుట్టి ఉన్నారు
    ఇంకా ఏం ప్రత్యేకం కావాలో మరి.
    మొత్తానికి మీరు మిమ్మల్ని అందంగా చిత్రించుకున్నారు.

    ReplyDelete
    Replies
    1. మీ అందరి అభిమానంతో ఏదో ఇలా నెట్టుకుని వస్తున్నాను.

      Delete
  9. అక్షరాల నమ్ముకున్నవారు పుస్తకాలు చదువుతారు
    పుస్తకాలు చదివినవారు పరమజ్ఞానులుగా వెలుగొందుతారు.

    ReplyDelete
    Replies
    1. మీరు ఎలాగో అపరజ్ఞానులే కదండీ...బోలెడన్ని పుస్తకాలు చదువుతారు మీరు.

      Delete
  10. నిస్సందేహంగా మీరు మీ భావాలు ప్రత్యేకం మనోరంజకం

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ నందుగారు.

      Delete
  11. "స్వాభిమాన అక్షర ఆలుచిప్పలో దాగిన ముత్యం" ఇంతకన్నా ఏం కావాలి మీకు.

    ReplyDelete
    Replies
    1. స్వాతిముత్యమై మెరవాలని :) thank you

      Delete
  12. తెలుగు అక్షరాల్లో చక్కగా ఇమిడిన పేరు "అర్పిత"

    ReplyDelete
    Replies
    1. నాకు కూడా ఎంతో ఇష్టం.

      Delete
  13. manasuloe padilam mee aksharalu

    ReplyDelete
  14. దేన్నైనా పదాలుగా కూర్చి పలికించే ప్రతిభ మీది అలాగే చిత్రాలని వాటికి అనుగుణంగా ఎంచుకుని మనసులను రంజింపజేస్తారు. అభినందనలు మీకు.

    ReplyDelete
  15. మీరు ఏది వ్రాసినా మనసుకి హత్తుకునేలా ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ వేరీ మచ్

      Delete
  16. Lovely poetry emotional feels padma.

    ReplyDelete
  17. This is too much
    evaru chepparu meru special kadani.
    You are multi talented woman upto my knowledge.
    ikanaina ee thoughts nundi bayata padu,

    ReplyDelete
    Replies
    1. appudappudu meetho ila pogidinchukovadam naku ishtam anduke :)

      Delete
  18. తటస్థంగా వ్రాయడం అలవాటు చేసుకోండి.
    ఎందుకో మీరు చాలా అనిశ్చల భావాలను వ్రాస్తున్నట్లు అనిపిస్తుంది. బహుశా నీరు ఏవైనా వత్తిళ్ళకు లోనవుతున్నారు ఏమో. చాలా రోజులుగా మీ రచనల్లో ముందు ఉన్న ఒరువడి లోపించింది, అంతే కాకుండా భావాలలో పట్టు కూడా తగ్గినట్లు అనిపిస్తుంది. తప్పుగా అనుకోవద్దు. ఇది కేవలం ఒక అభిమానిగా నా అభిప్రాయం మాత్రమే.
    మీలో ఎంతో పట్టుదల ధైర్యాన్ని మీ వ్రాతల్లో చూసాను. అదే ఇప్పుడు కరువైంది.

    ReplyDelete
    Replies
    1. ఏదేం లేదంటీ..ప్రతీ పోస్ట్ ఆలోచించి నిలకడగా రాస్తున్నాను. అయినా ఎప్పుడూ ఒకేలా రాయలేను కదండీ. మీ అభిమాన సూచనలు తప్పక పాటించి మెప్పించే ప్రయత్నం చేస్తాను.

      Delete
  19. ఆసరా ఎందుకు?

    ReplyDelete
    Replies
    1. నిలబడుతుంటే పడిపోకుండా.

      Delete
  20. meeru maku suparichamea
    ika chesukoevalasindi emundi
    kavitalu rasi meppinchadame

    ReplyDelete
  21. వాత్సల్య అన్వేషణలో వడలి వాలిన తామర తూడ-Beautiful sentence

    ReplyDelete
  22. భావవ్యక్తీకరణలో సిధ్ధహస్తులు మీరు.

    ReplyDelete
  23. మీ ప్రతి ఫదచిత్రం మీ మనసు గీసే మీ ముఖపత్రం కదా.. అభినందనలు..

    ReplyDelete