నన్ను నేను నిలబెట్టుకోవాలి!

నాలో ఏదో తెలియని బాధ ఆందోళన
అంతా గందరగోళ అయోమయంగుంది
ఏదో చెయ్యాలని కానీ ఏమీచెయ్యలేను
నేను నా అభిరుచులెన్నో కోల్పోయాను
వ్రాయాలనుకున్నవి వ్రాయలేకున్నాను!

నేను ఏదైనా చెయ్యాలి మళ్ళీ రాయాలి
అనేకానేక అద్భుత భావాల్ని పొంగించాలి
నా కన్నీటికి ఆరోగ్యవంతమైన చికిత్సచేసి
ఎవరూ మాట్లాడలేదని అలిగి కూర్చోకుండా
నన్నునే పరామర్శించుకుని కోలుకోవాలి!

నా అస్తిత్వాన్ని గట్టిపరచుకునేలా అడుగేసి
నిర్వేదము నిస్సహాయత నైరాశ్యం వదిలేసి
మూలాలు నిలబెట్టుకునే నిప్పురవ్వనవ్వాలి
ఒకరి ఎడబాటులో దహించుకుపోక చల్లబడి
కాలంచేసిన గాయంతో సుధీర్ఘంగా నడవాలి! 



17 comments:

  1. Beautiful Painting
    అస్తిత్వాన్ని గట్టిపరచుకోండి

    ReplyDelete
  2. chakkani prerana eche inspirational poetry
    picture kuda bagundi chala................

    ReplyDelete
  3. చింత ఎందుకు?
    సాగు ముందుకు.

    ReplyDelete
  4. అస్తిత్వాన్ని గట్టిపరచుకునేలా అడుగేసి, నిర్వేదము నిస్సహాయత నైరాశ్యం వదిలేసి పరుగులెత్తండి పద్మార్పితగారు

    ReplyDelete
  5. అందరిలో ఏదో ఒక అలజడి తప్పదు. కాలానికి ఎదురీదాలి తప్పదు

    ReplyDelete
  6. ఎవరికి వారే ఇచ్చుకునే సాంత్వన ఆలంబన
    ఎవరికి వారే కూడబెట్టుకునే ధైర్యం అనూహ్యం
    ఎవరి బాధకు వారే బాధ్యులు కాకున్నను ఎవరి ఆత్మ స్థైర్యాన్ని వారే పెంపొందించుకునే తీరు వర్ణనాతీతం
    ఎందుకంటే..
    ఆ బాధలో నుండి నిలదొక్కుకునే స్థితప్రజ్ఞత తనంత తానే సమకూరాలి
    ఎవరి బాధ లోతు వారికే ఎరుక గనక ఆ స్థితి నుండి తేరుకునే బాధ్యత కూడా వారిపైనే

    ~శ్రీత ధరణి

    ReplyDelete
    Replies
    1. భలే చెప్పావు శ్రీధర్

      Delete
    2. అంతే కదా అశోక్ గారు. ఒకరికై మంచి చేస్తే అది గుర్తుండేది ఆ చేసిన మంచి అందుకున్న వారికి ఉపయోగ పడినంత వరకే.. అదే చెడు తలపెడితే అంతే సంగతులు.. చేసిన మంచి అంత నవ్వుల పాలు.. కనుకనే ఎవరు ఎంత చేస్తే అది వారి వారి మానసిక పరిపక్వత పై ఆధార పడి ఉంటుంది.. మనం చేసే చేష్ట ఒకరికి విపరీతంగా నచ్చవచ్చు మరొకరికి అసల నచ్చకపోవచ్చు అది వారి వారి దృష్టికోణం మీద ఆధార పడి ఉంటుందనేది నిత్యసత్యం నైసర్గికం.

      మీకు నచ్చినందుకు ధన్యవాదాలు అశోక్ గారు.

      Delete
  7. అస్తిత్వం భధ్రం

    ReplyDelete
  8. కన్నీటికి ఆరోగ్యవంతమైన చికిత్సచేసి-WONDERFUL

    ReplyDelete
  9. చాలాబాగుంది

    ReplyDelete
  10. అందరికీ నా హృదయపూర్వక అభివందనములు _/\_

    ReplyDelete