ఎలా మరిచేది ప్రియతమా!


నిన్ను మరచిపోవాలంటే,
నేను
నేనుగా మిగలాలంటే

తెల్లవారితే నీ తలపులు రావనుకుంటే,
నీ
తలపులే తట్టి నాకు తెల్లవారింది.

అద్దంలో నా ప్రతిబింబాన్ని చూద్దామంటే,
అది
కూడా నీ బింబాన్నే చూపెడుతుంది.

నా నీడైనా నాతోడుందంటే,
నీ
నీడే నన్ను వెంటాడుతుంది.

నీవు చేసిన గాయం మానుతుందనుకుంటే,
మనసు
మౌనంగా రోధిస్తూనేవుంది.

నిన్ను నేను ఎలా మరిచేది ప్రియతమా!!!!
నీవైనా తెలుపుమా!!!!!!

14 comments:

  1. పద్మార్పిత గారూ!

    చదివితిని మీ కవితలను -
    పదములలో మెత్తదనము, భావుకతలలో
    కదిలించు సున్నితత్వము
    హృదయమునే దోచె - మీకు నివె జోహారుల్!

    - డా.ఆచార్య ఫణీంద్ర

    ReplyDelete
  2. పద్మార్పితగారూ !భావం హృదయానికి హత్తుకునేలా ఉందండీ !

    ReplyDelete
  3. ఆచార్య ఫణీంద్రగారికి.....
    నా బ్లాగ్ కి విచ్చేసి,
    వ్యాఖ్యచేసి,
    నా కవిత మీ మనసు దోచినందులకు
    మిక్కిలి సంతోషం మరియు
    మీకు నా ధన్యవాదములు!!

    ReplyDelete
  4. పరిమళగారు, మురళిగారికి....thanks a lot!!

    ReplyDelete
  5. సైజు జీరో రావాలంటే ఇంకొంచెం నడవాలంటే పడుకుని చదివే అలవాటు మానలన్తె.

    ReplyDelete
  6. hi padma.. good one.. chaala baagundhi :)

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. Mahesh & Sridhar thanks a lot...

    ReplyDelete
    Replies
    1. [15/06, 21:58] sridharanitha bukya: అందరం రాతిగుండెలతో వచ్చిన వాళ్ళమే
      కాకపోతే దేవుడు కొద్దిగా చెక్కుతాడు
      మరి కొంత మన చుట్టు ఉన్న చుట్టాలు చెక్కుతారు
      మరి కొంత మనలను బంధించే బంధువులు చెక్కుతారు
      చివరాఖరుకి ఆ రాయిలో హృదయం చెక్కె భార్య పాత్ర, వాత్సల్యతను చెక్కె అమ్మ పాత్ర, మానం అభిమానం చెక్కె నాన్న పాత్ర అమూల్యమైనవి.
      [15/06, 22:07] sridharanitha bukya: ఆత్మీయత అనగానే గుర్తుకొచ్చేది అమ్మ.
      నిరాడంబరత అనగానే గుర్తుకొచ్చేది నాన్న.
      అనురాగం అనగానే గుర్తుకొచ్చేది ఆలి.
      [15/06, 22:20] sridharanitha bukya: భార్య భర్తలన్నాక అపుడపుడు _గిలె శిక్వే_ వస్తాయి.. నిజం
      బావ బావమరదులన్నాక అపుడపుడు _చీఖనా చిల్లానా_ ఉంటాయి.. నిజం
      మామ అలుళ్ళ నడుమ అపుడపుడు _రూఠ్‌నా రులానా_ ఉంటాయి.. నిజం
      అత్త కోడళ్ళ నడుమ _మాన్ సమ్మాన్_ ఉంటాయి.. నిజం
      కాని ఈ పై నిజాలన్నిటిని తలదన్నే నిఖార్సమైన నిజం ఏమంటే
      *ఫ్లోయింగ్ స్మూథ్లి ఇన్ ట్రబల్డ్ వాటర్స్ ఇజ్ దీ ఓన్లి వే వన్ కెన్ గెట్ అక్విటెడ్ టూ దీ ప్రిషియస్ బాండ్స్ దట్ సరౌండ్ దెమ్ ఆల్వేస్.*

      Delete
  9. aripincharandi ee kavitato
    kavitaloni kaluvaku na chinna suggestion
    నిన్ను నేను ఎలా మరిచేది ప్రియతమా!!!!
    నీవైనా తెలుపుమా!!!!!!"
    maravadamanedi undi unte, adi pranayamanedi enduku avutundi
    maravadamanedi manesi, manalni manam marchukovadame...

    ReplyDelete
  10. Harish...thanx a lot.Wel said...

    ReplyDelete