భా.రా.రె.గారి/రె బహుమానం....:-)

ఇది కేవలం భా.రా.రె గారి హృదయస్పందనల చిరుసవ్వడి బ్లాగ్ లో "సంక్రాంతి కి విడుదల కాబోతున్న హారం పత్రికా ప్రతికై రచయితలకాహ్వానం. ఇరవై వేల పైన బహుమతులు"..... ఆహ్వానాన్ని చూసి స్పందించి స్నేహభావాల చనువుతో కాసేపు నవ్వుకుందామని చేసిన చిరుప్రయత్నంగా భావిస్తారని ఆశిస్తూ.....
భాస్కర రామిరెడ్డిగారికి
అంకితం!
ఆహ్వానాన్ని చూసి ఆనందంతో గెంతులేసి కాలువిరగొట్టుకుని కూర్చుని మరీ కవితలు కధానికలు రాసేద్దాం అనుకున్నానండి!!!!
అంతలో కొన్ని సూచనలు అంటూ అంకెల గురించి ప్రస్తావించేసరికి తుస్ స్ స్ స్.....అక్షర జ్ఞానమే సరిగ్గాలేని నేను అంకెల జ్ఞానం ఏం అర్థంచేసుకోను చెప్పండి!!!!
అయినా ప్రయత్నిద్దామని...... అంశాలన్నింటినీ రోజుకొకటి పదిహేనుసార్లు చదివితే దాని పర్యవసానం ఇదన్నమాట.!!!
ఛీ... ఛీ అని అనకుండా నా అజ్ఞానానికి నాలుగు చీవాట్లు పెట్టండి!
మీ మనసు నొప్పిస్తే మన్నించండి!
మీరు ఏమన్నా నవ్వేస్తా:-)
భా.రా.రె గారి బహుమతుల హారమా మజాకా:-)

1. ఆంధ్రమహాభారత, భాగవతాల ఇండెక్స్ ఇప్పుడిప్పుడే చదువుతున్న నేను ఎప్పటికి పరిశోధన చేసేది ఏమిరాసేది?:(

2. మొన్న రంజాన్ పండుగ ఇఫ్తార్ విందు అరగనేలేదు ఇంతలో క్రిస్టమస్ కేక్ తయారీలో బిజీగా ఉన్న నేను వచ్చే సంక్రాంతి ఎలా జరుపుకోవాలో అని అలోచిస్తుంటే.... భారతదేశంలో ఈ మతాల పాత్ర గోల ఏంటండిబాబు?

3. పట్నం నుండి పల్లెకు వెళ్ళి పదిరోజులుండి పచ్చనిపొలాలు చూసి పసందైన పలహారాలంటే.....ఓకే! కాని కధానికలేం రాయగలను చెప్పండి?

4. నన్ను ఇలా పెంచి పెద్దచేసిన నా తల్లిదండ్రుల మనోభావాలని గౌరవించి వృధాప్యంలో వారిని ఆనందింప చేస్తే చాలనుకుంటున్న నాకు పిల్లల మనస్తత్వం గురించి వ్రాసే జ్ఞానం ఎక్కడిదండి?

5. మహాత్మాగాంధీగారిని హత్యగావించింది గాడ్సే పేరు తప్ప స్పెలింగ్ కుడా తప్పురాసే నేను తదానంతరం భారతదేశంలో మార్పులపై పాతికపేజీలు రాయడం మాటలా చెప్పేయడానికి?

6. కుమ్మరి, కమ్మరి, శాలి, చాకలి, మంగలి, శిల్పి, పౌరోహిత్యం, జ్యోతిశాస్త్రం......ఇలా ఒక్కరేంటి అందరూ కంప్యూటర్ల ముందు తలవంచితే కులవృత్తులపై కధలు కమామిషలు ఏమి వ్రాయను ఎలా మెప్పించను?

7. పనికిరాని చెత్త వ్రాసి మీ అందరికి విసుగు తెప్పించి మీతో చీవాట్లు తింటూ కూడా నవ్వుతున్న నన్ను చూసి మీరు నవ్వుతారుగా......నన్ను మించిన బఫూన్ పాత్ర కాకుండా ఇంకెవరైనా ఉంటే చెప్పండి?

8. ఆహా...నాకు కావలసిన టాపిక్ దొరికింది కవితలు-తవికలు కూడా రాసేద్దాంకదా అని....ఒక తెలంగాణ పోరడ్ని ప్రేమించి పెళ్ళి చేసుకుని అమెరికాకు వెళదాం రండి అంటే..... ఛస్! నీఅవ్వ....అత్తమ్మోల్లు అంత్ర్వేధిలుంటే పండ్గకు పోయి అర్సెలు తినక అమెరికా అంటావేందే??? బొక్కలిరగదంతా అన్నడు.....ఇంకెక్కడి అమెరికాలో కాపురం? దానిపై కధలు కవితలు?:-(

9. చరిత్ర చెప్పకుండా చెప్పినట్లు బొమ్మ వేస్తే భా.రా.రె గారు నాకు బహుమానం గ్యారంటీగా ఇస్తారని కుంచెపట్టి అడ్డ గీతలు నిలువుగీతలు గీస్తే అవన్నీ కలసి భావంలేని ఒకటి అంకెగా మారితే అదిచూసి ఒక్కటిస్తారేకాని బహుమానమా నా మొహానికి చెప్పండి?

10. బాబోయ్....భయం వేస్తుంది ఎందుకంటే టెంత్ క్లాస్ లో నాకు భౌగోళికశాస్త్రంలో సున్నా....ఇప్పుడు అదేవేస్తే పరువుపోతుంది.... కాదంటారా?

11.రాసేసానోచ్!!!......అరపేజీ పద్యగద్య పదాలతో కుమ్మేసాగా....:-) ఛా! అంతలేదు నీకు అరపేజీలో సంక్రాంతి సోయగాలన్నీ ఏం చెబుతావులే అంటారా? (అయితే నేను అలిగానుగా: ( ఆ అరపేజీని మీకు పంపనుగా...)

12.ఈనాటికాలం గురించే జుట్టుపీక్కుంటుంటే శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటిపై కధకాదు....నాటిక/నవల ఎంతవరకు న్యాయం చెప్పండి? (మనలోమాట హిస్టరీలో నాకు రెండు మార్కులు వచ్చాయి టెంత్ లో ఎందుకంటే రాజులపేర్లు స్పెలింగులు కరెక్టుగా వ్రాసానని ప్రశ్నలో ఉన్నాయని మాస్టార్ కి తెలియదుగా మరి)

13. రంగులుచూపే కనుగుడ్డు నలుపు
కన్నుమూస్తే ప్రపంచమంతా నలుపు
ఆపేయ్ ఇంక... కవితకాదు సినిమా తీయమంటారా?
సారీ బాస్......నెలాఖరులో బడ్జెట్ లేదు:-)

14. ఇదండి నాకు నచ్చిన అంశం....అందుకేగా ఇలా పదిహేనురోజులు పాట్లు...బహుమానంకై అగచాట్లు.!

15. హూ...లలలా...
లల లల లలా
హారమా...హారమా
నీవు మా నేస్తమా

హూ...లలలా...
లల లల లలా
నీవే ఒక బహుమానమా
భా.రా.రె అంటే తెలుసుకొనుమా

హూ...లలలా...
లల లల లలా
"భా" అంటే భారీగా
"రా" అంటే రాసులుగా
"రె" అంటే రెమ్యునరేషన్ /బహుమానంగా
ఇచ్చేవారని తెలుసుకొనుమా.....

హూ...లలలా...
లల లల లలా........
ఏంటో....ఫ్లోలో ఇలా పాట పొడుచుకొస్తుందండి....
అయినా మిమ్మల్ని మీరే పొగిడేసుకుంటానన్నారుగా....
ఇంకేం రాసి పాడను....చిత్తగించండని చల్లగా జారుకుంటాను!

బహుమానం ఏమిద్దామా అని అలోచిస్తున్నారా???? తప్పదులెండి! థింక్ ....థింక్ ....థింక్:-) :-)

23 comments:

  1. హూ...లలలా...
    లల లల లలా
    "భా" అంటే భారీగా
    "రా" అంటే రాసులుగా
    "రె" అంటే రెమ్యునేషన్/బహుమానంగా
    ఇచ్చేవారని తెలుసుకొనుమా...

    :)
    :)

    ?!

    ReplyDelete
  2. పద్మార్పిత గారూ, ముందుగా మీ సమాధానాలన్నింటికి కలిపి :-> అంటే ముందుగా నమస్కారబాణ మన్నమాట. ఆ తరువాత :))


    ఏమండీ బాబూ
    ఇలా బాబును చేసి
    బాగా ఉతికేసారండీ....
    భారీ రెమ్యునరేషనని
    నడ్డి విరగొట్టేసారండీ బాబూ :)
    మీకేమో హూ లలలా...
    నాకేమో హుహుహూహు :)

    ఇక మీ సమాధానలలోకి వస్తే
    ౧) భారతం భాగవతం
    భారతీయునికది భాగ్యం!!

    వత్తులేరాని బెబ్బేలకు
    జ్ఞానచక్షువుల నుంచి
    ప్రవహించబోయే జీవసిద్ధాంతమది
    ఈ తరానికి నవతరానికి
    తన చరిత్ర తెలిపే చిరుప్రయత్నం.

    ReplyDelete
  3. 2) రంజాన్, క్రిష్టమస్, దసరా... ఆఫీసుల్లో భాయీ భాయీ..
    కానీ చార్మీనార్ ముందు వినాయక చవితినాడు చిన్నపిల్లాడిని పంపాలంటే భయం.
    కాశ్మీర్ వెళ్ళాలంటే భయం.
    పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు
    ఇండియా ఓడినా సంబరాలే
    ఎక్కడ తీగలాగినా
    హైదరాబాద్, లేదా ముంబాయి లో దానివేళ్ళు
    మతమంటే ఇదేనా?
    అభం శుభం తెలియని అమాయక ప్రాణులకు
    మతం మత్తు నూరి జీహాద్ లు చేపించటమా?
    ఏది మతం? ఎవడు దేవుడు?
    మనిషా, మనిషిని నడిపే మతగురువా?

    ReplyDelete
  4. ౩) ..
    చెట్టులెక్కగలవే ఓ పద్మా
    పుట్టలెక్కగలవే ఓ పద్మా
    చెట్టులెక్కి పుట్టలెక్కి
    పట్టు తేనెలాంటి కథను వ్రాయగలవే...
    ఓ పద్మా... :-)

    ౪) హ్మ్... దీనికి మినహాయింపు ఇచ్చేస్తాను. కారణం తెలుసుకాబట్టి. :)).

    ౫) హ హా.. ప్చ్..మీరసలు ఈ మధ్య పేపర్లు చదువుతున్నారా? వాళ్ళు ఒక్కరోజులోనే అన్నేసి పేజీలు వ్రాయగాలేనిది నెల రోజుల్లో ఇరవైపేజీలేం ఖర్మ..తలుచుకుంటే మీ ఊరినుండి మాఊరిదాకా ఎంత దూరముందో అన్నేసి పేజీలను కుమ్మెయ్యొచ్చు. :))

    ReplyDelete
  5. ౬) మీకు కనీసం ఆ కులవృత్తుల పేర్లైనా తెలుసు. ఇప్పటి పిల్లలను అడగండి. వాళ్ళకేమాత్రము పరిజ్ఞానముందో తెలుస్తుంది. మొన్నొకరోజు ఒక పాత పత్రిక చదువుతుంటే అందులో లోహకారుల,కుమ్మరివారి సామాగ్రి వాళ్ళ నైపుణ్యం చదువుతుంటే, ఇప్పుడు అసలు మిషన్స్ లేకుండా కనీసం వృత్తాన్ని కూడా గీయలేని మన నైపుణ్యానికి నవ్వొచ్చింది :((. సో చూద్దాం దీనిమీద ఎంతటి వైవిధ్యమైన కథానికలొస్తాయో.

    ౭) హహహ..అర్థమయింది. ఇంతకీ చేత్తోటి దెబ్బలా లేకపోతే టపాతోటి కొడతారా :))

    ReplyDelete
  6. అమ్మో లేటైపోయింది మిగిలిన "గారె" లు రేపు :))

    ReplyDelete
  7. Sir,

    అసలు పద్మ గారి ఉద్దేశ్యం నిండా స్తుతి వలె మీ పథ పోటీల టపా (మరుగున పడిన) దానిని మరల ఒక మారు అందరిని తట్టి లేపెందుకే ఇలా చేసారేమో అనిపిస్తుంది
    ఏంటో నాకైతే అప్పటికంటే ఇదే స్ఫూర్తి గా (based upon your comments సర్) ఉంది.

    మేబీ మీ view ( అవి) మరింత మందికి ఆదర్శంగా స్పూర్తిగా నిలుస్తవని భావన చేస్తున్నాను

    ?!

    ReplyDelete
  8. ఈ భారారె ఎవరండీ ?

    ReplyDelete
  9. పద్మార్పిత గారూ బొమ్మ చాలా అందంగా ఉందండీ..

    ReplyDelete
  10. :)))))
    బొమ్మ చాలా చాలా బాగుంది.

    ReplyDelete
  11. @ఎందుకో ఏమో....ముందుగా థ్యాంక్యూ... రాగయుక్తంగా భా.రా.రె గారిని స్తుతించినందుకు....
    ఇంకా బోలెడు థ్యాంకులు...:) నా పాయింట్ ని కరెక్ట్ గా క్యాచ్ చేసినందుకు.....అర్థంచేసుకోరూ:-)

    @భా.రా.రె...గారెలు soooo yummy:-) thanks for breakfast.... చూసారా! ఒక అజ్ఞాని మూలంగా ఎంతమంది జ్ఞానులు ఉద్భవిస్తారో...మున్ముందు మీరే చదువుతారుగా:-)
    waiting for some more జ్ఞానం:-)

    ReplyDelete
  12. @జిలేబిగారు...తగునా మీకిది???:-) హృదయస్పందనల చిరు సవ్వడులు క్రమంతప్పకుండా వింటూకూడా ఇలా అడగడం:-)
    @జ్యోతిర్మయిగారు, తృష్ణగారు....థ్యాంక్సండి...
    ఈ పెయింటింగ్ నాకు ఇష్టమైన వాటిల్లో ఒకటి...

    ReplyDelete
  13. మళ్ళీ వచ్చేసా మిగిలిన సగం గారెలు వేసేసి వెళ్ళిపోతా :)

    ౮) అద్దో మీకు తెలియకుమ్డానే కథకు కావలసిన సరుకు వచ్చేసింది చూసారా? ఒక ఫేమిలీ కి ఇంతకంటే సరిగమలేముంటాయి చెప్పండి :))

    ౯) దీనికి మాత్రం నో కామెంట్ :-)

    ౧౦) ఎందుకండీ భయం మీకు నేను పోటీ అనా?? ఏడులోనో ఎనిమిదిలోనో బుద్ధిలేక వార్షిక పరీక్షల్లో అదేదో నగరాన్ని ( హైదరాబాదే లెండి ) గుర్తుపట్టమన్నారు. గుర్తు పట్టడమంటే సుక్కెయ్యడమే కదా !!. ఎందుకొచ్చిన గొడవని పటంలో ఆంధ్రదేశమంత పెద్ద బొట్టు పెట్టాను. మార్కులేసే వుంటాడులే.లేకపోతే పాస్ అవ్వము కదా :))

    ౧౧) రాసేసానని ఆశపెట్టి పంపకపోతే ఆశకురుపులొస్తాయి. తర్వాత మీ ఇష్టం మళ్ళా.

    ౧౨) హిస్టరో బొక్కు తలకింద పెట్టుకోని కృష్ణరాయలను తలచుకోమ్డి. కలలోకొచ్చి ప్రబంధాన్నే మీచేత వ్రాయించకపోతే అప్పుడడగండి.

    ReplyDelete
  14. ౧౩) హహ్హహా.... ప్లీజ్ ప్లీజ్ సినిమా తియ్యవా? ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ వుంది. ఆలోచించుకోండి ఒక్కసారి.

    ౧౪) వెర్రీగుడ్డూ...ఇంకాలస్యమెందుకోమరి? కాస్త రంగులేస్తున్నారా ఏమి?

    ౧౫) సూపరో సూపరు. ఏమో జనాలు పొగుదుతారో లేదో అని ముందు జాగ్రత్త చర్యగా నన్ను నేను పొగిడేసుకున్నా. అర్థం చేసుకోరూ.

    మీ పాట చూసాక నాకూ ఒక చరణం తన్నుకోని వస్తుంది. రాసేస్తే పోలే... ( క్రింద చరణానికి అర్థం మనం కామెంట్లు టపాల్లో పెట్టే చుక్కలు, నవ్వులు, ఊసులు అని )

    చక్కనైన చుక్కలన్ని చిందులేసి ఆడెనమ్మ
    హా............రం....................హా.........రం...............హారం

    చిత్రమైన నవ్వులన్ని సందెపొద్దు ఊసులమ్మ
    హా............రం....................హా.........రం...............హారం


    జ్ఞానబీజముల అంతఃచక్షువుల రసమయమై అలరారే బ్లాగులూ...
    సకలశాస్త్రముల స్వతంత్ర్యభావానల రసఝరులై పొంగేటి బ్లాగులూ

    సర్వం సమస్తం నవ్యసాహితీ విప్లవమ్మీ హారం
    నవరస భరితం సుజ్ఞాన హరితం ఈ హారం
    భారతీయ భాషలకు అక్షరహారం
    మారుతున్న భావలని పొదిగే హారం
    భారతభాషల కళాప్రాంగణం
    మనిషీ మమతల పుష్పహారం
    ------------------

    అమ్మో మరీ ఎక్కువైందా సెల్ఫ్ :-)...

    ReplyDelete
  15. హహహ!బాగుంది, పద్మగారూ, మీ టపా దానికి భా.రా.రె సమాధానాలూ రెండూ బాగున్నాయి.భా.రా.రె ఇచ్చిన సిలబస్ కు దడుచుకుని తీరుబడిగా ఇంకోసారి చూద్దామని ఆ సోషల్ స్టడీస్ సిలబస్ ఓ పక్కన పెట్టేసాను. పద్మగారూ, జనాభిప్రాయం ఎంతబాగా చెప్పారో:))
    చదవటానికే తాతలు దిగొస్తుంటే కధలు రాయడానికి ఇంకెవ్వరు రావాలో:))
    ఐనా ఈయనకు పాండిత్యం ఎక్కువబ్బా!!

    ReplyDelete
  16. Enduko Emo గారూ,

    నెగెటివ్ మార్కెటింగ్... :)) వామ్మో...

    అయినా ఇప్పుడు మార్కెటింగ్ చేసినా చరిత్ర పుస్తకాలెక్కడ దొరుకుతాయండి :)). ఒకవేళ దొరికినా చదివే ఓపికేదండీ.. అద్దో సునీత చెప్పేసింది చూడండి :))

    ReplyDelete
  17. సునీత గారూ... మీరు రాయకపోతేమానె..కాసేపు మెదలకుండా వుండండి. :))

    ఐనా మీరేంటండీ... అమ్మాయిగారూ అంటూ అన్నేసి కబుర్లు చెప్పి ఇప్పుడిలా కథలా ...నేనా..అంటే ఊరుకుంటామా???

    ReplyDelete
  18. భా.రా.రె. గారు, చరిత్ర పుస్తకాలు దొరక్కేం...మస్త్ దొరుకుతాయి. 'రెడ్డి రాజుల' తో మాత్రం కష్టమే బాబూ:) ఎంతైనా పద్మర్పిత గారు, సునీత గారు చెప్పింది మాత్రం పక్కా కరెక్ట్.

    ReplyDelete
  19. "భా" అంటే భారీగా
    "రా" అంటే రాసులుగా
    "రె" అంటే రెమ్యునేషన్/బహుమానంగా
    ఇచ్చేవారని తెలుసుకొనుమా...
    భలే చెప్పావు పద్మా.....భారారె ఎన్ని రాసులుకురిపిస్తారో చూడాలి:)

    ReplyDelete
  20. జయ గారూ :-)
    ప్రశ్నాపత్రం కఠినమే!! ఒక నెల సమయమూ తక్కువే!! కానీ చూసారా మన తెలుగుదేశం మనకళ్ళముందే ఎలా గొడ్డుపోతుందో? దీనర్థమేమిటండీ? తెలుగులో ప్రతిభాపాటవాలున్న జనాలు సున్నా అనా? లేక ఇలాంటి వాటిమీద ఆసక్తి తగ్గిపోయి నోటికొచ్చింది రాసేవాటిల్లో అభివృద్ధి సాధించామనా :))


    సృజనగారూ, ఇంకేంటి రాసులు పోసేది. ఇలా నిరారచనదీక్ష చేస్తుంటే జనాలందరూ :)

    ReplyDelete
  21. భాస్కర రామిరెడ్డిగారు.....ఛీర్ అప్:-) చూస్తుండండి, మీ బ్లాగ్ హారం కధలతో, కవితలతో, కధానికలతో ఇంపైన లావుపాటి హారం అవుతుంది. బహుమతులు ఇవ్వలేక తబ్బిబై పోతారేమో!!!:-)
    చక్కగా స్పందించి...ఓపిగ్గా సమాధానాలు ఇచ్చినందుకు:-ధన్యవాదాలండి.

    ReplyDelete
  22. సునీతగారు....ఎంతైనా మనం మనం ఫ్రెండ్స్ కదా!:)
    భా రా రె గారి పాండిత్యప్రావీణ్యం తెలుసుగనకే అప్పుడప్పుడూ ఇలా కూసింతైనా మనకి అంటుకోదంటారా:-)

    జయగారు...మీరు మా పార్టీయేనా:-)

    సృజనగారు...తినబోతూ రుచెందుకండీ:-)

    ReplyDelete
  23. భారారె: భానుప్రచండమున రావిచెట్టు నీడలో రెక్కలువాల్చి సేదతీరిన గరుడు..!
    గారే కాదు ప్రస్తుత కరోన కాష్టమంటే లోకమంతటికి కంగారే
    అనట్లు ఈ మీ టపా వ్యాఖ్యాలను ఈ రోజే చూడటం జరిగింది..!!

    ReplyDelete