లేనితనమా!

కోతినుండి పుట్టి ఆ చేష్టలొద్దన్నాడు
నక్కజిత్తులతో నటించడం నేర్చాడు
ఏనుగు అంత బలమీయమన్నాడు
కుక్కలోని విశ్వాసమే తనదన్నాడు
సింహా
సనానికై వెంపర్లాడుతున్నాడు

గాడిదలా బరువులెన్నో మోస్తున్నాడు
జింకలోని చలాకీతనం కోరుకున్నాడు
గంగిరెద్దులా తలూపి సాగిపోతున్నాడు
చిలుక పలుకులెన్నో పలుకుతున్నాడు
నెమలి నాట్యాన్ని చూసి పరవశించాడు
కాకి రంగు ఒద్దని కోకిల గానం కోరాడు
సీతాకోకచిలుక
ను రంగులివ్వమన్నాడు
హంసలోని స్వచ్ఛత తనదనుకున్నాడు
తాబేలుని నెమ్మదితనం నేర్పమన్నాడు
క్రోధంవస్తే కోడెనాగై బుస్సుమంటున్నాడు

కార్యసాధనలో ఉడుములా పట్టుపట్టాడు
కోరికల్లో కళ్ళెంలేని గుర్రమై గెంతేస్తున్నాడు
పరజీవులను ఇన్నికోరిన మానవుడు
మన అర్హతలేవీ ఎందుకీయకున్నాడు

అవేవీ వాటికి అడగడం చేతకాకనా!!!

లేక మనలో అవి లేకపోవడమేనా???

21 comments:

  1. హహహ!!! లేకితనం

    ReplyDelete
  2. అవెప్పుడూ పక్కనోళ్ళ లక్షణాలను అడుక్కోవండి, వాటిలా అవి బతుకుతాయంతే......హూ

    ReplyDelete
  3. మనిషి కూడా ప్రకృతిలో ఒక భాగమే...
    కొన్ని లక్షణాలు అడగకపోయినా
    సహజంగా వచ్చేస్తాయి మరి...
    @శ్రీ

    ReplyDelete
  4. Man is a social animal అన్నాడు అరిస్టాటిల్...తనకు తాను అవసరమై సృష్టించుకున్న చట్రంలో బతుకుతూ తన సహజ లక్షణాలను వదులుకోలేక అప్పుడప్పుడూ బయటపడుతుంటాడు.. మీ భావ ఝరికి అభినందనలు పద్మ గారు...

    ReplyDelete
  5. అవినీతిని నేర్పుత రమ్మంటాడు....కాదంటారా?

    ReplyDelete
  6. బహుశా మానవుడి .గుణాలు ఏవీ నచ్చిఉండవు వాటికి:-)

    ReplyDelete
  7. వాటి ప్రత్యేకత అదే మరి...
    ఏ ఎండకా గొడుగు పట్టే రకం కాదు...
    బాగుందండీ మీ పోస్ట్ ఈ సారి మా గురించి రాయండి పద్మగారూ...:)

    ReplyDelete
  8. ఇంకా కొన్ని జీవుల్ని మరచిపోయారేం?
    మొత్తానికి పరజీవులకి పనికిరామని చెప్పారు.

    ReplyDelete
  9. మీ ఫ్రొఫైల్ పిక్ చూడముచ్చటగా ఉందండి. ఛాన్నాళ్ళకి మార్చినట్లున్నారు.

    ReplyDelete
  10. నా లైఫ్ లో మీ ఫ్రొఫైల్ పిక్ లోని అమ్మాయిని చూస్తానంటారా:)

    ReplyDelete
  11. మానవులకి వున్న ఒకేఒక అర్హత 'అనుకరించటం'.
    ఈ విద్య ఒకరు అడిగితే ఇచ్చేది కాదు కదా. ;)
    ఈ అనుకరణ విద్యకి తెలివితేటలు తోడయ్యి ఈ మానవులని అన్ని జీవులకి నాయకుడిని చేసాయి.

    ReplyDelete
  12. బహుశా వాటికీ మాట ఆలోచించే శక్తితో పాటు స్వార్థాన్ని కూడా ఇచ్చి ఉంటే మనలాగే అడుక్కునేవేమో;)

    ReplyDelete
  13. yes i am better than human and less than animal

    ReplyDelete
  14. మొత్తానికి మానవుడు అన్నీ అరువడుక్కుని బ్రతికేస్తున్నాడన్నమాట:) ఆలోచించాల్సిన విషయమే.

    ReplyDelete
  15. మనిషికి తీసుకోవడమే తప్ప ఇవ్వడం రాదని వాటికీ తెలుసు కాబోలు అందుకే అవి అడగవు :-) very nice post padma garu

    ReplyDelete
  16. ఏదో పాపం ఐకమత్యం గా అవి బతుకుతున్నాయి వాటికి మన లక్షణాలెందుకులెండి :-)

    ReplyDelete
  17. స్పందించిన ప్రతి హృదయానికి నమస్సుమాంజలి!

    ReplyDelete
  18. good post andi/// chala bagundi...

    ReplyDelete