మౌనంవీడు!

ప్రియా...
రాతిరైతే ఒంటరవుతానన్న భయం...
నీ ఊసుల దారాలతో అల్లుకున్న దుప్పటి కప్పుకొని
కలల అలల నురగలపై తేలియాడుతూ
ఒక్కో ఆశనూ నీ ముందు కాగితప్పడవను చేసి
నీ కనుల కొలనులో విడిచి
కరుణకై ఎదురు చూస్తున్నా...

ఈ చీకటి కీచురాళ్ళ ధ్వని మదినావహించి
నిశ్శబ్ధపు ఆవరణలో ఇంకిపోతున్నా...

ఒక్కమారైనా ఆ శిలాహృదయ పంజరాన్ని బద్ధలుకొట్టి
నా ఈ కన్నీటి పుష్పాన్ని స్వాకరించ రావా???
ప్రియుని ప్రశ్నకు?

ప్రియతమా...
పగలంతా పనిలో ఉన్నానని మనసుని మాయచేసానని నన్ను
నీకు దూరమై మౌనంగా రోధిస్తూ
నన్నుశపిస్తుందది తెలుసును
పగలైతే నన్ను మభ్యపెడతావు రేయి భూతానికి బానిసవైనావని
అర్థరాత్రి గడియకొకమారు ఉలిక్కిపడేలా లేపి వెక్కిరిస్తుంది నన్ను!

నా ఊసుల దారాలదుప్పటి కప్పుకున్న నీ మోము కలనైనా కానక
నా ఒంటరితనపు కన్నీట నీవంపిన కాగితపు పడవని తడవనీయక
నా కన్నులలో ఎన్నాళ్ళని దాచగలనో ఎవరికంటా నిన్ను పడనీయక
నాకు తెలుసు నవ్వేస్తుంటావని నా ఈ మనోవేదన నీకు తెలియక!

చీకటి కీచురాళ్ళ నిశ్శబ్ధపు ధ్వనావరణలో ఇంకనీయరాదని నిన్ను
ఇలా సిగ్గువిడిచి నా మనసు విప్పి నగ్నంగా నీకు దాసోహమైనాను
నీవు చులకనగా చుస్తావో లేక పద్మాన్ని పరవశమై వికసింపచేస్తావో
నీ మాటల ఉలికి లొంగిన శిలను నేను శిల్పంగా మార్చేయి నన్ను!

చీకటిలో మనిరువురి ఆత్మల బంధాన్ని నీటగీసిన గీతలని భ్రమించక
సరససల్లాపాల సరస్సులో మునిగి కమలానికి కాంతినొసగు కాదనక
ప్రియతమా!! మాటల్లేవని రావని మౌనంగా ఉండిపోకు జవాబీయక
నీ మౌనం నన్ను కృంగదీసి దహించి వేస్తుంది ఏ పనీ చేయనీయక!

14 comments:

  1. మౌనంవీడు! chaalaa baagumdi.
    ప్రియా
    నీ ఒంటరితనం లో తోడుంటుందని రాత్రిని నీకై రప్పించా
    ఆశల పడవ కాగితాలు విచ్చుకుని మౌనం గా
    కను కొనల వెలుగుల్ని చిమ్మే అలల నురగై
    నీ కలల్ని చేరుతున్నా.
    నువ్ ఇంకిన నిశ్శబ్దావరణం లో నిశ్వాసనై
    చీకటి చప్పుళ్ళను చీలుస్తున్నా.
    నా హృదయం కాదు ప్రియా శిలాపంజరం..
    ఈ శీతల నిశీధి గగనం లో నీ నీడని తాకలేని వేదనా తుహినమై.
    మౌనం గా కన్నీటి లో కలుస్తున్నా.

    అహరహం విరహం.. అద్భుత కావ్య వస్తువై నిలుస్తుంది..
    అల్లరి ఎక్కువైతే.. అక్షింతలకు మౌనం గా నా తల విలువిస్తుంది.

    --

    ReplyDelete
  2. Padmarpita gaaru blog lo top lo unna photo meedenaa andi, mee kavitalu chaduvu mimmallni oohinchukovadaniki, chaala spl ga untay andi mee kavitalu.

    ReplyDelete
    Replies
    1. inkochem clesr gaa cheppi undaalsindhi.(naa boti ajganulaku ardamayyela)

      Delete
  3. padma garu ..Well constucted poem...

    ReplyDelete
  4. ఆద్భుతమైన భావావిష్కరణ పద్మార్పితగారు ....అబినందనలు.

    ReplyDelete
  5. పద్మార్పితా .......ఇంతకీ ఇంత అందమైన జవాబు ఎవరికి ఇచ్చి నట్లో , అంత భావగర్భంగా అడిగిందెవరో :-)

    ReplyDelete
  6. పద్మ గారూ, భావామృతం, తేనియ ,తీయదనంతో కలసి విరహ బాటన ప్రవహిస్తుంది.
    మదిలోని మాటని, ఎదలోని వేదనగా పలికినా వినిపించదా అనే సందేహం మీ కవితలో ఆవిష్కరించారు.
    పద్మా .. ఈ భావుకత అన్ని సార్లూ కలం పలకదు, కానీ నిగూడమైన ఓ చిన్న కదలిక మెదడుపొరలలో దాగి ఎప్పుడో గాని బైటకి రాదు.
    చాలా బాగా రాసారు. ఏమాత్రం కృత్రిమత్వం లేని అక్షర ముత్యాలు......మెరాజ్

    ReplyDelete
  7. విరహపు లేఖ...
    అతి విరహపు జవాబు...
    బాగుంది పద్మ గారూ!
    @శ్రీ

    ReplyDelete
  8. అంతులేని ప్రణయ దాహార్తిని కావ్యీకరించి రసానంద డోలికలోఉర్రూతలూగించినందుకు హృదయపూర్వక అభినందనలు పద్మార్పిత గారూ:-)

    ReplyDelete
  9. నా భావాలఝరిలోని తప్పొప్పులని మనస్ఫూర్తిగా మన్నించి ఆస్వాధిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతిఒక్కరికీ నమస్కరిస్తూ......పద్మార్పిత!

    ReplyDelete
  10. Replies
    1. Thanks for you compliment Ravisekhar garu.

      Delete