ఆమె ఎవరో?

అల్లంత దూరంలో చూసా...
ఇంకొకరి జతగా అడుగేస్తూ
అలా గలగలా మాట్లాడేస్తూ
సన్నని
కూనిరాగమేదో తీస్తూ
ఆనందంగా ఎగిరి గంతులేస్తూ
సర్వం తన గుప్పిట్లో ఉన్నట్లు!
దరిచేరి అంతరంగలోకి తొంగిచూసా...
చిత్రంగుంది మొత్తం చిత్రమే మారింది
అలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంది
మౌనంగా తనతో తానే ఊసులాడుతుంది
ఆరాటంతో అసంకల్పితంగా రెప్పవాల్చింది
కన్నీటి ఉనికిని దాచేయబోతూ రాల్చేసింది
దూరం నుండి గమనించలేదు......ఆమె ఎవరో?
నా నీడే అది......దూరపు కొండలా నున్నగుంది!

45 comments:

  1. పద్మార్పిత ,

    చాలా బాగుంది .
    కొన్ని అక్షర తప్పులు 'సా' కాదు 'శా' ,
    'కూనీరామేదో' కాదేమో 'కూని రాగమేదో' అనుకుంటా .
    'దూరపు కొండలెపుడూ నున్నగనే వుంటాయీ అన్నది అనదిగా
    తెలియబడ్తున్న సత్యమే .
    'ఆ దూరపు కొండల్ని అలా దూరంగానే చూడాలి , లేకుంటే అదే
    దగ్గరగా అయితే అన్నీ గణుపులే ,నునుపు రవ్వంత కూడా కనపడదు .
    నిజానికి మన నీడ మనకంటే ఎంతో అందంగా వుంటుంది .

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానపూర్వక వ్యాఖ్యలకు నెనర్లండి. ( అవి తప్పులో ఒప్పులో తెలియదు కాని "చూసా" అంటే Seen by me అని "చూశా" అంటే Watched అని..... వాడుక భాషలో ఏదైనా పర్వాలేదు అని తెలుసుకున్నా)
      "కూనీరాగమేదో" అని సరిచేసానండి. మీ సహృదయ సలహాలను, సందేశాలను, స్పందనలను సదా కోరుతూ.....Once again thanks Sharma garu.

      Delete
    2. సీన్ బై మి అంటే నా చేత చూడబడ్డది అని . దానినే తెలుగులో చూశా( ను ) లేక చూసేశాను అంటారు .
      వాచ్ డ్ అంటే గమనించాను అని అర్ధం . నాకు తెలిసినంతవరకు . ఒకవేళ నాకు తెలియక పోయి వుండవచ్చు అనుకొంటున్నాను .
      కూనీరాగము తప్పు , కూనిరాగము కరెక్ట్ మాట .

      Delete
  2. నీడలూ నిజాలూ

    ReplyDelete
    Replies
    1. వందనం....అభివందనం.:-)

      Delete
  3. నిను వీడని నీడను నేనే అంటూ సాగింది మీకవిత...నాకు నచ్చేసింది :-)

    ReplyDelete
    Replies
    1. నచ్చిమెచ్చిన మీకు ధన్యవాదాలండి.

      Delete
  4. ఎప్పటిలానే కాకుండా కాస్త మార్పుగోచరిస్తుంది ఈ కవితలో.

    ReplyDelete
    Replies
    1. అవునా.....చాన్నాళ్ళకి బ్లాగ్ వైపురాక. థ్యాంక్యూ.

      Delete
  5. హ... అచ్చం నా మదిలోని భావాన్ని మీరీకవితలోకి మార్చేశారు.
    చాలా బాగుంది.
    బొమ్మ కూడా చాలా బాగుంది.
    ఇన్ని మంచి మంచి బొమ్మలేస్తున్నారు. ఎక్కడైనా అన్నీ ఒకచోట డిస్ప్లే కి పెట్టండి ఎప్పుడైనా.

    ReplyDelete
    Replies
    1. కళాహృదయభావాలు కొన్నైనా కామన్ గా ఉంటాయనుకుంటానండి:-)
      (నా జీవితాశయమే అది అని అనను కానీ ఎప్పటికైనా ఒక పెద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టి దానికి నన్ను ప్రోత్సహించిన వారిని, క్రిటిక్స్ తో నాలో మరింత పట్టుదలని పెంచిన కొందరు ప్రముఖ వ్యక్తుల్ని పిలవాలని కోరిక) చూసారా ఇది కూడా కాస్త కామనే :-) మీ ఆత్మీయ స్ఫూర్తిదాయక స్పందనకు అంజలీరవములు.

      Delete
  6. chaala chaala nbaagundi, super:-)) Image kuda Super...

    ReplyDelete
  7. Replies
    1. ధన్యవాదాలండి.

      Delete
  8. Anonymous13 June, 2013

    Painting is beautiful. Sharma gari suggestions r valuable. Good expression.

    ReplyDelete
    Replies
    1. Thanks for compliment.......I too respect his suggestions!

      Delete
  9. నీడ దూరం నుండి బాగుంటుంది దగ్గర నుండి మనసుతో చూసి అర్థం చేసుకుంటే మరింతబాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. నిజమే మీరన్నది. మీ స్పందనకు నెనర్లు.

      Delete
  10. Mee laage mee needa vundalani naa aasa...Vice versa vaddu... :-)

    ReplyDelete
  11. Anonymous13 June, 2013

    Padma......Fabulous Dear

    ReplyDelete
  12. మన నీడే మనకి మంచి మిత్రుడు....ఎదుటివారిని నమ్మడం కన్నా మనల్ని మనం నమ్ముకుని స్నేహం చేయడం ఉత్తమం. మీలాగే మీనీడ కూడా బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజమే....అలాగని ఎప్పుడూ నీడతోనే స్నేహం చేయలేమో అనికేత్.....ఒకోసారి మన నీడ కూడా మనల్ని వదిలేసి పోతుంది కదా! మన స్వశక్తిని మనం నమ్ముకోవడం ఉత్తమం.Thanks for sharing your views & compliments.

      Delete
  13. చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి.

      Delete
  14. చాలా చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ వెరీమచ్!

      Delete
  15. కన్నీటి ఉనికిని దాచేయబోతూ రాల్చేసింది
    దూరం నుండి గమనించలేదు......ఆమె ఎవరో?
    నా నీడే అది......దూరపు కొండలా నున్నగుంది!

    అంతరంగాన్నిలా చిత్రంతోపాటుగా చక్కని చిక్కనైన భావంతో ఆవిష్కరించడంలో మీకు మీరే సాటి పద్మ గారూ.. చదువుతుంటే ఎందుకో సన్నగా కన్నీటి పొర.. అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. ఆలస్యంగా వచ్చి అంతరంగాన్ని అర్థంచేసుకుని అభినందించిన మీకు అభివందనాలు

      Delete
  16. :) చాలా బాగుంది పద్మ గారు....

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి.

      Delete
  17. నీడకి ప్రాణంపోసి భాష్యం చెప్పించారు మీ కవితలో......అని అనాలనిపించినా అనను, ఎందుకంటే మళ్ళీ పొగిడాననో తిట్టాననో అంటారు కానీ తప్పడం లేదు పద్మ:-)

    ReplyDelete
    Replies
    1. అలా అలిగితే ఎలాగండి సృజనగారు......అలగడం నా హక్కు, అదికూడా తీసేసుకుంటారా ఇలా వ్యాఖ్యలతో > :-)

      Delete
  18. Anonymous14 June, 2013

    It's an amazing.
    I am really wondering that how you got this much talent padmaa!!!!!!!!! simply and easily your are giving replies and maintaining healthy relation with everyone. continue this.

    ReplyDelete
    Replies
    1. Thank you Anonymous.
      Its all because of love & affection I think. Thanks to everyone for It..

      Delete
  19. Chala bagundi..ilage andanga rastu undaalani...

    ReplyDelete
    Replies
    1. thanksandi....tappaka prayatnistaanu...

      Delete
  20. Chala Chala bagundi.....Padma Arpita garu...

    ReplyDelete
    Replies
    1. chala chala thanks....welcome to my blog Rajesh

      Delete
  21. అంతరాత్మ ఉన్నంతవరకు ఎవరికైనా ఈ అంతర్మధనం తప్పదు, ద్వందప్రవృత్తి తప్పదు పద్మగారు

    ReplyDelete
    Replies
    1. నిజమే మీరు చెప్పింది.....ధన్యవాదాలండి.

      Delete