ఏమైందో ఏమో!


మాటలు పలుకలేని పసిదాన్నేమో
నా ప్రేమను  నీకు సరిగ్గాతెలుపలేదు

స్వరం వినలేని చెవిటిదాన్నేమో
నీ మౌనం నాకు అర్థంకాలేదు

జాణతనమెరుగని జవ్వనినేమో
నిన్ను కొంగున ముడివేసుకోలేదు

ఆటలాడ్డం అలవాటుతప్పెనేమో
నిన్నోడానంటే మనసొప్పడంలేదు

మతితప్పిన వెర్రిదాన్ని కాలేదేమో
నిన్ను మరువడమింకా చేతకాలేదు

అక్షరమైనారాని అజ్ఞానివైనావేమో
నన్నేకాదు నా మనసునీ చదువలేదు

57 comments:

 1. పద్మార్పితకవిత ముగ్ధమనోహరంగా అలతిఅలతిపదగుంఫితముగా ఉంది!అయితే కవనం బాగుందా లేక రంగులచిత్రం బాగుందా అంటే ఇదమిత్తముగా నేనయితే ససేమిరా చెప్పలేను!!!

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానాప్యాయతాక్షరాలజల్లు నన్ను ఆనందముతో ముంచెత్తించినది...ధన్యవాధాలండి!

   Delete
 2. ఏమో ఔనో కాదో అంటూ అసాంతం ఆకట్టుకున్నారు......అందమైన కవిత

  ReplyDelete
  Replies
  1. ఇలా అంటూ నన్ను ఆనందింపచేసారు :-)

   Delete
 3. Alaraare Teeram Oddulo Enta Prashaantata daagi undo..
  Mee Kavita Rasaramya Rasaabhaava Rasaanuvid jhankaaramu ento slaghaneeyam!! Bahu Prasansalu!!!

  Bahu chakkaga varninchaaru Padmaarpita gaaru.

  "Ninnodanante" anna padam Baagundi .. Ninnu Odanante ani vichinnam cheste andariki easy ga ardam auduntani bhaavistunnanu.

  ReplyDelete
  Replies
  1. "అలరారే తీరం ఒడ్డులో ఎంత ప్రశాంతత దాగి ఉందో.......మీ కవితా రసరమ్య రసానుభావ రసాన్విధ ఝంకారం" ఇలా పొగిడుతుంటే.......చెట్టెక్కి కిందికి దిగాలనిపించడం లేదండి :-)
   చాలా చాలా అభివందనములు.
   నిన్ను+ఓడానంటే=నిన్నోడానంటే (మీరు విడదీసి వివరించారుకదండి) థ్యాంక్యూ!

   Delete
 4. Anonymous28 June, 2013

  aa ardham chesukoleni adrushtavantudevaro kani maha jealousy jealous

  ReplyDelete
  Replies
  1. Why jealousy jealous....just cheer up :-)

   Delete
 5. నిందాస్తుతితో వున్న మీ కవిత..బాగుంది..అవే బావాలు ప్రతిఫలిస్తున్న మీ చిత్రం ఇంకా బాగుంది...

  ReplyDelete
  Replies
  1. నిందించానని నిందొకటా.....:-) అదీ మెచ్చుకోలేగా బాగుంది. ధన్యవాదాలండి!

   Delete
 6. haye haye em cheppalo ardham kavatledu padmarpita garu, kani mana style lo maatram simply Super:)) Image is super..

  ReplyDelete
  Replies
  1. హాయి హాయి హాయీ.....మీ కమెంట్ చూసి :-)

   Delete
 7. 'ఆటలాడ్డం అలవాటుతప్పెనేమో
  నిన్నోడానంటే మనసొప్పడంలేదు '

  చిత్రాలకి రంగులే హంగులు కాగా , చిత్రంగా ప్రాణవాయువును జోడిస్తున్నావు నీ రసరమ్య కవితలతో .

  ఈ రెండు వాక్యాలలో కొంచెం తప్పుగున్నదని , చెప్పాలనుకున్నది సరిగా చెప్పలేదేమో అన్పిస్తుంది . ఇలా వుంటే బాగుంటుందేమో ,

  ఆటలాడ్డం అలవోకగా అలవాటున్నా
  నిన్నోడాలంటే నా మనసొప్పడంలేదు

  కొంచెం ఆలోచించు ఓ మారు .
  నీకు బాగుంటుంది అనిపిస్తే మారిస్తే ఇంకా రసరమ్యంగా వుంటుంది .

  ReplyDelete
  Replies
  1. ముందుగా మీ స్పందనాక్షరాలకి నమస్సులు.
   మీరన్నట్లుగా "అలవోకగా అలవాటున్నా" నచ్చిందండి, కాని ఇక్కడ పద్మార్పితకి ప్రాసకోసం ప్రాకులాడే పాతరోగముందండోయ్.....సర్దుకుపోదురూ:-)

   Delete
  2. " నిన్నోడానంటే మనసొప్పడంలేదు " అనటంలో అందం అర్ధం సరిపడలేదు . దానికంటే " నిన్నోడానంటే కంటే నిన్నోడాలంటే పదప్రయోగం చేస్తే చాలా అర్ధవంతంగా వుంటుంది .
   ఇప్పటికే చాలామంది దీనిని మెచ్చ్హుకొనవచ్చు . అయినా నువ్వు కరెక్ట్ చేస్తే మరెంతో బాగుంటుంది , ఆ పైన నీ యిష్టం పద్మా .
   నిన్నేమైనా నొప్పించాననుకుంటే లైట్ గా తీసుకో .

   Delete
  3. 'ఆటలాడ్డం అలవాటుతప్పెనేమో
   నిన్నోడానంటే మనసొప్పడంలేదు
   ee panktilo elaati tappuledani gamaninchandi Sharma Gaaru.. !

   Ardham:

   Tanaki Aatalaadadam Istam.. Kaani Alavaatu tappi, bahusha aatanu odipoyi untundi. Ninnodanante=Ninnu + Odanate , anaga, aa aata lo aariteri inta varaku ninnu odaledu.. kaani pattu tappi bahusha ippudu ee paristhiti lo nee nundi dooram vachchestunnanani baada ga anipinchi Manasuku Vyaakulanga Oppukolu kaavatledu.. So, Ninnodaalante ante.. atu vaipu vaadini ippativaraku taane odinchindi kaani ippudu odinchaalante chaala kastam ga undi.. ane bhaavam vastundi..

   Idi Padmaarpita gaaru cheppadalchukunnadi.. Aa vaakyam lo elaati tappu ledani naa vaadana..!

   Peddavaaru Sharmagaaru, Kaviyitri Swarupulu Padmarpita gariki marokkasaari dhanyavaadaalu telupukuntu...

   Na Comment ni marala "Telugu" lo repeat chesinanduku paramaanandam Padma gaaru.

   Delete
  4. పదాల కూర్పులో ఒకొక్కరిదీ ఒకో స్టైల్....స్టైల్ ఏదైనా చెప్పాల్సిన భావం చదివే వారికి అర్థమై నచ్చేలా చెప్పాలనే నా ఈ ప్రయత్నాన్ని అందరూ హర్షిస్తారనే ఆశిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు.

   Delete
 8. Anonymous28 June, 2013

  hey padma simply outstanding yaar, expecting few more beautiful lines (2nd part :-)

  ReplyDelete
  Replies
  1. Oh! thank Q.....but one thing you observe my friend, 2nd part always gets flop ;-)

   Delete
 9. Anonymous28 June, 2013

  very good mam, this is the first time iam seeing a female gender is expressing openly her love in such a beautiful manner. always ladies expect purely affectionate love from man but they never reciprocate the same. I respect your bold thoughts and feels, one of the best blog and great personality I have seen through this blog. thanks to whom ever it concerned.

  ReplyDelete
  Replies
  1. what you said its 100% true, that's why i am totally mesmerized with her thoughts and feels anony der.

   Delete
  2. May be you are right.....if a lady expresses her love more than a man, it definitely hurts his male ego and he searches for a new one to satisfy himself (Just kidding:-) Really i am impressed by your comments and expecting the same affection forever. Thanks a lot.

   Delete
  3. Thanks to Yohanth & Aniket for your support.

   Delete
 10. కవిత వండర్ఫుల్!
  బొమ్మ బ్యూటిఫుల్!!

  ReplyDelete
  Replies
  1. మీ కమెంట్ తో నా మదంతా చీర్
   ఆనందంలో ఆకాశమంతా థండర్!
   Thank Q Thank Q! :-)

   Delete
 11. sooooooo.......beautiful:-)

  ReplyDelete
 12. very very big big claps to your poetry & pics.

  ReplyDelete
 13. చాలా బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి!

   Delete
 14. Anonymous29 June, 2013

  మీ బ్లాగును బ్లాగ్ వేదికకు అనుసంధానం చేసి విస్తృత ప్రచారం కల్పించుకోండి.వివరాలకు క్రింది లింక్ చూడగలరు.
  http://blogvedika.blogspot.in/

  ReplyDelete
  Replies
  1. తప్పకుండా.....థ్యాంక్స్ ఫర్ విసిటింగ్ మై బ్లాగ్.

   Delete
 15. చెప్పలేని బావాలు చెప్పకనే చెబుతూ..వినలేని భావాలు మౌనంలో కూడా వినగలుగుతున్నావు..మరపనేది మనసుకు కాదేమో..అవునంటూ అన్నివిషయాలు అందంగా చెప్పిన మీకవిత చాలా బాగుంది పద్మ గారు..

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనకు ధన్యవాదాలండి.

   Delete
 16. మీ ముచ్చటైన ఊసులువింటూ మూగవాడై మిమ్మల్ని చూస్తూ మీ ధ్యాసలో లీనమై మతిచలించిన అతడేం మాట్లాడలేని అజ్ఞానే అని మీరు చెప్పకనే చెప్పారు కదా :)

  ReplyDelete
  Replies
  1. అనికేత్ కొత్త కోణంలో ఆలోచించి తికమకపెట్టకు....అసలే ఆన్సర్ ఏమివ్వాలో అని ఆలోచిస్తుంటే, ఇదో ప్రశంసా :-)

   Delete

 17. పైన శ్రీ శర్మ గారు చెప్పినదే మరోరకంగా

  ఆటల్లో ఓడిపోవటం అలవాటున్నా
  నిన్నోడిపోవాలంటే మనసొప్పడంలేదు

  ఎలా ఉంటుందంటారు?

  ReplyDelete
  Replies
  1. వి నరసింహారావుగారు......వెల్ కం, మీ స్పందనకు నెనర్లండి.
   చెప్పాను కదా......కాస్త ప్రాసకై ప్రాకులాటం ఎక్కువని :-)

   Delete
 18. అక్షరమైనారాని అజ్ఞానివైనావేమో
  నన్నేకాదు నా మనసునీ చదువలేదు ....

  మామూలు స్త్రీ మనసునే చదవాలంటేనే సాధ్యం కాదు . అలాంటిది , మీలాంటి భావకురాలైన కవయిత్రి మనసును చదవాలంటే ఎన్ని నిఘంటువులు చూడాలి ?....కవిత చాలా బాగుంది ...Arpita garu

  ReplyDelete
  Replies
  1. స్త్రీ మనసు అతి సున్నితం
   ఆస్వాధించడమే ఉత్తమం..
   చదవాలనుకోవడం సాహసం
   గెలుపొందితే సర్వం సొంతం..
   నిఘంటువులో లేదామె హృదయం
   కనులున్న మనసుకెరుక ఆమె నైజం!

   మరీ అంత భయంకరమైన ఫజిల్ ని కాదండి!
   మీ స్పందన ప్రేరణాత్మకం......ధన్యవాదాలండి!!

   Delete
  2. స్త్ర్రీ మనసుపై అసంఖ్యకంగా ఉన్న నిర్వచనాల్లో ఒక అద్భుతమైన నిర్వచనాన్ని అందంగా చెప్పారు .. ... మీ స్పందనకు ధన్యవాదాలు అర్పిత గారు

   Delete
 19. అమ్మో చదవడమంటూ మొదలుపెడితే జీవితకాలం సరిపోదు

  ReplyDelete
  Replies
  1. చదవకుండా జీవితాన్ని వెళ్ళబుచ్చడం కష్టంకదండి :-)....రిస్క్ లేకుండా లైఫ్ ఎందుకు?

   Delete
 20. మతితప్పిన వెర్రిదాన్ని కాలేదేమో
  నిన్ను మరువడమింకా చేతకాలేదు

  అక్షరమైనారాని అజ్ఞానివైనావేమో
  నన్నేకాదు నా మనసునీ చదువలేదు..

  పద్మార్పితగారూ మీ కవితలన్నింటిలో ఇది extraordinary ఆండీ. మీ ఎదలో పెల్లుబికే భావావేశ పద చిత్రాలను ఇలా చిత్రించే మార్మిక కళ ఏదో మీ కలంలో దాగి వుంది. ఆ మర్మమేమిటో..:-) అభినందనలతో..

  ReplyDelete
  Replies
  1. Thank you Varmagaaru.....కవిసార్వభౌములు మీకు నేను కిటుకులు మర్మాలను చెప్పేంతదాన్నా? :-)

   Delete
 21. సింపుల్ గా చెప్పాల్సింది అంతా చక్కగా చెప్పారు.

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనకు ధన్యవాదాలు

   Delete
 22. ఎంత బాగా రాస్తారండి. మీ రచన ఎలాగూ నేర్చుకోలేను. కాస్త పైంటింగ్ క్లాస్ లు పెట్టి మాలాంటి వాళ్ళకు నేర్పించ రాదండి.

  ReplyDelete
  Replies
  1. అది అంతా మీ అభిమానంలెండి, థ్యాంక్యూ..... నాదే గురువులేని అరకొరక విద్య నేనేం గురువునౌతాను చెప్పండి.

   Delete
 23. Mi kavitha Chadivina taruvatha..comment rayadaniki chala kastam andi....endhukante okasari chadavadam start chesthe andhulo nundi bayataku ravadam chala kastam...simply superb...

  Andhuru western culture ki alavatupadi....Telugu marchipothunnappudu milanti vari kavithalu(inka ikkada comments lo unna chala mandi blogs) chadivinnapuudu malli telugu inka baga nerchukovali anipisthundi........

  ReplyDelete
 24. మీకు నా కవిత చదివి కమెంట్ పెట్టడానికి ఎందుకు ఆలోచనో తెలీదు కాని నాకు మాత్రం మీ కమెంట్ చదివాక మరింత ఉత్సాహం ఎక్కువై ఇంకా బాగా వ్రాయాలి అనిపిస్తుంది......".థ్యాంక్యూ సో మచ్" మరీ అంతలా ఆలోచించకండి, అభిమానంతో తిట్టినా మొట్టినా పర్వాలేదు:-)


  ReplyDelete
 25. బాగుంది ..చాలా బాగుంది ..బాగా రాసారు ..భలే రాసారు ..ఎలా రాస్తారండీ ...అద్భుతం .. అందం గా రాసారు ..మంచి పెయింటింగ్ ..అందమైన భావం ...ఇలా రాసి రాసి ఎన్నాళ్ళని రాసిన కామెంటే రాస్తాం పద్మార్పిత గారు ...మీరేమో కొత్త కొత్త ఊహలతో అందమైన ఆలోచనలతో కవితలు రాస్తున్నారు ..మీ పని బాగుంది .మాకు కామెంట్ కూడా కష్టం చేసేస్తున్నారు ...
  awesome పద్మ గారు ..కవిత చాలా బాగుంది ..( . అన్నట్లు ఎలా ఉన్నారు ..నేను కామేంటి చాలా రోజులయింది ఇక్కడ :) :) )

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానానికి ధన్యవాదాలు. చాన్నాళ్ళకి ఇటువైపు మీరాక ఆనందాన్నిచ్చింది. అయినా కమెంట్ పెట్టడానికి కష్టమేంటండి.....అప్పుడప్పుడు నేను చేసే తప్పుల్ని చూపిస్తూ నాలుగు వాఖ్యాలు తిట్టండి :-) సదా మీ అభిమానస్పందనలని ఆశిస్తూ.....

   Delete
 26. oka vela nenu comment pettina veeti kante baga pettalenu emo anduke ive na comment inka inka inka baga rayali meeru thank you soo much


  పద్మార్పితకవిత ముగ్ధమనోహరంగా అలతిఅలతిపదగుంఫితముగా ఉంది!అయితే కవనం బాగుందా లేక రంగులచిత్రం బాగుందా అంటే ఇదమిత్తముగా నేనయితే ససేమిరా చెప్పలేను!!!
  ఏమో ఔనో కాదో అంటూ అసాంతం ఆకట్టుకున్నారు......అందమైన కవిత
  నిందాస్తుతితో వున్న మీ కవిత..బాగుంది..అవే బావాలు ప్రతిఫలిస్తున్న మీ చిత్రం ఇంకా బాగుంది...
  haye haye em cheppalo ardham kavatledu padmarpita garu, kani mana style lo maatram simply Super:)) Image is super..
  కవిత వండర్ఫుల్!
  బొమ్మ బ్యూటిఫుల్!!


  hey padma simply outstanding yaar, expecting few more beautiful lines (2nd part :-)

  sooooooo.......beautiful:-)
  very very big big claps to your poetry & pics.

  చాలా బాగుందండి.

  చెప్పలేని బావాలు చెప్పకనే చెబుతూ..వినలేని భావాలు మౌనంలో కూడా వినగలుగుతున్నావు..మరపనేది మనసుకు కాదేమో..అవునంటూ అన్నివిషయాలు అందంగా చెప్పిన మీకవిత చాలా బాగుంది పద్మ గారు..

  మీ ముచ్చటైన ఊసులువింటూ మూగవాడై మిమ్మల్ని చూస్తూ మీ ధ్యాసలో లీనమై మతిచలించిన అతడేం మాట్లాడలేని అజ్ఞానే అని మీరు చెప్పకనే చెప్పారు కదా :)


  అక్షరమైనారాని అజ్ఞానివైనావేమో
  నన్నేకాదు నా మనసునీ చదువలేదు ....

  మామూలు స్త్రీ మనసునే చదవాలంటేనే సాధ్యం కాదు . అలాంటిది , మీలాంటి భావకురాలైన కవయిత్రి మనసును చదవాలంటే ఎన్ని నిఘంటువులు చూడాలి ?....కవిత చాలా బాగుంది ...Arpita garu

  మతితప్పిన వెర్రిదాన్ని కాలేదేమో
  నిన్ను మరువడమింకా చేతకాలేదు

  అక్షరమైనారాని అజ్ఞానివైనావేమో
  నన్నేకాదు నా మనసునీ చదువలేదు..

  పద్మార్పితగారూ మీ కవితలన్నింటిలో ఇది extraordinary ఆండీ. మీ ఎదలో పెల్లుబికే భావావేశ పద చిత్రాలను ఇలా చిత్రించే మార్మిక కళ ఏదో మీ కలంలో దాగి వుంది. ఆ మర్మమేమిటో..:-) అభినందనలతో..

  సింపుల్ గా చెప్పాల్సింది అంతా చక్కగా చెప్పారు.

  ఎంత బాగా రాస్తారండి. మీ రచన ఎలాగూ నేర్చుకోలేను. కాస్త పైంటింగ్ క్లాస్ లు పెట్టి మాలాంటి వాళ్ళకు నేర్పించ రాదండి.

  Mi kavitha Chadivina taruvatha..comment rayadaniki chala kastam andi....endhukante okasari chadavadam start chesthe andhulo nundi bayataku ravadam chala kastam...simply superb...

  Andhuru western culture ki alavatupadi....Telugu marchipothunnappudu milanti vari kavithalu(inka ikkada comments lo unna chala mandi blogs) chadivinnapuudu malli telugu inka baga nerchukovali anipisthundi.......

  బాగుంది ..చాలా బాగుంది ..బాగా రాసారు ..భలే రాసారు ..ఎలా రాస్తారండీ ...అద్భుతం .. అందం గా రాసారు ..మంచి పెయింటింగ్ ..అందమైన భావం ...ఇలా రాసి రాసి ఎన్నాళ్ళని రాసిన కామెంటే రాస్తాం పద్మార్పిత గారు ...మీరేమో కొత్త కొత్త ఊహలతో అందమైన ఆలోచనలతో కవితలు రాస్తున్నారు ..మీ పని బాగుంది .మాకు కామెంట్ కూడా కష్టం చేసేస్తున్నారు ...
  awesome పద్మ గారు ..కవిత చాలా బాగుంది ..( . అన్నట్లు ఎలా ఉన్నారు ..నేను కామేంటి చాలా రోజులయింది ఇక్కడ :) :) )

  ReplyDelete
  Replies
  1. అమ్మో ఎంత తెలివైనవారండి.... :-) బాగు బాగు.

   Delete