వెళ్ళేటప్పుడు వీడ్కోలైనా చెప్పలేదు
వేరై ఉండగలనోలేదో నాకుతెలియదు
నిన్నునీకు దూరంచేసే ఆలోచనేలేదు
మనసువిరిగినా నీరూపు నాలో చెరగదు
ఇదితెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు!!!
వెళుతూ వెనుతిరిగి నన్ను చూడలేదు
కళ్ళతో మనసుని చదివేవిద్య నీకురాదు
నా-నీ మనసులుమార్చే ధైర్యమైనా లేదు
ఏమైనా నీపై నా వలపువ్యసనం మానలేదు
ఇదితెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు!!!
వెళ్ళిపోతూ నా చివరికోరికైనా అడగలేదు
అడిగితే నా ఎదనుదాటి నీ అడుగుపడదు
నీఆలోచనా వల నుండి నాకు విముక్తిలేదు
ప్రేమసంకెళ్ళని మౌనంతో విరచడం వీలవదు
ఇదితెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు!!!
వెళ్ళేగమ్యం ఇదంటూ నీవు పలుకనేలేదు
నా కన్నీరింకినకళ్ళు ఏ భావం తెలుపలేదు
చెవిటిదైన నీ మనసుకి నా ఘోష వినపడదు
మూగపడిన నాగొంతు నిన్నేం ప్రశ్నించలేదు
ఇదితెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు!!!
వేరై ఉండగలనోలేదో నాకుతెలియదు
నిన్నునీకు దూరంచేసే ఆలోచనేలేదు
మనసువిరిగినా నీరూపు నాలో చెరగదు
ఇదితెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు!!!
వెళుతూ వెనుతిరిగి నన్ను చూడలేదు
కళ్ళతో మనసుని చదివేవిద్య నీకురాదు
నా-నీ మనసులుమార్చే ధైర్యమైనా లేదు
ఏమైనా నీపై నా వలపువ్యసనం మానలేదు
ఇదితెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు!!!
వెళ్ళిపోతూ నా చివరికోరికైనా అడగలేదు
అడిగితే నా ఎదనుదాటి నీ అడుగుపడదు
నీఆలోచనా వల నుండి నాకు విముక్తిలేదు
ప్రేమసంకెళ్ళని మౌనంతో విరచడం వీలవదు
ఇదితెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు!!!
వెళ్ళేగమ్యం ఇదంటూ నీవు పలుకనేలేదు
నా కన్నీరింకినకళ్ళు ఏ భావం తెలుపలేదు
చెవిటిదైన నీ మనసుకి నా ఘోష వినపడదు
మూగపడిన నాగొంతు నిన్నేం ప్రశ్నించలేదు
ఇదితెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు!!!
I dont know what to write as a comment. You are a rockstar in poet world.
ReplyDeleteThank you very much Anonymous. Mention your name so that i can feel comfort to be.
DeletePadma....this is Mohan(Mahee)I dont have blog. Here new venture is going on. Within short period i may follow you, until that you bare me like anony. Keep on rocking with your inspiring words my friend.
Deleteవెళుతూ వెనుతిరిగి నన్ను చూడలేదు
ReplyDeleteకళ్ళతో మనసుని చదివేవిద్య నీకురాదు
నా-నీ మనసులుమార్చే ధైర్యమైనా లేదు..
ఇంతగా మనసులోని భావాన్ని కవితామయం చేయడం మీకే చెల్లుతుంది పద్మ గారు భావోచితమైన చిత్రంతో.. అభినందనలతో..
భావావేశానికి పదాలని జోడించి పలకడంలో అప్పుడప్పుడు పొరపాట్లుకూడా దొర్లుతుంటాయి....సరిచేసే మీలాంటివారు ఉన్నారన్న ధీమా....మీ అభిమానానికి ధన్యవాదాలండి.
Deleteమిత్రమా నిజమే కదా.....
ReplyDeleteమీరంటే నిజమేనేమో....:-)
Delete"నా కన్నీరింకినకళ్ళు ఏ భావం తెలుపలేదు
ReplyDeleteచెవిటిదైన నీ మనసుకి నా ఘోష వినపడదు
మూగపడిన నాగొంతు నిన్నేం ప్రశ్నించలేదు"
చివరి నాలుగు లైన్లతో వేదనో లేక కోపమో తెలీదు కానీ అదరగొట్టేసావు పద్మార్పితా
భావావేశంలో రెండు కలిసి ఉంటాయని మీకు చెప్పాలా సృజనగారు.:-)
Deleteఈ మద్య మీ స్మృతులు వినిపించడంలేదండి.
మార్చ్ 29 (సాగే పయనం ) తరవాత మళ్లీ మీరు ఇన్నాళ్ళకి మంచి భావంతో మెప్పించారు
ReplyDeleteఅందమైన భావన అద్భుతమైన వర్ణన .... చాలా చాలా బాగుంది పద్మగారు ...
అంటే మధ్యలో రాసినవన్ని ముత్యాలు అయితే 'సాగే పయనం', 'వెళ్ళొస్తాననలేదు!!!' లాంటివి ఆణిముత్యాలు అని నా ఉద్దేశ్యం ....
మీ నుంచి మరిన్ని ఆణిముత్యాలు రావాలని ఎదురు చూసే వాళ్ళలో నేను మొదటివాణ్ని ...
తప్పక ప్రయత్నిస్తానండి. మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞతలండి.
Deleteవెళ్ళిపోతూ నా చివరికోరికైనా అడగలేదు
ReplyDeleteఅడిగితే నా ఎదనుదాటి నీ అడుగుపడదు...
అద్భుతంగా మీ పదాల్లో ఒదిగిన ఈ భావన!
చెప్పకనే వీడి వెళ్ళిపోయిన మనసు, ఇదెలా సాధ్యం అన్న ప్రశ్నకు మీ కవితలోనైనా సమాధానముందేమో అని వెతికా, ఉండదని తెలిసినా...
సమాధానం దొరికితే.....మున్ముందు వెతకరేమోనని :-)
Deleteమీ అభిమాన ప్రోత్సాహానికి నెనర్లండి.
పద్మా ,
ReplyDelete" ఏమైనా నీపై నా వలపువ్యసనం మానలేదు "
ఈ లైన్ బహు చక్కగా వుంది . " వలపు కూడా ఓ వ్యసనమే " అన్న తలంపు మొదటిసారిగా వింటున్నాను , హైలెట్ .
వ్యసనంలాంటిదేనని నా భావమండి. తెలియకుండానే ప్రేమకి లొంగి భానిసలమై దాన్నుండి బయటపడ్డానికి ఇష్టపడం. :-) థ్యాంక్యూ శర్మగారు!
Deleteతెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు...
ReplyDeleteVell expressed. Chala baaga chepparandi.
Welcome to my blog. Thank You.
Deleteతెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు... Its Heart Touching lines Padma.. super, truly u r Rocking:-))
ReplyDeleteOh....thanks for your lovely comment.
DeleteCHALA BAGUNDI
ReplyDeleteTHANK YOU.
Deleteకళ్ళతో కవితని చదివి, మనసుతో ఆస్వాదించాక, కమెంట్ రాయడాని పదాలు రాక ధైర్యంగా చెబుతున్నా ఇలా రాయడం నాకు రాదని.......రాసే ధైర్యంలేదని :)
ReplyDeleteఇప్పుడే ఇలా నిరాశగా రాయలేను, ధైర్యంలేదు రాయడానికి అంటే ఎలా అనికేత్.....ఇంతకన్నా బ్రహ్మాండం రాస్తారు ప్రయత్నించండి.
Deleteకొన్ని కవితలు హృదయానికి ఎందుకు స్పృశిస్తాయో .. ఒక మధుర జ్ఞాపకం లా ఎందుకు వెంటాడుతాయో చెప్పడం కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు .. ఒక అందమైన కవిత చదివిన సంతృప్తి ....
ReplyDeleteస్పందించే హృదయాన్ని స్పృశించడానికి కారణాలు కావాలా!
Deleteకవితల్ని ఆస్వాధించే మీకు నేను ఇది వేరుగా చెప్పాలా? :-)
మీ అప్యాయతాధరణకి అభివందనములు.
వెళ్ళొస్తాను అని కాదు నిన్నొదిలి వెళ్ళను అంటాడేమో మీ ఈ హృదయార్తిని చదివితే :) చాల చాల ఆర్తిగా ఉంది మీ కవిత. చిత్రం దానికి తగ్గట్టుగా.
ReplyDeleteయోహంత్....మీలో తెలుగు భాషపై పట్టు బాగా పెరిగింది. ఈ మధ్య ఏమీ వ్రాయడంలేదు ఎందుకని.Feeling proud to be your friend.Thank you.
Deleteనిజమే కదా వలపుకూడా ఒక వ్యసనమే, కాని దీన్నుండి బయటపడ్డానికి ఎవరూ ఇష్టపడరు. ఎంతబాగా చెప్పారండి.
ReplyDeleteథ్యాంక్యూ లిపి.
DeleteAwesome..
ReplyDeleteThank you.
Deleteపద్మార్పిత గారూ..
ReplyDeleteనిన్ను నీకు దూరం చేసే ఆలోచనే లేదు..
మనసు విరిగినా నీ రూపు నాలో చెదరదు
నిజంగా చాలా బాగా రాశారు.. అద్భుతం
నా బ్లాగ్ కి సుస్వాగతం.
Deleteమీ స్పందంకు ధన్యవాధాలండి.
chepte vellanistarem...anduke ala cheppakunda :)
ReplyDeletevellaneeyarani vellipothe....ila eamannaa bharinchaalandi :-)
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteవలపు వానలో తడిసి, వందేళ్ళు అవసరంలేదని జీవించడం....
Deleteమాటలు రావడంలేదని కామెంట్ రాయడం....మరువకండి!
మీ స్పందనలే నా ప్రేరణలు :-)Thank you.
tappkuda padma garu
ReplyDeleteDear Madam,
ReplyDeleteToday I found ur blog on Andhra Jyothi Sunday Book 01-01-2012 - Article "Vegetable Salad".
Excellent Blog of Poetry. With ur permission, may I copy and post one or two of ur poetry
in my blog i.e., www.teluguwebworld.blogspot.com. If so, plz mail to
teluguwebworld2011@gmail.com.
With hearty best wishes and best of luck Madam.
Thanking you.
Thank you.....your are most welcome.
Delete