ఏదో కొత్తర్ధమని పాత ప్రేమనే పదే పదే రాశాను
ఆగాగి సాగే శ్వాసతో గుండెలయని ఆలపించాను
చీకటిలో ముద్దాడి, వణికిన నా పెదవుల అలికిడికి
భీతిల్లిన అతడ్ని వర్ణించబోయాను ప్రేమని తెలియక!
ఎన్నో వాక్యాలను కూర్చిపేర్చి ప్రేమావేదన రాశాను
నా రెండునయనాలలోని సాగరఘోషను లిఖించాను
విరహ వేదనతో కలయికాఝంకారాల సడిని వెతికి
తల్లడిల్లిపోయా పదాల్లో నా ప్రేమనంతా ఇమడ్చలేక!
ఏదో కాగితంపై నాలుగందమైన అక్షరాలు రాశాను
పగిలిన గుండెను అతికించి ప్రియపదాలు కూర్చాను
మూల్యం చెల్లించబడింది కొన్ని నావై నచ్చిన భావాలకి
మరెన్నో మౌనాలుగామారి మిగిలాయి ఖరీదు కట్టలేక!
ఆగాగి సాగే శ్వాసతో గుండెలయని ఆలపించాను
చీకటిలో ముద్దాడి, వణికిన నా పెదవుల అలికిడికి
భీతిల్లిన అతడ్ని వర్ణించబోయాను ప్రేమని తెలియక!
ఎన్నో వాక్యాలను కూర్చిపేర్చి ప్రేమావేదన రాశాను
నా రెండునయనాలలోని సాగరఘోషను లిఖించాను
విరహ వేదనతో కలయికాఝంకారాల సడిని వెతికి
తల్లడిల్లిపోయా పదాల్లో నా ప్రేమనంతా ఇమడ్చలేక!
ఏదో కాగితంపై నాలుగందమైన అక్షరాలు రాశాను
పగిలిన గుండెను అతికించి ప్రియపదాలు కూర్చాను
మూల్యం చెల్లించబడింది కొన్ని నావై నచ్చిన భావాలకి
మరెన్నో మౌనాలుగామారి మిగిలాయి ఖరీదు కట్టలేక!
విరహ వేదనతో కలయికా ఝంకారాల సడిని వెతికి
ReplyDeleteతల్లడిల్లిపోయా పదాల్లో నా ప్రేమనంతా ఇమడ్చలేక!
హృదయాంతరాలలోని అనంత ప్రేమ మాధుర్యాన్ని ఇలా ఒలికించారు.. అభినందనలతో..
మీ కవితాస్వాద కమ్మదనం ఈ కమెంట్లో కనపడిందండి కెక్యూబ్ వర్మగారు ;-) ధన్యోస్మి
Deleteinta premaki velakattadam kashtame!
ReplyDeleteఅలా అమూల్యమైనదిగానే ఉండనీయండి.:-)
Deleteమంచి కవితకు కావలసినది ఆర్ద్రత . హృదయపు లోతులనుంచి వచ్చే భావ ఆవేశం .. అది ప్రేమ గురుంచి కావచ్చు , సంఘమ్ లో జరిగే సంఘటనలు కావచ్చు ... ముందు మనం మానసికం గా అనుభవించనిదె భాష రాదు. పద్మార్పిత గారి కవితల్లో మొదట కనిపించేది ఆమె మానసిక అనుభవం అందుకే అంత గా హృదయానికి హత్తుకుంటాయి ..Keep it up Kid.
ReplyDeleteనా కవితల్లో మానసిక అనుభవం కన్నా మీ అందరి అభిమానస్పందనాదరణలే నాకు అత్యంత స్పూర్తినిస్తాయన్నది మాత్రం ముమ్మాటికి నిజం. మీ ఆత్మీయ వాఖ్యాలకి అభివందనం.
DeleteSure....I will try to be ;-)
బాగుంది .
ReplyDeleteనా రెండునయనాలలోని సాగరఘోషను లిఖించాను
పగిలిన గుండెను అతికించి ప్రియపదాలు కూర్చాను
పగిలిన గుండెను అతికించటంలో పడ్డ ప్రయాస , ప్రియపడాలు కూర్చటంలో సేద తీరటం చాలా బాగుంది .
మూల్యం చెల్లించబడింది కొన్ని నావై నచ్చిన భావాలకి
మరెన్నో మౌనాలుగామారి మిగిలాయి ఖరీదు కట్టలేక!
మూల్యం కట్టినవాటికంటే కట్టనివి అమూల్యం అంటం చాలా చాలా బాగుంది .
రాసాను కాదు రాశాను అని వ్రాయాలి .
సహజంగా ఈ సా ఎప్పుడు వాడతామంటే రాస్తాను , యిస్తాను , వస్తాను , చూస్తాను లాంటి పదాలవద్దనే .
హమ్మయ్య.....మిమ్మల్ని మెప్పించాను :-)
Deleteసరిచేసానండి......ధన్యవాదములు.
మరోమారూ నా మనసుని మీ కవితలో చూసుకున్నాను.
ReplyDeleteమీ కవితలన్నీ ఓ అద్భుతమే, కానీ కవితల కన్నా మీ పెయింటింగ్స్, డ్రాయింగ్స్ ఇంకా అద్భుతం.
మీరు పెయింటింగ్స్ లో విభిన్నమైన శైలి కనబరుస్తారు. అన్ని రకాల శైలి లు అవలీలగా కుంచెతో ఒలికించగల నైపుణ్యం అరుదు.
మీ పెయింటింగ్స్ అన్నీ ఒకచోట చేర్చి ఒకప్పటి విమర్శకులతో ప్రశంశలు పొందగల ప్రతిభ మీది. ఎప్పటికైనా ఆ రోజు రావాలని ఆకాంక్షిస్తూ..
మీ మనసుని మెప్పించేలా మరిన్ని వ్రాయడానికి ప్రయత్నిస్తానండి.
Deleteనా పెయింటింగ్స్ ఏమిటండి....ఎవరో వేసిన వాటిని చూసి వేయడమా? మీలా సొంతంగా ఊహించి భావానుగుణంగా కొన్నైనా నా కుంచె నుండి ఎప్పుడు జాలువారుస్తానో ఏమో. ఆరోజు కోసమే వేచిఉన్నాను. ఈ పెయింటింగ్ నేను వేసింది కాదని మనవి. ఆర్టిస్ట్ ఎవరో కూడా తెలియదండి మన్నించాలి.
మీ అభిమానానికి నమస్సుమాంజలి.
చూసి వేయటమంటే మాత్రం తమాషా కాదుగదండీ, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ల పెయింటింగ్స్ చూసి వెయ్యాలన్నా ఎంతో నేర్పు కావాలి.
Deleteనేనూ మీలానే చూసి వేస్తూ నేర్చుకోటమే. ఊహించి వెయ్యటం ఈ మధ్యనే అలవరచుకుంటున్నా "బాపు" గారి ఏకలవ్య శిష్యరికం తో ;)
ఇంతటి పరిపక్వత చెందిన పద్మకి నేను నేస్తాన్ని అని ఇక్కడ అందరికీ ఎలుగెత్తి చెప్పా. ఇప్పుడు నాతోపాటు నా కొలీగ్స్ కూడా నీ విసనకర్రలైపోయారు/ఫాన్స్ వర్షాకాలం వద్దనకు :)
ReplyDeleteఅందమైన భావమాలిక అని ఈ కవితకి నా కాంప్లిమెంట్
మరీ నేస్తాన్ని అంతలా పొగిడేయకు.......సర్వకాలసర్వావస్తలలో విసనకర్రలు/ఫాన్స్ కావాలనే కోరుకుంటాను :-) కాంప్లిమెంట్ కి థ్యాంక్యూ
Deleteఅందరూ అభిమానులే మీ కవితలకి....అభినందనలు
ReplyDeleteఈ అదృష్టాన్ని సదా ఆకాంక్షిస్తూ......మీ అభిమానాన్ని కోరుతూ, అభివందనం.
Deleteప్రేమ మొదట కలిగీకలగనట్లు,తెలిసీతెలియనట్లు కూకుండనీదమ్మ కూసింతసేపు!పొడిపొడిమాటల్లో ప్రేమ ఇమడదు,గుండెతడిలో తడిసిన మాటలు కావాలి,చెమర్చిన పదాలు కావాలి,కదిలే అక్షరాలు కావాలి!అందుకే మనసులో నానిన పదబంధాలన్నీ తెల్లకాగితం పయికెక్కవు!కవి తపన,జిజ్ణాస,పిపాస ఒక తీరని దాహం!........వెల ఎంతో? -లో పద్మార్పిత ఎదలోని భావాలు ప్రేమార్పితంగా రసార్ద్రంగా ఉన్నాయి!
ReplyDeleteప్రేమతత్వాన్ని భలే చెప్పారు, కవితారాటం కూడా మేళవించి......మీ అభిమానాత్మక స్పందనకు నెనర్లండి.
Deleteఒకోసారి కుళ్ళుగా, మరోసారి మనసంతా భారంగా, అప్పుడప్పుడూ ఆశ్చర్యంగా, ఎప్పుడూ మీపై అభిమానంగా ఉంటుంది. ఇదేదో రోగం అనుకోకండి. మీ భావావేశపు కవితల్ని చదువుతుంటే నాలో కలిగే ఫీల్:-)
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteరోగం మంచిదైతే మహానందం ( మరక మంచిదైతే స్టైల్ లో).....ఈ అభిమానపు రోగం నాపై ఎల్లకాలం ఉండాలని దీనికి మందు దొరక్కూడదని కోరుకుంటున్నాను లిపి :-)
DeleteWow :-)) super padmarpita gaaru, Premaki vela kattalemu.. adi aksharala nijam... nice:-))
ReplyDeleteThank you very much.
Deleteఏమని రాయాలో తెలీక నిన్నటి నుంచి చదువుతూ ఉండిపోయాను. ఎంత చక్కని భావం...no words to express my feeling.
ReplyDeleteThank Q...Anoo
Deleteపద్మా....నీవు అర్పించే ప్రేమకుసుమాలకి అభిమానులు ఎందరో, ఇలా అల్లుకుపోనీ నీ కవితామాలని...అభినందనలు!
ReplyDeleteధన్యవాదాలండి.
Deleteప్రేమభావోధ్రేకాల అల.....మీ ఈ కవిత వెల:-)
ReplyDeleteవిలువైన వ్యాఖ్యకు వందనాలు.
Deleteమీ శైలి అందంగా , అద్భుతంగా ఉంటుందండి .. మీ బ్లాగ్ కు వస్తే మనసుకు ప్రశాంతత అనిపిస్తుందండి
ReplyDeleteధన్యవాదాలండి.
Deleteఅందీఅందని అనురాగం
ReplyDeleteప్రేమలోని విరహం ఉంటేనే బాగుంటుంది
మీరు రాయలేను చెప్పలేను అంటూనే బోలెడన్ని రాస్తూ చెప్పేస్తుంటారు.
అంతా మీ అభిమానం :-) ధన్యవాదాలండి.
Deleteవిరహోత్తుంగ తరంగమైన మీ కవిత మనసుకు హత్తుకుంది పద్మార్పిత గారూ.. మీరలా కొంగు నడుముకు చుట్టి నిలుచున్న చిత్రంకూడా నచ్చింది నాకు.. అభినందనలతో..
ReplyDeleteధన్యవాదాలండి.
Delete" నా రెండునయనాలలోని సాగరఘోషను లిఖించాను "
ReplyDeleteఇంత తక్కువ చక్కని పదాల కూర్పుతో ఎంత ఎక్కువ భావాన్ని అందించారండి !!!
అధ్బుతం !