అంతరంగం

అందమైన కల్లబొల్లి కబుర్లు చెప్పడం
ప్రేమించి యుగళగీతాలు పాడుకోవడం
ఆకాశపంచులుదాటి మిద్దెలు వేయడం
లేననురాగాన్ని రంగుటద్దంలో చూపడం
నాకు చేతకాదు వీటిని అలాగ చేయడం!

నా అంతరంగం నేనే అల్లుకున్న పర్ణశాల
అంతఃపుర అంతర్ముఖంలేని ఆనందహేల
ఆవేశాందోళనలకి అర్థం తెలియని పసిబాల
ఆనందాల అల్లిక నా మనోరంగ నర్తనశాల
శోధనంటూ చేయకు దాన్నొక ప్రయోగశాల!

ప్రేమాక్షరాలునేర్పే నెపంతో అక్షరాభ్యాసమని
ఆర్ద్రమిళిత వాలుచూపు చూసది ఆకర్షణనని
మన్మధుడి వలపుబాణమేసి మదిని దోచానని
శూలమంటి చూపుతో నాగుండెకి గురిపెట్టానని
ఆంతర్యమెరుగక అంబరాన్నంటకు సంబరమని!

38 comments:

 1. ఎంత అందమైన అంతరంగమండి మీది....అద్భుతంగా రాసారు.

  ReplyDelete
  Replies
  1. ఆస్వాధించి అభినందించిన మీకు నమస్సులు.

   Delete
 2. అందమైన అందానికి రంగులు అక్కర లేదు చక్కని భావ్వాన్ని ఒలికించారు

  ReplyDelete
  Replies
  1. చాన్నాళ్ళకి......థ్యాంక్యూ!

   Delete
 3. Anonymous08 June, 2013

  extraordinary beautiful feel in your poetry & pict.

  ReplyDelete
 4. అంత రంగం ఎపుడూ అనంత రంగమే!
  మీదైన కవితా శైలిలో ఎప్పటిలా అద్భ్తంగానే ఆవిష్కరించారు.
  బొమ్మా అద్భుతమే!
  పెన్సిలా, చార్కోలా?

  ReplyDelete
  Replies
  1. మీ ప్రశంసాత్మక స్పందనకు ధన్యవాదాలండి. పెన్సిల్ స్కెచ్ అండి.

   Delete
 5. Anonymous08 June, 2013

  మీరు పదిలముగా అల్లుకున్న పర్ణశాలలోకి ,అంతపుర అంతర్ముఖత్వములోకి,మనోరంగ నర్తనశాలలోకి,ప్రవేశించినా ఆంతర్యపు అంతుచిక్కదు!మీ రేఖాచిత్రాలు మురిపిస్తున్నాయి!మీ మనస్సుకార్మిక ప్రయోగశాలలో మరెన్నో సుతిమెత్తని కవనవజ్రాలు తయారయి కనువెలుగు,వీనులవిందు కలిగించాలని,మృదులత్వం,వజ్రసదృశ కఠినత్వం ప్రదర్శించాలని,దానిని మీ అభిమానులు దర్శించాలని ఆశిస్తున్నాను!'ఆకాశాపంచులు'బదులుగా 'ఆకాశపుటంచులు'అంటే బాగుంటుందేమోకదా!

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనలో బోలెడన్ని అందమైన పదాలు ఇమిడి ఉండడం నా అదృష్టమండి. సదా మీ ఈ స్పందలని, సలహాలని కోరుతూ.....నమోఃవందనం. ( ఆకాశపుటంచులు అని మీరన్నట్లు పెడితే అతికినట్లుందండి, కానీ కూసింత అందంగా పైనుండి క్రిందికి పెంచుకుంటూ రావాలని అలా.....ఎంతైనా అమ్మాయి అంతరంగం అందానికి ప్రాముఖ్యతనిస్తుందని అర్థంచేసుకుంటారని ఆశిస్తూ)

   Delete
 6. "నా అంతరంగం నేనే అల్లుకున్న పర్ణశాల
  అంతఃపుర అంతర్ముఖంలేని ఆనందహేల
  ఆవేశాందోళనలకి అర్థం తెలియని పసిబాల
  ఆనందాల అల్లిక నా మనోరంగ నర్తనశాల
  శోధనంటూ చేయకు దాన్నొక ప్రయోగశాల"
  This shows your attitude and self confidence.Know one can beat out this. Keep it up mam.

  ReplyDelete
  Replies
  1. Thank you Aniketh for your lovely comment:-)

   Delete
 7. ఆనందాల అల్లిక నా మనోరంగ నర్తనశాల
  శోధనంటూ చేయకు దాన్నొక ప్రయోగశాల!

  శూలమంటి చూపుతో నాగుండెకి గురిపెట్టానని
  ఆంతర్యమెరుగక అంబరాన్నంటకు సంబరమని!

  మీ అంతరంగ ఆవిష్కరణ చాలా శక్తివంతంగా దృఢంగా బాగుంది పద్మార్పితగారు. చిత్రం కూడా ధీటుగా వుంది. అభినందనలతో..

  ReplyDelete
  Replies
  1. అంతరంగం ధృఢంగా ఉంటేనే ఆత్మవిశ్వాసం పెరిగి ఆశయాలని అందుకోగలమని గట్టిగా నమ్ముతానండి. అదే ఇలా నా అంతరంగాన్ని ఆవిష్కరించడానికి ప్రేరణైంది. మీ అభినందలని సదా అకాంక్షిస్తూ......

   Delete
 8. అద్భుతంగా ఉంది ..... విన్నపం , హెచ్చరిక మిళితంగా ఈ ఆవిష్కరణ ఉంది

  ReplyDelete
  Replies
  1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండి అలి గారు!

   Delete
 9. ప్రేమగా చర్నాకోల్ తో కొట్టి జోలపాడుతూ లేపనం పూస్తారు పద్మార్పితగారు మీరు....గ్రేట్ టాలెంట్!

  ReplyDelete
  Replies
  1. గ్రేట్ టాలెంట్ అంటే తిట్టినట్లో కొట్టినట్లో :-) ఏమైనా ఇలా ఎప్పుడూ అభిమానాన్ని అందించే మీకు నెనర్లండి.

   Delete
 10. Anonymous09 June, 2013

  చిత్రం బాగుంది . చిత్రమేమిటంటే , కొన్ని చోట్ల నీ సహజసిధ్ధమైన మార్కు కనపడలేదు . దానివలన అందం వికటించినట్లుగా ఉన్నది . నేను అది ఎక్కడో పట్టి చూపించటం లేదు . ఒకటికి నాలుగు మార్లు చూసుకుంటే నీకే బోధపడ్తుంది .

  ReplyDelete
  Replies
  1. చిత్రం మెచ్చి స్పందించిన మీకు ధన్యవాదాలండి. సహజసిధ్ధమైనవి అన్ని వేళలా కనిపించాలంటే కష్టమండి, కొన్నిసార్లు కనబడకపోయినా అంతర్గతంగా ఎక్కడో దాగే ఉంటుందనుకుంటాను అనానిమస్ గారు. నా అంతరంగ భావావిష్కరణలో కావాలని పట్టి దాచినవేవి లేవనే నేననుకుంటున్నాను. ఐదుకి పదిసార్లు చదివినా బోధపడని మందబుధ్ధేమో మరి నాది.....బోధిస్తే బాగుంటునది మనవి!

   Delete
 11. కాస్త కంఫ్యూజ్ గా కటువుగా ఉన్నా మీ అంతరంగాన్ని మీదైనతీరులో చెప్పారు.

  ReplyDelete
  Replies
  1. కంప్యూజ్ అంటే సర్దుకుంటాను కానీ కటువుగా ఏం చెప్పానో తెలియడంలేదు తెలుగమ్మాయిగారు!

   Delete
 12. Last Paragraph confusega vundi...migata anta..mee saililo vunna...eakkado chinna lotu...chivari paralone antara...padma gaaru...???

  ReplyDelete
  Replies
  1. నాకు తెలిసినంత వరకు క్లారిటీగానే చెప్పాననుకుంటున్నాను. ఇంక లోటుపాట్లు ఏవీ లేకుండా వ్రాయడం అంటారా మహామహులకే సాధ్యంకాదు.
   "నేనెంత.........కవితాసామ్రాజ్యపు కొలనులో అరవిరియని ఒక కలువరేకుని"
   మీ సందేహ నివృత్తితో నేను మున్ముందు నా వ్రాతలకి మెరుగులుదిద్దుకో ప్రయత్నిస్తాను. మీ స్పందనకు థ్యాంక్సండి!

   Delete
 13. Anonymous11 June, 2013

  అర్పితగారి కవితల పదును బహుపసందు
  కామెంట్లకి ఇచ్చే సమాధానం మహాపసందు
  చదివే మాబోటివారికి విద్య మరియు విందు

  ReplyDelete
  Replies
  1. ఆస్వాధించే మనసున్న మీ పేరు తెలిస్తే నా దిల్ పసందు
   మీ పేరుతో పాటు వ్యాఖ్యలిడండి ఇకముందు. :-)

   Delete
 14. Mee antaramgam andari hrudayalanu gelupomdu

  ReplyDelete
 15. Welcome to my blog & thanks for compliments. :-)

  ReplyDelete
 16. Replies
  1. మీ స్పందనా హృదయానికి అభివందనాలు.

   Delete
 17. బాగుంది. చాలా కాలమయ్యింది... బ్లాగును పలకరించి అనుకుంటూ తీసిన ప్రతీసారీ ఎక్కడో ఒకచోట చిక్కటిపదార్ధాల కూర్పుతో వాక్యాలు దొర్లిపోతూ వుంటాయి. చదువుకూంటూ సాగిపోయేందుకు వీలుగా... తెలియకుండానే కూరుకుపోయేటంత గాఢంగా...

  ReplyDelete
  Replies
  1. ఏదో యాధాలాపంగా వచ్చిన మిమ్మల్ని అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడూ బ్లాగ్ కి విచ్చేసేలా :-)..... చిక్కని చక్కటి పదాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తానండి. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండి.

   Delete
 18. Anonymous12 June, 2013

  nijame srujanagaru meerannatlu madam mastu talented:)

  ReplyDelete
  Replies
  1. Compliment ayitea :-) kaadannaa :-)

   Delete