ఆదర్శాలు ధృడమైనవైతే ఆశయాలు నెరవేరతాయంటూ
అనుకున్నది సాధించేవరకు కంటిపై కునుకురానీయకంటూ
అలసటనక ఆలోచించి అడుగేస్తే అంబరానైనా తాకొచ్చంటూ
అన్నిసూత్రాలు వివరించి, నెరవేరకపోతే విధిరాతంటారెందుకు?
ఆవేశం పొంగి ఆవేదన రగిలి ఆశయమార్గాన్ని వెతుక్కుంటూ
ఆకాంక్షతో ఆశగా సాగి అందుకో లేకపోతే మదనపడకంటూ
అంతలా అత్యాశ పడడం అవివేకమని ఆనకట్ట వేయమంటూ
అందని చందమామపై ఆశవలదంటూ వెనక్కి లాగేస్తారెందుకు?
ఆచరించడానికి కాదు ఆదర్శాలు వల్లించడానికే అనుకుంటూ
ఆశయమంటూలేక అధోగతిగా జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ
అడుగులో అడుగేస్తూ శూన్యం వైపుకి నిర్జీవిగా కుంటుకుంటూ
అలా జీవఛ్ఛవంలా జీవించాలనుకుంటే ఇన్ని ఆలోచనలెందుకు?
అనుకున్నది సాధించేవరకు కంటిపై కునుకురానీయకంటూ
అలసటనక ఆలోచించి అడుగేస్తే అంబరానైనా తాకొచ్చంటూ
అన్నిసూత్రాలు వివరించి, నెరవేరకపోతే విధిరాతంటారెందుకు?
ఆవేశం పొంగి ఆవేదన రగిలి ఆశయమార్గాన్ని వెతుక్కుంటూ
ఆకాంక్షతో ఆశగా సాగి అందుకో లేకపోతే మదనపడకంటూ
అంతలా అత్యాశ పడడం అవివేకమని ఆనకట్ట వేయమంటూ
అందని చందమామపై ఆశవలదంటూ వెనక్కి లాగేస్తారెందుకు?
ఆచరించడానికి కాదు ఆదర్శాలు వల్లించడానికే అనుకుంటూ
ఆశయమంటూలేక అధోగతిగా జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ
అడుగులో అడుగేస్తూ శూన్యం వైపుకి నిర్జీవిగా కుంటుకుంటూ
అలా జీవఛ్ఛవంలా జీవించాలనుకుంటే ఇన్ని ఆలోచనలెందుకు?
నాకు కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా మనం అనుకున్నది సాధించనప్పుడు సర్దుకుపొమ్మని సలహా ఇచ్చి నిరుత్సాహపరుస్తుంటే.
ReplyDeleteచక్కగా చెప్పారు.......కుడోస్ పద్మార్పిత
సాధ్యమైనంతవరకు సాధించి గెలవడానికే ప్రయత్నించాలి అనేది నా అభిమతం....బహుశా ఇది కొందరికి విపరీత ధోరణిగా అనిపించవచ్చు.
Deleteమీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
అనుకున్నది సాధించాలనే తపన వున్నపుడు ఓడిపోతున్నా చివరంటా ప్రయత్నించడమే జీవితం కదా పద్మ గారూ..
ReplyDeleteసర్దుకు పోవడం కొన్ని సార్లు అవసరమే అనుకుంటా సాధారణ జీవితంలో. లేకపోతే కలిగే విపరిణామాలు వేరుకదా.. అలా అని వ్యక్తిత్వాన్ని కోల్పోయేగా వుండకూడదు. బేలన్స్ చేసుకోవాలి మనకు మనమే.
సాధించాలన్న తపనలో పడిలేస్తూ చేసే ప్రయత్నానికి కాస్త ఊతమందిస్తే బాగుంటుంది కానీ నిరుత్సాహపరిచే ప్రేలాపనలెందుకని నా భావమండి.
Deleteఅలా సర్దుకుపోవాలి అన్నప్పుడు, వాటిని కూడా సూక్తులతో పాటు నూరిపోస్తే ఇలా కాకపోతే అలా అని భావమైనా కలుగుతుందేమోనండి....గెలిచినప్పుడు ఒకలాగా ఓడిపోతే " అందని పళ్ళు పుల్లన" అనే ధోరణిలో బ్రతకమనడం ఎంతవరుకూ సమంజసం చెప్పండి.
మీ స్పందనకు సలహాకు అభివందనాలండి.
Superb padma you are very sensible and practical in thoughts and feelings. Keep rocking my dear friend.
ReplyDeleteThanks for understanding my feelings & thoughts.
Deleteమీ ఈ కవనం లో వచనత్వం పెరిగినట్లనిపించింది ఎందుకోనాకు!
ReplyDeleteఇక్కడ నా భావాన్ని అర్థమైయ్యేలా చెప్పాలనుకున్నానే కాని అది కవనమో వచనమో అని పట్టించుకోలేదని మనవి. మీ స్పందనకు నెనర్లు!
Deleteఅ ఆ లతో మీ కవితలోని ప్రతి పంక్తీ ఆకట్టుకుంది.
ReplyDeleteజీవితమే ఒక పోరాటం! ఒక్కొకసారి పోరాడి ఓడినా గెలిచినదానికన్నా ఎక్కువే సంతృప్తి కలుగుతుంది. అందుకే ఎవరెలా అన్నా ఎదురోడి వెళ్ళక తప్పదేమో!
బొమ్మా విభిన్నంగానే ఉంది.
మీరన్నది నిజం..... మీ అభిమాన ఆప్యాయతా స్పందనకు అభివందనములు.
Deleteపద్మార్పితగారు,
ReplyDeleteమీ కవిత, మీ ప్రశ్నలు, మీ ఆలోచనలు చాలా బాగున్నాయండి!
నేను మీ బ్లాగు చూడటం ఇదే మొదటిసారి. మీ పాత పోస్టులు కూడా చదవటం మొదలుపెడతాను. :-)
నా బ్లాగ్ కు స్వాగతం....మీకు నా కవిత నచ్చినందుకు నెనర్లు. మిగిలనవి కూడా చదివేయండి!
Deletejivaschavamainaa aalochanaku vadalau chaalaa baavundi mi kavita
ReplyDeletechala bagundi, natural life ki chaala daggaraga anipinchindi...
ReplyDeletethank you Sruti
Deletemeeru prashninchadam enduku? ans elago ready ga untundi meefaggara adento selaviste chafivi telusukuntam.
ReplyDeleteనేనే ప్రశ్నించుకుని జవాబు నేనే చెప్పుకుంటే బాగుండదు....మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తే సంతోషమండి.
DeleteUr right Padmarpita. Life is a compromise but to some extent only. We must live as we wish n only those who has strength...
ReplyDeleteYes I too agree with you Anoo.....thanks for your comment.
Deleteఎవ్వరు ఎన్ని చెప్పినా అనుకున్నది సాధించాలనుకుని వీరోత్సాహంగా పోరాడి అన్నీ సాధించొచ్చు అనుకుంటూ....ఏమీ సాధించకుండా సర్దుకుపోతుంటాను నిస్సహాయంగా ;-(. మంచి పోస్ట్, అభినందనలు పద్మా....ఆలోచించడమే కాని ఆచరించలేను.
ReplyDeleteసృజనగారు నా మట్టుకు నేను.....చివరివరుకూ సాధించాలి అన్న పట్టుదలతోనే కృషిచేస్తాను. ఒకవేళ కాకపోతే మరో మార్గంలో సాధించడానికి ప్రయత్నిస్తానే కాని ఓటమిని ఒప్పుకుని సర్దుకుపోవడానికి నా మనసెందుకో అంగీకరించదండి. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
DeleteBahu chakkaga Vipulanga Chepparu Padmarpita gaaru.. Meeloni Kavita Sahrudayataku darpanam ee kavita. Manam edaina cheyyadaaniki mundu anta positive gaane teeskuntaam.. teera edo vignam vachchipoorti kaakapote enduku vidhini antaam anna bhaavana nijanga aalochimpajese vishayame. Nenu mee anta kaakapoina O Chinna Kavini (Lokulu Alaa antaaru) Veelunte http://kaavyaanjali.blogspot.in/ choodandi.
ReplyDeleteWelcome to my Blog...Bukya Sridhar garu.మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండి.
Deleteమీ బ్లాగ్ చూసాను అన్నీ పూర్తిగా చదవలేదండి. చదివిన కొన్నింటిలో చక్కని భావాన్ని అందంగా చెప్పారు. సమయం చూసుకుని చదివి వ్యాఖ్యలిడతాను.
ఎవరికోసం ఏదో అంటారని మనం అనుకున్నవి చేయలేకపోతే నిరుత్సాయపడం ఎందుకండి. సాధించాలి అనుకున్నప్పుడు ఎవరు చెప్పినా పట్టించుకోకుండా సాగిపోవడమె. సత్తువలేనివారు నిరాశ చెందాలి కానీ మీకేం పద్మార్పితగారు..... Evergreen dynamic with enthusiasm personality you are :)
ReplyDeleteOh, your words are inspiring me thank Q!
Delete100% right..
DeleteYes, she is always great & I feel proud to be her friend.
Deleteనచ్చింది,
ReplyDeleteచాలా బాగా రాసారండీ!!
థ్యాంక్యూ....
Deletepadmarpita gaaru,
ReplyDeleteBagunddhi !
"ఆదర్శాలు ధృడమైనవైతే ఆశయాలు నెరవేరతాయంటూ
అనుకున్నది సాధించేవరకు కంటిపై కునుకురానీయకంటూ
అలసటనక ఆలోచించి అడుగేస్తే అంబరానైనా తాకొచ్చంటూ
అన్నిసూత్రాలు వివరించి, నెరవేరకపోతే విధిరాతంటారెందుకు?"
Evaru ela cheppina sadhrarbhanni batte kadha !
inka lotugaa aalochiste, prayatnm lo lopam vundakudadhani aa cheppatam
adukovataniki aina prayatanam avasarm alage andaledani nirasha padinnapudu ala cheppatam kuda malli kotta prayatanam cheyamane.
మీ స్పందనాస్పూర్తి వాఖ్యాలకి ధన్యవాదాలండి. మీరు చెప్పినా విన్నుతన కొత్తకోణంలో ఆలోచిస్తే కొన్నింటికి మంచి పరిష్కారమే దొరుకుతుందనిపిస్తుంది.
Deleteపద్మా ,
ReplyDelete" అన్నిసూత్రాలు వివరించి, నెరవేరకపోతే విధిరాతంటారెందుకు? " అన్న వాక్యంలో ఈ క్రింది అంతరార్ధం ఇమిడి వున్నది .
నెరవేరినప్పుడు తన ఘనత అంటానికే అలా అంటూంటారు .
అత్యాశ ని చందమామ తో చక్కగా వివరించటం చాలా బాగుంది .
ఇలా జీవించటమెందుకో అన్నదానికి ఇంకోలా జివించలేనందుకే .
అందమైన సమాధానాలిచ్చి...మొత్తానికి సర్దుకుపొమ్మని చల్లగా చెప్పారు శర్మగారు :-) ఎంతైనా అనుభవజ్ఞులు........ధన్యవాదములు.
Deleteఆకాంక్షతో ఆశగా సాగి అందుకో లేకపోతే మదనపడకంటూ
ReplyDeleteఅంతలా అత్యాశ పడడం అవివేకమని ఆనకట్ట వేయమంటూ
అందని చందమామపై ఆశవలదంటూ వెనక్కి లాగేస్తారెందుకు? Hart Touching words
నచ్చి కమెంటిన మీకు నెనర్లండి.
Deleteమీ పోస్ట్ ఒక్కోటి ఒక్కో విధంగా ఆలోచనాత్మకంగా స్పూర్తినిస్తుంటాయి.....అందుకేనేమో అందరికి అభిమానం.:-)
ReplyDeleteతెలుగమ్మాయి పొగుడుతుంటే తబ్బిబ్బిపోతున్నా :-) థ్యాంక్యూ వెరీమచ్
DeleteVery insightful root of thoughts..కలని అల గా చూపించే పదాలు మీ వాక్యాల్లో కనిపిస్తాయి.. Tnq fr such a wonderful post...)
ReplyDeleteThanks a lot for your affectionate & inspiring comments.
Deleteకష్టపడి సాధించండి అని అంటే మీకే ఎన్నైనా చెప్తారు మోసేవాడికి తెలుస్తుంది బరువు అంటారు. అందుకే అటు కర్ర విరక్కుండా ఇటు పాము చావకుండా అనే ధోరణిలో ఇలా సర్దుకుపొండి అంటాం.. అది కూడా తప్పు అంటే ఎలా పద్మ :)
ReplyDeleteఉన్నదేదో నిర్మొహమాటంగా చెప్తే సరిచేసుకుంటాం అంతేకాని ఈ గోడమీద పిల్లివాటమెందుకండి :-) మీ స్పందనకు ధన్యవాదాలండి.
Deleteబాగుందండి .... ఎందుకో తెలియదు కాని జలపాతం ఘనీభవించినట్టు . అలలు నిశ్చలనమైనట్టు అనిపిస్తుంది .. మీరు సరదాగా సాగిపోయే ఒక సమీరంలా ఉంటేనే ఆహ్లాదంగా అనిపిస్తుంది ..( ఎప్పుడు ఒకేలా రాస్తే ఎలా అనకండి )..
ReplyDeleteసాగిపోయే సమీరానికి కూడా అప్పుడప్పుడూ అడ్డుకునే అవరోధాలే ఆటవిడుపులండి :-) మీ అభిమానానికి నెనర్లండి.
Delete