ముగ్గురు మిత్రుల కధ...

అనగనగా ముగ్గురు మిత్రులు
జ్ఞానం, ధనం, నమ్మకం వాళ్ళు
ముగ్గురూ భలేమంచి మిత్రులు
ఒకరికై ఒకరు ప్రాణమిచ్చేవాళ్ళు..

కాలం కలిసిరాక విడిపోతూ వారు
ప్రశ్నించుకున్నారు ఒకరితో ఒకరు
కలయికెప్పుడంటూ కార్చి కన్నీరు
విడలేమంటూ పెనవేసుకున్నారు..

జ్ఞానం విద్య, గుళ్ళలో నివాసమంది
మేడలు మిద్దెలు నావని ధనమంది
నమ్మకం కిమ్మనకుండా కూర్చుంది
జవాబుగా కిలకిలా నవ్వి ఇలాగంది..

జ్ఞానం, ధనం కోరితే దొరుకుతారు..
నమ్మకం పోతే మరల తిరిగిరానంది!

నమ్మకాన్ని పెంచే స్నేహం చేసేద్దాం
రోజూ "ఫ్రెండ్ షిప్ డే" చెప్పుకుందాం!!

21 comments:

  1. నమ్మకాన్ని మించిన ధనంలేదు అదే ధైర్య లక్ష్మి, స్నేహితులరోజు శుభకామనలు..

    ReplyDelete
  2. సదా మీ ఆజ్ఞకు బద్దుడను స్నేహమయి, Wish you happy friendship day not only today everyday.

    ReplyDelete
  3. Excellent!!! Trust...'TRUST' always...

    ReplyDelete
  4. Excellent!! Trust....'TRUST' always...

    ReplyDelete
  5. ఔను స్నేహానికి నమ్మకమే అసలు సిసలైన పునాది. మీ స్నేహం లో అది నేను పుష్కలంగా ఉన్నట్టు గమనించాను. మీతో స్నేహం ఎల్లప్పుడూ ఉండాలని ఈ స్నేహితుల దినోస్తావం నాడు కోరుకుంటూ, Happy Friendship Day Padmagaaru. Trust should never be breached under any circumstances. Trust is the life bond in friendship.

    ReplyDelete
  6. జ్ఞానం విద్య, గుళ్ళలో నివాసమంది
    మేడలు మిద్దెలు నావని ధనమంది
    నమ్మకం పోతే మరల తిరిగిరానంది!

    చాలా చాలా బాగుంది , బహు చక్కగా సెలవిచ్చావు .
    చిన్న కరెక్షన్
    కార్చి కన్నీరు కాదు కార్చె కన్నీరు , యిష్టమైతే కరెక్ట్ చేసుకో పద్మ .

    చిత్రంలో జ్ఞానంఏది , ధనమేది , నమ్మకమేది అన్నది ప్రశ్నార్ధకమైంది నాకు . ధనాన్ని మాత్రం ఎఱుపు రంగు అనుకుంటున్నా . ఎందుకంటే ఆకర్షిస్తూ రక్తాన్ని చిందిస్తుంటుంది కదా !
    జ్ఞానాన్ని తెలుపులో , నమ్మకాన్ని ఇంకేదైనా రంగులో వేస్తే బాగుంటుందేమో అంపించింది . నువ్వు ఎంచుకున్న సబ్జెక్ట్ అలాంటిది కదా!.
    నీకివె నా స్నేహపూర్వక కుసుమాలు .

    ReplyDelete
  7. prati dinam snehamayam kaavaalani korukuntu..
    happy friendship day Padmarpitagaru..

    ReplyDelete
  8. చాల చక్కగా చెప్పారు పద్మగారు. మన నుంచి ఎప్పుడూ వెళ్లిపోనిది, మన నమ్మకాన్ని ఎప్పుడూ వొమ్ముచేయనిదే నిజమైన స్నేహం.
    స్నేహదినోత్సవ శుభాకాంక్షలండి పద్మగారు.

    ReplyDelete
  9. చక్కని కధతో సందేశాన్ని అందించిన నేస్తానికి మిత్రోత్సవదిన అభినందనలు.

    ReplyDelete
  10. కథ గా కవితలో చెప్పి "నమ్మకానికి" వన్నె తెచ్చారు. రంగుల్లోనూ మరింత వన్నెలద్దారు.
    నిజమైన స్నేహానికి "నమ్మకమే" గట్టి పునాది.
    స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete
  11. Sorry to say this.....not upto ur standard.....not sure why people so excited.....

    ReplyDelete
  12. Sairam...thanks for your frank expression.In this little bit message I want to share with my friends on Friendship day occasion.:-)

    ReplyDelete
  13. Thanks to all for their love & affection.

    ReplyDelete
  14. చక్కటి విషయాన్ని చిక్కగా వ్యక్తీకరించారు. అభినందనలు !!
    అన్నట్టు, మంచీచెడుల విచక్షణను బేరీజు వేయగలిగిన వివేకం (జ్ఞానం) కల్గినవారి మధ్య నమ్మకం సడలే ప్రసక్తే ఉండదనుకుంటా. నిజమైన వివేకవంతులే పదవీ, కీర్తి, ధన వ్యామోహాలపై, వాటి విషఫలాలపై కూడా నియంత్రణ సాధించగలరనుకుంటా. మానవీయతను పెంచే, మానవాళి పురోగమననానికి సహకరించే విజ్ఞత సాధించడం అతి ముఖ్యమేమో. ఏ విషయంలోనైనా, ఎవరి మధ్యనైనా... ఉట్టినే నమ్మకం ఏర్పడడం, అది కొనసాగడం అన్నవి కూడా అసాధ్యమేమో. ఆలోచించండి. మనిషిని మనీషిగా మార్చగలిగే జ్ఞానానికి పెద్దపీట వేయగలరని మనవి :-)
    Anyways, belated friendship day wishes to all here. Thanx a lot !!!

    ReplyDelete
  15. nice happy friendship day padmarpita gaaru:-))

    ReplyDelete
  16. ప్రతిరోజు స్నేహితుల రోజే కదా.....అయినా ఈ ప్రత్యేకమైన రోజులు అవసరమా అన్నారని ఆలస్యంగా వచ్చాను అర్పితా :-)

    ReplyDelete
  17. అవును ..నమ్మకం లేకపొతే స్నేహం ఎక్కడుంది..స్నేహమేరా జీవితం ..స్నేహమే కదా శాశ్వతం ..

    ReplyDelete
  18. జ్ఞానం, ధనం కోరితే దొరుకుతారు..
    నమ్మకం పోతే మరల తిరిగిరానంది!

    నమ్మకాన్ని పెంచే స్నేహం చేసేద్దాం
    రోజూ "ఫ్రెండ్ షిప్ డే" చెప్పుకుందాం!!Nice chala bagundi padma garu

    ReplyDelete
  19. జ్ఞానం, ధనం కోరితే దొరుకుతారు..
    నమ్మకం పోతే మరల తిరిగిరానంది!

    నమ్మకాన్ని పెంచే స్నేహం చేసేద్దాం
    రోజూ "ఫ్రెండ్ షిప్ డే" చెప్పుకుందాం!!Nice chala bagundi padma garu

    ReplyDelete