అనుకుంటున్నా!

జ్ఞాపకపుస్తక పుటల్ని తిప్పుతూ అనుకున్నా
గడిచిన కాలాన్ని తిప్పగలిగితే ఎంతబాగుండ్నో
కలల ఆశలు అలగా వచ్చిపోతుంటే మేల్కున్నా
జీవితంలో నిజమై నెరవేరితే ఇంకెంత బాగుండ్నో
ఏదోకటి ఆశించి ఆదరించే వారిని చూసనుకున్నా
ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటే ఎంతబాగుండ్నో
మాటలతో మనసు విరిచి మజాచేసే వారితో అన్నా
విరిగిన మనసు అతగడం నేర్చుకో ఎంత మజాగుండ్నో
మనకోసం ఎదుటివారిని భాధించకూడదని నాతో నేనన్నా
చచ్చికూడా నలుగురి మనసులో బ్రతికుంటే ఎంతబాగుండ్నో

అనుకుంటే పరిష్కారమయ్యేవి కావని సహాయం కోరుతున్నా
ఎవరోకరు ఏదోకటి ఆచరిస్తే ఎంతబాగుండ్నో...అనుకుంటున్నా!

45 comments:

  1. అనుకోగలమే కానీ ఆచరించడమంటేనే కష్టం:)

    ReplyDelete
    Replies
    1. అలా కష్టం అనుకుంటే ఏం సాధించలేం. :-)

      Delete
  2. గడచిన కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే ఇంకేముంది మనమంతా అమాంతం మళ్ళీ పసిపిల్లలమైపోమూ పద్మార్పితగారూ!!!!

    ReplyDelete
    Replies
    1. అలా పసిపిల్లలమై కేరింతలు కొడితే ఇంకెంతబాగుంటుందోకదండి :-) థ్యాంక్యూ

      Delete
  3. ఊహాలొకమున ఏమున్నది గడిచిన కాలే జ్నపకాలు తప్పా,
    ఎంతగా ఉబలాటపడినా గొరంత మార్చలేమూ,
    నిండు మనసు లొ ప్రేమపు చమురుతొ జనకొటీ హృదయాల్లొ ఆశాజ్యొతి వెలిగింపజూడూ, నీ లొకం నీకే కొత్తగా అనిపించును

    ఆ చిత్తరూపులేని, చలించనీ మూగభావాలు ఎప్పటికీ మారవు, మార్పునకు నీవే నాంది పలుకు,
    ఎంతో నిష్టతొ తప్ప పొందలెని ఈ మానవ జన్మని సార్థకం చెసే మానవత్వం మిళితం సేయు,
    కరిగిపొయిన ఆ కలలే అలలా పారి, నిన్ను మరల తాకలెవు వ్యర్థ ప్రయాసా

    కంటినిండుగ కన్నిళ్ళతొ మనసునిండుగ బాధటొ జీవిస్తె జీవింపజాలదు,
    మనిషనేవాడి జన్మ మంచి చెయ్యడానికే అన్నా హితము తెలుసుకొనినా, ఆ పీడకలలు కల్లలయ్యీ, మనసు తెలిక పడి,
    ఉరకలేస్తు నవ్వుతుంది పెదాలపై వికసించె నవ్వు ఇక ఎప్పటికి చెరిగిపొదు

    Nijame Alaa Eppudu Manam Anukunte appudu tippukogalige varam manake unte manam manashulloni uttamulavutaam, devullanta keerthini gadistaam.. Aina mana verri gaani alaantidi ennatiki jaragadu. Mee Aalochana Style Baagundi Padmagaaru..:-)

    ReplyDelete
    Replies
    1. మీ ఊహలన్నీ ఇక్కడ ఇలా వ్యక్తపరచి మాతో పంచుకున్న మీకు అభివందనములు.

      Delete
  4. చాలా బాగుంది. గతకాలం మీద ప్రేమలేనిదెవరికండి. అది మళ్ళీ చేతుల్లోకొస్తేనా....మనిష్టం తీరదా:)

    ReplyDelete
    Replies
    1. జయగారు....బహుకాల దర్శనం.... నిజమేనండోయ్ అలా నెరవేరేదెన్నటికో :-)

      Delete
  5. బాగుందండి

    గడిచిన కాలాన్ని తిప్పగలిగితే ఎంతబాగుండ్నో..
    మా అమ్మే వచ్చేయదా :( అనిపిస్తుంది

    ReplyDelete
  6. ఆహా! చాలా చాలా బాగుంది:-)) సూపర్:-)) యోనాథ్ అన్నట్టు అనుకోగలమే కానీ ఆచరించడమంటేనే కష్టం:

    ReplyDelete
    Replies
    1. శృతి నీవు కూడా అలా అంటే ఎలా:-)

      Delete
  7. మేలిమి ముత్యాలాంటి మీ జ్ఞాపకాలను కవితలనే దారానికి గుచ్చి అందమైన హారాన్ని తయారు చేస్తూ కాలాన్నే వెనక్కి తిప్పినంత పని చేస్తున్నారు మీ కలాన్ని కవితా లోకంలో విహరింపచేసి ఆ లోకాన్ని కనుల ముందు ఆవిష్కరింఛి మీరు ఆచరిస్తూ అందరిలో మార్పును కోరుతూ చక్కటి కవిత రాసిన మీకు అభినందనలు

    ReplyDelete
    Replies
    1. మీ ప్రేరణాత్మక స్పందనకు అభివందనములు.

      Delete
  8. గడచిన కాలాన్ని వెన్నక్కి తిప్పగలిగితే కాలాన్నెపుడూ వెనక్కే నడిపించమా అందరం?
    బావాల్నిలా అందమైన కవితల్లా మలచటంలో కవిత కవితకీ మీ కలం పదునెక్కుతోంది.
    ఈసారి బొమ్మ గూగులమ్మది కాదేమో ;)

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశగారు కళాహృదయం మీది కనిపెట్టేసారు కదా.....
      అంత బాగా చిత్రించలేకపోయాను.....మీ పరిశీలనా ప్రేరణా దృక్పధం నాకెంతో ప్రియం. ధన్యవాదాలండి.

      Delete
  9. బాగుందండీ :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి.

      Delete
  10. Anonymous29 July, 2013

    గడిచిన జ్ఙాపకాలను...తలచుకోవడం నిజంగా బాధాకరమే..వద్దండీ..జరుగుతున్నదే ముఖ్యమనుకుంటే..అదే సంతృప్తినిస్తుంది. Ur right. we need to be remembered by someone after death...
    Take care of the l'l mistakes in typing.

    ReplyDelete
    Replies
    1. జరిగేవన్నీ మంచికని అనుకోవడంలోనే తృప్తి......మీరన్నది రైట్ అను. no need of care , i can understand the feel:-) thank you.

      Delete
  11. భావానికి తగ్గ భాష లేదనే చెప్పాల్సి వస్తుంది . చిత్రం గురించి ఎంత చెప్పినా చాలదు అనిపిస్తోంది . భాష కూడా తోడైతే ఎంతో ఎంతో బాగుంటుందేమో .

    ReplyDelete
    Replies
    1. ఏమో ఎక్కడో లోపం జరిగి ఉంటుంది.....మిమ్మల్ని భాషా పరంగా మెప్పించలేక పోయినా చిత్రంతో సంతోషపెట్టాను కదా అని కాస్త తృప్తి.

      Delete
  12. ఒకోటీ మెల్ల మెల్లగా నిజమైతే ఎంతబాగుండ్నో :-)

    ReplyDelete
    Replies
    1. తప్పక తీరతాయిలే. ;-)

      Delete
  13. Anonymous31 July, 2013

    పద్మా, ఎవరో అధములు అల్పబుధ్ధితో వెకిలిగా అన్నమాటల్ని పట్టించుకుని నిరాశా నిస్పృహలకి లోనయ్యే అబలవి కాదన్న నమ్మకం నీపై. ఎందరికో ధీరోత్తంగా జవాబిచ్చే నిన్ను మేము ఇలా చూడ్డానికి ఇష్టపడం. ఏనుగు నడుస్తుంటే కుక్కలు మొరిగితే అది సన్నాయిమేళంగా అనుకుని సాగిపో.
    సదా నీ నుండి చక్కని రచనలని ఆశిస్తూ, ఆశీర్వధిస్తున్నాను.->Harinath

    ReplyDelete
    Replies
    1. హరినాథ్ గారు.....మీరు వ్యాఖ్యలిడడానికి కలిగించిన అసౌకర్యానికి మన్నించండి. నిజమే మీరన్నట్లు మంచికి గుర్తింపు చెడు ఉన్నప్పుడే......అనుకుంటూనే ఉంటాను మన సంకల్పం మంచిదైతే ఎవరేమన్నా పట్టించుకోరాదని. కాని పిచ్చి మనసు అప్పుడప్పుడూ కలత చెంది కన్నీరిడుతుంది. ఎంతో అభిమానంతో మాట్లాడి మనోధైర్యాన్ని ఇచ్చి స్పంధించిన మీకు నెనర్లండి.

      Delete
  14. జ్ఞాపకపుస్తక పుటల్ని తిప్పుతూ అనుకున్నా...గడిచిన కాలాన్ని తిప్పగలిగితే ఎంతబాగుండ్నో ilA ennO sarlu nEnu anukunnavi endku jaragatamleedu. nenu anukunnaTTuga jarigite bagundu ani enni sarlu anukunnano Meelaaa..chla bagundi

    ReplyDelete
  15. ఎంటో జీవితం అనుకున్నవన్ని జరగవులే .. జరిగేవన్ని అనుకోనివే కదా..

    ReplyDelete
    Replies
    1. అంతేకదండి మరి :-)....థ్యాంక్యూ.

      Delete
  16. మీరనుకున్నవన్నీ జరగాలని ఆశిస్తూ..
    అభినందనలతో...

    ReplyDelete
  17. You can express more, over all its good

    ReplyDelete
    Replies
    1. Thank you.....I will try my level best.

      Delete
  18. చక్కటి కవిత...అభినందనలు!

    ReplyDelete
  19. అనుకున్నామని అన్నీ జరగవు కదండి అర్పితగారు :)

    ReplyDelete
    Replies
    1. అనుకోలేదని ఆగవు కూడా జరిగేవి అనికేత్ :-)

      Delete
  20. దాదాపుగా అందరి మదిలో మెదలే ఆశల్నే చక్కగా కవితాత్మకంగా ఆవిష్కరించారు. కవితలోని ఆకాంక్షలన్నీ కూడా అనుసరణీయమైనవీ, ఆచరించదగినవేనూ. పైగా అవేమీ అసాధ్యమైనవేం కాదు కూడా. మీ అభిమతం, అభిలాష నెరవేరుగాక...! అన్నట్టు, మీ బ్లాగు చాలా అందంగా, ఆహ్లాదంగా ఉంది. ఇదే మొదటిసారి చూడ్డం. ముఖ్యంగా చిత్రాలు చాలా మనోజ్ఞంగా ఉన్నాయి. మీ అభిరుచి చాలా బాగుంది. Its truly aesthetical in all respects. Thank you :)

    ReplyDelete
    Replies
    1. వెల్ కం టు మై బ్లాగ్ నాగరాజ్ గారు. మీ అనుభూతి ఆస్వాధ స్పందనలకు, అభిప్రాయ అశ్వీర్వచనాలకు వందనాలు.Thanks a lot.:-)

      Delete
  21. అనుకున్నవి జరిగితే అది జీవితమే కాదేమో అర్పిత.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి.

      Delete
  22. హృదయం స్పందించాలంటే పద్మార్పిత కవితలు చాలు
    జీవితానికి పరమార్థం తెలిపే నీ స్నేహమే నాకు పదివేలు
    నా హృదయ సవ్వడిని తట్టిలేపిన నేస్తమా నీకు జోహారు.

    ReplyDelete
    Replies
    1. Thanks for understanding and creating an account Mahee, now no more prejudices I hope. Enjoy the life with spicy touch of blogs :-)

      Delete