మసకబారిన అద్దం!!


వద్దు నాకీ రంగులుమారే స్నేహం
అది కలిగిస్తున్న అభధ్రతా భావం!!
బంధాల నడుమ భావాలని మారుస్తూ
ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేమొలకబోస్తూ
ఎందుకీ నటనంటే నేనే ప్రాణమంటూ
బాధ్యతలతో బంధీని అయ్యానంటూ!!

వద్దు నాకీ దాగుడుమూతల అనుబంధం
నలుగురిలో పలకరించాలంటేనే సంకోచం!!
బంధుత్వమా అనడిగితే నీళ్ళు నమిలేస్తూ
స్నేహం కాదంటూ బిత్తరచూపులు చూస్తూ
ఎందుకిలాగంటే నేనో అమాయకురాలినంటూ
ఏకాంతపు బిగికౌగిలిలో సర్వస్వం నేనంటూ!!

వద్దు నాకీ తెగే నూలుపోగుముడుల బంధం
అంతరంగానికి సైతం అర్థంకాని అల్పావేశం!!
అవసరం ఉంది అనుకుంటే అతిగా పొగిడేస్తూ
అయినవాళ్ళందరి నడుమ అలుసుగా చూస్తూ
ఏమిటిదంటే ఎదలో దాచుకునే గాజుబొమ్మనంటూ
ప్రతిబింబాన్నైనా చూపలేని అద్దాన్ని నేనంటూ!!!

58 comments:

 1. వద్దులేండి పద్మ గారు ఇలాంటి బంధం....బాగుంది.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్సండి వత్తాసుపలికి మెచ్చిన మీకు:-)

   Delete
 2. ఇదంతా అనుభవాల సారాంశమా పద్మా?
  painting bagundi

  ReplyDelete
  Replies
  1. జీవితంలో జరిగేవన్నే ఎవరో ఒకరి అనుభవాల సారాంశమే కదండి :-)
   thank you.

   Delete
 3. good one...being straight is the best as always..thanks for a nice poem...may GOD bless you in abundance.

  ReplyDelete
  Replies
  1. Thanks for your compliments and blessings.

   Delete
 4. మసకబారిన అద్దం ( మన స్వంతమైనా ) ఎప్పుడూ బాగుండదు అందామా అనుకున్నా , అర్ధం చేసుకుంటావో లేదో అని సందేహించా .
  ఇక నీ కవిత్వానికొస్తే జీవితం అంటే ఏమిటో చెప్పకనే చ్హెప్పటం చాలా బాగుంది .
  " రంగుల దాగుడుమూతల , నూలుపోగులముడులే నని ."

  ReplyDelete
  Replies
  1. శర్మగారూ....సందేహించకండి ఇకముందు, తెలియకపోతే వివరించడానికి మీరున్నారుగా :-)
   మీ ఆత్మీయస్పందనకు ధన్యవాదలండి.

   Delete
 5. "వద్దు వద్దు ఆంటూనే మానవీయ సంబంధాలు ఎలా ఊంటె బాగుంటాయొ పూసగుచ్చినట్టు చెప్పారు" "గుండెలకు హత్తుకునెలా, ఎంతొ సున్నితంగ చెప్పారు"

  "లొకాన జీవించడం అందరికి, నెర్పెది తల్లిదండ్రులైతే,
  ఎలా మెలగాలొ చెప్పెది సమాజం, ఎలా ఉంటున్నాం అన్నది కాదు,
  నలుగురిలొ ఎలా కలిసి ఉండాలొ తెలియపరిచింది మీ కావ్యం"

  ReplyDelete
  Replies

  1. థ్యాంక్సండి, ఇంతపెద్ద పీఠం వేసారే కానీ...నేను ఇంకా ఆ స్థాయికి ఎదగలేదండి.

   Delete
 6. "మసక బారిన అద్దాన్ని తడిగుడ్డ తొ తుడుస్తె మళ్ళి నిగారిస్తుంది"
  "అనురాగం కరువైన బంధాలలొ ఓ కమ్మని పలకరింపు జీవితానికె వన్నె తెస్తుంది"

  ReplyDelete
  Replies
  1. మీ ఆశాజనకమైన కామెంటు కడుబాగుంది.

   Delete
 7. Anonymous18 July, 2013

  అత్యంత అద్భుతం

  ReplyDelete
 8. బాగుందండీ..
  అన్నట్లు మూడో లైన్లో టైపో సరిచేయాలనుకుంటా.. ఒక్క దీర్ఘం అర్ధాన్ని మార్చేసేట్లుంది :)

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్సండి.... ఎక్కడ సరిచేయాలో అర్థం కాలేదండి!

   Delete
  2. మూడో లైన్ లో "భావలని" అనే పదంలో "వ" కి దీర్ఘం పెట్టాలని వేణు గారు సూచిస్తున్నట్లున్నది. అవును, అక్కడ దీర్ఘం ఉండాలనుకుంటాను. అలాగే, ఆరో లైన్ లో "భా" కి, "ధీ" కి ఒత్తు అక్కరలేదు (కాంపోజిషన్ దిద్దుతున్నట్లుగా చెప్తున్నాడేమిటని విసుక్కోరుగా?).

   Delete
  3. విన్నకోట నరసిమ్హారావుగారు......చాలా చాలా కృతజ్ఞతలు. నేను తప్పులు ఎక్కడా అని పరీక్షించాను కానీ అర్థం కాలేదండి మీరు చెప్పేవరకు. సరిచేస్సాను చూడండి. వందనాలు చెప్పాల్సింది పోయి విసుగెందుకండి!... సరిచేస్తే సంతోషించడంలో ఎప్పుడూ సంకోచించను. సదా మీ స్పందనలని స్ఫూర్తిని కోరుతూ మరో మారు ధన్యవాదాలని తెలియజేస్తున్నాను.

   Delete
 9. మీ మనోభావాలకు మనోఅభివందనం ఇంతకన్నా ఏం రాయడానికి తోచడంలేదండి

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ యోహంత్

   Delete
 10. Bukya Sridhar gaaru annattu వద్దు వద్దు ఆంటూనే మానవీయ సంబంధాలు ఎలా ఊంటె బాగుంటాయొ పూసగుచ్చినట్టు చెప్పారు" "గుండెలకు హత్తుకునెలా, ఎంతొ సున్నితంగ చెప్పారు" nice chaala bagundi.

  ReplyDelete
  Replies
  1. Sruthi....thanks for your affectionate comment.

   Delete
 11. Anonymous18 July, 2013

  పద్మా......అందరు ఒకేలా ఎందుకు ఉంటారనుకుంటావు? నిర్మలంగా స్నేహం చేసేవాళ్ళుకూడా ఉంటారు, పాసిటివ్ కోణంలో నుండి చూసే ప్రయతం చేయి ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అయినా నువ్వు అప్పుడు అర్థంకాలేదు ఇప్పుడు అంతు చిక్కడంలేదు :-)మహీ!

  My friends are here with sending a big flower bouquet to you along with claps for your open mind and boldness.

  ReplyDelete
  Replies
  1. అందరూ ఒకేలా ఉంటారని ఎలా అనుకుంటాను చెప్పండి. మనుషులంటే రోబోల లోకమా ఏంటి! నిజంగా మీరు చెప్పిన స్నేహం చాలా అరుదు. పాసిటివ్ కోణంలో నుండి చూస్తున్నాను కాబట్టే కూసింత నా నీడనైనా చూసుకో గలుగుతున్నానేమో! అయినా నన్ను అర్థం చేసుకు ఏం అవార్డ్ గ్రహిస్తావో అర్థంకావడంలేదు :-)
   Convey my thanks to all your friends.

   Delete
 12. మీరు వద్దనుకుంటున్న ఈ బంధాలు ఈ నవీనకాలపు నగ్న సత్యాలు. అందరూ తెరవెనుక పులులు, తెరముందుకొస్తే పిల్లులే ;-) మీరు నిర్భయంగా వద్దనుకుని నిశ్చింతగా ఉండండి. నా దృస్టిలో ఈ పోస్ట్ తో మరింత ఉన్నతంగా కనిపిస్తున్నారు.

  ReplyDelete
  Replies
  1. మీ అంత బాగుంది మీ ఈ స్పందన. ధన్యవాదాలు.

   Delete
 13. మీ మనస్తత్వాన్ని అందంగా ఆవిష్కరించారు ... అద్భుతంగా ఉంది మీ వ్యక్తిత్వం లాగే ...

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానాక్షరాలకు ధన్యవాదాలు.

   Delete
 14. మనసు అద్దం ముందు నిలబడి ప్రశ్నిస్తుందా అనిపించింది కవిత చదువుతుంటే.
  మీ కవితలు కొన్ని ఆలోచింపజేస్తాయి...

  ReplyDelete
  Replies
  1. ఓష్......ఈ పద్యప్రశ్నకే అలా అనిపిస్తుందా :-) థ్యాంక్యూ!

   Delete
 15. Anonymous18 July, 2013

  స్వేచ్చ్హ!స్వేచ్చ్హ!స్వేచ్చ్హ!....సమాధానం.

  ReplyDelete
  Replies
  1. అలా అనుకోవడం....భ్రమ! భ్రమ! భ్రమ :-)

   Delete
 16. చాల బాగుంది పద్మ గారు . . . . .

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి.

   Delete
 17. దేన్నైనా భరించొచ్చు కానీ 'మన 'అనుకునే మనిషే ఇలా మోసగిస్తూంటే...తెలిసీ తట్టుకోగలమా. మనల్ని మనం ప్రేమించుకుంటూ బతకొచ్చు ఒంటరిగానైనా కానీ....మోసం చేసే మనిషిని క్షణమైనా భరించలేము. తెలిసిన మరుక్షణం, పూర్తిగా... జీవితంలో తిరిగి రానీయకూడదు.

  పచ్చి నిజాలనే చెప్పారు...

  ReplyDelete
  Replies
  1. మీ ఆలోచనల్ని ఇలా పంచుకున్నందుకు ధన్యవాదాలు...అనూ!

   Delete
 18. ఇలా రంగులు మారే స్నేహాలు కోకొల్లలు.....మనచుట్టూ ప్రక్కలా, ఆఫీస్ లో ఎందరో ఈ స్నేహాలకి బానిసలై ఎప్పుడో ఒకప్పుడు బాధపడినవారే. మీలా నిర్భయంగా వద్దు అని కచ్చితంగా చెప్పే ధైర్యం మాత్రం చాలా కొద్దిమందికే ఉంటుందనేది మాత్రం వాస్తవం. మంచి సబ్జెక్ట్ ని ఎంచుకుని రాసి ఆలోచింపచేసే కళాత్మక హృదయానికి అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. మీరిచ్చే ప్రేరణ నాకెప్పుడూ ఆనందదాయకం. థ్యాంక్యూ.

   Delete
 19. Anonymous18 July, 2013

  "పద్మార్పిత" పేరుకు తగ్గ అందమైనభావాలు వాటికి సరిపడే చిత్రాలు. చూస్తుంటే అందమైన అన్నీతెలుసిన ఒక తెలుగమ్మాయి ఇలా ఉండాలి అనేలా ఉంది మీ బ్లాగ్. ఇక్కడ మీ కవితలు చదువుతుంటే అందమైన ఆర్ట్ గ్యాలరీలో కూర్చొని ఆనందిస్తున్న ఫీల్. అందరూ అనుకుంటుంటే విన్నాను ఇప్పుడే చదువుతున్నాను. చాలా చాలా బాగుంది

  ReplyDelete
  Replies
  1. వెల్ కం సర్/మాడం....నా భావాలకి అందమైన కమెంటిడిన మీకు ధన్యవాదాలండి!

   Delete
  2. Anonymous19 July, 2013

   19 జూలై 2013 నేను గుర్తుంచుకోవలసిన రోజు, ఇప్పుడే మీ మొత్తం కవితలని, కమెంట్లని చదివాను. నా 50 ఏళ్ళ జీవితంలో ఇలా ఏకబిగిన చదవడం ఇదేకామోసు. ఈ మధ్యకాలంలో ఇంత అందమైన భావాలు ఉన్న అమ్మాయిని అందులోను తెలుగు మాట్లాడం తప్పు అనుకునే ఈ కాలంలో ఉండడం అరుదు. మీ పై నా అభిప్రాయం రాయాలని కూర్చుంటే వచ్చిన వాక్యాలివి ప్రాసంటే ఇష్టమని ప్రయత్నించాను. నీలో ఒక అల్లరిపిల్ల, చలాకీ చిన్నది, అమాయకపు అమ్మాయి, సర్వం తెలిసిన సఖి, సున్నితంగా చెప్పగల సుకుమారి, పరిణితి చెందిన పడతి, అవసరమైనప్పుడు అదరగొట్టగల ఆడపులి, ధీరనారి, ఓటమిని ఓర్పుతో జయించే వయ్యారిని చూసాను/ చదివాను. చాలా కాలానికి నన్ను నేను మరచి మైమరిచేలా చేసిన నీ భావుకతకు నీకు నా శుభాశిస్సులు.

   Delete
  3. ఎంతో ఓపిగ్గా చదివి నా ఇష్టాన్ని ఆదరించి అందంగా అభిమానంతో నాపై మీ అభిప్రాయాన్ని అక్షరాల్లో పొందుపరిస్తే ఆనందంతో ఏం వ్రాయాలో అర్ధంకావడంలేదండి.
   మీ ఈ వాఖ్యలకి.....
   "ఆనందభాష్పాలు హరివిల్లులై
   ధన్యవాదాలు చెలియకట్టదాటి
   వందనములు విరిసిన మాలలై
   శ్రావ్యమైన రాగమొకటి మీకైమీటి
   సదా మీ ఆశ్శిస్సులు కోరుతున్నా"

   Delete
 20. అందరిలో ఏదో ఒక బలహీనత దాన్ని పట్టుకుని మిగిలిన సుగుణాలని వద్దంటే ఎలాగండి.....స్నేహం అంటేనే చెడులో మంచిని వెతకడమేమో :)
  వద్దనడం కూడా మీరు అందంగానే చెప్పగలరు.

  ReplyDelete
  Replies
  1. అనికేత్...బలహీతల్ని అయితే క్షమించొచ్చు కాని బంధాలు బాధ్యతలు అంటూ ఉన్నాయని తెలిసి అనుబంధం ఏర్పడ్డాక తప్పించుకుని వంకలు వెతికితేనే కష్టం.
   చెడులో మంచిని వెతగ్గలం కాని మంచిని నటించేవారిలో చెడే కనపడుతుందేమో!

   Delete
  2. Bahu chakkani Nirvachanam:
   చెడులో మంచిని వెతగ్గలం కాని మంచిని నటించేవారిలో చెడే కనపడుతుందేమో!!

   Delete
 21. వద్దు నాకీ రంగులుమారే స్నేహం
  అది కలిగిస్తున్న అభధ్రతా భావం!!
  బంధాల నడుమ భావలని మారుస్తూ
  ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేమొలకబోస్తూ
  ఎందుకీ నటనంటే నేనే ప్రాణమంటూ
  భాధ్యతలతో బంధీని అయ్యానంటూ!!

  వద్దు నాకీ దాగుడుమూతల అనుబంధం
  నలుగురిలో పలకరించాలంటేనే సంకోచం!!
  బంధుత్వమా అనడిగితే నీళ్ళు నమిలేస్తూ
  స్నేహం కాదంటూ బిత్తరచూపులు చూస్తూ
  ఎందుకిలాగంటే నేనో అమాయకురాలినంటూ
  ఏకాంతపు బిగికౌగిలిలో సర్వస్వం నేనంటూ!!

  వద్దు నాకీ తెగే నూలుపోగుముడుల బంధం
  అంతరంగానికి సైతం అర్థంకాని అల్పావేశం!!
  అవసరం ఉంది అనుకుంటే అతిగా పొగిడేస్తూ
  అయినవాళ్ళందరి నడుమ అలుసుగా చూస్తూ
  ఏమిటిదంటే ఎదలో దాచుకునే గాజుబొమ్మనంటూ
  ప్రతిబింబాన్నైనా చూపలేని అద్దాన్ని నేనంటూ!!!

  kavali mee ee kavithaa pravaham
  manasulni saitham meppinchee aalochanalu
  inthena anukunte anthalone entho arthannistu
  entivani ante naa manasuloni bhavalu oohalee antuu
  mullani kuda chupaleni kantini nenantu jeevithane rasesaru alavokaga great andi meeru superuuu mee sisyarikam kosam eduru chustunnamu

  ReplyDelete
  Replies
  1. అబ్బో....కామెంట్ పెట్టిన మీకు థ్యాంక్స్ చెప్పడం సులువేమో అనుకున్నా కానీ వ్రాసింది చదువుతున్న కొద్ది కొత్తపదాలు వెతుక్కోవలసి వస్తుంది కృతజ్ఞతలు చెప్పడానికి. :-) ధన్యవాదాలు రవిగారు మీ అభిమానాత్మక స్పందనకు.

   Delete
 22. స్నేహం పట్ల మీ ఆత్మీయతకు జోహార్లండి. ఇలా మీ స్నేహ హస్తాన్ని మిస్సయిన వాడు దురదృష్టవంతుడే... మీ కవితా హృదయానికి వందనాలు..

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి కెక్యూబ్ వర్మగారు.

   Delete
 23. బాగుంది పద్మ గారు .కొన్ని సార్లు ఇలానే అనిపిస్తుంది కొంత మందిని చూస్తే !

  ReplyDelete
  Replies
  1. అవునుకదా:-)thank you

   Delete
 24. వద్దు నాకీ తెగే నూలుపోగుముడుల బంధం
  అంతరంగానికి సైతం అర్థంకాని అల్పావేశం!!
  అవసరం ఉంది అనుకుంటే అతిగా పొగిడేస్తూ
  అయినవాళ్ళందరి నడుమ అలుసుగా చూస్తూ
  ఏమిటిదంటే ఎదలో దాచుకునే గాజుబొమ్మనంటూ
  ప్రతిబింబాన్నైనా చూపలేని అద్దాన్ని నేనంటూ!! Nijamaa .. niajme kadandi.NijaM ayundocheemooo... emo nakem teliyadu

  ReplyDelete
  Replies
  1. ఎవరి భావాల ప్రతిబింబం వారికే కనపడుతుందేమో చూసుకోండి :-) థ్యాంక్యూ

   Delete
  2. వద్దు నాకీ తెగే నూలుపోగుముడుల బంధం

   Chaala baagundandi ee bhaavam.... Mee kavitalu chaduvuthoonte chaala mandi introspection cheskovaalsi vasthundani meeku munde telusaa??

   Delete
  3. నిజంగా అలా కొందరైనా ఆత్మపరిశీలన చేసుకుంటే...అంతకన్నా కావలసింది ఏముందండి
   నేను రాసే రాతలకి సార్థకత చేకూరినట్లే కదండి! మీ స్పూర్తిదాయక స్పందనకు నెనర్లండి.

   Delete