మూగబోయిన భావం


అనురాగపు సిరా తరిగి నా కలం మూగబోయింది
తడారినకుంచె బండబారిన మదిని ముద్రించనంది
ప్రేమపొందని అక్షరాలు ఒత్తుల్లేని అనావిష్కృతాలై
భావాలని ఎదలోనే బంధించి మూగగా రోధించింది!

అంతరంగపు మరువని తలపులు చదరంగమాడాయి
పరిమళించని జ్ఞాపకాలు విరియలేమంటూ వాడాయి
తోడులేని ఒంటరితనం ఒకవైపు పూడిపోయిన వేణువై
మది ఆర్తనాదాన్ని మౌనరాగాలుగా ఆలపిస్తున్నాయి!

అందలం ఎక్కిన ఆలోచనా సౌరభం కుప్పగాకూలింది
తనువు గాయమైతే మానేది, మనసుకి గాయమైంది
ప్రేమార్తితో ఎదురుచూస్తున్న గుండె అనురాగధారలంటి
ఓదార్పుని ఆశిస్తే ఆ పదమే దాని అర్ధం ఏమనడిగింది!

రెప్పలులేని కళ్ళు తెరచినా మూసినా కన్నీళ్ళేవస్తాయి
వ్యధ నిండిన మది ఏం రాసినా నిట్టూర్పులై రాలతాయి
రాయాలంటే భారమైన మది అనురాగపు కడలిలో కరిగి
భావంపొంగి కవితాక్షరాలకి ఊపిరులూది జీవంపోయాలి!

38 comments:

  1. రెప్పలులేని కళ్ళు తెరచినా మూసినా కన్నీళ్ళేవస్తాయి
    వ్యధ నిండిన మది ఏం రాసినా నిట్టూర్పులై రాలతాయి..

    హృదయాంతరాలలోని మౌన ఘోషను మదినిండిన వ్యధార్థ దృశ్యాన్ని ఇన్ని పద చిత్రాలమద్య ఆవేదనను రంగుగా మలచి ఆవిష్కరించిన మీ మనసుకు జోహార్లు పద్మార్పితగారూ..

    ReplyDelete
    Replies
    1. స్పందించిన మీ భావోద్వేగ దర్పణం...ఈ వ్యాఖ్యాప్రభంజనం! నమస్సుమాంజలులు.

      Delete
  2. ఇంత సుతారంగా సున్నితంగా మృదువుగా అలవోకగా లేతగా చిరుగాలికే మోగే తీగలు బిగించిన వీణలా ఎలా ఆలోచిస్తారు పద్మార్పితగారూ!hats off!

    ReplyDelete
    Replies
    1. మీ ఈ స్పందన లేత చిరుగాలిలా నా మనసుని తాకింది. నెనర్లండి.

      Delete
  3. Anonymous14 July, 2013

    Iam sorry for my previous comment arpita you touched my heart with your sensitive words and bearing me as your friend. Really iam impressed by your thoughts and emotions. your are fantastic lady that i have ever seen let us have cheerful atmosphere in your blog and enjoy the fragrance of your poetry.thank you.

    ReplyDelete
    Replies
    1. Oh! sure....thanks for your pleasant comment.

      Delete
  4. ఇంకేం రాయను భారమైన మనసుతో మూగబోయిన మదివేదన, మీ అంత అందంగా రాయండం అందరితరమా పద్మగారూ.

    ReplyDelete
    Replies
    1. రాయలేనంటూ భారంగా అని కవితాలోకానికి దూరంకాకండి.

      Delete
  5. రెప్పలులేని కళ్ళు తెరచినా మూసినా కన్నీళ్ళేవస్తాయి
    వ్యధ నిండిన మది ఏం రాసినా నిట్టూర్పులై రాలతాయి

    పరిమళించని జ్ఞాపకాలు విరియలేమంటూ వాడాయి
    తోడులేని ఒంటరితనం ఒకవైపు పూడిపోయిన వేణువై
    మది ఆర్తనాదాన్ని మౌనరాగాలుగా ఆలపిస్తున్నాయి!
    అందలం ఎక్కిన ఆలోచనా సౌరభం కుప్పగాకూలింది
    తనువు గాయమైతే మానేది, మనసుకి గాయమైంది
    ------------- exlent Hart Touching Words

    ReplyDelete
    Replies
    1. ఇంతలా నా కవితల్ని అభిమానించే మీకు వందనం.

      Delete
  6. "గుప్పెడంత కూడా లేని గుండెలో ఇమిడి దాగున్న భావాల ప్రవాహం సంద్రం కన్నా లోతైనది
    నిట్టూర్పులు నిస్సహాయత కోరే మనసు లోని ఆలోచనలు అలా నింగి కన్నా ఎత్తైనది
    భారమే లేని అతి తేలికైన అక్షరాలే ఏర్చి కుర్చీ భావమై జనించే వేళా ఆ అక్షరానికి వెలకట్టలేనిది"

    Hats off Padma Gaaru For the Speechless Poetry.. Bhaavaalu Jeevam posukovaalante mee kavitanu chooste itte ardam aipotundi adi maatram Mummatiki nijam Nootiki Nooru Pallu Satyam

    ReplyDelete
    Replies
    1. అమ్మో....ఇంతందంగా కమెంటిడిన మీ అభిమానం నాకెంతో విలువైనది. థ్యాంక్యూ.

      Delete
  7. Anonymous14 July, 2013

    ఈరోజు బ్లాగ్ చూడొద్దు అనుకుంటూనే చూసాను, గుండెల్ని పిండేసావు (గుర్తుందా నీలాలు కారేనా కాలాలు మారేనా, నీ జాలి నే పంచుకోనా పాట) నీ పాత పరిచయం ఒక తీపి జ్ఞాపకం, ఈ బ్లాగ్ పరిచయం నాలోని భావాలకి కూడా ఇస్తుంది కొత్తరూపం. నీ బ్లాగ్ ఒక వ్యసనంగా మారింది, అయినా ఎంతో బాగుంది. కుడోస్ పద్మ

    ReplyDelete
    Replies
    1. అదేం అలా చూడొద్దు అనుకోవడం ఏంటి? అంటే భయపడ్డావా బలి అయిపోతావేమోనని.......ఏది ఏమైనా నేనో నచ్చిన వ్యసనాన్ని అన్న మాటతో కట్టిపడేసావు ( మంచి పాత పాటతో జ్ఞాపకాలని గుర్తుచేసావు) థ్యాంక్యూ మహీ!

      Delete
  8. నేను చెప్పాలనుకునే ప్రతిభావం మీ నుండి ఎంతో అందంగా అలంకరించబడుతుంది. కొన్ని భావాలకైనా నేను అక్షరరూపం ఇచ్చేలా వరమీయండి అర్పితగారు :-) మీ అంతంగా ఇవ్వలేను కాని ప్రయత్నించగలను.

    ReplyDelete
    Replies
    1. వరమీయడమెందుకండి....మీరు ఆల్ రెడీ తెలుగు కవితామానస పుత్రిక ;-)

      Delete
  9. Anonymous14 July, 2013

    అమ్మూ...

    మనసుకు నరముంటుందా
    ఒక్కసారిగా తెగినట్టై అలా రక్తమోడుతోంది...

    కంటి ఎనకాల సంద్రముప్పొంగిందా
    కాన రాని సునామీ గట్టు తెగి పారుతోంది...

    మూగబోయిన గొంతు పాట కడుతోందా
    వర్ష రాగమాలపిస్తూ ముసురు కమ్ముతోంది....

    రెక్క తెగిన తూనీగలా ఈ పూవునంటి
    చివర శ్వాశలో శిరసును త్యజిస్తోంది....

    నేలనంటిన శిరసు నీ పాద పద్మముల చేరి
    కనురెప్పల మూతలో నీ గోటి రంగు చిత్రాన్ని పొదువుకుంది...

    ReplyDelete
    Replies
    1. అమ్మూ....అంటూ అభిమానంగా పలుకరించి అందమైన కవితతో అభిమానానికి భాష్యం చెప్పిన అనానీమస్ గారి అసలుపేరు తెలుపకపోయినా అభివందనం.

      Delete
    2. ప్రేమతోపాటు వేదనకూడా కనబడుతుంది ఈ కవితలో
      ఈ అజ్ఞాతగారెవరో ప్రేమని అందుకోలేకనా లేక అందింది అస్వాధించలేకనో కొంచెం కంఫ్యూజ్ :)

      Delete
    3. అంతలా కంప్యూజ్ అవ్వకులే అనికేత్.....అభిమానంగా అందమైన కవితను అందించారుగా, తప్పక పేరు పెడతారులే :-)

      Delete
  10. Superb words with beautiful expressions,....

    ReplyDelete
    Replies
    1. Wow...thank you so much Mehdi Ali garu.

      Delete
  11. అంబరానంటిన అభిమానం అందరిలో నీపై....పద్మా గతనాలుగేళ్ళుగా నీ బ్లాగ్ చూస్తున్నాను, ఎప్పటికప్పుడే ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, కొత్త ఆలోచల్ని కలిగిస్తావు. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ఇలా అలరించే భాగ్యాన్ని నాకు సదా ప్రసాదించమని వేడుకుంటున్నాను.

      Delete
  12. Anonymous14 July, 2013

    తడారినకుంచె బండబారిన మదిని ముద్రించనంది....
    ప్రేమార్తితో ఎదురుచూస్తున్న గుండె అనురాగధారలంటి
    ఓదార్పుని ఆశిస్తే ఆ పదమే దాని అర్ధం ఏమనడిగింది!
    ఇంతకన్నా మనసు గతిని ఎవరు వర్ణించగలరు? ఎలా ఈ పరిస్థితిని ఎదుర్కోవడం?
    Amazing...Unable to express my feel in words...

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి అభివందనం అనూగారు. I can read your feelings of unsaid words. thank you

      Delete
  13. Excellent:-)) Simply Super:))

    ReplyDelete
  14. వేదన పాళ్ళు ఎక్కువగా అనిపిస్తున్నాయి మాడం :-(

    ReplyDelete
    Replies
    1. వేదన కూడా సుఖమేకాదా.....:-)

      Delete
  15. రెప్పలులేని కళ్ళు తెరచినా మూసినా కన్నీళ్ళేవస్తాయి
    వ్యధ నిండిన మది ఏం రాసినా నిట్టూర్పులై రాలతాయి
    రాయాలంటే భారమైన మది అనురాగపు కడలిలో కరిగి
    భావంపొంగి కవితాక్షరాలకి ఊపిరులూది జీవంపోయాలి!

    ee 4 linelu nannu ekkado touch chesayi padmarpita nakante peddavaro kado teliyadu anduke peru tho pilichanu....chala rojulu tarvata malli mee oohalu bhavalu ivale chadivanu chala andam ga aa alochanalu aa padalu ela vastunnayi nakkuda mee secret chepthe nenu oo 2 kavithalu raskuntanu kada Guru samanulu padmarpita garu

    ReplyDelete
    Replies
    1. మీరు రాసిన నాలుగు వ్యాఖ్యాలు....మీలోని సున్నిత మనసుని దాని స్పందనను తెలిపి నాకు ప్రేరణతోపాటు మీ అభిమానాన్ని మరింతగా పొందాలి అనే ఆలోచలని కూడా పెంచిందండి. మీకు నేను సీక్రేట్ చెబితే 2 లైన్లే రాస్తారు....చెప్పకపో అంచెలంచెలుగా అద్భుతంగా రాసేయగలరు.

      Delete
  16. ప్రేమార్తితో ఎదురుచూస్తున్న గుండె అనురాగధారలంటి
    ఓదార్పుని ఆశిస్తే ఆ పదమే దాని అర్ధం ఏమనడిగింది!

    చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. మీ స్పందన నాకు సదా ప్రేరణాదాయకం. థ్యాంక్యూ!

      Delete
  17. మీ భావావేశాలకి అబ్బురపడాలో లేక మీ అమాయకత్వానికి ఆశ్చర్యపోవాలో అర్థం కావడంలేదు అప్పుడే ఉప్పెనై పడిలేస్తావు అంతలోనే అణగారిపోతావు.

    ReplyDelete
    Replies
    1. అంత సులువుగా మీకు అంతుబడితే తర్కానికి తావుండదు కదండి! :-)

      Delete
  18. ఎంతో ప్రేమ,అంతలో భాధ, మరింతగా నింద, అంతులేని వేదన,..మీ కవితలలో..బాగుందండీ..

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనుకు ధన్యవాదాలండి.

      Delete