నేను నీకు ఎప్పటికీ అర్థం కాను
నువ్వు నాకు ఎప్పుడూ అర్థం కావు
మన జీవనవీణలోని తీగలు కలిపాను
ఇరుమనసుల మధ్య దూరం పెంచావు
ఎన్నో భావాలకి కవితా రూపమిచ్చాను
భావం మెచ్చి కవితలో నన్ను వెతికావు
ఎదలోనివ్యధ నీ కంటపడనీయక దాచాను
కనులతో వెతికి మనసుతో చూడ మరిచావు
నేను నీకు ఎప్పటికీ అర్థం కాను
నువ్వు నాకు ఎప్పుడూ అర్థం కావు
నేనే జీర్ణించుకోవాలని జీవించబోతాను
అర్థమైతే అలుసనుకుని అందకుంటావు
నీకు అనుగుణంగా అమరి అల్లుకుపోతాను
తామరాకుపై నీటిబొట్టులామారి జారిపోతావు
అలవాటుపడి సర్దుకుపోవాలి అనుకుంటాను
ఆలోచనలకే అందనంత అలజడిని సృష్టిస్తావు
నేను నీకు ఎప్పటికీ అర్థం కాను
నువ్వు నాకు ఎప్పుడూ అర్థం కావు
నిండైన నిబ్బరంతో నిన్ను చూస్తాను
ఆశలన్నీ అణచివేసి నిరాశ పరుస్తావు
చివరి ప్రయత్నమని మొదలుపెడతాను
మారని నీవు మళ్ళీ మొదటికి వచ్చేస్తావు
నా నీ తప్ప మనదంటూ లేని నువ్వు నేను
ముడిపడలేమని తెలిసికూడా ఒకటే అంటావు
నువ్వు నాకు ఎప్పుడూ అర్థం కావు
మన జీవనవీణలోని తీగలు కలిపాను
ఇరుమనసుల మధ్య దూరం పెంచావు
ఎన్నో భావాలకి కవితా రూపమిచ్చాను
భావం మెచ్చి కవితలో నన్ను వెతికావు
ఎదలోనివ్యధ నీ కంటపడనీయక దాచాను
కనులతో వెతికి మనసుతో చూడ మరిచావు
నేను నీకు ఎప్పటికీ అర్థం కాను
నువ్వు నాకు ఎప్పుడూ అర్థం కావు
నేనే జీర్ణించుకోవాలని జీవించబోతాను
అర్థమైతే అలుసనుకుని అందకుంటావు
నీకు అనుగుణంగా అమరి అల్లుకుపోతాను
తామరాకుపై నీటిబొట్టులామారి జారిపోతావు
అలవాటుపడి సర్దుకుపోవాలి అనుకుంటాను
ఆలోచనలకే అందనంత అలజడిని సృష్టిస్తావు
నేను నీకు ఎప్పటికీ అర్థం కాను
నువ్వు నాకు ఎప్పుడూ అర్థం కావు
నిండైన నిబ్బరంతో నిన్ను చూస్తాను
ఆశలన్నీ అణచివేసి నిరాశ పరుస్తావు
చివరి ప్రయత్నమని మొదలుపెడతాను
మారని నీవు మళ్ళీ మొదటికి వచ్చేస్తావు
నా నీ తప్ప మనదంటూ లేని నువ్వు నేను
ముడిపడలేమని తెలిసికూడా ఒకటే అంటావు
Little bit in confused stage
ReplyDeleteఇలా అర్థం కానప్పుడు విడిపోవాలనా చెప్పేది మీరు?
నా దృష్టిలో అంత త్యాగాలు చేసి అలా ప్రేమను పొందడంకన్నా కిమ్మనకుండా వదిలేయడం ఉత్తమం :)
Deleteఅందరి అభిప్రాయంతో అర్థమై ఉంటుంది అనుకుంటాను యోహంత్ :-)
Deleteఅనికేత్.....ఉచిత సలహానా :-)
మనం అనలేనివాడు మనసుతో ఎలా చూడగలడు!అనుబంధం పొసగదు!చివరి ప్రయత్నం కూడా ఇంకా ఎందుకు,కాలవలో పోసిన పన్నీరు!!
ReplyDeleteహమ్మయ్య....నాలాగే ఆలోచించి ఏకీభవించినందుకు వందనం. :-)
Delete
ReplyDeleteప్రేమంటే , అతను ఎలా ఉన్నా,ఏమి చేసినా, అతనిని, అతను ప్రేమించే
ప్రతీ దాన్ని, అతనికిష్టమైనవన్నీ ప్రేమిస్తూ మమైకమైపోవడమే కదా?
నిజమైన ప్రేమ ఆశించదు, ప్రశ్నించదు...ఇస్తుందే తప్ప.నాకు తెలిసి ఒక స్త్రీమూర్తి అంత ప్రేమను పిల్లలకు మాత్రమే పంచగలదేమో!!! ఊండొచ్చేమో కొన్ని ఎక్ష్చెప్షన్స్.. :))
ఏమోనండి......ఎంత ప్రేమ ఉంటే మాత్రం చలించని మారని, కరగని శిలని పట్టుకుని శిల్పంగా మార్చాలని అనుకోవడం కూడా ఆశే అంటే అంగీకరించకుంది మనసు:-)
Delete(అమ్మ ప్రేమ పోల్చడానికి దేవుడు కూడా సాహసించడు..That is exception)
Ela rastaru andi ala alovakaga...the poetic way of illuminating the beautiful phrases comes thru u r writings..Chala baga rasaru..Kudos
ReplyDelete--Vajra
Thank you vajra garu.
Deleteముడిపడలేమని తెలిసికూడా ఒకటే అంటావు
ReplyDeleteఅదే చిదంబర రహస్యం. అది తెలిస్తే బ్రహ్మ తత్వం.
తెలియని వాటిని తెలుసుకునే నా ఈ వెర్రిప్రయత్నం
Deleteఅయినా మీకు తెలియనిదా నా అమాయకత్వం :-)
జలతారు వెన్నెల అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను .
ReplyDeleteఅలా ఏకీభవించి తప్పించుకుంటే ఎలాగండి :-)
Deleteఅర్థం కాను, అర్థం కాను, అంటు చాలా అర్ధాలే చేప్పారు. నిజమైన ప్రేమ ఆశించదు, ప్రశ్నించదు...ఇస్తుందే తప్ప ఇది కరెక్ట్ అండి, చాలా బాగుంది.:-))
ReplyDeleteప్రేమైనా ఏమైనా.....అన్నీ తీసుకుని కొన్నైనా ఇవ్వాలని నాభావం....
Deleteఅంతే కానీ అడక్కూడదు ప్రశ్నించకూడదూ ప్రేమంటే ఇస్తూనే ఉండాలి అంటే మాత్రం కష్టం :-)
అర్థం కానప్పుడు ప్రే
ReplyDeleteమార్థము నటన యగును , పరమార్థము తొలగున్ ,
మార్దవము లేని హృదయ ని
రర్థక ప్రేమాయణములు రాణింపవుగా !
----- బ్లాగు సుజన-సృజన
చిన్ని పొన్ని పదాల చిట్టి కవితలో నా భావాన్ని పొదిగారు.......ధన్యవాదాలండి
Deleteనేనే జీర్ణించుకోవాలని జీవించబోతాను అర్థమైతే అలుసనుకుని
ReplyDeleteఅందకుంటావు నీకు అనుగుణంగా అమరి
అల్లుకుపోతాన
ు తామరాకుపై నీటిబొట్టులామారి
జారిపోతావు
ఇంత అనురాగాన్ని అందుకోలేని మనిషి
దురదృష్టవంతుడే కదా... touching lines Padma
Arpita garu..
అందుకోలేనివాడు దురదృష్టవంతుడే అంటున్నారు అంతేకాని అనురాగాన్ని అందించి అదృష్టవంతుడుగా మారమని చెప్పరు :-) ఎంతైనా పురుష పక్షపాతి అని నిరూపించుకున్నారు కవివర్మగారు :-)
Deleteఇందులో పక్షపాతమేమీలేదండీ.. మా వర్గాన్ని మేం కాపాడుకోవాలిగా..:-)
Deleteఅందమైన ఒక అక్షర సందేశం..లా ..
ReplyDeleteమీరే కాదు మీ భావాలకు స్పూర్తి , ప్రేరణ ఇస్తున్నదేవరోగాని అతను కూడా అభినందనీయుడే ... మనసును స్పృశించింది . చాలా బాగుందండి మీరు వ్రాసిన శైలి మరియు భావం.
నా భావాక్షర రూపాలకి స్పూర్తి, ప్రేరణ మరియు అభినందనలు అందుకునే సర్వహక్కుల ఏకైవారసురాలు....."నా మది" ;-)Thank you Mehdi Ali garu.
Deleteఎప్పటిలాగే చాలా బాగుందండి మీ కవితా దానిలో భావం ..దానితోపాటు పాటు పైంట్
ReplyDeleteథ్యాంక్యూ....చాలా రోజులకి :-)
Deleteప్రేమైక జీవితంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికే ప్రయత్నించాలి. కాని ఇది అనుకున్నంత సులభం కాదు. అరమరికలు వస్తూనే ఉంటాయి. గాఢమైన అనుబంధం ఉన్నా ఒకరి మనసులోని లోతైన భావాలు మరొకరు పట్టుకోవడం కష్టమేమో !అయినా కలిసి జీవించాలి కనుక ఒకరినొకరు అర్థం చేసుకోవడానికే ప్రయత్నించాలి. మనసులోని భావాలు అర్థం అవ్వాలనే నిబంధన ఏది లేదు. ఆ భావాలను గౌరవిస్తే చాలు. జీవితం సుఖమయంగా సాగిపోతుంది. మీ కవిత రెండు మూడు సార్లు చదివి అభిప్రాయం తెలియజేయడానికి ప్రయత్నించాను. మనసుల లోతుల్లోకి తొంగి చూస్తూ వెళ్తుంటాయి నేస్తం మీ కవితలు. ఇంకా మంచి కవితలు రాస్తారని ఆశిస్తూ ..
ReplyDeleteమీ అమూల్యమైనా అభిప్రాయాలని ఇక్కడ ఇలా పంచుకున్నందుకు, కవితను ఆస్వాధించి ప్రశంసించిన మీకు ధన్యవాదాలండి.
Delete"నీవు నాకు ఎప్పుడో అర్థమైనావు
ReplyDeleteనేను అర్థం కాలేదని వదిలేయవు
మార్చుకునే తెగువున్న మగువవు
మాట కటువైనా మనసున్నదానవు
ఆప్యాయత చూపే స్నేహమయి నీవు"
పద్మా నీ కవితలు చదివి అబ్బిన బుధ్ధి అనుకుని నవ్వుకుంటావని సరదాగా రాసిన సత్యమిది @Mahee
ఏంటి ఇప్పటికీ కాపీ కొట్టడం మానలేదన్నమాట!
Deleteఅయినా మంచి మార్కులే కొట్టేసావులే :-)Thank U
ప్రేమలో అసలు ఏమీ ఆశించకుండా, ఎలా ఉన్నా సర్దుకుపోయి, అన్నీ త్యాగాలు చేసి, అన్నీ ఎదుటివారికి ఇష్టమైనట్లుగా ఒకవైపు నుండే కోరుకోవడం మాత్రం ప్రేమ ఎలా అవుతుందో నాకు అర్థంకాదు. ఇలా ఎదుటివారికి చెప్పడానికి, కవితలు రాయడానికి బాగుంటాయేమో కాని నిజంగా ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేవారు అరుదు కాదుకదా అసలులేరు.
ReplyDeleteనీ ఈ జీవన పయనంలో ఇంతలా అర్థం చేసుకునే వాళ్ళు అరుదేమో :-)
DeleteGood poetry and superb paintings :)
ReplyDeleteThank you Praveena
Deleteఅమ్మో అందరూ ఏవేవో చెప్పెస్తున్నారు...బాగుంది చాలా బాగారాశారు అని తప్ప ఏం చెప్పలేని నిస్సహాయురాలిని.
ReplyDeleteఈసారికి వదిలేస్తున్నా.....నెక్ట్స్ టైం ఒప్పుకోనమ్మాయ్ :-)
DeleteVinani Manasulo Bhaavaalanu tadumite ekkada nundi jaaluvaarutaayi..? Prema Anedi O Jeevanaadi, Adi Praanam poyaale kaani Praanam adagakoodadu.. Preminche manasu preminchaale kaani emi aasinchakoodadu. Mee Kavitalo prati aksharam O aanimutyam.
ReplyDeleteThank you for you lovely comment.
Delete"మది నిండుగా ఆలోచనాత్మకం
ReplyDeleteకనివిని ఎరుగని సంచలనాత్మకం
అక్షారాలతోనే భావాలు తెప్పించడం వర్ణనాత్మకం
అర్ధం కామూ అంటూనే మనసు భావాలు అలవోకగా అల్లిన వైనం భావాత్మకం
ఇన్ని ఆత్మలు నిండి జీవం పోసుకున్న కుందనపు బొమ్మ మీ కవిత
రారు సాటి మరెవరు మీ కావ్య భావం ఎదుట పద్మార్పిత
అందుకే అందుకో నా ఈ అభినందనల మాలికల లత "
ఇందులో ఎలాటి అతిశ్యోక్తి లేదు
మరీ ఇంతలా పొగిడేస్తే.....ఎగిరిపడి కాళ్ళు విరి కూలబడిపోతానేమో :-)
Deleteచక్కని భావాన్ని అలవొకగ ఆలొచనాత్మక ధొరణిలొ వ్యక్తపరచటం అది మీకే చెల్లుతుంది పద్మార్పిత గారు.
ReplyDeleteథ్యాంక్యూ
Deleteఅర్దం కాకపోవటం ఓ వరం, అర్ధం చేసుకొనేందుకు ప్రయత్నిస్తూ... జీవితాన్ని నడిపించవచ్హు కాదంటారా? మీ భావాలు కట్టిపడేస్తాయి.
ReplyDeleteమిరాజ్ గారు.....ఇదేదో ఆలోచించవలసిన విషయమే ;-) ఆశలు చిగురిస్తూ, ఆలోచిస్తూ అలా సాగిపోవచ్చు. కాదంటానా !!!! కొత్తపంధాలో చెప్తే :-)
Deleteమీరజ్ అక్కా ఫేస్ బుక్ లో కనిపించడం లేదు ఇక్కడ మిమ్మల్ని చూడటం చాలా హేపీగా ఉంది
Deleteమనసున్న ప్రతీ మనిషికీ...ఈ వ్యధ తప్పదేమో...
ReplyDeleteఆ మనసే చేరువైతే ఇక అంతా మైమరపేగా...
అందుకై తిరిగి ప్రయత్నించక తప్పదుగా ....
ఎందుకంటే...మనసుందిగా...
Wonderful feel...i think he is da lucky one for he had someone in this world showering love on him.
No one is Lucky non other than my heart:-) Thanks for your inspiring words.
Deleteఅర్ధం కాని భావాల్ని సైతం అద్భుతంగా కవిత గా మలిచారు!
ReplyDeleteఅర్ధం అయ్యీ కానట్టున్న ఆ abstract పెయింటింగూ బాగుంది.
థ్యాంక్యూ......చిన్ని ఆశగారి కమెంట్ లేదు ఏమైపోయారో అని అర్థం కాక ఆ అబ్ స్ట్రాక్ట్ చిత్రం చిన్నబోయింది.....ఇప్పుడు చూడండి నవ్వుతుంది(Google lo kottesina painting)
Deleteఅన్నీ అర్థమైపోతే ఆనందానికి హద్దులు ఉండవుగా....అందుకే ఇలా అర్థమై కానట్లుగా ఉంటేనే బాగుంటుందని అందులోని ఆంతర్యమేమో :-)
ReplyDeleteఅయితే అర్థం చేసుకోకుండానే అలా గడిపేయమంటారన్నమాట.....అలాగే
Deleteనిండైన నిబ్బరంతో నిన్ను చూస్తాను
ReplyDeleteఆశలన్నీ అణచివేసి నిరాశ పరుస్తావు
చివరి ప్రయత్నమని మొదలుపెడతాను
మారని నీవు మళ్ళీ మొదటికి వచ్చేస్తావు
నా నీ తప్ప మనదంటూ లేని నువ్వు నేను
excellent, all your thoughts are heart touching.
Thank you Anony.....
DeleteDini gurinchi cheppadaniki na vayasu na anubhavalu saripovemo anduke em cheppalekapotunnanu kani kachitanga antha preminche manishini duram cheskune vadu nijamaina pedavadu. And meekela vastunnayo ivanni naku training epudu start chestaru -:)
ReplyDeleteగుండె గుడిలో గుట్టుగా దాచుకున్న తలపులను
ReplyDeleteనీకు చేరవేయోద్దని మనసును హెచ్చరించా...
నిత్యం నీ చుట్టూ పరిభ్రమించే నా మనోనేత్రం
భావాలను నువ్వు పసిగట్టినప్పుడు
మాట వినని నా మనస్సు ముందు ఓడిపోయా..mI ru rasina kavitamundu edntaa ayina Nee padala allinakamundu edina chinna Cheemaganee kanipistundi.. exlent Feel padamagaru
ధన్యవాదాలండి.
DeleteGood one
ReplyDeleteThank you
Delete@నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి..
ReplyDeletesir...మీ ఈ మెయిల్ ఇవ్వగలరు..
Padmarpita గారూ మీ బ్లాగ్లొ ఈ రిక్వెస్ట్ ఉంచినందుకు..క్షమించాలి..