మనసుందా!

ఇప్పటికీ నా వద్ద ప్రేమించే మనసుంది
ఇప్పుడు దాన్ని నమ్మించే శక్తి నీకుందా
నిన్నునీవు ప్రేమించుకోలేని నీమనసుంది
దాన్ని మభ్య పెట్టవలసిన అవసరముందా!

రాతినుండి సైతం రాగాన్ని రప్పించగలను
విని మురిసిపోయి కరిగే మనసు నీకుందా
తెమ్మెరఊసుల వింజామరతో సేదతీర్చెదను
ఒళ్ళంతా చెవులు చేసుకుని వినే ఓపికుందా!

ఇప్పటికీ నాదికాని నీమనసు నాదగ్గరుంది
అది నా సొంతం అని చెప్పే ధైర్యం నీకుందా
నీమనసునే నిర్దేశించలేని నీకూ మనసుంది
అది తెలిసికూడా ప్రేమించలేననడం బాగుందా!

రాత్రివేళ కలనై పగటివేళ వెలుగునై రాగలను
జీవితాంతం నాతోనే ఉంటాననే సత్తా నీకుందా
నీవు లేదని చెప్పే మౌనంలో నేనేం వెతకను
ఇవన్నీ తెలిసి మనసివ్వడంలో అర్థముందా!

54 comments:

  1. Anonymous21 July, 2013

    ఇప్పటికీ నా వద్ద ప్రేమించే మనసుంది

    మనసుచేసే చిత్రాలని ఏకరువు పెట్టేరు. బావుంది

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి.

      Delete
  2. మీ కవితను మీ వర్ణచిత్రమే నమిలి మింగింది పద్మార్పితగారూ!

    ReplyDelete
    Replies
    1. ఏది ఏమైనా మీ స్పందన స్ఫూర్తిగాయకంగా ఉందండి. థ్యాంక్యూ

      Delete
  3. Anonymous21 July, 2013

    చిత్రంలో చిరునవ్వు విసిరి
    మనసుందా అని ప్రశ్నించి
    కెవ్వుమని కవితని అరిపించారు

    ReplyDelete
    Replies
    1. ప్రశ్నకి చిరునవ్వే జవాబు...బాగుంది

      Delete
  4. good one. Liked it. Thanks for writing...

    ReplyDelete
  5. చిత్రం చాలా బాగుంది . నిన్నే ప్రదర్శిస్తున్నది .
    ఇవన్నీ తెలిసి మనసివ్వడంలో అర్థముందా!
    కవిత బాగుంది , నేనూ అదే అడుగుతున్నా .

    ReplyDelete
    Replies
    1. అందుకే ఇవ్వకుండా ఉండాలనే డిసైడ్ అయ్యాను శర్మగారు :-)thank Q

      Delete
  6. దేహమంతా నేత్రమై
    హృదయమంతా ఆకాశమై
    నీ చిర్నవ్వును పిడికిడంత గుండె గూటిలో
    దీపం చేసి వెలిగించే నా మనసు చమురుంది...

    నేస్తమా కాదనగలవా??

    మీకు సమాధానంగా కాదుగానీ చదివినంతనే కలిగిన ఫీల్.. మీ చిత్రమిచ్చిన భావోద్వేగం... అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. కవివర్మగారు.....కదనగలవా అని కవితలో ప్రశ్నిస్తే....కాదనేంత ధైర్యమా :-)ధన్యవాదాలండి.

      Delete
  7. ఒక అందమైన అంతరంగం చదివిన అనుభూతి .... ప్రతి వాక్యం మనసుకు స్పృశించేలా ఉంది ... ఇలాంటి కవితలు మరిన్ని రాయాలని ...

    ReplyDelete
    Replies
    1. మీ ఆస్వాధించే మనసుకి, స్ఫూర్తిదాయక స్పందనకు నెనర్లండి.

      Delete
  8. Anonymous21 July, 2013

    చాలాబాగుంది

    ReplyDelete
  9. "Kannulu Palike Bhaavaalu Chitikalo Ardham Chesukovadam Kastame
    Manasuloni Antarangam Jaada telusukovadam kastame
    Kaani Aa Kannula Kolanulo Manasu Addam Pai Pratibimbinche nee momuni maravadam chaala kastame
    Vennella Andaalu, Chinuku Saraalu, Bhaava Tarangaalu Okinta telusukovadam Kastame
    Intakanna Varninchaalante Maatalu raavatam kooda kastame"

    Really Fantastic Piece, An elegant piece of poetry. A Gem of All.. Really I appreciate your work. Really Inspiring. Chaala Baagundi.. Naa Kavitalato polchite ae paripaatiki avi toogalevu.. :-) Padmarpita Gaaru

    ReplyDelete
    Replies
    1. Thank you so much for your lovely inspiring comment Sridhar.

      Delete
  10. Ee Kavita Chadivina taruvaata.. Mimmalni Pogadakunda undalenanipistundi Padma Gaaru.. Nijanga Baagundi.. Manasanede leni manishi evaraina chadivite.. atani/aame lo kooda leni manasu dhramavai karigi kannillu teppinchestundi.. Vallaloni Bhaavaalu Ubiki Manashulla migilipotaaru anadam lo Atisyokti ledu.. :-))
    http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకి ధన్యవాదాలు.

      Delete
  11. ఇప్పటికీ నాదికాని నీమనసు నాదగ్గరుంది
    అది నా సొంతం అని చెప్పే ధైర్యం నీకుందా
    నీమనసునే నిర్దేశించలేని నీకూ మనసుంది
    అది తెలిసికూడా ప్రేమించలేననడం బాగుందా!
    ఇది చాలా చాలా నచ్చింది....

    ReplyDelete
  12. ఎప్పటికీ మీరు అద్భుతంగా కవితలు రాస్తూ ఉంటారు
    అప్పటికీ మేము బాగుంది బాగుంది అని కామెంటేస్తాం

    చిత్రాల్లో సైతం మీరు భావుకతని రప్పించగలరు
    చూసి మురిసిన మనసు కామెంటు రూపం లో కరిగిపోతుంది :)

    భావుకతలు ,భావాలు తెలియవు గానీ ,ఎప్పుడూ బాగుంది బాగుంది అని ఏం రాస్తాం అని ఇలా .. :)

    ReplyDelete
    Replies
    1. బాగుంది అని కాకపోయినా చూసాను అని ఒక చిన్న స్మైలీ చాల్లెండి ;-)

      Delete
  13. నవ్వుతూ వాలుచూపుతో వేడిగా ప్రశ్నించే సత్తా మీలో ఉంది :-)

    ReplyDelete
    Replies
    1. పసిగట్టేసారుగా ప్రేరణగారు :-)

      Delete
  14. కవిత చాలా బాగుంది....మనసుని తట్టింది.......

    Keep going....

    ReplyDelete
    Replies
    1. స్వాగతమండి......మీ స్పందనకు థ్యాంక్సండి!

      Delete
  15. హమ్మయ్య మళ్ళీ ఎన్నాళ్ళకొచ్చానో. మిస్సవకుండా ముఖచిత్రంలో చదివేస్తున్నా ఇన్ని రోజులూ ఆ గందరగోళాల మధ్య. ఏది ఏమైనా ఇక్కడ చదవడం ఎంతో ప్రశాంతంగా ఉంది. "మనసుకవి" లా మీరో " ప్రేమ" కవి.

    ReplyDelete
    Replies
    1. ఆహా! మనసు ఉల్లాసమొందె మరల మిమ్మిచటగాంచి :-)
      ఇలా వచ్చిపోతుండండి వినోద్ గారు!
      Facebook lo without face to face
      Block lo (heart) beat to beat.:-)
      Thanks for your compliment.

      Delete
  16. Anonymous22 July, 2013

    ఈరోజంతా మేము చేసిన పని ఏంటంటే, నీ కవితలన్ని కూర్చుని చదవడం. సినిమాకి వెళ్ళి తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకని అందరం హాయిగా కవితలతో అంతకంటే అందమైన పెయింటింగ్స్ తో గడిపాము. పిక్చర్ కి వెళ్ళకుండా మిగిల్చిన డబ్బులన్నీ నీవే పద్మ :-)
    "నీవొక అందని సమీరానివి
    ప్రేమకి నీవొక నిర్వచనానివి
    గుండెలయని సరిచేసే నీ నవ్వు
    కవితల్లో మా అందరికీ పంచివ్వు"
    ఇది నేను రాసిందికాదు....నీ కవితల ఇన్స్పిరేషంతో నాతో వీళ్ళంతా రాయించారు :-) శభాష్ మహీ & ఫ్రెండ్స్ అను లేకపోతే వీళ్ళంతా కవితల్తో కుమ్మేసేలాగున్నారు.
    Thanks a lot for your lovely poetry and paintings which was given us lot of sweet memories to share.


    ReplyDelete
    Replies
    1. శభాష్ ఫ్రెండ్స్ & మహీ :-)
      ఇలా బ్లాగ్ లో రాసేయ్ నేస్తం, తిరుగుండదు. కొన్నాళ్ళకి సిమాకి లేదు షికారుకి లేదు ఏ అచ్చటా ముచ్చటా లేదు అని మాత్రం ఎవ్వరితోటి అనిపించుకోకుండా జాగ్రత్త! లేకపో ఇప్పుడు ఆహా అన్నవాళ్ళే అప్పుడు నన్ను తిట్టుకుంటారు. :-)
      Thanks to all for spending your valuable time in my blog.

      Delete
    2. Anonymous23 July, 2013

      Thank you padma

      Delete
  17. ఏడాదికి ఒక్క స్మృతిని కూడా వ్రాయలేకపోతున్న నా మనసు నీ కవితా ప్రవాహాన్ని చూసి మురిసిపోతుంది పద్మార్పితా......కొనసాగిస్తూ అలరించు.

    ReplyDelete
    Replies
    1. ఇలా అభిమానంతో ఆదరించే మీరంతా ఉంటే....అలా అలనై అలరిస్తానండి.

      Delete
  18. అందరికీ మీ అంత అందమైన భావాలు మనసు ఉంటే ఎంత బాగుంటుందో పద్మగారు. చాలా చాలా బాగుంది కవితా బొమ్మ ఇంకా మీ భావం అడిగిన విధానం.

    ReplyDelete
    Replies
    1. అందరి భవాలూ ఒకటేలా ఉండాలి అని కోరుకోవడం కూడా అతిసయోక్తే కదా :-) థ్యాంక్యూ!

      Delete
  19. చాలా చాలా బాగుంది పద్మార్పితా. చిత్రం చాలా బాగుంది:-))ఇంక మాటలురావట్లేదు చెప్పడానికి. సూపర్:-))

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ..... థ్యాంక్యూ వెరీమచ్

      Delete
  20. Anonymous22 July, 2013

    మీరు బ్లాగ్ వేదికలో మీ బ్లాగును అనుసంధానం చేసినందుకు కృతజ్ఞతలు అందిస్తున్నాము.బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.గమనించగలరు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.
    క్రింది లింక్ ను చూడండి. http://blogsvedika.blogspot.in/p/blog-page.html

    ReplyDelete
  21. Good one. Made me read 3 times. ;)

    ReplyDelete
    Replies
    1. After a long time....:-)
      Thank Q...Thank Q...Thank Q

      Delete
  22. ఇలా నిగ్గేసి ఒగ్గేసి అడిగితే ఏం చెప్తాడు పాపం:) అందుకే ఆ మౌనం

    ReplyDelete
    Replies
    1. తప్పించుకోవడానికి అతిసులువైన మార్గం కూడా మౌనమే అనికేత్ :-)

      Delete
  23. హ్రుదయాన్ని అర్పించే, మెప్పించే భావం మీ కలానికి ఉంది.

    ReplyDelete
    Replies
    1. చాన్నాళ్ళకి మీ ఆప్యాయ స్పందన మీరాజ్ గారు.,,,థ్యాంక్యూ

      Delete
  24. ఇప్పటికీ నాదికాని నీమనసు నాదగ్గరుంది
    అది నా సొంతం అని చెప్పే ధైర్యం నీకుందా
    నీమనసునే నిర్దేశించలేని నీకూ మనసుంది
    అది తెలిసికూడా ప్రేమించలేననడం బాగుందా,,,,....> ఇలా మనసుకు నచ్చినపదాలను పేర్చి..మా మనసులను ఏమార్చి ఇలా చేస్తే ఎలా అండి..మనసులోని భావలు తట్టిలేపడం. ప్రతి పదంలో నన్ను నేను చూసుకోవండం...ఇలాంటి అద్బుతమైన భావాలు మీకు మాత్రమేసాద్యం పద్మాగారు exlent fee No words to say

    ReplyDelete
  25. Anonymous25 July, 2013

    తప్పకుండా అర్థముందండీ...మనసివ్వడంలో...ఎందుకంటే చెప్పకనే చెప్పారుగా...ఆతని మనసు మీ దగ్గరే ఉందని...అన్నేసి మాటలన్నారే...ఇనా మౌనమే...మీరు తన మనసుని అర్థం చేసుకుని చేరువకాక ఇలా అనకూడదు మరీ..తనకూ మనసుందని ఒప్పుకున్నారుగా.. I am overwhelmed with ur poetry...

    ReplyDelete
  26. అనుగారూ.....మీ నిస్పక్షపాత వ్యాఖ్యలకు ధన్యవాదాలు. :-)

    ReplyDelete
    Replies
    1. @Padmarpita: Nice poetry :-)
      @Anu: Nice justification as well :-)

      Delete
  27. ఇప్పటికీ నా వద్ద ప్రేమించే మనసుంది
    ఇప్పుడు దాన్ని నమ్మించే శక్తి నీకుందా
    నిన్నునీవు ప్రేమించుకోలేని నీమనసుంది
    దాన్ని మభ్య పెట్టవలసిన అవసరముందా!

    రాతినుండి సైతం రాగాన్ని రప్పించగలను
    విని మురిసిపోయి కరిగే మనసు నీకుందా
    తెమ్మెరఊసుల వింజామరతో సేదతీర్చెదను
    ఒళ్ళంతా చెవులు చేసుకుని వినే ఓపికుందా!

    ఇప్పటికీ నాదికాని నీమనసు నాదగ్గరుంది
    అది నా సొంతం అని చెప్పే ధైర్యం నీకుందా
    నీమనసునే నిర్దేశించలేని నీకూ మనసుంది
    అది తెలిసికూడా ప్రేమించలేననడం బాగుందా!

    రాత్రివేళ కలనై పగటివేళ వెలుగునై రాగలను
    జీవితాంతం నాతోనే ఉంటాననే సత్తా నీకుందా
    నీవు లేదని చెప్పే మౌనంలో నేనేం వెతకను
    ఇవన్నీ తెలిసి మనసివ్వడంలో అర్థముందా!

    eppatiki navadda kavithalu rase shakthi undi
    vatini chadivi artham cheskune telivi neekunda annatlu chadive variki

    nee premaloni prati kshanni naa kavithallo dachanu
    vatini artham cheskune manasu neeku lekunda poyindi annatlu ga oo bhagna premikuralila rasaru

    inka epudu epudu epudu start chestunnaru mee teaching ento eduru chustunnam padmarpita -:)

    ReplyDelete
    Replies
    1. Thanks for your comments. Nenu edutivariki cheppenta ettiki yedagalendi Ravigaru inkaa.....

      Delete
  28. డియర్ సిస్టర్,
    రక్షా బంధన్ సుభాకాంక్షలు

    వెతగ్గా వెతగ్గా నాకో సరస్వతి పుత్రి లభించినందులకు ఉబ్బి తబ్బిబ్బయ్యాను. ఏంట్రోయ్ కోతలు బానే కోస్తున్నావ్ అనుకోకపోతే, మీతో పరిచయం మాకాత్మానందం. మీ అభిప్రాయం కోసం ....
    mallik1973@hotmail.co.uk

    ReplyDelete