ప్రశ్న జవాబులు ఏమి అడిగాను
నన్ను తలచావన్న వెక్కిళ్ళు తప్ప
ప్రేమకావ్యం ఏం లిఖించమన్నాను
నీ ప్రేమాక్షర నా ప్రాణగుళికలు తప్ప
వెన్నెలరేయిలో నాతోడు నిన్నేం కోరను
పగటి ఆనందపు వెలుగుని చూడ్డం తప్ప!
కొద్దో గొప్పో నీ ప్రేమని పంచమంటున్నాను
నీవో లేక నీ కలలకౌగిలిలో నే కరగడం తప్ప
మనసుని నీకిచ్చి నాజీవితాన్ని ఏం అడగను
నా చావు నీకన్నా ఒక్క క్షణం ముందు తప్ప
ఇస్తానంటే మనవైన గడియలు కొన్ని కోరతాను
వేయిజన్మల ప్రేమామృతాన్ని ఈ జన్మలో తప్ప!
నన్ను తలచావన్న వెక్కిళ్ళు తప్ప
ప్రేమకావ్యం ఏం లిఖించమన్నాను
నీ ప్రేమాక్షర నా ప్రాణగుళికలు తప్ప
వెన్నెలరేయిలో నాతోడు నిన్నేం కోరను
పగటి ఆనందపు వెలుగుని చూడ్డం తప్ప!
కొద్దో గొప్పో నీ ప్రేమని పంచమంటున్నాను
నీవో లేక నీ కలలకౌగిలిలో నే కరగడం తప్ప
మనసుని నీకిచ్చి నాజీవితాన్ని ఏం అడగను
నా చావు నీకన్నా ఒక్క క్షణం ముందు తప్ప
ఇస్తానంటే మనవైన గడియలు కొన్ని కోరతాను
వేయిజన్మల ప్రేమామృతాన్ని ఈ జన్మలో తప్ప!
last lines superb....
ReplyDeletethank you Aniketh
Deleteపద్మార్పిత గారు,
ReplyDeleteఇది మరీ ఎక్కువ కాదుటండీ !
ఇన్నేసి అడిగేసి, మళ్ళీ ఆ పై ఇంకే మడగను అని మమ్మల్ని అడుగుతున్నారు !
జేకే !
జిలేబి
మీరు మరీను.....ఆ ఏదోలే అడిగిందికదా అని చెప్పొచ్చుగా:-)
Delete"Raati Gundenaina kariginchi Premaamrutam Kuripinche Kannullo Kanniti Dhaaralu Uppongendukano..? Vennela Andaalu Choodaalante Reyini aashrayinchaalendukano..? Surya rashmiki Kadagallu Vadagallai kuriyunendukano..? Chakkani Bhaavam Kaligina Ee Kavitvaaniki Kavita tone samadhaanam cheppalani.. Ila.. ! Simply Superb.
ReplyDeleteరాతి గుండెనైన కరిగించి ప్రేమామృతం కురిపించే కన్నుల్లో కన్నీటిధారలు ఉప్పొంగెనెందుకో?
Deleteవెన్నెల అందాలు చూడాలంటే రేయిని ఆకర్షించాలెందుకో?
సూర్యరశ్మి కడగల్లు వడగాలులై కురియునెందుకో?
మీ ఈ కవితాభిమానం.....నాకు అత్యంత ప్రీతిప్రాయం, ధన్యవాదాలండి.
ప్రేమలోని మాధుర్యాని అతిసున్నితంగా చెప్పగల ప్రేమార్పితా నీకు వందనం.
ReplyDeleteధన్యవాదాలు......మీరు కూడా మళ్ళీ రాస్తారని ఎదురుచూస్తున్నా.
Deletesimply super, specially last lines extraordinary:))
ReplyDeletethank you sruti dear.
Delete"మనసుని నీకిచ్చి నాజీవితాన్ని ఏం అడగను
ReplyDeleteనా చావు నీకన్నా ఒక్క క్షణం ముందు తప్ప"
ఇంతకన్నా మనకిష్టమైన వారినిగురించి ఏం చెప్పగలం. ఒక్కక్షణం ముందు కలిగే ఆ ఎడబాటుని కూడా భరించలేము.
(గడియలు కాదు..ఘడియలు అని ఉండాలనుకుంటా...)
మీ అభిమాన స్పందనకు నెనర్లండి.
Deletesuperb...
ReplyDeletethank you
Deleteమీ భావాల ప్రేమామృత జల్లులో తడిపేసారు
ReplyDeleteఅలా ఎల్లఫ్ఫుడూ తడుస్తూ ఉండండి.....జలుబుచేస్తుంది (బోర్) అనొద్దు :-)
Deleteపద్మా అద్భుతమైన భావపటిమ నీ ప్రతిమాటలో, నీకు తెలుసా ఈరోజు లంచ్లో నా ఫ్రెండ్స్ నీ కవితని పదేపదే చదువుతుంటే నేనే రాసినంత ఫీల్ కంగ్రాట్స్
ReplyDeleteఓహ్....థ్యాంక్యూ, ఎంతైనా ఒక గూటిపక్షులమేకదా మహి!
Deleteఅద్భుతంగా ఉంది పద్మార్పిత గారు
ReplyDeleteమీ అభిమానానికి కృతజ్ఞతలండి.
Deleteమాటలు రావండీ ఇలా హృదయాన్ని చిలికే భావాన్ని చదివితే..
ReplyDeleteextraordinary feel..
అభినందనలతో...
మీరు ఎలాగో మితభాషే కదండి వర్మగారు :-) థ్యాంక్యూ వెరీమచ్!
Deleteఈ కవిత చదివాక ఇంకేభావం ఒప్పనంటుంది మనసు.....ఇలా మనసు దోస్తావెందుకు పద్మార్పితా ;-)
ReplyDeleteమనసు నేను దోచేసాను అని నిందవేయకండి సృజనగారు.......మీ శ్రీవారెప్పుడో దోచేసారు అన్నారుగా అప్పుడెప్పుడో :-) జస్ట్ కిడ్డింగ్, మీ అభిమానాపేక్షలకు అభివందనాలు.
Deletekavita chadivaja malli preminchali anipistundi:) evarni anadakandi
ReplyDeleteచదివేసాక ఆలస్యం ఎందుకండి.....ప్రేమించెయ్యండి, మిమ్మల్ని మీరేగా ప్రేమించుకునేది :-)
Deletenaku telusu meeru ilanti fitting edo pedarani, clever lady.
Deleteలోకంలో తెలివిలేనివారు ఎవరూ లేరండి, అది ఉపయోగించే మార్గాలే వేరుకాని...... మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నాకే ఎదుటివారిని ప్రేమించడం సులభం.
Deleteఅయినా మేరేగా ఎవరు అని అడగొద్దన్నారు :-)
బాగుంది పధ్మార్పితా..అయినా మీరు మరీను..ఇంతగా ప్రాధేయపడింది,కొద్దో,గొప్పో ప్రేమకోసమా..:-)
ReplyDeleteశైలజగారు.....అలా కొద్దో గొప్పో అంటాం....అంతేకాని ప్రేమంటూ కలిగాక పెరుగుతుందేగాని తరగదు/ తరగొద్దని నాభావం :-)
Deleteవేయిజన్మల ప్రేమామృతాన్ని ఈ జన్మలో తప్ప! ante 999 janmalalo kavali anaa? devudi gudiki velli hundilo okka rupai vesi lakshalu kavalani korukunnattugaana, manishiki entha aaso kada!
ReplyDeleteఏ ఆశా లేకుండా బ్రతికేవాడు మనిషేకాడేమోనండి.....మనిషి ఆశాజీవి. thanks for sharing your thoughts.
Delete