నా చిట్టి కవిత ఎక్కడ తప్పిపోయావమ్మా
నా తలపుల నుండి ఎటు వెళ్ళిపోయావమ్మా
ఈ జనసమూహంలో ఎక్కడ చిక్కుకున్నావమ్మా
నిన్ను ఇందరిలో ఎక్కడని వెతుకనమ్మా
నలుగురి పెదవులపై నవ్వైనావామ్మా
నా చిట్టి కవిత ఎక్కడ తప్పిపోయావమ్మా?
ప్రతి ఒక్కరూ నీకై వెతుకుతున్నారమ్మా
ఎందరి కనుసైగలనుండి నీవు తప్పించుకోగలవమ్మా
ఆకాశంలోని తారలను అడిగానమ్మా
ఎవరి హృదయంలోనైనా చిక్కుకున్నావామ్మా
పూలలోని సుగంధంలో దాగున్నావామ్మా
నా చిట్టి కవిత ఎక్కడ తప్పిపోయావమ్మా?
ఎక్కడకూ తప్పి పోలేదు.
ReplyDeleteమీ కవితలోనే ఉంది.
:-)
బాగా చెప్పారు. ఇదే భావంతో నేను రాసిన కవిత చూడండి ఒకసారి. (http://pradeepblog.miriyala.in/2009/01/blog-post_28.html)
ReplyDeleteమరో మాట మీ పేరు చాలా బాగుంది. అది మీ కలం పేరా ?
బాగుంది పద్మార్పిత. కవిత మీద కాదు కానీ, నా కవితలకి స్పందననిచ్చేవేవీ అగపడని ఒక రోజు నా మనసు దిగులుగా వ్రాసుకున్న కవిత ఇది. "మనసు వెచ్చబడింది - కాస్త చూసివెళ్ళండి" -
ReplyDeletehttp://maruvam.blogspot.com/2008/12/blog-post_2536.html
బహుశ నా దగ్గర నుండి మీ దరిచేరిందేమో చూడండి...అర్పితగారు!!
ReplyDeleteబాబాగారు.... నా దగ్గర ఉన్న కవితలో ఉల్లాసం మునపటి ఉత్సాహం తగ్గిందనిపిస్తుంది, అందుకే నా చిట్టి కవితా ఎక్కడున్నావమ్మా అని వెతుకుతున్నది, కాదంటారా???
ReplyDeleteఫణిగారు చూసాను మీ బ్లాగు.... బహు బాగు.
అది నా పేరు....థాంక్సండీ!
ఉషగారు... ఏమని చెప్పను థాంక్సని తప్పుకుంటాను.
యోహంథ్ గారికి ధన్యవాదాలు....
చాలా బాగుంది :)
ReplyDeleteఇంతకీ మీ కవిత దొరికిందా పద్మార్పితగారు?
ReplyDeleteNice one...
ధన్యవాదాలు నేస్తం.
ReplyDeleteసృజనగారు... నా కవితలని చదివి మీరే చెప్పాలి!