ఈ ఉరుకుల పరుగుల జీవనంలో పరుగిడి చేసేదేముంది
చంద్రున్ని చేతపట్టి రేయిని ఆపి ప్రయోజనమేముంది
సూర్యోదయం ఎప్పుడౌతుందో తెలియదు
సూర్యాస్తమయం అస్సలు గుర్తుకే రాదు
సెల్ ఫోన్, టెలిఫోన్ పలకరింపులే అందరు
ప్రేమాభిమానాలతో పలకరించే వారెందరు
ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో అందరితో ఉంది టచ్
పక్కింట్లో ఏమి జరుగుతున్నా పట్టించుకోము మనం మచ్
ఏయే ఛానల్ లో ఏ కార్యక్రమాలో తెలుసు అందరికి
తల్లిదండ్రులని పరామర్శించే సమయం లేదు ఎవ్వరికి
మనశ్శాంతితో మనిషి జీవించ లేకపోతున్నాడు ఎందుకని
108 ఛానల్స్ లో ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోతుందెందుకని
ఇటువంటి ఉరుకుల పరుగుల జీవనంలో పరుగిడి చేసేదేముంది
ఇలాగే జీవించాలి అనుకున్నప్పుడు మరణించి లాభమేముంది!!!!
really its so busy life's nah!
ReplyDeletegood!
ReplyDeleteహాయ్ ....చినుకుల జల్లులో తడిచార....నా బ్లాగ్ లో కామెంట్ పేజి కి ప్రాబ్లం వచ్చింది ఎవరికయిన చూపించాలి .
ReplyDeleteచిన్నిగారు.... అది మీ ప్రాబ్లం కాదండి, నా పొరపాటు... చిత్తగించండి!!!
ReplyDeleteమీరు అన్న మాట నూటికి నూరు పాళ్ళు నిజమండీ! రాను రాను వున్నచోటే ఒంటరివాళ్ళమై పోతున్నామేమో! ఎదురుగా వున్న మనిషిని చూస్తూ మాట్లాడితే వచ్చే ఆనందం, కీ బోర్డు మీద వ్రేళ్ళు టకటక లాడిస్తూ వుంటే వస్తుందనుకోను.
ReplyDelete