గాయం మానలేదనుకుంటే
మరో గాయానికి గురి చేస్తున్నావు.
కన్నుల నిండా నీరుంటే
నవ్వుతూ వుండమని మారం చేస్తున్నావు.
హృదయం దహించి వేస్తుంటే
వెలుగుకోసమై వెతకమంటున్నావు.
నిజాలే భయపెడుతుంటే
నిందలని ఎలా నమ్మమని అంటావు.
కంటికి కునుకే రాకుంటే
కమ్మని కలలు ఎలా కనమంటావు.
నీడైనా నాకు దక్కలేదంటే
తోడుకోసమై ఎదురు చూడమంటావు.
చుట్టూ పొగ కమ్మి ఉంటే
మంచు జల్లు కురియబోతుందని అంటావు.
బ్రతుకే భారమైనది అనుకుంటే
ఇదే జీవితం ఇలాగే సాగిపోవాలంటున్నావు.
చాలా బాగుందండీ...
ReplyDeleteతగిలే ప్రతి ఎదురుదెబ్బ..
గమ్యం విలువ తెల్పుతుంది
అది చేరే ఆశ పెంచుతుంది
రగిలే కడుపు మంట
మెతుకులోని ప్రాణాన్ని చూపుతుంది
అది లేని కొరత తెలుపుతుంది
అందుకే
అలానే బ్రతక మనడం
అదే బ్రతుకు మన్నడం..
nice blog andi చాలా బాగుంది
ReplyDeleteఊ, తప్పదు, గాయపు కోతే గెలుపుకి చిహ్నం. బ్రతుకున బాధల నలుపే మిగిలిన సుఖం, సంతోషం, శాంతి, తృప్తి వంటి ఇంద్రధనుస్సు వన్నెలకి వన్నెనిస్తుంది. పళ్ళెం అంచుకి తగరు వంటివే ఈ భారపు గడియలు. ఆ చుట్టంచు నడుమనున్నదే ఈ అందమైన బంగరు పళ్ళెం, ఆరు రుచులనూ మనకు అందించే జీవితం. నేనూ ఒకసారి వాపోయాననుకోండిలా చివరకు మిగిలేదేది? http://maruvam.blogspot.com/2009/01/blog-post_15.html
ReplyDeleteబాగుంది.
ReplyDeleteగాయం మీద గాయమైనా, కన్నీటి ధారల చెంపలు తడిసినా, కనరాని కాంతికై ఎదురుచూపే జీవితం కదా?
ReplyDeleteఈ గాయం తాలూకు మచ్చ కొన్నాళ్ళు గడిచేసరికి జ్ఞాపకాల పొరల్లో ఓ తీపి గురుతు గా మిగులుతుంది.. బాగుందండి...
ReplyDeleteఏం చేయమంటారు, ముందుకు సాగిపోమంటారు. :)
ReplyDeleteబాగుంది.
''మరి మీ చెల్లెల్ని ఎందుకు నాకు పరిచయం చేసావు '' అని మళ్ళి అడుగుతున్నావు అని ముగించి వుంటే కధ పూర్తిగా అర్ధం అయ్యేదేమో పద్మర్పిత గారు .(.'
ReplyDeletemee hridaya soundaryam pratibinbistondi mee kavithaloo....!
ReplyDeleteపద్మా! ఎంత బాగా చెప్పారు. ప్రతి వాక్యం నిజాన్ని నిగ్గదీస్తున్నట్లు ఉంది.
ReplyDeleteఇది ఇంతేనా? నిజమేనా అనుకుంటూనే ఆశగా ఎదురు చుడాటం శాపమో వరమో తెలియనంతగా సాగుతున్న జీవితాలను చక్కగా చూపారు.
కవిత రూపంలో ప్రతి ఒక్కరికీ ప్రతిస్పందన వ్రాయలేకపోతున్నాను అన్న భాధతో .....
ReplyDeleteస్పందించిన ప్రతి హృదయానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను....
@ రవిగారూ బంధుత్వాల మీద బ్లాగులో మీలాంటి పెద్దలు చాలా కధలు వ్రాస్తున్నారుగా.....
కవితలో కూడా అక్కా చెల్లెల ప్రస్తావన అవసరమా చెప్పండీ?
ఏం పర్లేదు, అవేసర్దుకుంటాయ్ అంటే,
ReplyDeleteకాదూ కూడదూ అంటావు.
:):)
రామరాజు గారు ఎన్నని సర్దుకు పొమ్మంటారు చెప్పండి?
ReplyDelete(Just kidding).
i love it really padma garuuu
ReplyDeleteఆ ఆశా భావమే మన జీవితాలను నడిపిస్తోంది .....చాలా బావుందండీ !
ReplyDeleteevandi ,,chala baga vundi,,,nijanni chebtune ,,,abbdanga batukutunna teeeru lo ee teearanni cheraleka,,,chastu barataukutunna
ReplyDeletebratukulu endarivio,,,
kadaa
Padma garu asalu ela vastunnaiye andi meeku e thoughts chala chala bagundi mee kavitha goodBest of Luck My der Nesatamaaaa
ReplyDelete