నా తలపులలో...

చిరుగాలులు నీకు చింతనిస్తున్నాయా!
నా తలపులు నీలో తబ్బిబౌతున్నాయా!
నా ఊసులేమైనా నీకు ఊరటనిస్తున్నాయా!
నీ కనులు స్వప్న లోకాలలో విహరిస్తున్నాయా!
తొలిపొద్దు కిరణాలు నిన్ను తట్టిలేపుతున్నాయా!
ప్రతి పనిలో మన హృదయాలు ప్రతిబింబిస్తున్నాయా!
ఋతువులు నన్ను చేరమని నిన్ను అల్లరి పెడుతున్నాయా!
నా ఉనికిని నీతో ఊహించి నీ పెదవులు విచ్చుకుంటున్నాయా!
విచ్చుకున్న పెదవులను చూసి నీ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయా!
ఎడబాటెన్నాళ్ళని తనువులోని అణువణువులు ప్రశ్నిస్తున్నాయా!
నీ ఆలోచనలు నిన్ను నా దరి చేరమంటూ ఆరాట పెడుతున్నాయా!
నీ రాకతో నా సందేహాలు తీరతాయని అనుకుంటాను ప్రియా!!!
నీ కొరకై వేయి కన్నులతో ఎదురు చూస్తుంటాను ప్రియా!!!!

13 comments:

  1. Beautiful....no words for comment.

    ReplyDelete
  2. ఎంత చతురులు, మీ మానసాన్ని జంట పక్షికి బదిలీ చేసి ప్రశ్నలన్నీ వెలికి తెచ్చారే? ప్రేమ, నిరీక్షణ అన్నీ ఎంత మధురం కదా, ఎంత తరిచినా అర్థం కాని అందమైన, అరుదైన అనుభూతుల గనులవి.

    ReplyDelete
  3. Yohanth thankQ....

    ఉషగారు...మీకన్నానా!!
    ఏదో జవాబుల ద్వార అయినా మనోగతం తెలియకపోతుందా అని! ఇంతకు మించి నాకేమీ తెలీదండీ, నమ్మాలి మరి మీరు!

    ReplyDelete
  4. మీ శైలిలో ఉంది...

    ReplyDelete
  5. ప్రకృతిలో కనబడే ప్రతి అందానికి స్పందించే హృదయం మీదనుకుంటాను. చిరుగాలికి తల వూపే గడ్డి పరక కూడా మీలో కవిత్వాన్ని ప్రేరేపిస్తుందనుకుంటాను. ఇంత స్పందన కలిగే హృదయం కలిగిన మీరంటే అసూయగా వుంది. మీరు మరో మనసు కవి అవుతారేమో! ఆత్రేయకు వారసురాలవుతారేమో! ఎవరికీ తెలుసు?

    ReplyDelete
  6. చాల బాగుందండి ......

    ReplyDelete
  7. పద్మా!
    భలే, చెప్పకుండానే చెప్పి, పోక చెట్టు చాటు నుండి గురి చూసి వదిలారే మీ ప్రశ్నలను. నిజం చెప్పండి, ఈ అనుభూతులన్ని మీవి కదూ. నేను చెప్పనులెండి ఎవరికీ.

    ReplyDelete
  8. sruthi garu correct ga chepparu padmarpitha garu

    ReplyDelete
  9. శృతిగారు మీరు చెప్పరుకదా అని మీకు చెపుదాము అనుకునేసరికి హరేకృష్ణగారికి ఎలా తెలిసిపోయింది చెప్మా!!

    ReplyDelete
  10. మధుర భావాల సుమ మాల ....
    మీ మనసులో పూచిన వేళ .....
    ఆ పరిమళాల్ని ఆస్వాదించి ....
    ఆనందించడం మా అదృష్టం !

    ReplyDelete
  11. మురళీగారికి, సిరాకిపుత్ర గారికి, చిన్నిగారికి, శృతిగారికి, హరేకృష్ణగారికి ధన్యవాదాలు....
    ఆ పరిమళాలని ఆనందంగా ఆస్వాదించడాన్ని అదృష్టంగా భావించే మీ అభిమానానికి నా అభివంధనాలు....

    ReplyDelete
  12. Padma Garu Asalu edo undi andi mee chethi lo good Best Of lUck

    ReplyDelete
  13. vichchukunna;
    nii pedavulu........
    "niiku(+niikE)kanipiMchaDamEmiTI?"
    ii chiTikeDu mistake nu vadilEsTE,mii kavita chaalaa baagunnadi.
    naa >>>>>
    http://chitravarnam.blogspot.com
    nu chuusi,mii abhipraayaM tappaka cheppaMDI!please!
    miiku Sishyuraalinigaa avakaaSaM istaaraa?
    (konamanini@gmail.com )

    ReplyDelete