ప్రేమించాకే తెలిసింది....

ఓ అమ్మాయి మనసివ్వాలని ఆరాటపడింది
ప్రతిక్షణం తనలో తనే తర్జన బర్జన పడింది

ప్రపంచమంతా తనలాగే స్వచ్చమైనదనుకుంది

అందమైన లోకమని భ్రమపడింది

ప్రేమే లోకమనుకుని ప్రేమలో పడింది..


ప్రేమించాకే తెలిసింది....


ఆ అమ్మాయి ఇప్పుడు ఆలోచిస్తుంది

లోకం రంగులమయం అనితెలుసుకుంది

అమాయకత్వంతో మోసపోకూడదనుకుంది

ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమేనంటుంది

స్థిరమైన గమ్యంతో ముందుకి సాగిపోతుంది..

7 comments:

 1. అమ్మాయి తీసేసి అబ్బాయి, ది బదులు డు పెట్టండి అది నా కవిత.... :) lite lenaa.. jst 4 fun.. simple n expressive..

  ReplyDelete
 2. బాగుందండి..

  ReplyDelete
 3. అందమైన లోకమనీ ...రంగు రంగులుంటాయనీ ....
  అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా ....

  ReplyDelete
 4. కవిత, బొమ్మ రెండు బాగున్నాయి.....

  ReplyDelete
 5. అందరికీ ధన్యవాదాలండి...

  ReplyDelete
 6. అందరికీ ధన్యవాదాలండి...

  ReplyDelete