Saturday, May 23, 2009

నీరాకతో.....

నీవు వస్తున్నావని చిరుగాలి కబురు తెచ్చింది
అది విన్న నా మనసు నాట్యమాడింది
ఇప్పుడే నా చుట్టూ వెన్నెల విరబూసింది
నీవు లేక నా కంటి కాటుక కరిగింది
ప్రతిరోజు నా కన్నీరే నాకు తోడైంది
నేను వద్దన్నా నా మనసు నీ వెంటవచ్చింది
ఇంతవరకు పెదవులపై చిరునవ్వు కరువైంది
నీవు వచ్చాకే నాకు తెలిసి వచ్చింది
వెన్నెలకూడా నాపై ఇన్నాళ్ళు అలిగింది
నీ అండతో నా మనసు నామాట వినను అంటుంది
ఇప్పుడు గుర్తొచ్చానా అని అద్దం నన్ను ప్రశ్నించింది
ఆ ప్రశ్నకి నా సిగలోని ఎర్ర గులాబి పక్కున నవ్వింది
ఇది చూసిన నా హృదయం కొంగుచాటున దాగింది
నీలా నేను దాగలేనంటూ నా ముఖం విప్పారింది
నీవే నా ఆనందాన్ని తిరిగి తీసుకుని వచ్చింది....

14 comments:

yohanth said...

Its touching one.....

ఉష said...

నిన్నటి నా వేదన :(

"ఈ నిశ్శబ్దం నను నలిబిలిచేస్తుంది, ఈ ఎడబాటు నను శిధిలజీవిని కమ్మంటుంది
నీవు లేని వనాన నేనిక విహారం చేయను, ఈ విలాపాల విరహగీతమాలపిస్తాను
నివురువోలె నింగికెగయనా, వానవోలె నేలకు జారనా, ఏవిధముగ నిను చేరను?
ఏ దిక్కున నిను వెదకను, వేగిరపడి ఏ మలుపున నిను కలవను?"

నేడు మీ కవితతో ఉపశమనం. :)

రాఘవ said...

super..

srujana said...

మీ నిరీక్షణలో ప్రేమ దాగివుంది....

భాస్కర రామి రెడ్డి said...

పెదవులపై చిరునవ్వుల కరువు నిండువెన్నెల అలకను
హృదయము దాచే గిలిగింతలు ముఖం దాచలేదంటూ

మనసును కవితా ఊయలలో ఓలలాడించారు.

...Padmarpita... said...

యోహంత్, రాఘవ, సృజన గార్లకి ధన్యవాదాలు.
ఉషగారూ...మీ మరువపు చల్లదనంలో ఈ ఉపశమనం ఎంత చెప్పండి!!!
భాస్కర్ గారూ.... మీ అభిమానానికి కృతజ్ఞతలు

jayachandra said...

ప్రియుని రాకతో తిరిగి వచ్చిన ఆనందం---చక్కని భావం. చల్లని గీతం.

mannava gangadhara prasad said...

మీ అభినందనలకు నమస్సులు
సాహితీ సహృదయానికి వందనాలు
విరియాలి సదా ఈ స్నేహసుమాలు
- మన్నవ
మీ బ్లాగు చూసి నేను మరింత ఒదిగి ఉండాలని నాకు నేనే చెప్పుకున్నాను.
సో.. సోదరీ మీ కళాహృదయానికి మరో సారి వందనం
...మన్నవ65

ప్రేమ పక్షులు said...

nice blog... maintaining.. ...keep it up.....

ప్రియ said...

చాలా బాగుంది మీ కవిత. అలిసిన మనసుకి ఉపశమనం.

http://priyamainamaatalu.blogspot.com/2009/05/blog-post.html

చూసి మీ అభిప్రాయం చెప్పండి.

aswinisri said...

"ఇప్పుడు గుర్తొచ్చానా అని అద్దం నన్ను ప్రశ్నించింది
ఆ ప్రశ్నకి నా సిగలోని ఎర్ర గులాబి పక్కున నవ్వింది"-- awesome!!!

aswinisri said...

"ఇప్పుడు గుర్తొచ్చానా అని అద్దం నన్ను ప్రశ్నించింది
ఆ ప్రశ్నకి నా సిగలోని ఎర్ర గులాబి పక్కున నవ్వింది"-- awesome!!!

aswinisri said...

"ఇప్పుడు గుర్తొచ్చానా అని అద్దం నన్ను ప్రశ్నించింది
ఆ ప్రశ్నకి నా సిగలోని ఎర్ర గులాబి పక్కున నవ్వింది"-- awesome!!!

పరిమళం said...

"వెన్నెలకూడా నాపై ఇన్నాళ్ళు అలిగింది" అద్భుతమైన భావం !