అరిగిన కుంచెతో అందాలు అద్దనా
పూరించని చిత్రానికి నా పేరుపెట్టనా
మెప్పించలేని మాటలు పలుకగలనా
జగమెరిగినవాడి జాతకం నే చదవనా!
బ్రతకలేని భావాలు ఎన్నని వ్రాయగలను
మదిమెచ్చకుంటే మెదడుకు అందించను
మరపన్నదేలేని నన్నునేనేం తలుచుకోను
మనసులోనే పదిలమంటే మెప్పులేం కోరను!
మీరే నిండిన మోముకి అలంకారాలెందుకు
పూలై విరిసివాడే పేరుప్రఖ్యాతులు ఎందుకు
మంచి చెబితే ముళ్ళైనా మణిహారమే నాకు
గుచ్చుకుని భాధలో గుర్తొస్తుంది తడవతడవకు!
మంచి చెబితే ముళ్ళైనా మణిహారమే నాకు
ReplyDeleteగుచ్చుకుని భాధలో గుర్తొస్తుంది తడవతడవకు!
well said
This comment has been removed by the author.
ReplyDeleteపూలై విరిసి, వాడే పేరుప్రఖ్యాతులు ఎందుకు
Deletesorry andi,manchi line idi, aa cama leekapoye sariki nene koncham confuse aiyanandi, emanukokandi,
This comment has been removed by the author.
ReplyDeleteBTB, ఎప్పుడూ మీ కవిత బొమ్మ పై కామెంట్ ని నివారిస్తుంది మనసు తిప్పనీకుండా ;)
ReplyDeleteబొమ్మ చాలా బాగుంది, రంగుల ఫ్లో లో ఉన్న ఈజ్...వాటర్ కలరా?
చక్కటి భావాలని రంగరించి
ReplyDeleteచిత్రించిన తీరు చాలా బాగుంది...
మీరే నిండిన మోముకి అలంకారాలెందుకు ?
పూలై విరిసివాడే పేరుప్రఖ్యాతులు ఎందుకు?
మంచి చెబితే ముళ్ళైనా మణిహారమే నాకు
గుచ్చుకుని భాధలో గుర్తొస్తుంది తడవతడవకు!
ఆఖరి నాలుగు వాక్యాలు మనసుని కదిలించాయి..
superb...
@శ్రీ
ఎవరన్నారు బ్రతకలేని భావాలని , ఊపిరి ఊదేస్తుంటేనూ , " మీరే నిండిన మోముకు అలంకారాలేందుకు" వహ .. ఎంత కొత్త ప్రయోగాన్ని సందించారు. పద్మగారూ చాలా బాగా ఆవిష్కరించారు. ఇంకా పొగడాలని ఉంది కానీ గురువు ఎక్కువగా పొగడకూడదు.
ReplyDeleteమీ కవిత అద్భుతం మీ painting చూడగానే నాకు కలిగిన భావన
ReplyDeleteఆమెవన్నీ రంగుల స్వప్నాలే అని
పాపమా కన్నీళ్ళకేం తెలుసు
తెలుసుంటే అవికూడా రంగులద్దుకునే జారేవేమో.
writing n painting, both are competing with each other.
ReplyDeleteబ్రతకలేని భావాలు ఎన్నని వ్రాయగలను?
ReplyDeleteమీరే నిండిన మోముకి అలంకారాలెందుకు?
nice padmarpita gaaru.....:)
చాలా తాత్వికంగా ఆర్థ్రంగా గుండె తడిని కుంచెకద్ది భావాన్ని అక్షరీకరించారు...అభినందనలు మేడం..
ReplyDeleteవిభిన్నమైన కవిత." మీరే నిండిన మోముకి అలంకారాలెందుకు".ఆ మోము లోని వెలుగుకు వేరే అలంకారాలెందుకు.మంచి ప్రయోగం.
ReplyDeleteఎంత సున్నితంగా చెప్పారండి.
ReplyDeleteచాలా బాగుంది మీ భావవ్యక్తీకరణ.
భావాలన్ని అక్షరాలుగా పేర్చి, వాటికి రంగులు అద్ది, మనసులో అందరికి ఒక పెద్ద పీట వేసి,
ReplyDeleteసమర్పించుకున్న కవితా సుమం ఇది!!
చక్కగా ఉంది!
painting chaalaa nachindandi padmarpitaji.
ReplyDelete