ఇరువురి ఆలోచనల్లో, పనిచేసే విధానంలో బోలెడంత వ్యత్యాసం!
అందుకేనేమో ఆమెపై అతనికి అతనిపై ఆమెకి ఆ అధికారం!
ఏమైనా ఇది మాత్రం కేవలం చిరు చమత్కార ప్రయత్నం!
మీరంతా చదివి ఆనందిస్తే నాకెంతో సంతోషం!!!!
ఏమైనా ఇది మాత్రం కేవలం చిరు చమత్కార ప్రయత్నం!
మీరంతా చదివి ఆనందిస్తే నాకెంతో సంతోషం!!!!
గమనిక:-నవ్వొచ్చినా రాకపోయినా నవ్వాలి మరి:-)
షీ/She >< హీ/He
బహుళ ప్రక్రియలపై ఒక కన్నేస్తే...
ఆమె: ఒకే సమయంలో బహుళ పనులు చేయగలదు. టీవీ చూస్తూ వంటచేస్తూ ఫోన్ మాట్లాడగలదు.
అతను:ఒక సమయంలో ఒకే పని చేయగలడు ( సింగిల్ ప్రాసస్ అన్నమాట) కావాలంటే పరీక్షించుకోండి. చూస్తున్నప్పుడు కాల్ వస్తే కట్టేయకుండా మాట్లాడే వాళ్ళెంతమందో మరి మీరే చెప్పాలి.
భాషా పరిజ్ఞానం పై దృష్టిపెడితే...
స్త్రీ: సులభంగా అనేక భాషలను తెలుసుకోగలదు కానీ నిర్ణయాలను తీసుకుని పరిష్కరించడంలో కాస్త వెనుకే ఉంటుంది.
పురుషుడు: భాష నేర్చుకోలేడు కాని పరిష్కార మార్గాన్ని సులువుగా అన్వేషించగలడు.
ఒక 3 సం!!ల బుజ్జిది 3 ఏళ్ళ బుజ్జిగాడికన్నా మూడురెట్లు అధికంగా పదజాలాలని ఉపయోగించగలదు.
విశ్లేషణాత్మక నైపుణ్యం.....
షీ: ఒక క్లిష్టమైన మ్యాప్ ఏదైనా చూసి అర్థం చేసుకోవలసి వస్తే కాస్త ముందు కంగారుపడుతుంది. ముందుగా దాన్ని ఒక పిచ్చిగీతల చిత్రం గానే ఊహిస్తుంది (ఎంతైనా ముగ్గులువేసే ముదితకదండీ).
హీ: మెదడంతా విశ్లేషణాత్మక ప్రక్రియా స్థలమే. ఇలా చూడగానే అలా అర్థం చేసుకునే పరిజ్ఞానం ఈ విషయంలో మెండు.(హీస్ అంతా కాలర్ ఎగురవేసుకోండి).
డ్రైవింగ్ విషయంలో...
మేల్: కారు డ్రైవింగ్ విషయంలో దూరంగా ఉన్న వస్తువులను సులువుగా పసిగట్టి దిశను వెంటనే మార్చి వేగంగా నడుపగలడు.
ఫిమేల్: ఈ విషయం లో కాస్త స్లో అనే చెప్పాలి దూరంగా వస్తువుని ఆలస్యంగా గుర్తించి దానిపైనే దృష్టిని నిలపడం వల్లనే అతని ప్రక్కన ఆమె ఉంటే "జాగ్రత్త" "ఓష్" " మెల్లగా నడపండి" "భగవంతుడా" "ఓ గాడ్" అంటూ ఉంటుంది . (ఇది అతను పట్టించుకోడు, వేరో విషయం అనుకోండి).
అబద్ధం.....
లేడీస్: చాలా సార్లు అతను ఆమె ఎదురుగా అబద్ధం ఆడినప్పుడు ఆమె సహజసిద్ధమైన మెదడు సూపర్ పవర్ తో ముఖ కవళికలతో 70%, శరీర భాషతో20% మాట్లడే పదాలను బట్టి 10% పూర్తి 100% అబద్దం చెపుతున్నాడని గమనిస్తుంది.
జెంట్స్: ప్చ్.. ఈ పవర్ లేదు పాపం. అందుకేనేమో అతడు అతడితో సులువుగా అబద్ధం చెప్పగలడు.
(అబ్బాయిలు అందుకే మీ గర్ల్ ఫ్రెండ్ కి అబద్ధం చెప్పలనుకుంటే మొఖానికి ముసుగేసుకునో, ఫోన్ లొనో, లెక లైట్స్ ఆర్పేసో అబధం చెప్పంది, కళ్ళలోకి చుసి చెప్పే సాహసం చేసారో కుమ్మేస్తారు...తస్మాత్ జాగ్రత్త)
సమస్య.....
మగ: సమస్యలెన్నైనా వాటిని విడగొట్టి ఒక్కోదానికి పరిష్కారాన్ని చివరికి కనుక్కుంటారు. అందుకేనేమో వారు అలా ఆకాశం వైపు చుస్తూ ఆలోచిస్తూ, వారిని పలుకరిస్తే విసుగు చెందుతారు ఎక్కువగా.(కొందరు అలా మైళ్ళకొద్ది దూరం నడిచేస్తూ ఆలోచనల్ని రింగు రింగులుగా పొగరూపంలో వదిలేస్తుంటారు)
ఆడ: ఈమె పరిష్కారించడం మానేసి అది ఎవరికో ఒకరికి చెప్పుకుని దానిగురించి అక్కడితో వదిలేస్తుంది( వీలుంటే ఒకసారి ముక్కు ఛీది కుదిరితే నాలుగు కన్నీటి బొట్లురాల్చి) అంతే ఇంక అయినా కాకపోనా పట్టించుకోదు.
(అందుకే రాత్రి భర్తకు అవి ఇవి చేరవేసి ఆమె ప్రశాంతంగా నిదురపోతుందని ఆయనేమో తిరిగే ఫ్యాన్ రెక్కలు లెక్కిస్తుంటాడని నానుడి)
కావలసినవి....
ఔరత్: సంసారం, పిల్లలు, కుటుంబం, బంధువులు, (ఇంకేం కావాలంటే... మరి అన్నీ కావలసినవే)
ఆద్మీ: మంచి ఉద్యోగం, విజయం, అంతస్తు, తాహతు, స్నేహితులు, మద్యం అలవాటుంటే పార్టీలో ఒక పెగ్ అంటూ ఫుల్ తో ఆపలేక హైరానా పడతాడు. (మంచి మాటతో, ఒక టీ ఇస్తే చాలు పొంగిపోతానంటూ ఇంకేవో ఊహించుకుని పొంగిపోయే వారుకూడా లేకపోలేదులెండి).
వాక్చాతుర్యం....
ఈ విషయంలో నైపుణ్యమంతా ఆమెదే.....ఆమె పరోక్ష పదాలను ఎక్కువగా వాడితే, అతను అన్నీ డైరెక్ట్ గానే చెప్పాలనుకుంటూ అప్పుడప్పుడు దెబ్బలు తింటుంటాడు అంటే బాగోదేమో.
ఒక కాఫీ షాప్ ని చూసిన వెంటనే ఆమె "మీరు బహుశా కాఫీ తాగాలనుకుంటున్నారేమో అంటుంది (ఆమెకి తాగాలని ఉంటుంది)....గమనించారో లేదో అతను మాత్రం కాఫీ తాగుదాం రా అంటాడు.
ఎమోషన్స్ & ఫీలింగ్స్ విషయానికి వస్తే...
మహిళలు ఆలోచించకుండా మాట్లాడితే, పురుషులు ఆలోచించకుండా పనిచేస్తారు...
ఇది ఎంతమంది ఒప్పుకుంటారో లేదో తెలీదుకానీ ప్రపంచంలో ఎక్కువ శాతం మగ ఖైదీలే ఉన్నారనేది మాత్రం వాస్తవం.:-)
నిజాలు నిర్మొహమాటంగా చెప్పేరు. ఎంతయినా స్త్రీ పురుషునికంటే అన్నిటిలో ఒక మెట్టు ఎక్కువే. స్తీ శక్తి, పురుషుడితో చేరితే సృష్టి. అదే అద్వైతం. ఒకటే అయిన రెండు, రెండుగా కనపడే ఒఅకటి.
ReplyDeleteనిజాలు నిర్మొహమాటంగా చెప్పి మొహమాటపెట్టానో లేక మొట్టికాయలే తిన్నానో కాని :-) మీరు చెప్పిన "రెండుగా కనపడే ఒకటి" అనే మాట మాత్రం భలే నచ్చేసిందండి. థన్యవాదాలు మీ స్పందనకు.
Deleteమీ అబ్జర్వషన్ అదిరిందండి, మనస్తత్వాలను భలే విశ్లేషంచారు,ఓ చిన్న డౌట్ వస్తుంది, ఇక్కడ ఆమె, షీ , ఫీమేల్, ఆడ, ఔరత్, మహిళ ఇవన్ని నాకైతే పద్మార్పితను చూసినట్టే వున్నాయండి, హి,హీ.........సరదాకేలేండి.నవ్వొచ్చినా రాకపోయినా నవ్వాలి మరి:-)
ReplyDeleteప్రపంచంలో ఎక్కువ శాతం మగ ఖైదీలే ఉన్నారనేది మాత్రం వాస్తవం.:-)
ఇది మాత్రం వందశాతం నిజం అని నోరుమూసుకోని చెప్పోచ్చు, జైల్లో అయితే కొంచం స్వేచ్ఛగ వుండచ్చు, ఇంట్లో అంత సీన్ కూడా వుండదు కదా, మరి. హ, హ...........
ఓ థ్యాంక్యూ భాస్కర్ గారు... డౌటేనా:-( ఇన్ని క్వాలిటీస్ పద్మార్పితలో ఉంటే ఇంకేమండి బ్లాగ్ లో ఎందుకుంటానండి ఏ పద్మశ్రీనో, పద్మభూషణ్ అవార్డ్ ఫంక్షన్ లోనో ఉంటాను కానీ.... నవ్వానుగా :-)
Deleteమీరే ఒప్పుకున్నారుగా....నో కమెంట్స్ హ:-) హ:-)....
..beautiful :-)
ReplyDeleteThank Q Pavani:-)
Deleteమా విశ్లేషణ బాగుంది.
ReplyDeleteసరదాగానే ఇదీ తీస్కోండి
బ్లాగరు : టపా చదివిన వెంటనే ఏదోటి కామెంటు చేస్తాడు.
బ్లాగిణి : ఆచి తూచి కామెంటు చేస్తుంది.
good one.
Deleteఅవునండోయ్!
Deleteఆత్రేయగారు....థ్యాంక్సండి
Deleteబహుకాలానికి విచ్చేసారు
మీ విశ్లేషణలో నిజం ఉన్నా...
ఆచితూచి చేసినా ఆడబ్లాగర్స్ కి ఫాలోవర్స్ ఎక్కువ అని అభాంఢాలు..:-)
ఇవి వేసేది కూడా మగ బ్లాగర్సేనండోయ్:-)
Just kidding...smile please:-)
జ్యోతిర్మయి..గుడ్ అంటే బాడ్ అనలేనుగా:-)
Deleteశ్యామలీయంగారు...మీరు అవునండోయ్ అంటే కాదంటానా:-)
:)))
ReplyDeletethanks for :-)))
DeleteGood attempt..any how it is Nice
ReplyDeleteThanks for your compliments.
Deleteమీ ఆమె అతడు విశ్లేషణ బాగుందండీ...
ReplyDeleteకానీ కొన్నింటిలో అటూ ఇటూ జరగొచ్చనుకుంటా...
ఉదాహరణకు పనుల విషయంలో మగాళ్ళలో కూడా ఒకేసారి బహుళ కార్యాలు చేసే వాళ్ళుంటారు...:-)
అలాగే కెరీర్ విషయంలో కూడా పోటీ పడుతున్నారు కదా...
ఖైదీల విషయంలో మాత్రం పూర్తిగా ఏకీభవిస్తున్నా(బయట జైళ్ళలో)...
కానీ ఎక్కువ శాతం మహిళలు గృహ నిర్బంధంలోనే గడిపేస్తున్నారు మరి...కాదంటారా??
యింత మంచి పోస్ట్ రాసినందుకు అభినందనలు పద్మాజీ...:-)
కొన్నింటిలో ఏంటండి బోలెడన్ని విషయాల్లో కుడిఎడమలౌతూ ఉంటాయి...కాదంటారా:-)
Deleteకెరీర్ విషయం మాత్రం ఎక్కువ శాతం కృషిపైనే ఆధారపడింది అంటాను ఏవరికైనా సరే...
మహిళా గృహనిర్భంధం గురించి నేను మాట్లాడితే...భాభాస (భార్యా భాధితుల సంఘం) వాళ్ళు నన్ను దుమ్మెత్తి పోస్తారండి మరి...:-)
మీ అభిమాన స్పందనలకు అభివందనం వర్మాజీ..:-)
మీ విశ్లేషణ చాలావరకు సరియైనదే.
ReplyDeleteఒప్పుకున్నారుగా కొన్నైనా థ్యాంక్యూ:-)
DeleteGood post!
ReplyDeleteఆడ మగ ఇద్దరూ సమానమే, కాకపోతే ఆడవాళ్ళు కుంచెం ఎక్కువ సమానం :)
http://100telugublogs.blogspot.com
.
Thanks for compliment!
Deleteఅంతేనంటారా:-)
padmarpita chaal chaala bagundi andi. naku chaal correct anipistundi. Image kuda chaala bagundi. nice one....
ReplyDeletethank Q very much.
Delete:)
ReplyDelete:)థ్యాంక్యూ..
Deleteభలే చెప్పారు..
ReplyDeleteఔనంటారా...:-) థ్యాంక్యూ!
Deleteపద్మ గారూ!
ReplyDeleteమీరు చెప్పిన వాటిలో అన్నీ అంగీకరించలేము...:-)
కేవలం MALE... FEMALE...
కాకుండా...STUDIES..SUBJECT OF STUDIES...
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే...
కొత్త విషయాలు తెలుస్తాయి మనకి...:-)
అదంతా పక్కన పెడితే...
ఇదంతా...మగ బ్లాగర్లు,...ఆడ బ్లాగర్ల మధ్య యుద్ధం తేవాలనే...
కుట్ర కూడా ఏదో కనిపిస్తోంది...:-)))....:-)))
అబద్ధాల గురించి ఒక మంచి మాట చెప్పి ముగించేస్తాను నా వ్యాఖ్య..
" అబద్ధం చెపితే...ప్రతిసారి మనం ఏమి చెప్పామో గుర్తు పెట్టుకోవలసి వస్తుంది..
అదే..నిజం చెప్తే..మనం ఏమి చెప్పామో ఇంతకుముందు అని గుర్తు పెట్టుకొనే పని ఉండదు.."
@శ్రీ
శ్రీగారు!
Deleteఒకరు చెప్పిన వాటిలో ఎప్పుడూ అన్నీ అంగీకారయోగ్యం కావండి...:-)
ఇంక STUDIES..SUBJECTS వీటిని పరిగణలోకి తీసుకుంటే కొత్త విషయాలు తెలుస్తాయి but I think these all are depend on our own STRUGGLES & TALENTS...:-)
వాటిగురించి తెలుసుకోవడమే తప్ప వ్రాసేంత పరిజ్ఞానం లేనిదాన్ని:-)
అందుకే పక్కన పెట్టేస్తున్నా...
అమ్మో ఇలా కూడా యుద్ధాలు వస్తాయని ఇప్పుడే తెలిసింది...
అలాంటి యుద్ధ కుట్రలేమైనా వస్తే మీరే రాయబారం నడపాలండోయ్..:-)))...:-)))
మీరు చెప్పిన ఈ మంచిమాట!
రాజ మార్గానికి రహదారన్నమాట!
Thanks a lot for your valuable & advisable reply.
మొత్తానికి మీ థీసిస్ వీటిపైన పడిందన్నమాట.ఇవన్నీ అక్కడక్కడ అందరికి అనుభవమైనవే .మీరు వాటిని కూర్చారు.ఆడ,మగ ఆలోచనా ధోరణి ఇంకా విభిన్న విషయాల్లో వ్యవహరించే తీరు అన్ని వేరు వేరుగా, కొన్ని మీరు ప్రస్తావించిన తీరుగా వుంటాయి.men are from mars,women are from venus అని ఒక బుక్ వుండాలి అందులో ఏమైనా ఇవన్నీ ఉన్నాయా!
ReplyDeleteథ్యాంకండి మీ స్పందనకు....థీసిస్ అంత థియరీ వ్రాసానంటారా..?:-)రాసిన దాంట్లో పాయింట్స్ ని కరెక్ట్ గా కాచ్ చేసారు. ఆ పుస్తకమే నేను చూడలేదు(I will try to read that book).... అయినా అలాంటి పుస్తకాలని మహానుభవజ్ఞులు వ్రాసి ఉంటారు కదండి!
Deleteపద్మగారు కవర్ చేసిన వాటిల్లో 90% నిజాలే ఉన్నాయి. ఇంక మిగిలిన 10% అంటారా ఆడమనసుకదా ఒప్పులేక అలా:)
ReplyDelete90% మెజారిటీ లో 10% మైనారిటీదేముందిలెండి:-) థ్యాంక్యూ!
DeleteMultitasking? noway! Its a fact that when a 2786th episode of a Telugu TV serial is going on, Telugu ladies wont do any task what-so-ever, forget phone calls, an earth quake/house on fire wont have any effect, unless TV is not effected.;)
ReplyDeleteLanguage skills? I doubt. I know some ladies that missed a bus as they took sweat time understanding route 'written' on bus at a typical Hyderabad bus-stop. Many often board a wrong bus too to do a Detour.;)
Analytical skills? Its proved that women were born with a defective brain that weigh much less size & mass than men. No wonder they have poor analytical skills.;)
Driving skills? Men never ask for directions to go for a place en-route, even if they are new to a place. Women stop and ask directions for every turn on the road. ;)
Telling lies? Not a problem. We start our day with lies & end it with more lies. Just ask any husband why he came late from work! Rajamouli got all those hits with these stories only ;)
Problem solving skills? women do start the process of solving problems, but they never finish them. Most of their multitasks gets started fine, but not all tasks gets finished, most would be delegated to others.;)
necessities? men look for more definitive big-picture things in life. women look at intangible & petty stuff with micro-vision. All that drinking at parties is help improve social networking that lead to new high paying jobs & opportunities etc. that in turn are helpful for spouses to buy gifts etc ardhachesukorooo ;)
communication skills? Men are pretty straight forward in communication, wastes no time for anyone, women always beat around the bush, were indirect never come to the point in communication. ;)
Feelings & emotions? Its impossible not to think if you do any work but its possible to talk non-sense without thinking. most crimes in the world for done for women, to women but by men & later suffered by men.
--- Now its time for me to run fast & hide in cave for a while. ;)
multitasking అంటే..రెండు సెరీల్స్ ని ఒకేసారి మార్చి మార్చి చూట్టమండి.అది మా అమ్మ కూడా చేస్తుంది.
Deletelanguage skills..ఆడవారికే ఎక్కువండి.కావాలంటే మా అమ్మనోసారి మీ పేరేంటని అడిగి చూడండి.పది నిమిషాలు దానిగురించే (తనే) మాట్లాడింతర్వాత కూడా కనిపెట్టలేరు.
Telling lies-..'వwe start with lies..' అనటంలోనే దొరికిపోయారు. ఆడవాళ్ళెప్పుడూ అబధం చెప్పరు.కాకపోతే వాటిల్లో నిజముండదంతే.
నావోటు..పద్మార్పిత గారికే.
Please don't search for negative things in this post....this is just for fun and be cool while reading and smile with whole heart:-)
Deleteno need to run away & hide in a cave be with us and share with us as a friend.
Thanks for visiting my blog.
Pavani garu thanks for your vote and supporting me:-)
DeleteApologies for the negative comments. Just trying to be funny. ;( As such I have already proved that I am a big liar, being a man.
DeleteOne TV serial itself would give me headache lasting for hours, two at the same time? Waaaaaaaaa....
Apologies are not applicable friend:-)
DeleteEnjoy the fun in watching!! Waaaaaa:-)
:)హమ్మయ్య ఇలా నవ్వుతూ ఉండండి..Thank Q!
ReplyDeleteతేడా లున్నప్పటికిని
ReplyDeleteతోడూ నీడగుచు బ్రతుకుతూ గడుపన్
గాఢంపు ప్రేమ బంధము
ఆడా మగ నొకటి గాగ నలరించు గదా !
----- సుజన-సృజన
ధన్యవాదాలండి మీ స్పందనకు.
Deleteహా హా భలే రాసారే, అన్నీ నిజమేనేమో మీరు చెప్పారుగ:)
ReplyDeleteనిజాలు చెపితే తెలుసుకునే వారికంటే అనుభవంతో నేర్చుకున్నవే పదికాలాలపాటు గుర్తుండిపోతాయేమో కదండి.:-)థ్యాంక్యూ
Deleteభలే చెప్పారే...మీ నిశిత పరిశీలనకు ఓ మచ్చు తునక ఈ పోస్ట్...
ReplyDeleteహెచ్చు తగ్గులు లేని చోటే లేదు కదా...
ఎందుకంటే భూమి బల్లపరుపుగా లేదు కాబట్టి...
కావున ఒకరికొకరు అడ్జస్ట్ అయిపోవడమే...
ఖాళీలను పూరించుకుంటూ...:-)
అభినందనలు పద్మార్పితగారూ..
బాగా చెప్పారండి. మీ అభిమాన స్పందనకు నెనర్లు.
Deleteభలే విశ్లేషించి చాలా బాగా చెప్పారు.
ReplyDeleteచదుతున్నంతసేపూ చిరునవ్వులు..హ హా...నిజమే అనుకుంటూ...
మగవారిని బాగా విశ్లేషించారు...అయితే ఎక్కువ క్రెడిట్ ఆడవాళ్ళకే ఇచ్చారేమో అనిపించింది.
మరంతేనేమో...
"ఆడదె ఆధారం మన కత ఆడనె ఆరంభం...." పాట గుర్తుకొచ్చింది చదువుతుంటే ;)
అలా నవ్వాలనే నా ఆశ కూడానండి:-)
Deleteఅన్నీ నిజాలేనంటూ ఆడవాళ్ళకే క్రెడిట్ ఇచ్చారనేది మీరు కాదు రాసింది చిట్టి మీద మీకున్న అభిమానం అలా రాయించిందండి:-) ధన్యవాదాలు!
పద్మగారూ, చూసారా మగవాళ్ళంతా ఒకే రకంగా ఆలోచిస్తున్నారు, అర్ధం చేసుకోరూ.... మొదట అతడా? అన్నారు కదా అంటే మగవారే కదా ఏమిటో వీళ్ళను ఎప్పుడు బాగు చెయ్యాలో ఏమో.
ReplyDeleteఫాతీమాగారు అదేకదా అర్థం చేసుకోరూ....:-) థ్యాంక్యూ!
Deleteపద్మా అంతే మనం ఎంత మంచోళ్ళమైనా అణిగిమణిగి ఉన్నా ఆధిక్యత మనదేనని మనకే అంటగడతారు పెత్తనం ఇచ్చామని పైకి చెప్పుకుంటూ ప్రశాంతంగా బ్రతికేస్తారు..:) భలేగా రాసావు!
ReplyDeleteసృజనగారు అంతేనండి గమనించారో లేదో చిత్రంలో కూడా వాళ్ళనే పైన పెట్టానా గొప్పగా అయినా మనల్ని అనడం ఆనవాయితీ అయిపోయిందండి:-)
ReplyDeleteపోనీలెండి వాళ్ళు అలా అనడమే మనకి ప్లస్ పాయింట్:-)