ఏమని బదులీయను!!

ఏమని బదులీయను నా దగ్గర జవాబులేని ఆ ప్రశ్నలకు...
ఏమైనాయి నీవు ఊహించిన ఆ మధురక్షణాలనడిగితే,
నాతో నడచిన నా తోడు ఏదని నా నీడే నన్ను అడిగితే!!

ఏమని బదులీయను సంధ్యవేళ సూర్యుడడిగిన ప్రశ్నకు...
వేసారినవెన్నెలే వేడెక్కి నాపై రేయంతా మంటలు వెదజల్లేస్తే,
మానసచోరుణ్ని బంధించలేని నా నిస్సహాయతను గేలిచేస్తే!!

ఏమని బదులీయను రంగులన్నీ ఏకమై అడిగిన ప్రశ్నలకు...
వాన నీరెండా కలిసి అపురూపమైన ఇంధ్రధనస్సుగా ఏర్పడితే,
ఒంటరినై కనే నా రంగుల కలలో అంతా నలుపే కనపడితే!!

ఏమని బదులీయను మేఘం ఉరిమి అడిగే ఆ ప్రశ్నకు...
వానకి పోటీ అంటూ నా కన్నీటిధారలే కుంభవృష్టిగా కురిస్తే,
ప్రేమ తీయనైనదైతే మరి కన్నీరేల ఉప్పగా అని ప్రశ్నిస్తే!!

ఏమని బదులీయను బేలగా నా ఊపిరి అడిగే ప్రశ్నలకు...
నీవులేవని తెలిసాక ఇంకా నేనెందుకంటూ నన్నే అడిగితే,
నీ ప్రాణమే నీకు పరాయిదైనదంటూ దూరంగా నన్నేనెడితే!!

32 comments:

 1. వాన నీరెండా కలిసి అపురూపమైన ఇంధ్రధనస్సుగా ఏర్పడితే,
  ఒంటరినై కనే నా రంగుల కలలో అంతా నలుపే కనపడితే!!<3

  చాలా టచింగ్ గా వుందండీ కవిత ఆసాంతం...అభినందనలు..

  ReplyDelete
  Replies
  1. నా కవిత మిమ్మల్ని టచ్ చేసినందుకు సంతోషం వర్మగారు:-)

   Delete
 2. You can answer that you are 'a rain tear in a storm, A drop of water in the huge ocean, A piece of dust in the hot desert, The breath of wind wing, The sea kiss on the shore, A book with lot’s of pages unwritten, An ephemeral moment of earthly existence, that helping hand given to a friend, hope and curse & that you are so many things in the same time but nothing important/special for the world, in all, answer that you are only a human being that is God's creation'. Simple answer, right? ;)

  ReplyDelete
  Replies
  1. Oh! thanks for giving clue :-)

   Delete
 3. Anonymous24 July, 2012

  ఏమని బదులీయను బేలగా నా ఊపిరి అడిగే ప్రశ్నలకు...
  నీవులేవని తెలిసాక ఇంకా నేనెందుకంటూ నన్నే అడిగితే,

  ఎవరి జీవితం వారిదే.

  ReplyDelete
  Replies
  1. అంతే కదండి అలా అనుకుంటూ బ్రతికేస్తాం...
   అంతేకానీ పోయినవాళ్ళతో పాటు పోతామేంటి!:-)
   ఎవరి జీవితం వారిదే.:-(

   Delete
 4. ఎలాగైనా బదులివ్వాలి మరి తప్పదు, కవ్వించే మనసు ఇలాగే అడుగుతుంది. అయినా మీకు జవాబు దొరకలేదా అయ్యో వెతికి చూడండీ.మొదటే ఉంది కదా ఊహించిన మదుర క్షణాలలో పద్మగారూ కవిత చాలా బాగుంది

  ReplyDelete
  Replies
  1. ఓ! బదులు నన్నడిగి మీరే ఇచ్చారన్నమాట...భలే మంచోరండి:-) థ్యాంక్యూ!

   Delete
 5. ప్రశ్నలు కొన్నిటికి జవాబులున్నా రావు...
  మరి కొన్నిటికి రావని తెలిసినా ప్రశ్నించక మానం...
  పద్మ గారూ!
  బాగుంది మీ కవిత..చిత్రం..
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. అంతేనంటారా....?????:-)
   తెలిసీ తెలియని ఆరాటం కదా!
   నచ్చినందుకు ధన్యవాదాలండి.

   Delete
 6. మేము మాత్రం మీ కవిత బాగుందని బదులీయడం తప్ప,
  చేయగలిగిందేముందడి, సమాధానాలు మీరు వెతుక్కోవలసిందే, నాదో చిన్న ప్రశ్న బదులిస్తారా.. (సరదాగానే అండి), మీ వీక్షకుల సంఖ్య ఒక నెలలో రెండు లక్షలు పెరిగింది, అసలు మీ బ్లాగ్ అంత పాపులర్ కావడానికి కారణమేంటి,....

  ReplyDelete
  Replies
  1. బాగుందని బదులిచ్చి బాహటంగా ఇట్లడుగుట భావ్యమా భాస్కరా:-)
   సరదాగా అడిగినా సంతోషంగా జవాబు ఇచ్చే ప్రశ్నే అడిగారుగా:-)
   ఈ కౌంట్ నాలుగు సంవత్సరాల మొత్తం వీక్షకులదనుకుంటా...
   ఇంతలా గమనించి లెక్కని గుర్తించిన మీకు అభివందనములు...

   (సరదాకి : అసలు విషయం ఏంటంటే నిముషానికి 5సార్లు మన బ్లాగ్ ని మనమే ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే సరి నెలకి 2 లక్షలకి పైగా వీక్షకులం మన బ్లాగ్ కి మనమే కాదంటారా?:-) ఎవరికీ చెప్పకండేం....అతిరహస్యం :-)5x60x24x30=2,16000)

   క్యా ఐడియా హై అని పొగడకండి...జస్ట్ ఫాలో;-)

   Delete
  2. I thought its the home page for all your browsers at home & work ;)

   Delete
  3. Oh! may that dreams come true:-)

   Delete
 7. ప్రశ్నలు శేష ప్రశ్నలు.జీవితమంతా ఇలాంటివే!ఎందుకంటే కారణమేంటో అర్థం కాదు!అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పేవారు ఎన్నటికి చెప్పరు..అటువంటి అవకాశమే రాదు.కాని తీయని మధుర జ్ఞాపకం గా ప్రేమ బాధిస్తూనే వుంటుంది .కవితలోని మీ ఆర్ద్రత అలాంటి హృదయాలను కదిలిస్తుంది.simply touching.

  ReplyDelete
 8. కవితలోని ఆర్ద్రతని ఆస్వాదించి అభినందించిన మీకు ధన్యవాధములు!

  ReplyDelete
 9. పద్మార్పితగారు
  "ఏమని బదులీయను మేఘం ఉరిమి అడిగే ఆ ప్రశ్నకు...
  వానకి పోటీ అంటూ నా కన్నీటిధారలే కుంభవృష్టిగా కురిస్తే,
  ప్రేమ తీయనైనదైతే మరి కన్నీరేల ఉప్పగా అని ప్రశ్నిస్తే!!"
  ఈ లైన్లు చాలా నచ్చాయండి.
  పెయింటింగ్ సూపర్ గా ఉందండి.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ వెరీమచ్!

   Delete
 10. క్షమించాలి
  కవిత కన్నా చిత్రంలోనే వేదన ఎక్కువగా వ్యక్తమౌతుందండి.

  ReplyDelete
 11. padma garu.... bahut acche sawaal kiye aapne ,
  tasweer ka b kya tarif karu bahut khub banayi hi..
  ek chota sa mera b sawal hi aap ke liye..
  log kahte hai ki, pathar dil roya nahi karte,
  koi muje yeh to bata de,
  Phir Chashme (jharne) pahadon se kyun nikalty hai....

  ReplyDelete
 12. Shukriya Malleshji....magar mujhe sawaal ke badle mein sawaal hi mila:-)
  Khudh ke sawaal ka jawaab na milatho....aap ke iss sawaal ka kya jawaab dhoon?:-)

  ReplyDelete
 13. అన్నీ చెప్పగల మీరే ఏమని బదులీయను? అని అడిగితే ఏం చెప్పమంటారు?:)

  ReplyDelete
  Replies
  1. బదులీయమంటే :)? అంటే ఏం చెప్పను:-(

   Delete
 14. టచింగ్ కవిత బాగుంది.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ...

   Delete
 15. "...ఒంటరినై కనే నా రంగుల కలలో అంతా నలుపే కనపడితే!! ...."
  ఇలా చాలా అద్భుతమైన భావాలడిగే ప్రశ్నలకు ఇక ఏమని బదులీయగలదు మనసు?
  సమాధానం దొరకనీ, ఇవ్వలేని ప్రశ్నలెన్నో జీవితాన....
  చాలా బాగా రాశారు.
  బొమ్మా చక్కగా కుదిరింది కవితకు.

  ReplyDelete
  Replies
  1. మీరే బదులులేని ప్రశ్నలు అంటే ఎలాగండి:-)
   ధన్యవాదాలు....నచ్చింది కదా!!!

   Delete
 16. kavitalu superb anukunte vatikanna meeru pettin images inka keka padma gaaru.......... మీరు పెట్టిన చిత్రాలు చూస్తుంటేనే నాలో ఏదో రకమైన భావం కలుగుతోంది. ఆ చిత్రాలోంచే కవితలు కూడా పుట్టుకొస్తున్నాయి......

  ReplyDelete