వర్షించిన మేఘం నిన్నేం మాయచేసింది
ఒంటరిగా తడవాలన్న కోరికను నీలో రేపింది!
వానలో తడవడం అంత ఇష్టమైతే
నా కనురెప్పలమాటున ముద్దైపో....
మేఘాలు వానై మనుషుల్ని తడిపేస్తే
నా కన్నీటిధారలో నీవు మొత్తం కరిగిపో....
ఋతుపవనాలతో పనేల నీ తలపుల జడివానకి
ఆవిరైన నీ దూరమే చాలు కన్నీరై కురవడానికి!
ఎదపై తన్ని ఎరుపెక్కిన నామోము గాంచింది
ఎదలో దాగిన ఎర్రని తనమోము చూడకుంది!
చెక్కిళ్ళపై ఎరుపుకై నీవు ఆశపడితే
నా గుండె నలుమూలల దూసుకుపో....
గుండెలయకై సిరధమనుల్లో రక్తం ప్రవహిస్తే
అవితాకి ఎరుపెక్కిన చెక్కిళ్ళతో మెరిసిపో....
ఆయుధాలతో అవసరమేల నే అంతమవడానికి
నీ ఛీత్కారమే చాలదా నే కనుమూయడానికి!
chakkaga raasaarandi, first part naku chaalaa nachindi, second part koncham confuse chesthundi,
ReplyDeleteఎదలో దాగిన ఎర్రని తనమోము చూడకుంది!
ikkada erupu enduku vadaaro cheppara please.
ఆయుధాలతో అవసరమేల నే అంతమవడానికి
నీ ఛీత్కారమే చాలదా నే కనుమూయడానికి!
ee lines super ga unnai.
good one, keep writing.
ధన్యవాధాలండి.....
Delete"ఎదపై తన్ని ఎరుపెక్కిన నామోము గాంచింది"....అంటే నన్ను కాదని వెళ్ళిపోతూ నాలోని కోపాన్ని చూసింది.
"ఎదలో దాగిన ఎర్రని తనమోము చూడకుంది"....నా గుండెల్లో దాగిన తన ఎర్రని(సిగ్గుతో)మోముని చూడకుంది.
అని నా భావం....
అలా ప్రస్ఫుటం చేయలేక పోయినందుకు మన్నించాలి.
Thank You once again....
చాలా గొప్పగా ఉంది.
ReplyDelete"...ఆయుధాలతో అవసరమేల నే అంతమవడానికి
నీ ఛీత్కారమే చాలదా నే కనుమూయడానికి!...."
ఈ ముగింపు అద్భుతంగా అనిపించింది.
మీకు ఇంతలా నచ్చినందుకు ఆనందమాయనండి. థ్యాంక్యూ!
Deleteపద్మ గారూ!
ReplyDeleteవిరహంతో మొదలై....
శృంగారపు రంగులతో ఎరుపెక్కి...
ప్రేమవేదనతో ఎగసింది మీ కవిత...
చిత్రం కూడా బాగుంది.
చిన్న సందేహం..
ఎదపై తన్ని.....అనా
లేక
ఎదపై తనని అనా?
@శ్రీ
మీ విశ్లేషణా విధానం బాగుందండి.
ReplyDeleteనచ్చిమెచ్చిన మీకు నెనర్లు...
అది ఎదపై తన్ని అనేనండి.... (గుండెలపై తన్ని కాదంటే కోపంతో ముఖం ఎర్రబడింది అని భావం.)
ధన్యవాదాలు...
Deleteఎందుకంటే రెండు అర్థాలతో వేర్వేరు భావాలని అన్వయించుకోవచ్చు
అందుకే సందేహం...:-)
@శ్రీ
పద్మార్పితగారు టచ్ చేసారు విపులంగా వివరించి.
ReplyDeleteచాలా బాగుందండి.
ధన్యవాదాలు...
Deleteపద్మార్పితగారు చాలా బాగుందండి.
ReplyDeleteథ్యాంక్యూ!
Deleteఋతుపవనాలతో పనేల నీ తలపుల జడివానకి
ReplyDeleteఆవిరైన నీ దూరమే చాలు కన్నీరై కురవడానికి!
ఇంతందంగా మీరే చెప్పగలరు పద్మార్పితగారూ..అభినందనలు..
మీరు ఇలా మెచ్చుకున్నారంటే అమితానందం:-) థ్యాంక్సండి!
DeleteOnce again i can see your mark in this post,keep it up.
ReplyDeleteThank Q very much.
Deletevirahamoo vedanaa rendu unnayi yedpai tanni ane chota inkedainaa upamanam vadi unte inkaa andamgaa undedemo, chaaalaa baaga raasaaru padmgaaru, mee prathi katitha chadivistunci nannu pilustundi mee blog loniki.
ReplyDeleteమేడంగారు....అలా ఎదపై తన్నితేనే విరహం, వేదన, కోపంతో ముఖం ఎర్రబడ్డం ఒకేసారి జరుగుతాయేమోనని చిన్నిప్రయోగం చేసానండి:-)
Deleteఎప్పుడైనా ఆలోచించి అందంగా వ్రాయలేదని అలిగి రావడం మానేయకండేం! ఓనాలుగు చీవాట్లు వేయండి కాని వదిలేయకండి:-)Thank You!
అమ్మో ఇంత బంగారు శిష్య రత్నాన్ని వదులుకుంటానా, డియర్, మీ కవితలు చాలా బాగుంటాయి నేనన్నది ఏమిటంటే కోపాన్నీ,విరహాన్నీ, వేదననీ చెప్పాలనుకున్నపుడు తాను ఎంతగా ప్రేమిస్తుందో,ఎంత వేదన అనుభవిన్చిందో అతనికి నచ్చని విరుద్ద చర్యల ద్వారా చెప్పటం అన్ని సమయాలలో సరిపోదు, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమె, మీ కవితని ఇష్టంగా చదివేస్తాను.
Deleteభలేగా నచ్చిందిగా పద్మార్పిత.
ReplyDeleteఅదేగా నేకోరుకున్నది. థ్యాంక్సండి!
Deleteआँख से बाहर निकल कर कोर पर ठहरा रहा ।
ReplyDeleteज़िन्दगी पर आँसुओं का, इस तरह पहरा रहा ।
तुम तो आईना रहे, जिसमें हज़ारों अक्स थे
मैं रहा तस्वीर जिसमें, बस वही चेहरा रहा ।
बहुत खूब कहा:-)
Deleteఋతుపవనాలతో పనేల నీ తలపుల జడివానకి
ReplyDeleteఆవిరైన నీ దూరమే చాలు కన్నీరై కురవడానికి!different poetry.
thank you
ReplyDeleteమీ ఆత్మీయ స్పందనకు నెనర్లు...
ReplyDeletewow.....superb, నాకు తెలిసి మీరు pictures మీరే draw చేస్తున్నారు కచ్చితంగా.........
ReplyDelete