నీ చిలిపి చూపులు, అవిచేసిన బాసలు
మైమరపించే నీ అనురాగపు మాటలు
నా మనసును దోచెను నీ చిరునవ్వులు
మానోహరా నిజంచేయి నా బంగరుకలలు
ఎన్నో కధనాలు, మన వలపుల కవనాలు!!!
దూరమైతే గతితప్పును నా హృదయ లయలు
ఎడబాటులో నా మది రాల్చునెన్నో నిప్పురవ్వలు
నీవు దరినుంటే చాలు అవే నాకు ఋతుపవనాలు
మన కౌగిళ్ళ ఆవిరిలో వర్షించును ప్రేమ మేఘాలు
అవి వెన్నెల ఒడిలో చెప్పుకునెడి కమ్మని ఊసులు!!!
మూడుముళ్ళువేసి నడిచేయి నాతో సప్తపదులు
కొంగునబంధించక అందించెద నా సొగసుపరువాలు
అవి మనసు పలకాలపై లిఖించు మధుర జ్ఞాపకాలు
నా ప్రేమలో మంచువలె కరగిపోనీ నీ ప్రేమ శిఖరాలు
ఏకమైనామంటే సాగరాన్న సాగు అమృతమధనాలు!!!
Beautyful and romantic lovely feelandi Padmagaru...channallaki..
ReplyDeletecongrats..:-)
వలపు దప్పికతోటి అలమటించే కోయిల ఆలాపించిన గీతంలా,
ReplyDeleteమనోహరుని మనసు చుట్టూ బిగించినపాశంలా,
ఊరిస్తూ దూకుతున్న వయసు జలపాతంలా,
చిరునవ్వులతో ప్రేమాగ్నిని కురిపించే,
పద్మార్పిత కవితలా,
చాలా బావుందని చెప్పి,
ఆపలేని మాటలా వుందేమో,.. కదా ఇది.
సాగరాన్న, correct it, please.
ReplyDeleteపద్మ గారూ!
ReplyDeleteచక్కని ప్రేమలేఖలా ఉంది మీ కవిత....
చిత్రం కూడా చాలా బాగుంది...
గమనిక: కొంగున కట్టుకోనంటూనే...చున్నీలో బంధించేసారే!...:-)))
మంచి కవితకి అభినందనలు మీకు.
@శ్రీ
పద్మార్పిత, మీ బ్లాగ్ ని మొదటి సారిగా ఈరోజు చూస్తున్నాను. మొదటి సారికే మీ టపాలు మనసుకి ఆహ్లాదాన్ని కలిగించినాయి.
ReplyDeleteకవిత బాగుందండి.
ReplyDeletechaal baagundi padmarpita gaaru.......
ReplyDeleteప్రేమించిన మనసు జీవితాంతం దరిచేరి తోడైతే, చేరలేక దూరమైతే...ఎంత తేడానో కదూ, రెంటికీ...
ReplyDeleteభావం కవితలో బాగా ఇమిడింది. చక్కగా రాశారు.
బొమ్మా చాలాబాగుంది.
Chala romantic ga bavundi Padma garu me kavitha....
ReplyDeleteపద్మ గారూ, అందమైన ప్రేమ లేఖ లా ఉంది.
ReplyDeleteచక్కటి సందేశంలా ఉంది.
గగనంలో విహరించే విపంచిలా ఉంది.
మొదటి నుండీ మీ శైలికున్న ప్రత్యేకత చెక్కు చెదర లేదు.
పద్మార్పిత గారూ..
ReplyDeleteకవిత,చిత్రం రెండూ చాలా బాగున్నాయండీ..
బాగుందండీ
ReplyDeleteమీ బ్లాగును ఎప్పుడూ చూస్తూంటాను.
ReplyDeleteఅద్భుతమైన కుంచె మెరుపులతో అలరారే
మీ బ్లాగు వన్నెలకు అభినందనలు.
కవితలుకూడా భావస్ఫోరకంగా
ఆహ్లాదకరంగా ఉంటూన్నవి పద్మార్పిత గారూ!
(కాదంబరి;konamanini)
;
Nice :)
ReplyDeleteఓహ్...పద్మార్పిత ఈస్ హియర్ అగైన్:)
ReplyDeleteఇలా అలవికాని అనురాగాన్ని ఎలా రాస్తారో మీరు...చాలాబాగుంది!
ReplyDeleteపద్మార్పితా అంటూ...."సరాగాలు" కు
ReplyDeleteప్రేమతో స్పందించిన వర్మగారికి, భాస్కర్ గారికి,
శ్రీగారికి, భరత్ గారికి, anrdగారికి, శృతికి,
చిన్నిఅశకి, శ్రీవల్లికి, ఫాతీమాగారికి, రాజిగారికి,
చిన్నిగారికి, కాదంబరిగారికి, ఫోటాన్ గారికి,
సృజనగారికి, yohanth కి పరవసినై చేస్తున్నా ప్రణామములు.