కవితా! నాలోని భావానివై ఉరకలు వేయి
నీకు ప్రతి రూపంగా నన్ను పలికించేయి
కవితా! నాలో ఏమూల దాగినా వచ్చేయి
నా ఆలోచనలకి అక్షరాలని జోడించేయి
కవితా! అజ్ఞానినని అలుసుగా చూడకోయి
నాతోడై పదకుసుమాలుగా విరబూసేయి
కవితా! నీకు అనర్హమంటూ ఏదీ లేదోయి
నీవు పలికించే ప్రతిపదంలో జీవంపోయి
కవితా! నన్ను కాదని వేరొకరి సొత్తైపోయి
శూన్యానికి నిదర్శనంగా నన్ను చూపకోయి
కవితా! మందబుద్ధినై తప్పులు చేస్తానోయి
పడిలేచిన నేను లేడినై పరుగిడతానోయి
కవితా! ఆచరించే వాటినే లిఖింపచేయి
సాలెగూడై అల్లుకునే పదాలు వలదోయి
కవితా! పసందైన పదపానకానివి కావోయి
పద్మార్పిత భావాలలో పంచధారవైపోయి!!
కవితా! ఆచరించే వాటినే లిఖింపచేయి
ReplyDeleteసాలెగూడై అల్లుకునే పదాలు వలదోయి
చాలా నచ్చాయండీ పద్మగారూ...
కవితను కూడా మీ కొంగున ముడివేసారు కదా...సుమాభినందనలు...
మీకు నచ్చిందంటే "సాలెగూడు" అనే పదమే కారణమేమో:-)
Deleteఎక్కడండీ ముడికి చిక్కడంలేదుగా కవిత:-)...ధన్యోస్మి!
ROFL
ReplyDeleteSugar???hope no girl named kavitha see this one! ;)
No problem, she too become a friend of mine:-)
Deleteviry nice padma, every time new adventures in Poetry..... so qte.......
ReplyDeleteIs this is an adventure Sruthi....Oh! thank Q:-)
DeleteVery Good expression in little words
ReplyDeleteThank you very much.
Deleteకవితలోని కమ్మదనం అంతా మీ ఒక్కరి సొంతమేనా...వెరీగుడ్:)
ReplyDeleteకమ్మదనాన్ని మీకందరికీ పంచాలన్న తాపత్రయమండి...
Deleteనేను అంత స్వార్థపరురాలుని కాదండోయ్:-)
Its an pleasure to be with you!
ReplyDeleteThis is the feel of poetry!:-)
Oh! thank you my dear:-)
Deleteబొమ్మ బాగుందండి, కవితంత అందంగా.
ReplyDeleteథ్యాంక్సండి...బొమ్మతో పాటు కవితను మెచ్చినందుకు.
Deleteఎన్నెన్నో భావాలు
ReplyDeleteఅన్నింట్లో తియ్యందనాలు
తీపి ఎక్కువైందని ముఖమొత్తనీయకండి మరి
Deleteధన్యవాదాలు తీపిని ఆస్వాధించినందుకు:-)
కవితా! పసందైన పదపానకానివి కావోయి
ReplyDeleteపద్మార్పిత భావాలలో పంచధారవైపోయి!!
.......
పద్మార్పిత పంచే పంచామృత ధారలైపోయి.....
చాలా బాగుంది పద్మ గారూ!
మీ చిత్రాలతో ఓ చిక్కు వచ్సిపడుతోంది...
ఇలాంటి చిత్రం దొరికితే వేరే భావంతో ఓ కవిత వ్రాసేద్దును కదా అనిపించేస్తూ ఉంటుంది...:-)
చిత్రం చాలా బాగుంది..వ.పా గారి రంగుల కలయికలా అనిపించింది...
అభినందనలు...
@శ్రీ
శ్రీ గారు ధన్యవాధాలండి....
Deleteఓ! ఇంకేం మరి వ్రాసేయండి
మీ భావాలలో ఈ బొమ్మలు
కొత్తరంగులు అద్దుకుంటాయిగా!
వడ్డాదిపాపయ్యగారి అందాల వయ్యారిభామే...
నా కుంచెలో కూసింత సుకుమారత్వం తగ్గి
ఏదో లోపంలా ఉండి అలా మరుగున పెట్టి
ఇప్పుడు ఇలా మీముందుంచాను...
పద్మగారూ,కవితలాగే చిత్రం కూడా బాగుంది.
ReplyDeleteమీకు రెండూ నచ్చినందుకు నెనర్లండి!
Deleteమీ కవితల్లో ఆ పంచదార తీయదనం ఎంజాయ్ చేస్తున్నా పద్మార్పితగారు:)
ReplyDeleteఎంజాయ్ ది స్వీట్నెస్స్:-)
Deleteపద్మార్పిత భావాలలో పంచధారవైపోయి!!
ReplyDeleteపలికించే ప్రతిపదంలో జీవంపోస్తూ
ఆలోచనలకి అక్షరాలని జోడించేస్తూ
పదకుసుమాలుగా విరబూసేస్తూ
భావానికి ప్రతి రూపంగా పద్మార్పితను పలికించేస్తూ,........
మాకేమి మిగల్చరనమాట, మొత్తం మీద,
కానీయండి,కానీయండి, మీ రోజులు నడుస్తున్నాయ్.హి,హి.........
భాస్కర్ గారు...ఏదో పొగిడారనుకున్నా
Deleteఅంటే పోయే రోజులు ముందున్నాయంటారా
కానీయండి చేస్తాం హ:-) హ:-) హ:-)
padma garu ..aapke kavita ne bana diyaa hai sarkarii daftar mujhko...
ReplyDeletena koi baat sunta hoon., na koi kaam karta hoon...!!!!
chitra k sath kavita b bahut acha hi.
malleshji....aap sarkaari daftar samajkar aanand leejiye magar tanquaa math poochiye...:-)
DeleteBahut bahut shukriyaa!
కమ్మదనం తీయదనం ఉంది కవితలో.
ReplyDeleteథ్యాంక్సండి..
Deleteపద్మార్పిత భావాలలో తియ్యగా ఒదిగిపోయిన కవిత పలికించే అక్షర కుసుమాలతో రంగులద్దిన కవితా చిత్రం...రెండూ ఎంతో బాగున్నాయి.
ReplyDeleteమీకు రెండూ నచ్చినందుకు థ్యాంక్సండి!
ReplyDeleteమీ పేరుకు తగ్గట్టుగా ఉంటాయండి మీ కవితలు......
ReplyDeleteyour templete is very nice