మునివేళ్ళు ముంగురులతో సరసమాడుతుంటే
నీవు చెంతనజేరి చిలిపి ఊహవై ఊసులాడమాకు
గోరింట ఎరుపును చెంపలు అప్పుగా అడుగుతుంటే
నీవు చేసిన అల్లరిని గురిచూసి గుర్తుకురానీయకు
అద్దం నా అందానికి దాసోహమై దాహమని అంటే
నీవు నా ప్రతిబింబమై పెదవిపై గాటుగా మారిపోకు
కనుల కౌగిలిలో కనుపాపలు కలిసి కాపురముంటే
నీవు కలగావచ్చి కన్నుగీటి కలవరపెట్టేసి పోమాకు
మెడవంపున మెత్తగ ఏదో తాకి మైమరచి నేనుంటే
నీవు మదిలో మెదిలి మోహంతో పరవసింపజేయకు
స్వేదం చెక్కిలి చేజారి ముత్యపుమాలై మత్తెక్కిస్తుంటే
నీవు చెలికాడినని తలపుకొచ్చి తికమకపెట్టి జారుకోకు
కుచ్చిళ్ళు నన్ను తాకిన భాగ్యానికే తబ్బిబైపోతుంటే
నీవు తనువంతా తడిమిమేస్తున్న భావమై రెచ్చిపోకు
గోరింట ఎరుపును చెంపలు అప్పుగా అడుగుతుంటే
నీవు చేసిన అల్లరిని గురిచూసి గుర్తుకురానీయకు
అద్దం నా అందానికి దాసోహమై దాహమని అంటే
నీవు నా ప్రతిబింబమై పెదవిపై గాటుగా మారిపోకు
కనుల కౌగిలిలో కనుపాపలు కలిసి కాపురముంటే
నీవు కలగావచ్చి కన్నుగీటి కలవరపెట్టేసి పోమాకు
మెడవంపున మెత్తగ ఏదో తాకి మైమరచి నేనుంటే
నీవు మదిలో మెదిలి మోహంతో పరవసింపజేయకు
స్వేదం చెక్కిలి చేజారి ముత్యపుమాలై మత్తెక్కిస్తుంటే
నీవు చెలికాడినని తలపుకొచ్చి తికమకపెట్టి జారుకోకు
కుచ్చిళ్ళు నన్ను తాకిన భాగ్యానికే తబ్బిబైపోతుంటే
నీవు తనువంతా తడిమిమేస్తున్న భావమై రెచ్చిపోకు
కనుల కౌగిలిలో కనుపాపలు కలిసి కాపురముంటే
ReplyDelete--------------------
వర్ణన బాగుంది.
వర్ణన బాగుందని వక్కాణించిన మీకు ధన్యవాదాలండి:-)
Deleteచక్కని చిలిపి భావాలన్నీ ఏరీకోరి ఏరుకొచ్చి పరిచినట్లున్నారండి, అభినందనలు.........
ReplyDelete:-) నచ్చాయని మెచ్చిన మీకు అభివందనములు......
Deleteప్రతి వాక్యం చెక్కినట్టు చక్కగా ఉందండి.ఇంత అద్బుతంగా అమ్మాయిల ఊహలుంటాయా!
ReplyDeleteచక్కని శిల్పాలని చెక్కడం అమ్మాయిలకి చేతకాదేమో కానీ ఊహలకేం బ్రహ్మాండంగా ఊహిస్తాం....
Deleteవాటికి రెక్కలు రానీయకండి, వస్తే విరిచేయండి అంటారని కూసింత భయమండి:-)
ప్రోత్సాహాన్నిస్తున్న మీకు నమసుమాంజలి.
గోరింట ఎరుపును చెంపలు అప్పుగా అడుగుతుంటే...
ReplyDeleteస్వేదం చెక్కిలి చేజారి ముత్యపుమాలై మత్తెక్కిస్తుంటే...
మెడవంపున మెత్తగ ఏదో తాకి మైమరచి నేనుంటే...
లాంటి భావాలు
సున్నిత శృంగారాన్ని సున్నితంగా స్పృశించి పోకోయి....
అన్నట్లుంది పద్మగారూ!..
చక్కని శృంగారోద్దీపన...
@శ్రీ
సుతిమెత్తని భావాలని సున్నితంగా స్తుతించిన మీకు నెనర్లండి:-)
DeleteWonderful Padmarpitagaru, no words to write.
ReplyDeleteoh! thanks a lot.
Deleteచిత్రాల ఎంపికలో మీకు మీరేసాటి.
ReplyDeleteఅందాలరాక్షసి సినిమా చూస్తున్నంతసేపు మీ బ్లాగ్ నా కళ్ళలో మెదిలిందండి!
మరోసారి అభినందనలు మీకు, మీభావాలకు వాటికి సరిపడ్డ చిత్రాలకు.
Thanks for remembering my blog and once again thanks for compliments. Double Dhamaka:-)
Deleteపద్మా నీ మది ఒక అందమైనభావాల నిధి....అమూల్యం, అమోఘం!
ReplyDeleteఅమ్మో! ఇలా అమోఘం అమూల్యం అని భారం వేసి దూరం చేయకండి:-)Thank you Srujanagaru
Deleteపద్మార్పిత గారు,
Deleteపోనీండి, 'మోహమాల్యం' అంటాం మరి !
అపురూపం చిత్రం, అపూర్వ రచనా కౌశలం !
చీర్స్
జిలేబి.
జిలేబి(గారు) మామూలుగా ఊరించరుకదా:-)
Deleteఅమ్మో! ఈ తీపితనాన్ని తట్టుకోవడం కష్టమే:-)
మీ అభిమానపు స్పందనకి కృతజ్ఞతలండి!!!
స్వేదం చెక్కిలి చేజారి ముత్యపుమాలై మత్తెక్కిస్తుంటే
ReplyDeleteనీవు చెలికాడినని తలపుకొచ్చి తికమకపెట్టి జారుకోకు...
Fabulous...Marvelous...
యింత అందమైన ఊహల జాజుల మాలలన్నీ మీ హృదయాకాశంలో రూపుదిద్దుకొని మా మనసులలో వెన్నెల కురిపించడం బ్లాగ్ లోకం చేసుకున్న అదృష్టం పద్మగారూ...అభినందనలు...
వర్మగారి నోట Fabulous...Marvelous...అనే పదాలకు నోచుకున్న ఈ "సరసరాగాలు" సన్నజాజులై నన్ను చక్కిలిగిలి పెడుతున్నాయండోయ్. Thank you very much.
Deletechaala chaala bagundi padmarpita garu. super. chala interesting a untay mee kavitalu...
ReplyDeleteMee ee encouraging words baagunnayandi. thank Q!
Deleteపద్మగారూ, శ్రుంగారాక్షర జల్లులో తడిపేసారు అందరినీ..
ReplyDeleteబాగుంది కవిత, మంచి పదాలను ఎన్నుకున్నారు. వెన్నెల దారిలో .. మల్లెల గుభాలింపులా సారిపోయింది మీ కవితాలహరి.
సవరణ: సాగిపోయింది మీ కవితాలహరి.
Deleteఫాతీమాగారు థ్యాంక్సండి....
Deleteసకలకళాకోవిధురాలు అని మీ అందరి దగ్గర మార్కులు కొట్టేయాలన్న తాపత్రయంలో శృంగారమని, శొంటికొమ్మని ఏమైనా సృతిమించితే తోకని కత్తిరించడానికి మీరంతా ఉన్నారన్న ధీమాతో ఏదో అప్పుడప్పుడూ ఇలా తడిపేస్తుంటాను,
ఆనందిస్తే అందులో నేను తడిసి ముద్దైపోతాను.....
జలుబు జ్వరమంటే నా కన్నీట నే తడిసిపోతాను...
మీరంతా హాయిగా నవ్వేస్తుంటే పరవశించిపోతాను!
హలా...పద్మప్రియే , మీరు నిజ్జంగా సకల కళా కొవెడురాలే,
Deleteఅందుకే వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది వెన్నెల్లో తడవమన్నది.
పద్మ డియర్ , చాలా చక్కగా ఉంది కవిత, శృంగారం శ్రుతిమించ కుండా ఇలాగే ఉంటె కవిత బాగుంటుంది.
మీకు నా అభినందనలు.
మీరు బరోసా ఇస్తే ఇంక కుమ్మేస్తాను చూడండి:-)
DeleteOnce again thanks to you Fathimaji!
dear, meeru nijamgaane baagaa raastaaru.doubt ledu.
Deleteloved that pic.only a few of ur expressions r new but its ok.ijm eagerly waiting for the new pic.
ReplyDeleteThanks for loving pics & expressions of mine.
DeletePatience may give more pleasure....:-):-)
deenikina thanks cheppandi plzzzzzzzzzz
ReplyDeletethanks paina cheppaanu anduke dhanyavaadaalu cheputunna ikkada plzzzzzzzzz:-)
Deletepadmagaaru nice pic and vvv nice poetry
ReplyDeletethanks a lot for you comments.
Deleteఇన్ని అందమైన ఊహలు ఉన్న అమ్మాయికి చిక్కిన ఆ అదృష్టవంతుడెవరో???:)
ReplyDeleteఇంతకన్నా అందమైనా భావాలు ఉన్న అమ్మాయిలెందరో తరచిచూడండి;-) థ్యాంక్యూ!
Deleteఅనికేత్....మీ ప్రశ్నకి జవాబు పద్మార్పితగారి ద్వార చెప్పించడం కష్టం,
Deleteతరచిచూస్తే కూడాదొరకడం కష్టమేనండి..మీలాంటివారు పద్మార్పితగారు:)
గోపాల్ గారి చిత్రానికి మీ వర్ణన మరింత అందాన్నిచ్చింది! చాలా బాగుందండీ!
ReplyDeleteరసజ్ఞగారి రసరమ్యమైన వ్యాఖ్య నన్ను రంజింపజేసింది:-) ధన్యవాదాలండి!
Deleteఎప్పుడూ ఇలా అందమైన పదాలతో రాసే పద్మకి మంచి కమెంట్ పెట్టడానికి పదాలురాక బాగుంది అనితప్ప ఇంకేం రాయలేకపోతున్నా:(
ReplyDeleteబాగుంది అన్న దాంట్లోని భావాంతరం తెలుసునండి....ఆప్యాయంగా అది చాలు ప్రేరణగారు:-)
Deleteఓ మైగాడ్....ఎన్ని వర్ణనలు...ఎన్ని చిత్రాలు...ఇన్నాళ్ళు వీటిని ఎలా మిస్ అయ్యానో అర్థం కావడంలేదు....పద్మప్రిత గారు మీ చిత్రాలతో కూడిన కవితలు చాలా బాగున్నాయి.
ReplyDeleteపద్మార్పిత బ్లాగ్ కి స్వాగతం....విచ్చేసి చూసి మెచ్చిన మీకు ధన్యవాదాలండి!
ReplyDeleteThat was a Beautiful painting by gopal swami khetanchi. Thanks to rasagna garu for introducing him in her blog last year.
ReplyDeleteThat was a beautiful sonnet with exactly 14 lines. Amazing coincedence? ;)
Loved that she is left handed like me. ;)
Thanks a lot.
ReplyDeleteశ్రీ పద్మగారికి, నమస్కారములు.
ReplyDeleteమొదటగా, మీరు నా బ్లాగ్ ద్వారా నాకు సుపరిచితులే అయినప్పటికీ, మీ బ్లాగ్ ని దర్శించటం ఇప్పటివరకు కుదరలేదు. క్షమిచండి. ఇక ఈ కవిత చాలా సున్నితంగా వున్నది.
`సరసరాగాలు':-
సరిసరా? మీ
సరస
రస
సరాగాలు
ఎవరి కవితలతోనైనా
మీ స్నేహశీలి,
మాధవరావు.
మధవరావుగారు.....నా బ్లాగ్ కి విచ్చేసి విడదీసి వ్యాఖ్యిడిన మీకు వందనాలు.
ReplyDelete