సెకనుకు సెకనుకు ఒక శ్వాసై
నిముషానికో కనురెప్ప మూతై
గడియకి ఒకమారు పలుకరింపై
దినమంతా చెరగని చిరునవ్వువై
వారానికొకసారి అందమైన అలుకై
మాసమంతా మనోఉల్లాసభరితమై
ఏడాదిపొడవునా సంతోషసరాగాలై
అందించు నూరేళ్ళ జీవితాన్ని నాకై
శ్వాస విడుద్దాం ఇరువురమూ ఒకటై
పెనవేసుకోనీ యుగాలబంధం మనదై
కాలభ్రమణం విడదీయలేని తోడు-నీడై
గడియకి ఒకమారు పలుకరింపై
దినమంతా చెరగని చిరునవ్వువై
వారానికొకసారి అందమైన అలుకై
మాసమంతా మనోఉల్లాసభరితమై
ఏడాదిపొడవునా సంతోషసరాగాలై
అందించు నూరేళ్ళ జీవితాన్ని నాకై
శ్వాస విడుద్దాం ఇరువురమూ ఒకటై
పెనవేసుకోనీ యుగాలబంధం మనదై
కాలభ్రమణం విడదీయలేని తోడు-నీడై
సై అంటే......మీకో ప్రశ్న
చిత్రంలో ఆమెలో అతడు ఎక్కడ దాగున్నాడో చెప్పండి?
ఆమె పంచముఖాల్లోని విభిన్న భావాలని గమనించండి!
కనిపిస్తే నేను ధన్యురాలను, లేకపొతే మీరే సుమండి.....
kudi prakka unna stree nuduti darrana unnadu avunaa? padma gaaroo, kavitha chaalaa baagundi
ReplyDeleteఫాతీమాగారు మీకు అక్కడ అగుపించాడా.....ఆమె నవ్వుతుంది చూడండి విజయగర్వంతో తనలోనే దాగాడని;-) మీ స్పందనకు ధన్యవాదములు.
Deletepadmarpita
ReplyDeletechitramlo right corner lo kanipistunnaadu atadu.
anni bhaavalu kanipinchayi. mee bhavam tappa.
kavita bagundi.pic bavundi.
nee abhimaani.
ala muula daagenenduko? bhavam chitram baagunnappudu inka artham kaaledantu abhiyogamela:-)
Deleteఅలాంటి ప్రేమ లోకం లో జీవించే వారు అదృష్ట వంతులు.మంచి కవిత.
ReplyDeleteనిజమే కదండి....ఎంతమందున్నారో అలాంటి అదృష్టవంతులు:-) థ్యాంక్సండి
Deleteఒక శ్వాసై
ReplyDeleteకనురెప్ప మూతై
పలుకరింపై
చిరునవ్వై
అలుకై
ఉల్లాసభరితమై
సరాగాలై
నాకై
మనదై
ఒకటై
తోడు-నీడై
పద్మార్పిత కవితలో అక్షరాలై,
సై,,సై అంటూ ఒదిగిపోయాయేమో.
ఇన్ని ఒకే కవితలో ఒదిగిపోతే భారమై ఒంగిపోతుందేమో కదండి:-) సై సై అన్న మీకు సహృదయాభివందనములు.
Deleteయాహూ....నేను కనిపెట్టేసానుగా
ReplyDeleteకుడివైపు 2వామె నుదుటిపై అతడు
నలుగురిలో భావాలు చదివాను...
కాని ఎడమవైపున క్రింద పడిఉన్న
ఆమె భావాలు చదవలేకపోయాను...
:( కనులు మూసుకుని ఉందిగా,
చావులో కూడా తోడు కోరుతుంది కామోసు!
కరెక్ట్ అయితే నేను కూడా మీతో పాటు ధన్యురాలేనే:)
వావ్....ఇంతలా పరిశీలించి ప్రతిస్పందించిన మీకు నెనర్లు.
Deleteపరికిస్తే మీ కోణంలో చిత్రం కొత్త పలుకులు పలుకుతుందిగా:-)
right side lo unna aame nuditi pyna..
ReplyDeletekavita chala bagundi padma garu..
dhanya ho jo kisi ko is tarah pyaar mile..
nuditi pyna unte inka ame raataloe unntle kadandi.:-)
Deletethanks alot.
har kisiko mile iss tarah ke pyaar...yahi duva karenge:-)
Its an time punctual picture puzzle poem of padmarpita:)
ReplyDeleteI enjoyed it madam....thank you:)
oh! thanks for it.
Deleteప్రతి క్షణం ఆమెతో ఆమెలో కరిగిపోతున్న అతణ్ణి అలా పట్టుకోవడం కష్టమైనా ఆ చివరి రేఖలలో దాగివున్నాడన్నది స్పష్టమే కదా పద్మ గారూ...:)
ReplyDeleteఅనుక్షణం ఆమెలో దాగిన అతడు తలపై ఉన్నాడే కాని అమె నుదుటి రాతలో లేడనేది మాత్రం వాస్తవం వర్మగారు:-)
DeleteHmmm so sad:-(
Deleteయగ యుగాలకీ విడదీయరాని చెరగని బంధమై పెనవేసుకుపోతే ఇక ఏం కావాలీ లోకంలో అంతకన్నా...
ReplyDeleteకవితా చాలా బాగుంది.
బొమ్మలో పంచముఖాల్లో రంగులతో చాలా భావాలు చిందించారు. పరిశీలించి చూస్తే అతడు అన్ని ముఖాలలో కనిపిస్తూ మధ్యన ఉన్న డార్క్ షేడ్స్ లో అటువైపు తిరిగి పక్కకు తిరిగిన ముఖం పెదవుల దగ్గర కనిపించాడు... వెతికెతే అన్ని చోట్లా అగుపిస్తాడు.
కవితా బొమ్మా బాగున్నాయి.
బొమ్మలో రంగుల ఫ్లో అద్భుతంగా ఉంది.
ధన్యవాదాలండి...అన్ని చోట్ల అగుపించడం మీ కళా హృదయానికి నిదర్శనం. కళాకారులు కాబట్టే అలా అటువైపు తిరిగి ఉన్నా కనిపించాడు.
Deleteకవిత సూపరండి
ReplyDeleteకుంచె జ్ఞానం లేనివాడ్ని
ప్రశ్నకి బదులు మీరే చెప్పండి
కవితమెచ్చిన మీకు ధన్యవాదాలండి
Deleteకనులతో చూసి ఆనందించడం కుంచె జ్ఞానమండి
ఆమెను చూస్తున్న అతడు మనకెలా కనిపిస్తాడు చెప్పండి:-)
కవిత బాగుంది పద్మ గారూ!
ReplyDeleteఅంతమందీ చెప్పేశారు...
ప్రహేళిక సులువైంది ఇచ్చారుగా!..:-)
@శ్రీ
ధన్యవాదాలండి...
ReplyDeletePadma gaaru mee blog gurinchi mee friend cheppadu naku few months back.
ReplyDeletefrequent ga chuse vadini mee kavithalu...
oka roju anukoni sandarbam lo mee kavithalu loni konni vaakyalanu oka ammai tho cheppanu... oka 20 mins lo ammai naku propose chesindi.
mee ee kavithalu aame ki cheppadam lo aame pulakinchipoi naku propose chesesindi.
appati nundi mee updates kosam daily mee blog chustuntanu :)