సమానత్వం నిలబడింది!

అయిదేళ్ళు అమ్మఒడిలో గారాలుపోయి
ఆపై నేర్చుకున్నా విద్యలెన్నో బడికెళ్ళిపోయి
పదహారేళ్ళ పరువపు మొగ్గనైన నన్నుచూసి
ఒద్దికైన పనులు నేర్చుకోమంటారు ఆచితూచి
అబ్బాయికన్నా నేనే అన్నింటా ఒకడుగు ముందోయి
అయినా అమ్మాయినని భేధం చూపుతారెందుకోయి?

అబ్బాయినైతే వంశోద్ధారకుడని వెన్నుతడతారోయి
నాకు తోడుగా వేరొకరిని వెన్నంటి పంపుతారుకదోయి
పాతికేళ్ళకి పాణిగ్రహణ
మని ప్రయత్నాలు మొదలెట్టి
తెలియని అనామకుడికి పెళ్ళని అరగంటలో అంటగట్టి
ఆడపిల్లే కాని ఈడపిల్లను కాదని పంపిచేస్తారు కదోయి
నేను చూపని అభిమానం అబ్బాయిలో ఏం చూసారోయి?

అమ్మాయి అందగత్తైతే అదృష్టం అతడిని వరిస్తుందోయి
అతడి చేతకాని తనానికి నాకాలిని ధూషిస్తారెందుకనోయి
ఓర్పునైపుణ్యాలని తోబుట్టువులుగా నాకు ఒప్పగించేసి
నా ఆశల గూటి తాళంచెవులని వేరొకరికి సొంతంచేసి
మాతృత్వమే స్త్రీకి పరమపదసోపానం అంటారెందుకోయి
పితృత్వమనే పదానికి పుట్టగతులెందుకని పెట్టలేదోయి?

ఇద్దరూ అన్నింటిలో సమానమంటూ పలికే పలుకులోయి
ఇవి కేవలం గద్దెపై ఉపన్యాసాలకే పరిమితమని తేల్చారోయి
ఇలా ఎందుకనడిగే అమ్మాయికి ఒద్దిక ఓర్పులేదని తేల్చేసి
ఇంకా వాధిస్తే బరితెగించావంటూ అర్థంకాని సమాధానమిచ్చి
సమానత్వమంటే అతడు ఆకాశమై ఆమె నేలైన నిలువుగీతోయి
గీసింది అతడే కాని ఆమె కాదు అనడానికి ఇదే నిదర్శనమోయి!

36 comments:

 1. సమానత్వమంటే అతడు ఆకాశమై ఆమె నేలైన .....

  ఆకాశం సూన్యానికి , నేల సంపద కూ - సంకేతాలు మరి !

  ReplyDelete
  Replies
  1. సంపద కూడా శూన్యంవైపే మొగ్గుచూపుతుందేమో కదండి!:-) ధన్యవాదములు.

   Delete
 2. మాతృత్వం అంటే మరో ప్రాణిని సృష్టించే శక్తి.
  అది స్త్రీకి మాత్రమె ఉంది.
  అందుకే పితృత్వం కంటే మాతృత్వం గొప్పది.
  (నా కవిత గుర్తు చేసి పితృత్వం మాతృత్వం సమానం ఆన్నారని చెప్పకండి సుమా!..:-))...)
  అతడి చేతకాని తనానికి నాకాలిని ధూషిస్తారెందుకనోయి???..
  మీ భావమాలిక ప్రశ్నార్థకాలతో ఉన్నా...
  చాలా వాస్తవాలున్నాయి...
  అభినందనలు మీకు...
  గమనిక:"ఫాణీగ్రహం " పదాన్ని "పాణిగ్రహణం" గా సరిచేసుకోండి...
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. శ్రీగారూ "గొప్పది" అంటూ తెలివిగా తప్పించుకున్నారుగా:-)
   పదాన్ని సరిదిద్దిన మీకు సదా కృతజ్ఞురాలిని.
   Thank you very much.

   Delete
 3. మాతృత్వమే స్త్రీకి పరమపదసోపానం అంటారెందుకోయి
  పితృత్వమనే పదానికి పుట్టగతులెందుకని పెట్టలేదోయి?...

  సమానత్వమంటే అతడు ఆకాశమై ఆమె నేలైన నిలువుగీతోయి
  గీసింది అతడే కాని ఆమె కాదు అనడానికి ఇదే నిదర్శనమోయి!

  పితృస్వామ్య సమాజంలోని స్వార్థాన్ని బాగా ఎండగట్టారు...అభినందనలు పద్మార్పిత గారూ...

  ReplyDelete
  Replies
  1. స్వాభిప్రాయాల సమూహమే కాని సమాజంలోని స్వార్థాన్ని ఎండగట్టేంత సాహసకారినా చెప్పండి..:-) అభివందనములు.

   Delete
 4. excellent padmagaru....
  "अगर बेटा वारस है, तो बेटी पारस है |
  अगर बेटा वंश है, तो बेटी अंश है
  अगर बेटा आन है, तो बेटी शान है
  अगर बेटा तन है, तो बेटी मन है
  अगर बेटा मान है, तो बेटी गुमान है
  अगर बेटा आग है, तो बेटी बाग़ है
  अगर बेटा दवा है, तो बेटी दुआ है
  अगर बेटा भाग्य है, तो बेटी विधाता है
  अगर बेटा शब्द है, तो बेटी अर्थ है
  अगर बेटा गीत है, तो बेटी संगीत है ||

  ReplyDelete
  Replies
  1. बेटा और बेटी के बारे मे आपका ऎ राय मुझे बहुत अच्चा लगा:-)शुक्रिया!

   Delete
 5. పద్మగారూ, ఆవేదన కనిపిస్తుంది.
  అర్ధవంతమైన భావావేశం ఉంది,
  ఇక మిత్రుల మాటల్లో నిజముంది. చక్కని కవిత...మెరాజ్

  ReplyDelete
  Replies
  1. మెరాజ్ జీ....మెచ్చిన మీకు నెనర్లండి!

   Delete
 6. సమానత్వం సమాజం లో రావాలని ఎన్నో చట్టాలు ఉన్నాయి కానీ మనుషుల మనస్తత్వాల్లో మార్పు రావాలి.మీ ప్రశ్నలు అర్థవంతంగా ఉన్నాయి.

  ReplyDelete
  Replies
  1. ఏదో భావావేశంలో అంటామే కానీ సమాజంలో సమానత్వం అంత సామాన్యమైన విషయమా చెప్పండి:-) మీ స్పందనకు ధన్యవాదములు.

   Delete
 7. చాలా బాగా వ్రాసారు .

  ReplyDelete
  Replies
  1. ధన్యవాధములండి!

   Delete
 8. ప్రశ్నలు మమ్మల్ని అడిగినా...నిజాలకి జవాబివ్వడం కష్టం:)

  ReplyDelete
  Replies
  1. కష్టమని తప్పించుకుంటే ఎలా అనికేత్:-) ట్రై చేయొచ్చుకదా!

   Delete
 9. టైటిల్ అదిరింది, మీరు అడిగే ప్రశ్నలకి అల్పజీవులు ఆన్సర్స్ చెప్పలేరండి:)

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ, మీరు చెప్పగలరు:-)

   Delete
 10. Padma garu na feelings achu gudinatu rasaru.....
  How was that possible?
  Prati oka girl ki elane anipistunda andi?
  Anyways that was good taught n poem...
  Keep writing.
  Tc

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ రమ్య....ఎంతైనా మనం మనం ఒకటేకదా:-)

   Delete
 11. మా అమ్మమ్మ ఎప్పుడూ "చచ్చినాక ఎడ్వనీకే ఒక ఆడ బిడ్డ ఉండాలె వారీ" అనేది. అట్లాంటి ఆడపిల్లను ఏడిపించడం మనకు భావ్యమా?

  ReplyDelete
  Replies
  1. "పెద్దల మాట చద్ది అన్నం మూట" అని అందుకే అన్నారండి. థాంక్స్ ఫర్ కమెంట్.

   Delete
 12. సమానత్వం నిలబడి పైన వాళ్ళున్నా.....బేస్ మనమే కదా పద్మార్పితా:)

  ReplyDelete
  Replies
  1. బేస్ మనమే అనుకుంటే ఇంకా అణిచేస్తారేమోనండి:-)

   Delete
 13. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎంత బానిస బతుకు బతికే వాడైనా భార్య దగ్గరకొచ్చేసరికి తన ఆధిపత్య భావాన్ని చూపుతాడు..అందుకే బానిసకొక బానిసకొక బానిసగా మారిపోయాయి మహిళల జీవితాలు. ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు కదా..ఇంకా మార్పు రావాలి రెండు వైపులా...అభినందనలు పద్మ గారూ..

  ReplyDelete
  Replies
  1. ఇరువైపులా మార్పుకోసం ఎదురుచూద్దామండి:-) థ్యాంక్యూ!

   Delete
 14. ఓష్! అన్ని ప్రశ్నలు జవాబు కాలమే చెప్పాలి.

  ReplyDelete
  Replies
  1. ఇంకెంతకాలం వేచిచూడాలో?

   Delete
 15. నిజమే తప్పులన్నీ అమ్మయివే అని చెపుతారు

  ReplyDelete
  Replies
  1. అలా అంటే అందరూ ఒప్పుకోరుగా:-)

   Delete
 16. శ్రీ పద్మగారికి, నమస్కారములు.

  చాలా గొప్ప కవిత ఇది. ``గజరాజుని నియింత్రించటానికి అంకుశం కావాలి; పురుషాధిపత్యం చలాయించబడే ఈ సమాజంలో, పురుషులకు కనువిప్పు కావాలంటే ఇటువంటి కవితాంకుశమ్'' కావాల్సిందే.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  ReplyDelete
 17. అంకురార్పణతోనే అంతమౌతుంటే ఇంక అంకుశమయ్యేనా?:-)

  ReplyDelete