మనసా...నీకు మేకప్ అవసరమా?


కనుపాపకి, కంటిరెప్పలకు కాటుక దానికి చత్రంలా చెక్కిన కనుబొమ్మలు, మొత్తంగా కంటికి అందాన్నొసగేది ఐ మేకప్ విత్ "ఐబ్రోస్ షేపింగ్"
ముక్కుకు ముక్కెర, ఉన్నా లేక పోయినా ముక్కు ఏ షేపైనా మేకప్ తో కోటేరుముక్కులా చూపొచ్చు కాదంటే చేయొచ్చు "ప్లాస్టిక్ సర్జరీ"
పెదవులకు ఒంపులను పెద్దవాటిని చిన్నవిగా సన్నగా చూపి నైపుణ్యంతో మెరిసే రంగులద్ది కవ్వించేలా చూపగల చాకచక్యముంది "లిపిస్టిక్"
ముడతలులేని ముఖంతో మెరిసిపోయేలా మెరుగులుదిద్ది ఆత్మవిశ్వాసం పెంచే క్రీములు, వాటికితోడు బ్లీచింగ్ తో పాటుగా "ఫేషియల్ మసాజ్"
కురులకు రంగులువేసి జీవంపోసి వాలుజడను కొంగ్రొత్త కొప్పులెన్నింటిగానో మలిచి మరల మరల చూసేలా చేసేదే "హెయిర్ కట్టింగ్ & కర్లింగ్"
శరీరాకృతి ఏదైనా మెరుపునిచ్చి అలసిన మన శ్రమని మరిచేల మర్ధనా చేసి ఒంటి నొప్పులను దూరం చేసేది "బాడీ మసాజ్ విత్ స్టీమింగ్"
అవాంచితరోమాలు వద్దంటూ తనువంతా తాకితే తలపింపచేయాలి పట్టుపీతాబరాలని అనుకునే వారికి ఉందిగా "వాక్సింగ్ మరియు థ్రెడ్డింగ్"
సుతిమెత్తని చేతులు సన్నని పొడుగైన చేతివేళ్ళు వాటికి తగ్గ గోళ్ళకు ఎన్నో డిజైన్ల నెయిల్ పాలిష్లు వేసి కేర్ తీసుకునేదే "మానీక్యూర్"
ముఖంలాగే కాళ్ళకి కూడా తగిన శ్రధ్ధ అవసరం అని చెప్పడమే కాదు చేసి చూపడంలో తీసిపోని ప్రక్రియ పేరు మీకుతెలిసిన "పెడిక్యూర్"

ఇవన్నీ ఆడవాళ్ళకే మాకోసం కాదని మేల్ బ్లాగ్ మిత్రులంతా తప్పించుకుందామనుకుంటే......
నా టపాలకి సైట్ కొట్టేవారి రాంకింగ్ గణనీయంగా పడిపోదాండి:-)
అందుకే వీటితోపాటు మీకు అడిషనల్ గా జిమ్మని, గడ్డాలు మీసాలు ట్రిమ్మని ఆడ్ చేసారు...
ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో!!!! చాలా ఉన్నాయిలెండి మగధీరులకు సాధనాలు మరియు చిట్కాలు,
కానీ....కూసింత ఓపిక తక్కువైన మీకు ఖర్చు మాత్రం ఎక్కువండోయ్! ఇది ఎలాగో ఒప్పుకోరులెండి.

ఏంటీ! బ్లాగ్ లో బ్యూటీ పార్లర్ తెరిచారా అని అడగబోతున్నారు కదండి?
అడిగినా మానినా మ్యాటరు మాత్రం అదికాదండి.....
ఈ అవయవాలన్నీ అందంగా కనపడాలంటే సాధనసామాగ్రీలు ఉన్నాయి
"మనసు" అందంగా కనపడడానికి మాత్రం ఏ సాధన సామాగ్రి అవసరంలేదు ఎందుకో???
కేవలం మనసిస్తే చాలు మనిషంతా అందంగా కనిపిస్తాడు ఎందుకో???
ఇదీ సంగతి......మీతో పంచుకోవాలని నేను ఫుల్ మేకప్ తో మీ ముందిలా..
మరి మీరేమంటారో!!!....వితౌట్ మేకప్ మనసువిప్పి చెప్తారు కదూ...:-)

62 comments:

  1. "మనసు" అందంగా కనపడడానికి మాత్రం ఏ సాధన సామాగ్రి అవసరంలేదు ఎందుకో???
    -------------------------
    స్వతహాగా వచ్చేదానికి నగిషీలు చెక్కలేము కదా.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు.....అన్ని అవయవాలు సహజమైనవే కదండీ!!
      బహుశా ఇది అంతఃసౌందర్యానికి అవసరంలేదు కామోసు కదండీ.

      Delete
  2. నాచురల్ బ్యూటీనెస్ కి అసలు మేకప్ అవసరమేలేదండి, అందులో మనసు స్వచ్చమైనది అయితే ఇంక దానికి మేకప్ ఎందుకు? అదే మెరిసిపోతుంది:)

    ReplyDelete
  3. మేకప్ అవసరంలేదు అని మీరు చెప్పాక కాదంటామా చెప్పండి:)

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ...కాదని కారణం చెబితే ఇంకా బాగుండేది ప్రేరణగారు.

      Delete
  4. అయినా మనసుకి మేకప్ లేకుండా బ్రతకలేమండి.
    మీరే ఒకరోజు బాగా కష్టపడి చాల సమయం తీసుకుని తయ్యారయ్యి ఒక ఫోస్ ఇచ్చి మగవాళ్ళాని ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అని అడిగారనుకోండి. మేము మనసుకు మేకప్ లేకుండా చెబితే కొంప కొల్లేరు అవుతుంది. ;)
    ధర్మరాజు కి గూడా తప్పలేదు మనసుకి మేకప్ వేస్కోటం [అశ్వర్థామ హతః] మేమెంత?

    మనసు అందం చేతల ద్వారానే తెలుస్తుంది. ఆ చేతలు తప్పొప్పుల విచక్షణా ఙ్నానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఙ్నానం విద్య వలన గురువు ద్వారా వస్తుంది. ఆ చేతలు వేరెవరైనా వీరు చేస్తుండగా చూడాలి అప్పుడే ఆ ముసుగు మనసు జాడ తెలిసేది. ;)

    నా టపాలకి సైట్ కొట్టేవారి రాంకింగ్ గణనీయంగా పడిపోదాండి:-)
    ---ఇది వ్రాయడంలో మీ ఉద్దేశం ఏమిటి? అంటే? ?? ఆయ్!

    జిం మొగవాళ్ళకి మాత్రమే అనుకోవటం ఒక అపోహా అనుకుంటా? ;)

    అన్నట్లు మీరెంత ఫుల్ మేకప్ వేసినా గానీ మీ మనసేంటో మాకందరికీ మీ కవితల ద్వారా తెలిసి పొతుంది కదండీ. ;)

    PS: వితౌట్ మేకప్ మనసువిప్పి చెబితే ఇలాగే ఉంటుంది మరి. ;)

    ReplyDelete
    Replies
    1. ఏదో మేకప్ వేసుకుని మోజుతో అడిగాము కదా అని మనసుకి మేకప్ వేసుకుని అప్పటికి కొంపకొల్లేరు కాకుండా కాపాడుకున్నా మీ అనుబంధం మాత్రం నల్లేరు పై నడకై సాగుతుందండి:-)
      మీరెంత మేధావులైనా.....మనసులోదాగిన మర్మాన్ని మగువలు పసిగట్టడంలో మహాధీటైనవారన్నది జగమెరిగిన సత్యంలెండి:-)
      ఈ విషయంలో మీ మాటలే నావికూడాను...నచ్చాయిగా:-)
      ఏదోలెండి అంటే? అనో ఆయ్! అనో నా బ్లాగ్ వైపు ఒక లుక్ వేస్తారని:-)
      జిమ్మని ట్రిమ్మని రిథిమాటిక్ కోసం అంతే.....ఆ ముక్క నేను రాయకపో మీదే మొదటి కమెంట్ అయ్యేది..."This post is not meant for me" అని:-)
      కూసింత మా మట్టిబుర్రని మురిపించడానికైనా డైరెక్ట్ గా చెప్పొచ్చుకదండీ:-)
      PS: మనసువిప్పి చెప్పారు కాబట్టే ఇలా రిప్లై ఇవ్వగలిగాను:-)
      Thanks a lot for responding to my post.

      Delete
    2. Hahaha super.. Ji😊

      Delete
  5. మేకప్ అంటే కేవలం మేకప్ సామాగ్రి అనే కాదు మన అసలు రంగు బయటపడకుండా ఉండే ఏ ముసుగయినా సరే!! అటువంటి ముసుగు లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు, వారి డైరీలో వ్రాసినది వ్రాసుకున్నట్టు, మనసులో అనుకున్నదల్లా అనుకున్నట్టు బయట పెట్టేసేవారు చాలా చాలా తక్కువమంది ఉంటారండీ! నిజమయిన జాతి ముత్యానికి ఈ రంగులు, హంగులు, ముస్తాబులు అవసరం లేదనుకోండి :)

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది నిజమండి.....జాతిముత్యాలకి ముస్తాబులేల?
      దొరకడం కష్టమే కాని దక్కించుకుని దాచుకున్నవారు ధన్యులే! మనసువిప్పి మాట్లడిన మీకు మనఃసుమాంజలులు.

      Delete
  6. ఇప్పుడు నిజంగా మనసుకే మేకప్ అవసరమయిపోయింది, అసలు సరుకు కనపడనీయకుండా :)

    ReplyDelete
    Replies
    1. అవసరానికి ముసుగు అవసరమే అయినా అది అశాశ్వితమైన ఆనందాన్నే అందిస్తుందని నా అభిప్రాయమండి.....మీరు చెప్పింది కూడా నిజమే:) థ్యాంక్యూ!

      Delete
  7. పద్మ గారూ, మీరు చెప్పినది నిజమే మనసుకు ఎలాంటి మేకప్ అవసరం లేదు.
    మీ కవితలకి మీరు వేసే చిత్రాలు అందాన్నిస్తాయి, కాని మీ అక్షరాల అందాలు ఇంకా బాగుంటాయి.
    ఏ కవి అయినా తన భావాన్ని ఎందుకు బహిర్గతం చేస్తాడో తెలుసా అది మనం గుర్తించాలని. చిన్న ప్రశంస ఇవ్వాలని, అదీ అతని కవిత్వానికి సాటి కవులుగా మనం అద్దె మేకప్. (ఇక్కడ ఇది అసందర్బమే అనిపించినా నేను చెప్పేది, కవిగా మన బాద్యత గూర్చి అంతే.)
    ఇక మీ కవితల్లో మీ సున్నిత ,సూటి భావాలు చాలు ఎలాంటి మేకప్ అవసరం లేదు. అద్దంలా మీ మనసు కనపడుతుంది.
    మీ కవితలెప్పుడూ మేకప్ అవసరం లేని సహజ అందాలే...మెరాజ్

    ReplyDelete
    Replies
    1. ఓహో!!! మది ఆనంద తాండవమాడె వితౌట్ మేకప్:-)మీ ఈ కమెంట్స్ చదివి,
      ధన్యవాద్ ఫాతీమాజీ!

      Delete
  8. padma gaaru!
    గాలివాన కంటిచుక్కై కడలి ఒడిలో చేరాను.. మరుబైలు ధూళి కణమై రెక్కలతెమ్మెర ఊపిరైయ్యాను.
    నేనొక తీరం ముద్దాడిన తరంగాన్ని... అలిఖిత పుస్తకాన్ని.. లౌకిక నశ్వర మస్తకాన్ని.
    ఆశా నిరాశలు చాచిన స్నేహ హస్తాన్ని . ఈ భువనానికి ఏకానేక అవిశేషాన్ని. మానవత్వపు కేవలత్వాన్ని . ప్రభవించిన ఈశ్వరతత్వాన్ని సమభావ పద్మార్పితాన్ని అంటున్న
    అంతరంగానికి రంగెందుకూ..
    అక్షర నక్షత్రాలను అద్దుకున్న నింగికి నేలను కానని శోభలెక్కడ!
    కిరణ జన్య సౌందర్యం పద్మార్పిత మైతే ఓ అందమైన భావన.

    ReplyDelete
    Replies
    1. సతీష్ గారు నా బ్లాగ్ కి స్వాగతం.
      మీ ఈ అభిమాన అసామాన్య పదాలా ప్రసంశాపత్రానికి పద్మార్పిత మోము ప్రకాశించి మది పులకించెను. (మేకప్ లేకుండా) ధన్యవాదాలండి!

      Delete
  9. పద్మ గారూ, మీరు చెప్పినది నిజమే మనసుకు ఎలాంటి మేకప్ అవసరం లేదు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి శృతిగారు!

      Delete
  10. కేవలం మనసిస్తే చాలు మనిషంతా అందంగా కనిపిస్తాడు ఎందుకో???..
    ఎందుకంటే...
    మనం మనసిచ్చాక... త్రెడ్డింగ్ చేసుకొన్న కనుబొమలతో..
    మస్కారా వేసుకున్న eye lashes తో...
    కాటుక దిద్దుకొని అందంగా చేసుకున్న కళ్ళతో కాదు చూసేది...
    ప్రేమించిన మనోనేత్రంతో చూస్తాం...ఏమంటారు???
    సామెత కూడా అందుకే పుట్టిందేమో...
    "తాను వలచింది రంభ...తాను మునిగింది గంగ"..
    అని...:-)


    మనసుకి మేకప్ కొన్నిసార్లు వేసుకొనే కొన్ని చెప్పాల్సి వస్తుంది...
    లేకుంటే...ఏప్రిల్ ఒకటి విడుదల లా ఉంటుంది....(రాజేంద్రప్రసాద్ సినిమా)..:-)))
    అంతెందుకు ఉదాహరణకి నా వ్యాఖ్య నచ్చకపోయినా మీరు ధన్యవాదాలు చెప్పినట్లు....:-))...
    మీ ప్రశ్నకి సమాధానం చెప్పడం సాధ్యం కాని విషయమేమో????
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. అందాలద్దిన కళ్ళే అయినా మనసుని చూడాలంటే మనోనేత్రమే అవసరమని సంధర్భోచిత సామెతతో చక్కగా చెప్పారు.
      ఏప్రిల్ 1న విడుదలలో స్టన్నింగ్ బ్యూటీ కోసం రాజేంద్రప్రసాద్ ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలిలెండి:-)
      కొన్ని ఆనందాల కోసం మరికొన్ని అభియోగాలు తప్పవు:-):-)
      చూడండి మీరు ఇంతందంగా వ్యాఖ్య రాసి నాకు నచ్చదని అభియోగం భావ్యమా చెప్పండి:-)..
      Thank you Srigaru.

      Delete
  11. padmagaru........
    asalu sahajamaina andaniki makeup avasarameledu .
    swachchamaina manasu mee kavita laga unte ade merustundi.

    ReplyDelete
    Replies
    1. Sahajamaina andalaki addakaalatoe panileadani cheppina mee swachchamaina manasuku abhivandanamulu.

      Delete
  12. నేను చాతకంగారితో ఏకీభవిస్తున్నాను. వారు చెప్పినట్లు మనసుకి మేకప్ వేయకుండా మీ మేకప్ గురించి చెప్పామంటే కొంపకొల్లేరవడంతో పాటు మేము అజ్ఞానులమని, కళాహృదయం లేదని అబ్బో ఇలా ఎన్నో బిరుదులతో సత్కరిస్తారు. అందుకే ఆడవారు అందంగా కనబడ్డానికి మేకప్ వేసుకుంటే మగవారు మనసుకి మేకప్ వేసుకుని పొగడవలసిందే తప్పదు:)
    ఇంక మీ పోస్ట్ ల గురించి చెప్పడానికి చదవడానికి మేకప్ అవసరం లేదు, మనసుంటే మీరు పలికే భావాలు ఎంతో రసరమ్యంగా ఉంటాయి.No doubt in this.

    ReplyDelete
    Replies
    1. అనికేత్ ఏంటి ఇంత అనుభవపూర్వకంగా ఇలా అంటున్నారు అనుకున్నాను:-)
      ఇలా సపోర్ట్ చేసి సముపార్జించారన్నమాట.
      అయినా రమ్యమైనవంటూ పొగిడారుకదా ఓ కె:-)
      Thanksandi.

      Delete
  13. బాహ్య సౌందర్యానికి ఎన్ని మేకప్ లు వేసినా అవి వానలో తడిసిన నక్కలా కరిగిపోయేవే...
    అంతరంగానికి మాస్క్ వేసుకొని మాటాడేది మోసకారితనమే...
    ఎవరిపైనో నెపాన్ని నెట్టేసి అలా వుండాల్సి వస్తుందనుకుంటూ గో.పి.లా బతక నేర్చినతనమే కదా...
    అవును చాలా మంది అన్నట్టు అది నేటి అవసరమే కావచ్చు..
    కాని మనసు అద్దం ముందు నేరస్తులం కాక తప్పదు...
    మీరెప్పుడూ ఇలాంటి మంచి పోస్టులతో అలరిస్తారని ఆశిస్తూ అభివందనాలు పద్మ గారూ...

    ReplyDelete
    Replies
    1. వర్మగారు మీరు చెప్పినది అక్షరాలా నిజమే అయినా ఎంతమంది ఔను అని ఒప్పుకుంటారు చెప్పండి? మాస్క్ వేసుకున్న ముఖాలంటేనే మక్కువచూపే లోకం కదా...
      మనసు అద్దం ముందు నేరస్తులైతేనేమి నలుగురిలో దొరబాబులేకదా...
      మీ అభిమానపు అభినందనలకు అభివందనములు!

      Delete
  14. మనసు కనులకు కాక మనసుకు మాత్రమే కనబడడం వల్ల కాబోలు ఏ సౌందర్య సాధనా సామాగ్రి అవసరం లేదు.మనసు మనిషిని అందంగా తయారు చేయగల సాధనా సామాగ్రి అందుకే మనసిస్తే చాలు మనిషంతా అందంగానే కనబడతాడు కాబోలు......:-)

    ReplyDelete
  15. "మనసు మనిషిని అందంగా తయారు చేయగల సాధనా సామాగ్రి" బాగుందండి మీరు చెప్పింది.థ్యాంక్యూ వెరీమచ్!

    ReplyDelete
  16. అందమైనమనసున్న బ్లాగర్స్ ఇందరుండగ
    వారందరి అభిమానం నీవు పొందగా
    ఇంక నేను ఏమి రాసినా సుద్దదండగ
    అభినందనలందుకో పద్మా నిండుగా..

    ReplyDelete
  17. మీకూ ఉంది ఒక అందమైన మది....
    అది ఎల్లకాలం నన్ను ప్రోత్సహిస్తుందండి
    మీఅభిమానానికి నెనర్లంటోంది నాహృది
    సదా కోరుకుంటున్నాను మీ ఈ ఒరవడి!




    ReplyDelete
  18. ఇప్పుడు ..... నాకు కొంచెం confusion గా ఉండండి ...

    ఇదే మాటలు వేరే వాళ్ళు కూడా చెప్పొచ్చు కదా ? కానీ అవి అంత అందం గా ఉండవు . మీరు చెప్పారు చెప్పారు కాబట్టి ఇంత అందం గా ఉన్నాయి . అంటే మీ మనస్సు కి కొంచెం ముస్తాబు చేసి ఇక్కడ పరిచినట్లే కదా ? అది వద్దంటే ఎట్లా :P

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు నన్ను చేసారుగా confusion మీరు...:)
      అవుననుకుంటాను....మనసుని ప్రేమతో, మంచిమాటలతో ముస్తాబు చేస్తే ఇంకాబాగుంటుందేమో అనిపిస్తుంది మీ కమెంట్ చదివాక....Thanks for your comments.

      Delete
  19. they always say be yourself then they will hate u for being like that.

    vimaanamantha vishaalamina mansunna adi ikkada evadiki paniki raadu.

    anyway bravo beauty bravo.beauty compliment mee mansukay

    ReplyDelete
    Replies
    1. Whole heartily thanks for your compliments.vimaanamantha vishaalamaina manasunna adi andanantha ettulo untea panikiraadukadandi:-)

      Delete
  20. ఈ రోజుల్లో మనసులకు కూడా మంచి మాటలనే మేకప్ వేసుకుని చాల మంది అందంగా కనబడుతున్నారు అందుకే ఎవరేమిటో తెలుసుకోలేక పోతున్నాం సహజ సిద్ధమైన అందం కలిగిన మనసులు మనుషులు కూడా అరుదుగా కనబడుతున్నాయి సరదాగా రాసిన దాన్ని కాస్త సీరియస్ చేసినట్లున్నా ఏమైనా మీ పోస్ట్ చాల బాగుంది ..:-)

    ReplyDelete
  21. సరదాగా కూడా కొన్ని సందేహాలకి సమధానాలు దొరుకుతాయండి:-)
    మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు...

    ReplyDelete
  22. అబ్బాయిలకు కూడా "ఫేషియల్ మసాజ్" వచ్చాయి కదా ఇప్పుడు.:))
    శ్రావ్య చెప్పినట్టు మనసుకి ముస్తాబు అవసరమే!
    బాగుంది పద్మ గారు మీరు ఎంచుకున్న టాపిక్ ఈ కవితకు.

    ReplyDelete
    Replies
    1. చాలాకాలనికి విచ్చేసారు.....ధన్యవాధాలండి!
      అబ్బాయిలకు "ఫేషియల్ మసాజ్" ఇప్పుడేంటండి అన్నీ ఎప్పటినుండో వాడుకలో ఉన్నాయి:-)
      Thanks for compliment.

      Delete
  23. అయ్యబాబోయ్ మనసుకు మేకప్ లేకుంటే ఇంకేమైనా ఉందా పైన కొందరు చెప్పినట్టుగా

    దేహానికి (బట్టలు తప్ప) మేకప్ లేకున్నా ఓకే గాని మనసుకు తప్పదు కదండీ ( ఐతే అది పర్మనెంట్ మేకప్ అయి ఉండాలి )

    దానవుడు+ మేకప్= మానవుడు

    మహిషి+మేకప్=మనిషి అలాగే ముందుకెళితే

    మనిషి+మేకప్=మహర్షి



    చాలా చక్కటి కవితకు థాంక్సండి

    ReplyDelete
    Replies
    1. అబ్బో! ఇదేదో కొత్త ఈక్వేషన్ బాగుందండి.:-)
      కవిత నచ్చి స్పందించిన మీకు థ్యాంక్సండి!

      Delete
  24. మనసు చేసే చిత్రాల్లో తనకు తాను ముసుగును తొడుక్కోవటం ఒకటి .అది ముసుగులో ఉంది అని అర్థం చేసుకుంటే ఆ ముసుగు తొలగినట్లే.అప్పుడు స్వచ్చమైన మనోసౌందర్యం ఏదో అది అక్కడ ఉదయిస్తుంది.nice topic

    ReplyDelete
    Replies
    1. మనసుకి మనం ముసుగు వేసుకున్న అది తెలుసుకుని తొలగించుకుంటే మంచిదని చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి!



      Delete
  25. పైపూత ముసుగే కానఖర్లేదు.. అదో రక్షణ కవచం. రంగుటద్దాలలోంచి చూసే లోకానికి.. ముఖాలంకరణం ఒకేరంగు చూపే అవసరం.
    కంటి కింద నలుపు తెలిపే కలల భస్మాన్ని కప్పిఉంచే విభూది కొందరికి.
    పంటి కింద బాధ నణచే పెదవి పైపూత కొందరికి.
    వడలిన మోము విరుల రాగాల్ని దాచే పరదా గతకాల వెన్నెలసుందరికి ( चन्दिनीका नाम लिए तो .. सिर्फ़ उसकी मुस्कान)

    ఇవన్నీ అవసరం లేని పద్మం.. చూడండి.. నలుపూ తెలుపుల్లోంచి ఎలా తమాషా చూస్తుందో!! :)) దా చిం శిం క వి

    ReplyDelete
  26. మీ అమూల్యమైన అభిప్రాయాలని మాతో పంచుకున్న మీకు ధన్యవాదములు.




    ReplyDelete
  27. కేవలం మనసిస్తే చాలు మనిషంతా అందంగా కనిపిస్తాడు ఎందుకో???
    ఎంత అమాయకంగా రాసినట్లున్నారో, మనసివ్వడం అనేది ఓ పెద్దతతంగం అని తెలిసికూడా.......
    మనసివ్వాలంటే నచ్చాలి కదా, నచ్చాలంటే దేనికో ఒక దానికి పడిపోవాలి కదా.............
    "మనసు" అందంగా కనపడడానికి మాత్రం ఏ సాధన సామాగ్రి అవసరంలేదు ఎందుకో???
    ఇదీ మరీఅండి,..... చిన్నప్పటి నుంచి చదువు, నీతి పాఠాలు, వ్యక్తిత్వ వికాసాలు, మార్గదర్శకత్వాలు, మంచి మాటలు, భక్తి ఇలాంటివన్ని దానికే కదండి,
    మీరు చాలా తెలివైన వారండి, తెలిసికూడా భలే అడుగుతారు,

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారూ....చూసారా! నేను అలా అమాయకంగా అడగబట్టే మీరు ఇంతందంగా జవాబిచ్చారు:-)
      థ్యాంక్యూ!!!

      Delete
  28. Aparichitudu cinema lo cheppinattu...."manishiki make up veyagalamu....kani manasuku veyalemu...."
    manasu andanni manchitanam ane abharanam tho inka meruguparuchukovachu.....
    Chala bavundandi me thoughts...

    ReplyDelete
  29. chakkaga gurtuchesi chepparu....thank q!

    ReplyDelete
  30. మనసుకు మెరుగులు దిద్దే శిల్పి ఎవరు ?
    బాహ్య సౌందర్యం మనసు అందం గా ఉన్నప్పుడే
    మరింత మెరుగు గా కని పిస్తుంది.
    చూసే కనులకు మనసుంటే ఆ మనసుకు కూడా
    కళ్లుంటే ఎటు చూసినా అందమే .
    యింత కి పద్మ గారు మనలో మన మాట
    మేకప్పు లేకపోయినా బానే వున్నా ఆ అమ్మాయి ఎవరో ?

    ReplyDelete
    Replies
    1. మేకప్పు వేసుకోని ఆ అమ్మాయి ఎవరైనా మనసు మాత్రం మంచిదండి, అందుకే మీకు బాగా కనిపించి ఉంటుంది. See and enjoy:-)
      మనసులోని మాట చెప్పడానికి భాషతో పనిలేదండి, మీ చైనా అక్షరాలు అర్థమైనాయిలెండి! Thank Q.

      Delete
  31. ''ఎటు చూసినా అందమే'' అని

    ఆ చైనా అక్షరాలని అర్ధం చేసుకోన గలరు

    ReplyDelete
  32. తీసేసిన కామెంట్ లో ఏ రాసాడో చచ్చినాడు అనుకో గలరు

    ఆ చైనా అక్షరాలని తీసేసి సరిగ్గా రాద్దామంటే మళ్ళి అవే వచ్చాయి . . అది విషయం .

    ReplyDelete
  33. 'అతని' కళ్ళ తోడ 'ఆమెను' జూడుమా
    'ఆమె 'కళ్ళ తోడ 'అతని 'జూడు
    అసలు కిటు కిదే గ ! అమ్మ పద్మార్పితా !
    అంద మంత రంగ మందె కలద ?
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. అవును సర్ అందమంతరంగమందే ఉంటుంది. అతరంగమందం గా ఉంటే అందమంత బాగుంటుంది. ఆ అసలు సిసలు అందాన్ని గుర్తించే సత్తా అంతరంగానికే ఉంటుంది.

      Delete
  34. మీ ఆత్మీయ స్పందనకు నెనర్లండి!

    ReplyDelete
  35. మనసుకు మేకప్ అవసరమే. శరీరం తో పాటు మనసుకూ ప్రతిరోజూ స్నానం చేయాలి. శరీరం తో పాటూ మనసుకూ మేకప్ చేయాల్సిందే అవసరమైన ప్రతి నిమిషం. మనసుకు సరిగా మేకప్ చేసుకుంటే శరీరానికి మీరు చెప్పిన మేకప్ లు లేకుండానే ఇంకా అందంగా, అసలు సిసలు తేజోమంతం బయల్పడుతుందండీ. అయితే మనసుకు మేకప్ ఎలా అనేదే కీలకం. మీ బ్లాగు చాలా బాగుందండీ. చాలా ఆలశ్యంగా చూశాను.

    ReplyDelete
    Replies
    1. నమస్కారం...నా బ్లాగ్ కి స్వాగతం
      మీ విశ్లేషనాత్మక వ్యాఖ్య నా మనసును రంజింపజేసిందండి, ధన్యవాదాలండి!

      Delete
    2. మీ కమెంట్ చాలా బాగుందండి.

      Delete
  36. Very nice and beautiful blog..:-) Glad to have met you here..:-)

    ReplyDelete
    Replies
    1. Hearty welcome to my blog...:-) Thanks for your compliments

      Delete
  37. ఇప్పుడంతా మేకప్పే కదండీ..!

    ReplyDelete