ఆశల రెమ్మలే అయినా
చిగురుతొడిగాయి వద్దన్నా
ఎన్నో ఊహలకు ప్రాణం పోసి
నా ఊహల్లో కూడా ఉండలేనన్నా
నాఊపిరిని నాకు కాకుండా చేసిపోయినా,
ఎందుకిలా చేసావని నేనడగను...
అడిగితే నీ సమాధనం.....
నన్ను బలహీనురాలుని చేస్తుందని తెలుసును!
నా మనసు నిన్ను వీడనని
మొరాయిస్తుందని వీడితే నిర్జీవని
అందుకే దాన్ని నా నుండి వేరుచేసి
నీకే అర్పిస్తున్నా నీవు కాదన్నా
ఎందుకో చెబుతాను నీవు అడకపోయినా,
అనురాగానికి బంధీ అయిపోయి...
అది నీకు బానిసగామారి.....
నన్ను స్వార్థపరురాలిగా మార్చిందని తెలుసును!
How about asking Antonio Xavier Trindade from Goa? ;)
ReplyDeleteGreat artist & hats of to him. Thank you!:-)
Deleteఅనురాగానికి బంధీ అయిపోయిన మనసు విరహవేదనా లో స్వార్ధాన్ని ఆశ్రయించిన తీరు బాగుందండీ వేదనాభరితం గా :-)
ReplyDeleteవేదనాభరితమైన అవేదనను ఆస్వాధించిన మీకు అభివందనములు.
Deleteనా మనసు నిన్ను వీడనని
ReplyDeleteమొరాయిస్తుందని వీడితే నిర్జీవని
అందుకే దాన్ని నా నుండి వేరుచేసి
నీకే అర్పిస్తున్నా...
పునరర్పితం అన్నమాట.....
వేదనాభరితం...
చాలా బాగుంది భావం పద్మగారూ!
@శ్రీ
అవునండి అర్థంచేసుకుని అభినందించిన మీకు నెనర్లు
Deletechaala bagundi andi.......
ReplyDeleteThank you....
Deleteమీరు నిజంగానే స్వార్ధపరురాలండి. అన్నీ భావాలను మీరే దోచుకొని దాచుకుంటారు, చక్కగా రాశారు, అభినందనలు.
ReplyDeleteహిరోషిమా మీద అణుబాంబు వేసిన రోజిది.
ప్రపంచశాంతిని కోరుకుందాం – యుద్దాలను వ్యతిరేకిద్దాం
మీ అందరితో పంచుకోవాలన్న స్వార్ధమేలెండది:-) ధన్యవాదాలు.
Deleteఈరోజే ఏమిటి? ఎప్పుడూ కోరుకుందామండి శాంతిని.
పద్మ గారూ, ఊపిరిని కాకుండా చేసినా అడగలేక పోవటమే ప్రేమ బలహీనత.
ReplyDeleteవిపరీతమైన వేదన ఈ ప్రేమ రాహిత్యం, మీ పదాలలో అందమైన భావమాలిక అయింది.
డియర్, మరోసారి నిరూపించుకున్నారు అందంగా రాయటం మీ సొంతం అని.
థ్యాంక్సండి...ఫాతీమాగారూ! నిజం చెప్పాలంటే ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తుంది, అయినా అందంగా ఉంది అన్నారంటే అది మీ ఆత్మీయతా ప్రతిఫలం.
Deleteవేదనతో కూడిన మధురమైనభావానికి తగిన చిత్రంతో అందంగా అల్లిన అక్షరమాలిక.
ReplyDeleteఅందమైన అక్షరమాలని అభివర్ణించిన మీకు అభివందనములు.
Deleteఇంత వేధనాభరితమైన ప్రేమ అవసరమా చెప్పండి:)
ReplyDeleteఅవసరమే.....
Deleteవేదనలేనిదే ప్రేమరాహిత్యము కానరాదు,
అదిలేనినాడు సాహిత్యము పండదు:-)
చాలాబాగుంది పద్మార్పిత వేదనగా మనసుని కదలించేదిగా..
ReplyDeleteఈ వేదన అనుభవైక వేద్యమే కదా...ఈ భావన ఆ చిత్రం అలా వెంటాడుతూ వేటాడుతూనే వున్నాయి పద్మాజీ...ఆ చిత్రకారునికి నీరాజనాలు అర్పిస్తూ మాకు పరిచయం చేసిన మీకు అభినందనలు...
ReplyDeleteThanks a lot Varmaji
Deleteప్రేమించి ,మరవలేక మరిచి ఉండలేక,ఆ జ్ఞాపకాలను విడువ లేక ,విడిచి ఉండలేక ........కవిత హృదయాలను కదిలిస్తుంది.
ReplyDeleteప్చ్ అంతేకదండి:-(
ReplyDeleteఎందుకు ఆ అమ్మాయి విచారంగా ఉంది పద్మగారూ
ReplyDelete